షాపూర్‌లో విషప్రయోగం | Poisoning in Shahpur | Sakshi
Sakshi News home page

షాపూర్‌లో విషప్రయోగం

Published Sat, Jul 25 2015 11:34 PM | Last Updated on Tue, Sep 18 2018 7:36 PM

షాపూర్‌లో విషప్రయోగం - Sakshi

షాపూర్‌లో విషప్రయోగం

♦ తాగునీటి బావిలో క్రిమిసంహార మందులు కలిపిన దుండగులు
♦ వాసన గుర్తించి అప్రమత్తమైన స్థానికులు
♦ తప్పిన ప్రమాదం
 
 రాయికోడ్ : తాగునీటి బావిలో క్రిమిసంహారకాలు కలిపిన సంఘటన మండలంలోని షాపూర్‌లో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామంలోని ఎస్‌సీ వాడలో ఉన్న బావి నీటిని స్థాని కులు తాగటానికి, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. ఐదు రోజుల క్రితం నీరు వాసన వస్తుండడంతో అనుమానించిన కాలనీ వాసులు బావినీటి వినియోగాన్ని ఆపేశారు. వాసన తగ్గకపోవడంతో శనివారం పలువురు బావిలోకి దిగి చూడగా పలు క్రిమిసంహారక మంందు డబ్బాలు, కవర్లు లభించాయి.

అనుమానంతో బావినీటిని వినియోగించకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషప్రయోగానికి యత్నించిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని సీపీఎం మండల అధ్యక్షుడు దశరథ్ కోరారు. కాగా సంఘటనపై  వివరాలు సేకరించి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ శివప్రసాద్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement