దూసుకెళ్లిన లారీ: హోంగార్డ్ మృతి | home guard killed due to lorry hit and run | Sakshi
Sakshi News home page

దూసుకెళ్లిన లారీ: హోంగార్డ్ మృతి

Published Sat, Oct 8 2016 8:02 AM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM

home guard killed due to lorry hit and run

నెల్లూరు : నెల్లూరు జిల్లా మర్రిపాడు వద్ద తనిఖీ చేస్తున్న హోంగార్డ్ అహ్మద్పైకి శనివారం లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే లారీ మాత్రం ఆగకుండా వెళ్లి పోయింది. దీంతో అక్కడే సహాచర పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

దీంతో ఈ ఘటనకు బాధ్యుడైన లారీ డ్రైవర్ను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అలాగే అహ్మద్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement