అమెరికా అతిపెద్ద బాంబుకు కేరళవాసి బలి | islamic state terrorist from kerala killed in us attack | Sakshi
Sakshi News home page

అమెరికా అతిపెద్ద బాంబుకు కేరళవాసి బలి

Published Fri, Apr 14 2017 11:00 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

అమెరికా అతిపెద్ద బాంబుకు కేరళవాసి బలి - Sakshi

అమెరికా అతిపెద్ద బాంబుకు కేరళవాసి బలి

కాబూల్‌: నేలమాళిగల్లో దాగిన ఇస్లామిక్‌ తీవ్రవాదులను లక్ష్యంగా చేసుకొని అమెరికా జరిపిన బాంబు దాడిలో కేరళకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌’(ఎంఓఏబీ)గా పిలుచుకునే ప్రపంచంలోని అతి పెద్ద బాంబును ఆఫ్గనిస్తాన్‌పై అమెరికా ప్రయోగించిన విషయం తెలిసిందే.

కేరళకు చెందిన ముర్షీద్‌ అహ్మద్‌ అనే వ్యక్తి కొంత కాలం క్రితం ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థలో చేరాడు. ఈ మేరకు తాను ఐసీస్‌లో చేరినట్లు తండ్రికి అహ్మద్‌ టెలిగ్రాం చేశాడు. కాగా.. గురువారం అమెరికా ప్రయోగించిన అతిపెద్ద బాంబు దాటికి మొత్తం 36 మంది ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో అహ్మద్‌ కూడా ఉన్నట్లు సమాచారం అందింది. కేరళ నుంచి మొత్తం 21 మంది ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థలో చేరగా.. వీరిలో ఇప్పటికే నలుగురు ఆఫ్గనిస్తాన్‌లో జరిగిన వేరువేరు ఘటనల్లో మృతి చెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement