భవానీపురం(విజయవాడ పశ్చిమ): ఆన్‌లైన్ ప్రకటనల ద్వారా నీలి చిత్రాలను షేర్ చేసిన యువ ఇంజనీర్‌ను విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ పకీర్‌గూడెంకు చెందిన సోహెల్ (24) ఒక ళాశాలలో ఇంజనీరింగ్ పట్టా తీసుకుని వివిధ సంస్థల్లో ఉద్యోగాలు చేశాడు. ఆ ఉద్యోగాలలో ఆశించిన స్థాయిలో జీతం రావడం లేదని మానేశాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో నీలి చిత్రాలు అమ్మబడును అనే ఒక ప్రకటన చూసి ఆకర్షితుడైన సోహెల్ వాటిని పొందాలని భావించాడు.
చదవండి: వీడిన మిస్టరీ: ‘కోరిక’ తీర్చాలని బలవంతం చేయడంతో..
వారిని ఆన్‌లైన్‌లో సంప్రదించటమే కాకుండా కొంత నగదు కూడా పంపించాడు. కొద్ది సేపటికే అతని మొబైల్‌కు ఒక లింక్ వచ్చింది. దానిని తెరిచి చూడగా 18 ఏళ్ల వయసులోపు పిల్లల నీలిచిత్రాలు 4వేల వరకు ఉన్నాయి. ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించాలని.. ఆ నీలిచిత్రాలను ఉపయోగించుకుని ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించాలని వాటిని తక్కువ ధరకు అమ్మబడును అని ఆన్‌లైన్‌లో ఒక ప్రకటన ఇచ్చాడు. దానిని చూసిన ఒక వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment