
చేర్యాల (సిద్దిపేట): బతుకుదెరువు కోసం దేశం కాని దేశం వెళ్లి.. అక్కడే ఆత్మహత్య చేసుకున్న సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేణి గ్రామానికి చెందిన అహ్మద్ మృతదేహం సోమవారం స్వగ్రామానికి చేరుకుంది. మే 24న సౌదీ అరేబియాలో అహ్మద్ తానుంటున్న గదిలోనే ఉరి వేసుకున్న విషయం తెలిసిందే.
ఈ ఘటన జరిగి నెలలు గడిచినా మృతదేహం ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు మంత్రి హరీశ్‌రావుకు విన్నవించారు. దీనిపై స్పందించిన ఆయన.. విదేశాంగ అధికారులతో మాట్లాడి అహ్మద్ మృతదేహాన్ని స్వగ్రామానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చివరకు సోమవారం మృతదేహం వేచరేణికి చేరుకుంది.