
న్యూయార్క్ : అమెరికాలో ఓ గర్ల్ ఫ్రెండ్ తన బోయ్‌ఫ్రెండ్‌కు చుక్కలు చూపించింది. అర్థరాత్రి హలోవీన్(రక్త పిశాచాల మాదిరిగా వేసుకునే వేశం) ద్వారా దాదాపు అతడి గుండె ఆగినంత పనిచేసింది. హ్యాపీగా భోజనం చేసి గాఢ నిద్రలోకి జారుకున్న అతడి వద్దకు వెళ్లి మరి ఠారెత్తించింది. వివరాల్లోకి వెళితే.. పాశ్చాత్య నగరాల్లో హలోవీన్ అనేది సాధారణంగా జరుగుతుంటుంది. నటాలీ అనే ఓ 23 ఏళ్ల యువతి తాను హలోవీన్ మేకప్ వేసుకుంటే ఎదుటి వ్యక్తులు భయపడతారా లేదా అని పరీక్షించుకోవాలనుకుంది.
ఓ టిష్యూ పేపర్ సన్నటి దారాల సహాయంతో తన ముఖాన్ని జుగుప్సాకరంగా మార్చుకుంది. నోరును కుట్టేసినట్లుగా మొత్తం రసి కారుతున్నట్లుగా మార్చుకొని పై గదిలో తన బెడ్‌రూంలో నిద్రిస్తున్న బోయ్‌ఫ్రెండ్ స్టీపెన్ (27) వద్దకు వెళ్లి 'బేబీ నా ముఖం చూడు అంటూ చూపిస్తూ మెల్లిగా అతడి దగ్గరకు అడుగులు వేసింది. ఆ దృశ్యాన్ని చూసి గాఢ నిద్రలో ఉన్న బోయ్‌ఫ్రెండ్ బెంబేలెత్తిపోయాడు.. తెలుగు భాషలో చెప్పాలంటే 'ఓరి నాయనో ఓరి దేవుడో ఏమైంది.. నా దగ్గరకు రాకు తల్లో' అని కేకలు వేస్తూ మంచంపై ఎగిరెగిరి పడ్డాడు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అయింది.