Two Madhya Pradesh Congress MLAs Booked For Harassing A Woman In Train - Sakshi

Madhya Pradesh: ట్రైన్‌లో అసభ్య ప్రవర్తన.. ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై కేసు నమోదు

Published Fri, Oct 7 2022 6:44 PM | Last Updated on Fri, Oct 7 2022 7:21 PM

Two Congress MLAs Booked For Harassing A Woman In Train - Sakshi

భోపాల్‌: రైలులో ప్రయాణం చేస్తున్న సమయంలో ఓ మహిళను వేధించారనే కారణంగా ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై కేసు నమోదైంది. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై కేసు నమోదైన ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో గురువారం జరిగింది.

ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సునీల్‌ సరాఫ్‌(కోట్మా నియోజకవర్గం), సిద్దార్థ కుశ్వాహా(సాట్నా నియోజకవర్గం)లు రేవాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ ఏసీ కోచ్‌లో గురువారం ప్రయాణం చేశారు. మద్యం మత్తులో వారు కర్నీ స్టేషన్‌లో ట్రైన్‌ ఎక్కారు. అదే కోచ్‌లో ఓ మహిళ తన శిశువుతో ప్రయాణం చేస్తోంది. ఎమ్మెల్యేలు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించగా.. వారి ప్రవర్తనపై భర్తకు ఫోన్‌ ద్వారా తెలియజేసింది. ఏసీ కోచ్‌లో ఎమ్మెల్యేల తీరును వివరిస్తూ రైల్వే శాఖ, రైల్వే పోలీసులకు ట్యాగ్‌ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు బాధితురాలి భర్త.  ఫిర్యాదు అందుకున్న రైల్వే పోలీసులు ట్రైన్‌లోకి వెళ్లి మహిళ బెర్త్‌ను మార్చారు. ఇద్దరు ఎమ్మెల్యేలపై ఐపీసీ సెక్షన్‌ 354 ప్రకారం కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: ఎల్‌ఈడీ టీవీ పేలి బాలుడు మృతి.. మీరూ ఈ తప్పులు చేస్తున్నారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
 
Advertisement