Watch: Explosions Hit Ukraines Capital Kyiv, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Viral Video: బాంబులతో దద్ధరిల్లిన ఉక్రెయిన్‌ ...ఘోరంగా విరుచుకుపడ్డ రష్యా

Published Mon, Oct 10 2022 2:23 PM | Last Updated on Mon, Oct 10 2022 4:46 PM

Viral Video: Explosions Hit Ukraines Capital Kyiv  - Sakshi

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై ఘోరంగా వరుస బాంబులతో విరుచుకుపడింది రష్యా. అందుకు సంబంధించిన పలు వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రష్యా కురిపించిన బాంబు వర్షంలో కీవ్‌ నగరం నడిబొడ్డున ఉన్న ప్రసిద్ధ బ్రిడ్జ్‌ ఆఫ్‌ గ్లాస్‌ పై దారుణంగా బాంబు దాడి జరిగింది. దీంతో వంతెన బూడిదతో కప్పబడినట్లుగా నిర్మానుష్యంగా మారింది.

అలాగే ఎప్పుడూ జనాలతో అత్యంత రద్దీగా ఉండే షెవ్‌చెంకో పార్కుపై కూడా దాడులు జరిగాయి. అక్కడ మొత్తం దట్టమైన పొగ వ్యాపించి విధ్యంసకరంగా మారింది. మరోక వీడియోలో ఈ బాంబు దాడుల సమయంలో వీధుల గుండా వెళ్తున్న అమ్మాయి కనపిస్తుంది. ఆమె భయం భయంగా వెళ్తుంటే ఆమెకు సమీపంలోనే క్షిపణి దాడి జరిగింది. దీంతో ఆమె భయంతో వేగంగా పరిగెడుతూ వెళ్తున్నట్లు కూడా ఆ వీడియోలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఉక్రెయిన్‌ మిసైల్‌ దాడిలో చిక్కుకుని అ‍ల్లకల్లోలంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement