మాయలేడిని అడ్డుపెట్టుకుని బాబు సర్కార్‌ బెదిరింపులు! | Government attempt to intimidate entrepreneurs | Sakshi
Sakshi News home page

మాయలేడిని అడ్డుపెట్టుకుని బాబు సర్కార్‌ బెదిరింపులు!

Published Fri, Aug 30 2024 3:30 AM | Last Updated on Fri, Aug 30 2024 10:03 AM

Government attempt to intimidate entrepreneurs

పారిశ్రామిక వేత్తలే టార్గెట్‌

మాయలేడి కాదంబరిని అడ్డుపెట్టుకుని ఏపీ సర్కారు సరికొత్త దందా 

బాధితుల్లో పారిశ్రామికవేత్తలు,  నేతలు, బ్యూరోక్రాట్లు 

పారిశ్రామికవేత్తలను బెదిరించేందుకు ప్రభుత్వ యత్నం 

కాదంబరి బాధితుల్లో ఏసియన్‌ పెయింట్స్‌ ప్రమోటర్‌ మాలవ్‌ దానీ, సజ్జన్‌ జిందాల్‌ 

ఇలాంటి వారికి అండగా నిలవాల్సిందిపోయి దోషులుగా చూస్తున్న వైనం 

ప్రస్తుతం ఆ కేసును వక్రీకరిస్తూ ఎల్లో మీడియాలో దుష్ప్రచారం

సాక్షి, అమరావతి : బాలీవుడ్‌ హీరోయిన్‌గా చెప్పుకునే కాదంబరి జత్వానీ అత్యంత వివాదాస్పదురాలు. బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరో క్రాట్లు  తదితరులను లక్ష్యంగా చేసుకుని ‘వలపు వల (హనీ ట్రాప్‌)’ వేసి...అనంతరం బ్లాక్‌ మెయిలింగ్‌ చేస్తూ భారీగా డబ్బులు గుంజడంలో ఆమె సిద్ధహస్తురాలు. అందుకోసం సంతకాలు ఫోర్జరీ చేయడం, బోగస్‌ పత్రాలను సృష్టించడం వంటి నేరాలకు పాల్పడుతూ మరీ భారీగా ఆస్తులను కొల్లగొట్టడం ఆమె చరిత్ర. ఈ విషయాలన్నీ పలు ఆధారాలతో సహా నిర్ధారణ అయ్యాయి. 

అయితే ఈ మాయలేడి బ్లాక్‌ మెయిలింగ్‌ దందాను ఆసరాగా తీసుకుని ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం దుష్ట రాజకీయాలకు తెరతీసింది. బాధితులకు బాసటగా నిలవాల్సింది పోయి.. బాధితులనే బెదిరింపులకు గురిచేస్తూ దొరికినకాడికి దండుకోవాలని వ్యూహం పన్నింది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు.. ఇన్నాళ్లూ ప్రత్యర్థి పార్టీ వరకే పరిమితం చేసిన వేధింపులను తాజాగా పారిశ్రామికవేత్తలకూ వర్తింపజేశారు. ఈ పరంపరలో బడా పారిశ్రామికవేత్త సజ్జన్‌ జిందాల్‌ను తాజాగా ఈ కేసులోకి లాగుతున్నారు. 

ఇందుకు ఎల్లో మీడియా ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఊతమిస్తోంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో యునైటెడ్‌ బెవరేజస్‌ పరిశ్రమను.. వైఎస్సార్‌ జిల్లాలో జువారి, దాలి్మయా సిమెంటు పరిశ్రమల యాజమాన్యాన్ని సర్కారు పెద్దలు ముడుపుల కోసం బెదిరింపులకు పాల్పడ్డారు. జాతీయ రహదారి పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థలను ముడుపుల కోసం వేధిస్తున్నారు. 

చంద్రబాబు ప్రభుత్వ తీరు వల్ల పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయే ప్రమాదం ఏర్పడింది. అయినా సరే టీడీపీ పెద్దలు బరితెగించి మరీ బాడా పారిశ్రామికవేత్తలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారు. మరోవైపు ఎన్నికల హామీలు అమలు చేయలేక చేతులెత్తేసిన తమ వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించాలన్నది కూడా చంద్రబాబు ప్రభుత్వ పన్నాగంగా ఉంది.  

దండుకునే దందా.. 
దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా వలపు వల (హానీ ట్రాప్‌) పేరుతో బ్లాక్‌ మెయిలింగ్‌ దందా అది పెద్ద సమస్యగా మారింది. బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, రక్షణ రంగంలోని ఉన్నతాధికారులు, బ్యూరోక్రాట్లను లక్ష్యంగా చేసుకుని వలపు వల విసిరి.. అనంతరం వారీ నుంచి భారీగా డబ్బులు, ఆస్తులు కొల్లగొట్టడం ఓ మాఫియాస్థాయికి చేరడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అటువంటి ఓ హనీట్రాప్‌ కేసును వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడ పోలీసులు అత్యంత సమర్థంగా సత్వరం పరిష్కరించి శభాష్‌ అనిపించారు. 

పూర్తి ఆధారాలతో కేసు నమోదు చేసి.. న్యాయస్థానం అనుమతితో నిందితురాలిని ముంబయి నుంచి తీసుకువచి్చ... విజయవాడ న్యాయస్థానం రిమాండ్‌ విధించడంతో జైలుకు తరలించారు. అంతా చట్ట ప్రకారం వ్యవహరించారని అందరూ ప్రశంసించారు. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం ఆ వ్యవహారంలో బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడ్డ ఘరానా మోసగత్తెకు వత్తాసు పలుకుతోంది. 

రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ప్రస్తుతం బాలీవుడ్‌ హీరోయిన్‌గా చెప్పుకునే ‘హనీట్రాప్‌ స్పెషలిస్ట్‌’ కాదంబరీ జత్వానీని అడ్డంపెట్టుకుని టీడీపీ కూటమి ప్రభుత్వం ఐపీఎస్‌ అధికారులకు గురిపెట్టింది. రెడ్‌బుక్‌ రాజ్యాంగం సృష్టిస్తు న్న టెర్రర్‌లో మరో అంకానికి తెరతీసింది. 

వలపు వల.. ఆపై బ్లాక్‌ మెయిలింగ్‌   
వలపు వల, బ్లాక్‌ మెయిలింగ్, ఫోర్జరీ దందా కోసం కాదంబరీ జత్వానీ పకడ్బందీగా వ్యవహరించేవారు. పోలీసుల విచారణలో ఆమె అక్రమాలలన్నీ పూర్తి ఆధారలతో సహా బట్టబయలయ్యాయి. అవేమిటంటే.. కాదంబరీ జత్వానీకి రెండు పాస్‌ పోర్టులు, రెండు ఆధార్‌ కార్డులు ఉన్నాయి. ఒక్కొక్కరి వద్ద ఒక్కో పేరుతో పరిచయం చేసుకునేది. 

ఈ పకడ్బందీ దందాలో కదాంబరీ తమ్ముడు అంబరీశ్‌ జత్వానీ కూడా ప్రధాన పాత్రధారే. దుబాయిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే తన తమ్ముడికి అండర్‌ వరల్డ్‌ మాఫీయాతో సంబంధాలు ఉన్నాయని... ఆ మాఫియా ద్వారా అంతం చేస్తామని కూడా కాదంబరీ తీవ్ర స్థాయిలో బెదిరించే వారు. మాఫియాతో సంబంధాలు ఉండటమే కాదు హవాలా రాకెట్‌ను కూడా అతను నిర్వహించే వాడు. 

ఈ విధంగా ముంబయి, ఢిల్లీ, బెంగళూరులతోపాటు దేశంలోని పలు నగరాల్లోని పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరో క్రాట్లను బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడి భారీగా ఆస్తులు కొల్లగొట్టారు. ఏసియన్‌ పెయింట్స్‌ ప్రమోటర్‌ మాలవ్‌ దానీ కూడా ఆమె బాధితుల జాబితాలో ఉన్నారు. ఆయన ఫిర్యా దుతో ముంబయిలోని గమ్‌దేవీ పోలీస్‌ స్టేషన్‌లో ఆమెపై కేసు నమోదు చేశారు. అదే రీతిలో దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్‌ జిందాల్‌పై తప్పుడు ఆరోపణలతో బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడింది.  



అంతా చట్టబద్ధంగానే.. 
తనకు అలవాటైన రీతిలోనే కాదంబరీ జత్వానీ ఓ రాజకీయ నేత కుక్కల విద్యాసాగర్‌పై వలపు వల విసిరి అనంతరం బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడింది. ఆయన నుంచి భారీగా డబ్బులు వసూలు చేయడమే కాకుండా దుబాయిలోని మాఫియాతో అంతం చేయిస్తానని బెదిరించింది. విద్యాసాగర్‌కు చెందిన జగ్గయ్యపేటలో సర్వే నంబరు 396/2ఏ2హెచ్‌/1తో 5 ఎకరాల భూమిని ఫోర్జరీ పత్రాలతో సొంతం చేసుకుంది. ఆ  భూమిని మరొకరికి విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకోవడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో విద్యాసాగర్‌కు విషయం తెలిసింది. దాంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై స్పందించిన విజయవాడ పోలీసులు చట్టానికి లోబడి విచారణ నిర్వహించారు. 

ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి.. మెజిస్ట్రీట్‌ నుంచి సెర్చ్‌ వారెంట్‌ తీసుకుని ముంబయి వెళ్లారు. ముంబయి పోలీçసు ఉన్నతాధికారులకు ముందస్తుగా సమాచారం ఇచ్చి, వారి సమక్షంలోనే కాదంబరీ జత్వానీని అరెస్ట్‌ చేసి అక్కడి మేజి్రస్టేట్‌ ఎదుట హాజరు పరిచారు. పోలీసులు సమరి్పంచిన ఆధారాలతో సంతృప్తి చెందిన మెజి్రస్టేట్‌.. ఆమెను ఏపీకి తీసుకువచ్చేందుకు ట్రాన్సిట్‌ వారెంట్‌ జారీ చేశారు. దాంతో కాదంబరీ జత్వానినీ పోలీసులు విజయవాడ తీసుకువచ్చి అదే రోజు స్థానిక మెజిస్ట్రీట్‌ ఎదుట హాజరు పరిచారు. 

మెజిస్ట్రీట్‌ రిమాండ్‌ విధించంతో ఆమెను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. అనంతరం ఆమెకు న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. ఆమె కొన్నాళ్లు ఇబ్రహీంపట్నంలో నివాసం ఉండి, తర్వాత ముంబయికి వెళ్లింది. దీన్ని బట్టి చూస్తే సినీ నటి అరెస్టులో అంతా చట్టబద్ధంగా జరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ మొత్తం ప్రక్రియలో ఆమెకు న్యాయవాదుల సహాయం అందించేందుకు పోలీసులు సంసిద్ధత చూపారు. కానీ ఆమె అందుకు తిర స్కరించి ముంబయి నుంచి తన సొంత న్యాయవాదులను రప్పించుకున్నారు. 

ఈ కేసు విషయంలో విజయవాడ పోలీసులు పూర్తిగా చట్టబద్ధంగా వ్యవహరించారు. న్యాయస్థానాల అనుమతితో, నిబంధనలకు లోబడి దర్యాప్తు ప్రక్రియ పూర్తి చేశారు. దేశంలోనే ఎందరో బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరో క్రాట్లను బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడూ మోసం చేస్తున్న కాదంబరీ నేరాలను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల చర్యను అభినందించాల్సింది పోయి టీడీపీ కూటమి ప్రభుత్వం.. పోలీసు అధికారులపై తప్పుడు ఆరోపణలతో వేధించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.   
సర్కారే లీకులిచ్చి.. 
భారత రాజ్యాంగాన్ని గౌరవించం అని, తాము అమలు చేసేది లోకేశ్‌ రెడ్‌బుక్‌ రాజ్యాంగమేనని టీడీపీ కూటమి ప్రభుత్వం పదే పదే స్పష్టం చేస్తోంది. తాము లక్ష్యంగా చేసుకున్న పోలీసు అధికారులు, రాజకీయ నేతలను వేధించడమే ధ్యేయంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే కాదంబరీ జత్వానీ కేసును నేపథ్యంగా తీసుకుని పోలీసు అధికారులకు గురి పెట్టింది. ప్రభుత్వం దురుద్దేశంతోనే ఈ కేసుకు సంబంధించి అవాస్తవాలు, అభూతకల్పనలను టీడీపీ అనుకూల మీడియాకు లీకులు ఇచి్చంది. 

తద్వారా ఆ పోలీసు అధికారులు, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై దు్రష్పచారం చేస్తోంది. టీడీపీ అనుకూల పత్రికల్లో పతాక శీర్షికలతో కథనాలు... పచ్చ టీవీ చానళ్లలో రోజంతా చర్చలతో రాద్ధాంతం చేస్తోంది. తాజాగా ఇంకో అడుగు ముందుకేసి.. కాదంబరీ జత్వానీ ఉదంతంపై పత్రికలు, టీవీల్లో వస్తున్న కథనాలపై విచారించాలని విజయవాడ ఏసీపీ కె.స్రవంతి రాయ్‌ను గురువారం విచారణాధికారిగా నియమించింది....   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement