
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కేంద్రంలో మోదీ, రాష్ట్రం లో కేసీఆర్ నాలుగేళ్లుగా అబద్ధపు పాలన సాగిస్తున్నారని, ఎన్నికల వాగ్దానాల అమలులో ఇరు ప్రభుత్వా లు ఘోరంగా విఫలమయ్యాయని ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్ విమర్శించారు. ఆదివారం నల్ల గొండలో డీసీసీ బూడిద భిక్షమయ్యగౌడ్ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. నిరుద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోదీ మోసం చేశారన్నారు.
ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసన సభ్యత్వాన్ని రద్దు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. టీఆర్‌ఎస్ హత్యా రాజకీయాలకు కాంగ్రెస్ నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యే నిదర్శనమన్నారు.
తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉండాలి: ఉత్తమ్
నాలుగేళ్ల నుంచి కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని, ఈసారి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీని తరిమికొట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.
టీఆర్‌ఎస్ పాలన అప్రజాస్వామికంగా ఉందని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. కేసీఆర్, ఆయన కొడుకు, బిడ్డ, అల్లుడు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శ్రీశైలం సొరం గ మార్గానికి దివంగత సీఎం వైఎస్సార్ నిధులు కేటాయిస్తే దానిని విస్మరించి కాళేశ్వరంలో కమీషన్ల కోసం మామ, అల్లుడు అక్కడికి పోతున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment