నీలి చిత్రాలు చూపించి... | Raping on three girls | Sakshi
Sakshi News home page

నీలి చిత్రాలు చూపించి...

Published Mon, Mar 7 2016 3:20 AM | Last Updated on Sat, Jul 28 2018 8:43 PM

నీలి చిత్రాలు చూపించి... - Sakshi

నీలి చిత్రాలు చూపించి...

ముగ్గురు బాలికలపై అత్యాచారం

బెంగళూరు:  నీలి చిత్రాలను చూపించి ఓ మృగాడు ముగ్గురు బాలికలపై అత్యాచారం చేశాడు. మైసూరులో చోటుచేసుకున్న ఈ ఘటన ఒక రోజు ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. మైసూరులోని శాంతినగర్‌లో నివసిస్తున్న నవాజ్ అహ్మద్ (30)కు  వివాహమై నలుగురు పిల్లలు ఉన్నారు. స్థానికంగా వెల్డింగ్ పనిచేస్తుంటాడు.  పిల్లలు శనివారం పాఠశాలకు వెళ్లారు. భార్య  పుట్టింటికి వెళ్లింది. మధ్యాహ్నం సమయంలో ఇంటి పక్కనే ఉన్న 12 నుంచి 14 ఏళ్లలోపు వయసున్న ముగ్గురు బాలికలను ఇంట్లోకి పిలిచి జ్యూస్ ఇచ్చాడు.

అనంతరం నీలి చిత్రాలను చూపించి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికీ చెప్పకూడదని, ప్రతి రోజూ ఇదే సమయంలో వస్తే సినిమాలు చూద్దామని చెప్పి ఇంటికి పంపించేశాడు. ఇంటికి వెళ్లిన తర్వాత పిల్లలు విషయాన్ని తల్లిదండ్రులకు  తెలియజేశారు. వారు ఉదయగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుణ్ని అరెస్టు చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement