కూటమి అరాచకాలు.. ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు | YSRCP Leaders Given Petition To Election Commission Over Elections In AP | Sakshi
Sakshi News home page

కూటమి అరాచకాలు.. ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

Published Mon, Feb 3 2025 1:18 PM | Last Updated on Mon, Feb 3 2025 3:06 PM

YSRCP Leaders Given Petition To Election Commission Over Elections In AP

సాక్షి, విజయవాడ: మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి నేతల అరాచకాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. తిరుపతి డిప్యూటీ మేయర్, ఇతర ఎన్నికల్లో టీడీపీ, జనసేన అరాచకాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. కూటమి దౌర్జన్యాలపై ఈసీకి దేవినేని అవినాష్, మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మి ఫిర్యాదు చేశారు.

అనంతరం దేవినేని అవినాష్‌ మీడియాతో మాట్లాడుతూ..‘తిరుపతిలో టీడీపీ, జనసేన గుండాలు రెచ్చిపోయారు. సిగ్గు లేకుండా కార్పొరేటర్లు, మహిళలపై దాడులు చేశారు. కూటమి ప్రభుత్వం లో దాడులు, దౌర్జన్యం పెరిగాయి. మేము నిన్ననే ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాం. సిగ్గు లేకుండా కూటమి నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లను బెదిరించి, భయపెట్టి, ప్రలోభ పెట్టి లాక్కుంటున్నారు. అక్రమంగా నిర్వహించిన ఎన్నికలను రద్దు చెయ్యాలని డిమాండ్‌ చేశారు. 

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ..‘డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు పాల్పడింది. నిన్ననే మేము ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. కానీ, పోలీసులు పూర్తిగా అధికార పార్టీకి రక్షణ కవచంగా మారారు. పోలీసుల సమక్షంలోనే కార్పొరేటర్లపై దాడి చేసి ఎత్తుకుని వెళ్లారు. టెంపుల్ సిటీలో ఇలాంటి అరాచకానికి దిగడం దారుణం. నూజివీడులో మంత్రి పార్థసారథి ఎనిమిది మంది కౌన్సిలర్లను లాక్కున్నారు. ఎందుకు అధికార పార్టీ ఇంతగా భయపడుతోంది. ఈ ప్రభుత్వం వైఎస్‌ జగన్‌ను చూస్తే వణికిపోతోంది. అందుకే ఇలాంటి దౌర్జన్యాలు చేస్తున్నారు. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇలాంటి దమన కాండే జరుగుతుందన్నారు. ఈ అరాచకాలపై పోరాటం చేస్తామని తెలిపారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు YSRCP ఫిర్యాదు

మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి పార్టీలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. తిరుపతిలో మహిళా మేయర్, ఎంపీ, ఎమ్మెల్సీ ఉండగా దాడి చేశారు. కార్పొరేటర్లను బస్సుపై దాడి చేసి ఎత్తుకుపోయారు. ఎస్పీ ఉండగానే ఇంత విధ్వంసం సృష్టించారు. వెంకటేశ్వర స్వామి చూస్తుండగానే ఈ అరాచకానికి పాల్పడ్డారు. మా పార్టీ కార్పొరేటర్లకి భద్రత కావాలని మేము నిన్ననే అడిగాం. పోలీసులు పూర్తిగా టీడీపీ నేతలకు వత్తాసు పలుకుతున్నారు. ఇలాంటి విధ్వంసం ఏనాడు జరగలేదు. ఏమాత్రం సిగ్గు ఉన్న టీడీపీ నేతలు ఇలా వ్యవహరించరు. ప్రజలే కూటమి నాయకులకు తగిన బుద్ధి చెప్పడం ఖాయం’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement