ahmad
-
నేడు రంజాన్ పండుగ
సాక్షి, హైదరాబాద్: దక్షిణాధి, ఉత్తరాది రాష్ట్రాల్లో నెలవంక కనబడటంతో ఈ నెల 22న (శనివారం) రంజాన్ పండుగ జరుపుకోవాలని రుహియతే హిలాల్ కమిటీ(నెలవంక నిర్ధారణ కమిటీ) ప్రతినిధి ముఫ్తీ సయ్యద్ ఖలీల్ అహ్మద్ తెలిపారు. శుక్రవారం మొజంజాహీ మార్కెట్లోని కమిటీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆకాశంలో మబ్బులు ఉండటంతో హైదరాబాద్‌లో నెలవంక కనబడలేదని, తెలంగాణలోని పలు జిల్లాల్లో అది కనబడినట్లు నిర్ధారణ అయిందని, శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు రంజాన్ పండుగను జరుకోవాలని కమిటీ నిర్ణయించిందన్నారు. దీంతోపాటు ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా నెలవంక కనిపించినట్లు సమాచారం అందిందని చెప్పారు. నెల రోజులపాటు కఠోర ఉపవాసాలు ఉండి దైవప్రసన్నత కోసం పాటించిన ఉపవాసాలు అల్లా స్వీకరించాలని వేడుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా శాంతిపూర్వక వాతావారణంలో పండుగ జరుపుకోవాలని సూచించారు. రంజాన్ పండుగ(ఈదుల్ ఫితర్) నమాజ్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఈద్గాలతోపాటు దాదాపు అన్ని మసీదుల్లో ఉందన్నారు. పలు ప్రాంతాల్లో ప్రజల సౌకర్యార్థం మైదానాల్లో కూడా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఆయా ఈద్గాలు, మసీదులు, మైదానాల్లో ఈదుల్ ఫితర్ నమాజ్ ఉదయం 6:30 గంట నుంచి 10:30 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
Afghanistan: తాలిబన్ల వెన్నులో వణుకు.. అఫ్గాన్ హీరో ఇతడే..!
Ahmad Massoud History In Telugu: తాలిబన్లు.. రాక్షసత్వానికి మారు పేరు. వాళ్ల పేరు చెబితే అఫ్గాన్‌లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వెన్నులో వణుకు పుడుతుంది. తాలిబన్ల అరాచకాలు ఒకటా..? రెండా..? ఎన్నో ఎన్నెనో..! అయితే తాలిబన్ల దురాక్రమణపై సింహంలా గర్జిస్తున్న ప్రాంతం పంజ్‌షిర్. ఒకప్పుడు అక్కడ గెరిల్లా పోరాటంలో కీలకంగా వ్యవహరించిన నాయకుడే అహ్మద్ షా మసూద్. ఆయన తాలిబన్ల అంతానికి అహర్నిశలు కృషిచేశారు. ఇప్పుడు ఆయన లేకపోవచ్చు. కానీ ఆయన నాటిన విత్తనాలు పంజ్‌షిర్ ప్రజల్లో స్ఫూర్తిని నింపుతున్నాయి. ఆయన కొడుకు అహ్మద్ మసూద్ ప్రపంచ దేశాల మద్దతుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాబూల్: అహ్మద్ షా మసూద్ కొడుకు అహ్మద్ మసూద్(32) తన బలమైన కోటైన పంజ్‌షిర్ లోయ నుంచి తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడతానని ప్రతిజ్ఞ చేశారు. ఇందుకోసం అఫ్గాన్ మిలిటరీ సభ్యులు, కొంతమంది ప్రత్యేక దళ సభ్యులతో కలిసి పోరాడనున్నట్లు మసూద్ తెలిపారు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ముందే గుర్తించి తన తండ్రి ఉన్నప్పుడే మందుగుండు సామాగ్రిని, ఆయుధాలను భద్రపరిచినట్లు ఆయన పేర్కొన్నారు. తాలిబన్లు తమ పై దాడి చేస్తే తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొంటారని హెచ్చరించారు. అయితే పాశ్చాత్య దేశాల సహాయం లేకుండా తమ దళాలు నిలవలేవని, యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్, ఫ్రాన్స్ మద్దతు ఇచ్చి, అవసరమైన వాటిని అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమస్య కేవలం అఫ్గాన్ ప్రజలది మాత్రమే కాదన్నారు. తాలిబన్ల నియంత్రణలో నిస్సందేహంగా అఫ్గాన్‌లో పెను విధ్వంసం సృష్టిస్తుందన్నారు. ఇది ప్రజాస్వామ్యాలకు వ్యతిరేకంగా మరోసారి బాటలు పరుస్తుందని అహ్మద్ మసూద్ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు అహ్మద్ షా మసూద్ ఎవరు? హిందూకుష్ పర్వత శ్రేణులకు సమీపంలో కాబుల్‌కు ఉత్తరాన 150 కి.మీల దూరంలో పంజ్‌షిర్ ప్రావిన్స్ ఉంది. దాదాపు లక్షకు పైగా జనాభా కలిగిన ఈ ప్రాంతంలో తజిక్ జాతికి చెందిన ప్రజలే అత్యధికం. పంజ్‌షిర్ ప్రజల్లో తెగింపు చాలా ఎక్కువ. అక్కడి ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని మరింతగా నింపిన నాయకుడు అహ్మద్ షా మసూద్. ఆయన మార్గదర్శకత్వంలో పంజ్‌షిర్ ప్రజలు తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడారు. 1970-80లలో సోవియట్ రష్యా దండయాత్రను తిప్పికొట్టడంతో పాటు.. 1996-2001లో తాలిబన్ల రాక్షస పాలనపై అవిశ్రాంత పోరాటం జరిపిన యోధుల్లో అహ్మద్ షా పాత్ర కీలకమైనది. ఆయన కేవలం రాజకీయ నేత మాత్రమే కాదు.. మిలటరీ కమాండర్ కూడా. 2001లో యూరప్‌ను సందర్శించి తాలిబన్లకు పాకిస్థాన్ మద్దతు లేకుండా ఒత్తిడి చేయాలంటూ యూరోపియన్ పార్లమెంట్ నేతలను కోరారు. తాలిబన్ పాలనలో అఫ్గాన్ ప్రజలు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, మానవతా దృక్పథంతో సాయం చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. కాగా తాలిబన్లు, ఆల్‌ఖైదాలు కలిసి నకిలీ విలేకరుల వేషాల్లో మీడియా ఇంటర్వ్యూ చేస్తూ.. 2001 సెప్టెంబర్ 9న జరిపిన ఆత్మాహుతి దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. చదవండి: Afghanistan: విషాదం, ఆకలితో కన్నవారి చేతుల్లోనే కన్నుమూసింది -
నాలుగేళ్లుగా అబద్ధపు పాలన
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కేంద్రంలో మోదీ, రాష్ట్రం లో కేసీఆర్ నాలుగేళ్లుగా అబద్ధపు పాలన సాగిస్తున్నారని, ఎన్నికల వాగ్దానాల అమలులో ఇరు ప్రభుత్వా లు ఘోరంగా విఫలమయ్యాయని ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్ విమర్శించారు. ఆదివారం నల్ల గొండలో డీసీసీ బూడిద భిక్షమయ్యగౌడ్ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. నిరుద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోదీ మోసం చేశారన్నారు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసన సభ్యత్వాన్ని రద్దు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. టీఆర్ఎస్ హత్యా రాజకీయాలకు కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యే నిదర్శనమన్నారు. తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉండాలి: ఉత్తమ్ నాలుగేళ్ల నుంచి కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని, ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని తరిమికొట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ పాలన అప్రజాస్వామికంగా ఉందని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. కేసీఆర్, ఆయన కొడుకు, బిడ్డ, అల్లుడు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శ్రీశైలం సొరం గ మార్గానికి దివంగత సీఎం వైఎస్సార్ నిధులు కేటాయిస్తే దానిని విస్మరించి కాళేశ్వరంలో కమీషన్ల కోసం మామ, అల్లుడు అక్కడికి పోతున్నారన్నారు. -
గుండె మార్పిడి కోసం భారత్‌కు...
కరాచీ: పాకిస్తాన్ హాకీ దిగ్గజం మన్సూర్ అహ్మద్ గుండె మార్పిడి కోసం భారత్ రావాలనుకుంటున్నారు. 49 ఏళ్ల స్టార్ గోల్‌కీపర్ అహ్మద్ 1994 ప్రపంచకప్‌ను పాక్ గెలవడంలో కీలకపాత్ర పోషించారు. అయితే గత కొంతకాలంగా మన్సూర్ హృద్రోగంతో బాధపడుతున్నాడు. ఐదేళ్ల క్రితం గుండె కవటాలు మూసుకుపోవడంతో స్టంట్లు అమర్చారు. అయితే ఇపుడు అవి మళ్లీ మూసుకుపోవడంతో అక్కడి హృద్రోగ నిపుణులు గుండె మార్పిడి శస్త్ర చికిత్సే పరిష్కారమన్నారు. అమెరికా, భారత్‌లలోని ప్రఖ్యాత హార్ట్ స్పెషాలిటీ హాస్పిటల్లను సంప్రదించాలని సూచించారు. పొరుగునే ఉన్న భారత్‌లో గుండెమార్పిడి ఆపరేషన్లు విజయవంతం కావడంతో ఇక్కడికి రావాలని మన్సూర్ ఆశిస్తున్నారు. ఆయన చికిత్స కోసం ఇప్పటికే క్రికెటర్ ఆఫ్రిది ఫౌండేషన్ స్పందించి చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చింది. వీసా కోసం కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌కు వినతి పంపారు. -
ఎర్రకోటపై దాడికేసులో వ్యాపారవేత్తకు బెయిల్
న్యూఢిల్లీ : ఎర్రకోటపై దాడి కేసులో కశ్మీరీ వ్యాపారవేత్తకు బెయిల్ మంజూరైంది. 2000 సంవత్సరంలో ఎర్రకోటపై దాడి కేసులో ప్రమేయం ఉందనే కారణంతో కశ్మీర్‌కు చెందిన అహ్మద్ కావా(37) అనే వ్యాపారవేత్తను ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఢిల్లీ పోలీసులు, గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళ అధికారులు కలిసి ఆయనను అరెస్ట్ చేశారు. ఆయనకు అడిషనల్ సెషన్స్ జడ్జి సిద్ధార్థ్ శర్మ బెయిల్ మంజూరు చేశారు. అలాగే రూ. 50 వేల సొంత పూచీకత్తు, ష్యూరిటీ సమర్పించాలని షరతు విధించారు. ఎర్రకోటపై దాడి చేసిన లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులకు అహ్మద్ ఖావా బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు బదిలీ అయ్యాయి. ఈ కారణంతోనే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. -
సౌదీ నుంచి సొంతూరుకు మృతదేహం
చేర్యాల (సిద్దిపేట): బతుకుదెరువు కోసం దేశం కాని దేశం వెళ్లి.. అక్కడే ఆత్మహత్య చేసుకున్న సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేణి గ్రామానికి చెందిన అహ్మద్ మృతదేహం సోమవారం స్వగ్రామానికి చేరుకుంది. మే 24న సౌదీ అరేబియాలో అహ్మద్ తానుంటున్న గదిలోనే ఉరి వేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగి నెలలు గడిచినా మృతదేహం ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు మంత్రి హరీశ్‌రావుకు విన్నవించారు. దీనిపై స్పందించిన ఆయన.. విదేశాంగ అధికారులతో మాట్లాడి అహ్మద్ మృతదేహాన్ని స్వగ్రామానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చివరకు సోమవారం మృతదేహం వేచరేణికి చేరుకుంది. -
అమెరికా అతిపెద్ద బాంబుకు కేరళవాసి బలి
కాబూల్: నేలమాళిగల్లో దాగిన ఇస్లామిక్ తీవ్రవాదులను లక్ష్యంగా చేసుకొని అమెరికా జరిపిన బాంబు దాడిలో కేరళకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’(ఎంఓఏబీ)గా పిలుచుకునే ప్రపంచంలోని అతి పెద్ద బాంబును ఆఫ్గనిస్తాన్‌పై అమెరికా ప్రయోగించిన విషయం తెలిసిందే. కేరళకు చెందిన ముర్షీద్ అహ్మద్ అనే వ్యక్తి కొంత కాలం క్రితం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరాడు. ఈ మేరకు తాను ఐసీస్‌లో చేరినట్లు తండ్రికి అహ్మద్ టెలిగ్రాం చేశాడు. కాగా.. గురువారం అమెరికా ప్రయోగించిన అతిపెద్ద బాంబు దాటికి మొత్తం 36 మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో అహ్మద్ కూడా ఉన్నట్లు సమాచారం అందింది. కేరళ నుంచి మొత్తం 21 మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరగా.. వీరిలో ఇప్పటికే నలుగురు ఆఫ్గనిస్తాన్‌లో జరిగిన వేరువేరు ఘటనల్లో మృతి చెందారు. -
దూసుకెళ్లిన లారీ: హోంగార్డ్ మృతి
-
దూసుకెళ్లిన లారీ: హోంగార్డ్ మృతి
నెల్లూరు : నెల్లూరు జిల్లా మర్రిపాడు వద్ద తనిఖీ చేస్తున్న హోంగార్డ్ అహ్మద్పైకి శనివారం లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే లారీ మాత్రం ఆగకుండా వెళ్లి పోయింది. దీంతో అక్కడే సహాచర పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఈ ఘటనకు బాధ్యుడైన లారీ డ్రైవర్‌ను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అలాగే అహ్మద్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నీలి చిత్రాలు చూపించి...
ముగ్గురు బాలికలపై అత్యాచారం బెంగళూరు: నీలి చిత్రాలను చూపించి ఓ మృగాడు ముగ్గురు బాలికలపై అత్యాచారం చేశాడు. మైసూరులో చోటుచేసుకున్న ఈ ఘటన ఒక రోజు ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. మైసూరులోని శాంతినగర్‌లో నివసిస్తున్న నవాజ్ అహ్మద్ (30)కు వివాహమై నలుగురు పిల్లలు ఉన్నారు. స్థానికంగా వెల్డింగ్ పనిచేస్తుంటాడు. పిల్లలు శనివారం పాఠశాలకు వెళ్లారు. భార్య పుట్టింటికి వెళ్లింది. మధ్యాహ్నం సమయంలో ఇంటి పక్కనే ఉన్న 12 నుంచి 14 ఏళ్లలోపు వయసున్న ముగ్గురు బాలికలను ఇంట్లోకి పిలిచి జ్యూస్ ఇచ్చాడు. అనంతరం నీలి చిత్రాలను చూపించి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికీ చెప్పకూడదని, ప్రతి రోజూ ఇదే సమయంలో వస్తే సినిమాలు చూద్దామని చెప్పి ఇంటికి పంపించేశాడు. ఇంటికి వెళ్లిన తర్వాత పిల్లలు విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. వారు ఉదయగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుణ్ని అరెస్టు చేశారు. -
తాగిన మైకంలో ముగ్గురిపై కత్తితో దాడి
హైదరాబాద్ సిటీ: సైదాబాద్ పరిధిలో ఆదివారం రాత్రి అహ్మద్ అనే వ్యక్తి తాగిన మైకంలో కత్తితో ముగ్గురిపై పాశవికంగా దాడిచేశాడు. ఈ ఘటనలో శివ, కృష్ణ, సైదులు అనే ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా నిందితుడు తాగిన మైకంలో దాడి చేసి పలువురిని గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. -
జెడ్పీ ఎన్నిక లాంఛనమే
కరీంనగర్ సిటీ : జిల్లా ప్రజా పరిషత్ నూతన పాలకవర్గం శనివారం కొలువుదీరనుంది. మూడేళ్ల ప్రత్యేకాధికారుల పాలనకు ముగింపు పలుకుతూ జెడ్పీ ఇక ప్రజాప్రతినిధుల పాలనలోకి రానుంది. ఉదయం 9.30 నుంచి ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ... సాయంత్రం చైర్పర్సన్, వైస్‌చైర్మన్ ఎన్నికతో పూర్తికానుంది. ముందుగా రెండు కో-ఆప్షన్ పదవులకు నామినేషన్లు స్వీకరించి మధ్యాహ్నం ఒంటిగంటకు నూతన జెడ్పీటీసీల ప్రమాణస్వీకారం కార్యక్రమం చేపడతారు. అనంతరం అవసరమైతే కో-ఆప్షన్ పదవులకు ఎన్నిక నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3గంటలకు జెడ్పీ చైర్పర్సన్, వైస్‌చైర్మన్ ఎన్నికలను నిర్వహిస్తారు. ఒకరే పోటీపడితే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఎన్నిక అవసరమైతే చేతులెత్తే పద్ధతిన విజేతను నిర్ణయిస్తారు. జెడ్పీ ప్రత్యేకాధికారి, ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఎన్నికల అధికారిగా వ్యవహరించనున్నారు. ఉమ ఎన్నిక లాంఛనమే జిల్లాపరిషత్‌లో 57 స్థానాలకు గాను 41 స్థానాల్లో టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసి భారీ మెజారిటీని సొంతం చేసుకుంది. చైర్పర్సన్, వైస్‌చైర్మన్, రెండు కోఆప్షన్ పదవులు టీఆర్ఎస్ ఖాతాలోకి పోవడం ముందుగానే ఖాయమైంది. టీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, కథలాపూర్ జెడ్పీటీసీ తుల ఉమను చైర్‌పర్సన్‌గా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. చైర్పర్సన్ పదవికి పలువురు పోటీపడ్డా, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు విముఖంగా ఉన్నా... ఉమ పార్టీకి చేసిన సేవలను గుర్తించిన కేసీఆర్ ఆమె వైపే మొగ్గుచూపారు. పార్టీ పరంగా ప్రిసైడింగ్ అధికారికి అందజేసే ఆథరైజేషన్ లెటర్‌ను ఉమ పేరిట జారీ చేశారు. దీంతో ఆమె ఎన్నిక లాంఛనమే కానుంది. పార్టీ మరో సీనియర్ నాయకుడు బెజ్జంకి జెడ్పీటీసీ సభ్యుడు తన్నీరు శరత్‌రావు వైస్ చైర్మన్ కానున్నారు. ఇప్పటికే ఆయన అభ్యర్థిత్వం ఖరారైంది. కో ఆప్షన్ సభ్యుల ఎంపికలోనే పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. నేడు కాంగ్రెస్ నిర్ణయం జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికల్లో పోటీపై కాంగ్రెస్ పార్టీ శనివారం ఉదయం నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ఆ పార్టీకి డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం విప్‌గా వ్యవహరిస్తున్నారు. 14 మంది జెడ్పీటీసీలున్న కాంగ్రెస్ పార్టీ గెలిచే బలం లేనప్పటికీ పోటీ చేయాలని గతంలో నిర్ణయించింది. శనివారం ఉదయం 8 గంటలకు డీసీసీ కార్యాలయంలో జెడ్పీటీసీలు, సీనియర్ నాయకులతో జరిగే సమావేశంలో చర్చించి పోటీపై నిర్ణయం ప్రకటిస్తామని మృత్యుంజయం తెలిపారు. ఏర్పాట్లు పూర్తి జెడ్పీ పాలకవర్గం ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇన్చార్జి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో జెడ్పీ సీఈవో సదానందం ఏర్పాట్లు చేస్తున్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో పార్టీలవారీగా సీటింగ్ కేటాయించారు. ముందు వరుసలో ఎక్స్ అఫిషియో సభ్యులకు, తరువాతి వరుసలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ సభ్యులకు, వెనుక వరుసలో టీడీపీ, టీఆర్ఎస్ సభ్యులకు సీటింగ్ ఏర్పాటు చేశారు. తొలిసారి బహిరంగ సభ జెడ్పీసమావేశ మందిరంలో ఎన్నిక ప్రక్రియ పూర్తయిన అనంతరం నూతన పాలకమండలికి బహిరంగంగా అభినందన సభ నిర్వహించనున్నారు. ఈ సభలో ఎంపీ, ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొననున్నారు. దీనికోసం జెడ్పీ ఆవరణలో ప్రత్యేకంగా సభావేదిక ఏర్పాటు చేశారు. మూడేళ్ల తర్వాత జెడ్పీ పాలకమండలి మూడేళ్ల తర్వాత కొలువుదీరనుంది. చివరిసారిగా 2011 జూలై 22న గత పాలకమండలి గడువు ముగిసింది. అప్పుడు చైర్మన్‌గా అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఉన్నారు. ఎన్నికలు నిర్వహించకపోవడంతో అప్పటినుంచి జెడ్పీ ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతోంది. కలెక్టర్ ప్రత్యేకాధికారిగా ఉన్నారు.