RPF
-
యూపీలో ఎన్కౌంటర్.. రూ. లక్ష రివార్డు నిందితుని హతం
లక్నో: యూపీలోని లక్నోలో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. గత ఆగస్టులో ఇద్దరు ఆర్పీఎఫ్ పోలీసులను రైలు నుంచి తోసి, హత్య చేసిన కేసులో నిందితునిగా ఉన్న జాహిద్ పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఇతనిపై పోలీసులు రూ. రూ.లక్ష రివార్డు ప్రకటించారు. నిందితుడు జాహిద్ మద్యాన్ని రైలులో అక్రమంగా రవాణా చేస్తుండగా, ఇద్దరు ఆర్పీఎఫ్ జవానులు అడ్డుకున్నారు. అయితే నిందితుడు జాహిద్ వారిని రైలు నుంచి తోసివేశాడు. ఈ ఘటనలో వారిద్దరూ మృతి చెందారు.వివరాల్లోకి వెళితే గత నెల ఆగస్టు 19న రాత్రి బార్మర్ గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో జావేద్ ఖాన్, ప్రమోద్ కుమార్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లను నిందితుడు జాహిద్ రైలు నుంచి కిందకు నెట్టివేశాడు. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో పోలీసులు నిందితుడు జాహిద్‌ను ఎన్కౌంటర్ చేశారు. ఘాజీపూర్‌లోని దిల్దార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గాయపడిన స్థితిలో నిందితుడు జాహిద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతను చనిపోయినట్లు ప్రకటించారు. నిందితుడు పట్నాలోని మన్సూర్ గాలి పెదిమా బజార్‌కు చెందినవాడు. నిందితునిపై గతంలో కిడ్నాప్, దాడి, మద్యం స్మగ్లింగ్ తదితర కేసులు నమోదయ్యాయి. STF यूनिट नोएडा कोतवाली गहमर व GRP दिलदारनगर पुलिस की संयुक्त टीम द्वारा आरपीएफ जवानों की हत्या में शामिल 100000/- रुपये के इनामिया बदमाश के साथ थाना दिलदारनगर क्षेत्रान्तर्गत हुई मुठभेड़ के संबंध में #spgzr महोदय की बाइट(1)@Uppolice @IgRangeVaranasi @adgzonevaranasi pic.twitter.com/lCHVw8Z1In— Ghazipur Police (@ghazipurpolice) September 23, 2024ఇది కూడా చదవండి: మహాబోధి ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. పలువురు ప్రయాణికులకు గాయాలు -
చచ్చిపోదామని పట్టాలపై ..ఇంతలో వచ్చింది దేవత ! వైరల్ వీడియో
న్యూఢిల్లీ: జీవితంలో ఆశను కోల్పోవద్దు అని ఎంత చెప్పినా తృణప్రాయంగా ప్రాణాల్ని త్యజిస్తున్న వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. చివరికి ఆత్మహత్య చేసు కోవడం నేరం అని చెప్పినా కూడా చాలామంది సూసైడ్ చేసుకుంటూనే ఉన్నారు. కానీ ఆ ఒక్క క్షణం వారిని మృత్యు ముఖ్యం నుంచి తప్పించగలిగితే, సరియైన కౌన్సిలింగ్ ఇప్పించ గలిగితే జీవితం విలువ తెలిసి వస్తుందని చాలామంది మానసిక నిపుణులు చెబుతున్న మాట. అయితే తాజాగా చనిపోవాలని పట్టాలపై పడుకున్న వ్యక్తిని తృటిలో ప్రమాదంనుంచి తప్పించిన వైనం ఒకటి వైరల్‌గా మారింది. (తల్లి అకౌంట్నుంచి మొత్తం వాడేసిన చిన్నది: పేరెంట్స్ గుండె గుభిల్లు!) వెస్ట్ బెంగాల్‌లోని పూర్వా మేదినీపూర్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్పీఎఫ్ ఇండియా ట్విటర్ హ్యాండిల్ ఈ ఘటనకుసంబంధించినవీడియోను షేర్ చేసింది. దీని ప్రకారం రైలు కింద పడిచనిపోవాలనుకున్న యువకుడు చాలాసేపే అక్కడక్కడే తచ్చట్లాడాడు. చివరికి అతివేగంగా దూసుకు రానున్న రైలు కింద పడేలా పట్టాలపై పడుకున్నాడు. అయితే డ్యూటీలో ఉన్న లేడీ కానిస్టేబుల్ సుమతి ఈ విషయాన్ని గమనించారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా శరవేగంగా కదిలి అతగాడిని ట్రాక్‌పై నుండి లాగాపడేశారు. అంతే క్షణాల్లో అతడు యమపాశంనుంచి తప్పించుకున్నాడు. (రూ. 451 కోట్ల శ్లోకా మెహతా డైమండ్ నెక్లెస్: షాకింగ్ న్యూస్!) సుమతి నిర్భయంగా ముందుకు కదిలి ఆ వ్యక్తిని ప్రాణాలను కాపాడిన వైనంపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కుడోస్ సుమతి మేడమ్ అంటూ అభినందిస్తున్నారు. అంతేకాదు ఆత్యహత్యా ప్రయత్నం చేసిన వ్యక్తికిపై కేసు నమోదు చేయకుండా, దయచేసి అతనికి సాయం చేయండి అంటూ అభ్యర్థిస్తున్నారు. ఈ వీడియో దాదాపు 264.6 వేల వ్యూస్, 7వేలకు పైగా లైక్స్, 232 రీట్వీట్లను సాధించింది. #RPF Lady Constable K Sumathi fearlessly pulled a person off the track, moments before a speeding train passes by at Purwa Medinipur railway station. Kudus to her commitment towards #passengersafety.#MissionJeevanRaksha #FearlessProtector pic.twitter.com/yEdrEb48Tg — RPF INDIA (@RPF_INDIA) June 8, 2023 -
రైల్వే కానిస్టేబుల్ పాడుపని.. సిట్జర్లాండ్ మహిళలతో అసభ్యంగా..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్‌లో ఓ రైల్వే కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించాడు. తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో స్విట్జర్లాండ్‌కు చెందిన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమెపై భౌతికంగా దాడి చేయబోయాడు. ఆమెకు కాబోయే భర్త పక్కనే ఉన్నా పట్టించుకోకుండా కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. ఢిల్లీ నుంచి లక్నో వెళ్తున్న తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గవర్నమెంట్ రైల్వే పోలీస్(జీఆర్పీ) వెంటనే చర్యలకు ఉపక్రమించింది. అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. అతిథి అని కూడా చూడకుండా విదేశీ మహిళను వేధించిన ఈ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పేరు జితేంద్ర సింగ్. గత ఏడాదిన్నరగా యూపీ ఫిరోజాబాద్‌లోని ఆర్పీఎఫ్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. చదవండి: బీజేపీ ఎమ్మెల్యే ఇంట్లో రూ.6 కోట్లు సీజ్.. కీలక పదవికి రాజీనామా -
ట్రైన్లో మహిళకు వేధింపులు.. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసు!
భోపాల్: రైలులో ప్రయాణం చేస్తున్న సమయంలో ఓ మహిళను వేధించారనే కారణంగా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసు నమోదైంది. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసు నమోదైన ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో గురువారం జరిగింది. ఎఫ్ఐఆర్ ప్రకారం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సునీల్ సరాఫ్(కోట్మా నియోజకవర్గం), సిద్దార్థ కుశ్వాహా(సాట్నా నియోజకవర్గం)లు రేవాంచల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఏసీ కోచ్‌లో గురువారం ప్రయాణం చేశారు. మద్యం మత్తులో వారు కర్నీ స్టేషన్లో ట్రైన్ ఎక్కారు. అదే కోచ్‌లో ఓ మహిళ తన శిశువుతో ప్రయాణం చేస్తోంది. ఎమ్మెల్యేలు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించగా.. వారి ప్రవర్తనపై భర్తకు ఫోన్ ద్వారా తెలియజేసింది. ఏసీ కోచ్‌లో ఎమ్మెల్యేల తీరును వివరిస్తూ రైల్వే శాఖ, రైల్వే పోలీసులకు ట్యాగ్ చేస్తూ వరుస ట్వీట్లు చేశారు బాధితురాలి భర్త. ఫిర్యాదు అందుకున్న రైల్వే పోలీసులు ట్రైన్‌లోకి వెళ్లి మహిళ బెర్త్‌ను మార్చారు. ఇద్దరు ఎమ్మెల్యేలపై ఐపీసీ సెక్షన్ 354 ప్రకారం కేసు నమోదు చేశారు. ఇదీ చదవండి: ఎల్ఈడీ టీవీ పేలి బాలుడు మృతి.. మీరూ ఈ తప్పులు చేస్తున్నారా? -
రైల్వే స్టేషన్ల వద్ద పటిష్ట భద్రత
సాక్షి, అమరావతి: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న ఆందోళనలు, ఉద్రిక్తతల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధానంగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి రైల్వే స్టేషన్ల వద్ద అదనపు భద్రతా బలగాలను మోహరించారు. సైన్యంలో అగ్నిపథ్ కార్యక్రమం కింద నియామకాలను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌తో పాటు ఉత్తరాదిలో కొన్నిచోట్ల నిరసన కార్యక్రమాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. దీంతో రాష్ట్రంలో రైల్వే భద్రత దళం (ఆర్పీఎఫ్), ప్రభుత్వ రైల్వే పోలీస్ (జీఆర్పీ) విభాగాలతో పాటు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్రంలో ప్రధాన రైల్వే స్టేషన్ల వద్ద పోలీసు బందోబస్తును పటిష్టపరిచారు. భద్రతా ఏర్పాట్లపై సమీక్షించిన డీజీపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి రైల్వే ఉన్నతాధికారులతోపాటు ఆర్పీఎఫ్, జీఆర్పీ విభాగాల అధికారులతో శుక్రవారం సమీక్షించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రధానంగా విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కర్నూలు, కడప, అనంతపురం, అనకాపల్లి తదితర రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలో ఆర్మీ ఉద్యోగాల పరీక్షలకు శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలతో పోలీసు అధికారులు చర్చించారు. వారి వద్ద శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులెవరూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎవరైనా అభ్యర్థులు తమ సమస్యలను ప్రభుత్వానికి శాంతియుతంగా విన్నవించుకోవాలన్నారు. అంతేగానీ ఆందోళనలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాంటి వారు భవిష్యత్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు కావడంతోపాటు కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. టికెట్లు చూపిస్తేనే స్టేషన్లోకి అనుమతి విజయవాడ రైల్వే స్టేషన్‌కు అదనంగా 200 మంది పోలీసులను తరలించారు. రైల్వే స్టేషన్‌తో పాటు పరిసర ప్రాంతాలు, రైల్వే ట్రాక్‌ల వెంబడి పోలీసులను ఏర్పాటు చేశారు. టికెట్లు ఉన్నవారినే స్టేషన్లోకి అనుమతిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాతో పాటు పలువురు పోలీస్ అధికారులు రైల్వే స్టేషన్ వద్ద భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. విజయవాడ డీఆర్ఎం శివేంద్రమోహన్ రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. తిరుపతి, విశాఖపట్నం రైల్వే స్టేషన్ల వద్ద కూడా అదనంగా వందమంది చొప్పున రాష్ట్ర పోలీసులను మోహరించారు. వాల్తేర్ డివిజన్ పరిధిలోని అన్ని రైల్వేస్టేషన్లలో, రైల్వే కాలనీలు, కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ రైల్వే అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా రైల్వే, పోలీస్ యంత్రాంగాలు జాగ్రత్తలు తీసుకున్నాయి. సికింద్రాబాద్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో విజయవాడ మీదుగా ప్రయాణించాల్సిన 28 రైళ్లను పూర్తిగా, 19 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. మరో 8 రైళ్లను దారి మళ్లించగా, రెండు రైళ్లను రీషెడ్యూల్ చేశారు. ప్రయాణికుల సమాచారం కోసం విజయవాడ రైల్వే స్టేషన్లో 0866–2767055 నంబర్‌తో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. పరిస్థితి అదుపులో ఉంది రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అభ్యర్థులు, యువకులు ఎవరూ దుందుడుకు చర్యలకు పాల్పడవద్దని కోరుతున్నాం. పోలీసు ఆంక్షలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డీజీపీ -
దొందూ దొందే!
‘సాక్షి, హైదరాబాద్: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్.. జనరల్ రైల్వే పోలీసులు.. చేతుల్లో ఆయుధాలు. రాష్ట్ర, కేంద్ర ఇంటలిజెన్స్ నుంచి ముందస్తు హెచ్చరికలు.. స్వయంగా సికింద్రాబాద్‌లోనే జీఆర్పీ ఎస్పీ కార్యాలయం.. 24 గంటలు షిఫ్టులవారీగా పోలీసులభద్రత. అనుక్షణం నిఘాకళ్లతో చూపులు, ప్రయాణికులు, రైల్వేఆస్తులకు ఇబ్బంది కలగకుండా చూసే వ్యవస్థ తీరు ఇదీ! కానీ, వందలమంది యువకులు సికింద్రాబాద్ స్టేషన్ పరిసరాల్లోకి ముందురోజు రాత్రే చేరుకున్నా ఈ నిఘా కళ్లేవీ పసిగట్టలేదు. ఉదయం వీరు గుంపులుగా స్టేషన్లోకి చొచ్చుకొని వచ్చినా కీడు శంకించలేదు. యువకులు ఇష్టంవచ్చినట్టు విధ్వంసం చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. నిఘాసంస్థల హెచ్చరికలు లేనప్పటికీ, దేశంలోని ఇతర ప్రాంతాల్లో విధ్వంసం జరుగుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలన్న ప్రాథమిక విషయాన్ని కూడా రైల్వే అధికారులు విస్మరించటం గమనార్హం. అప్పుడు విధుల్లో 80 మంది పోలీసులే? సికింద్రాబాద్ స్టేషన్లో 50 మంది ఆర్పీఎఫ్, 30 మంది జీఆర్పీ సిబ్బంది విధుల్లో ఉంటారు. శుక్రవారం ఉదయం ఆర్మీ అభ్యర్థులు వేలల్లో తరలివచ్చాక జరిగిన విధ్వంసం సమయంలోనూ 80 మంది సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్పీఎఫ్కు సంబంధించి దాదాపు రెండున్నర వేలమంది అందుబాటులో ఉండి కూడా, ముందస్తుగా రప్పించి మోహరించాలన్న ఆదేశాలు రాలేదు. ఆందోళనకారులు స్టేషన్ ముందువైపు తొలుత కొంత సేపు ఆందోళన చేపట్టిన తరుణంలో ఓ ఆర్టీసీ బస్సుపై దాడి జరిగింది. ఆ సమయంలో కూడా రైల్వేభద్రత వ్యవస్థ మేల్కొనలేకపోయింది. రైళ్లు, రైల్వే ఆస్తుల పరిరక్షణ బాధ్యత పూర్తిగా ఆర్‌ఫీఎఫ్‌దే. ఇతర శాంతిభద్రతల అంశాన్ని జీఆర్పీ చూస్తుంది. ఈ రెండు విభాగాలు నిరంతరం సమన్వయంతో పనిచేసుకోవాల్సి ఉంటుంది. అయితే దాడికి సంబంధించి ఆర్పీఎఫ్కు ఎలాంటి నిఘా హెచ్చరికలు అందలేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. కాగా, సికింద్రాబాద్ ఘటనపై రైల్వేశాఖ అంతర్గత విచారణకు ఆదేశించినట్టు సమాచారం. సికింద్రాబాద్ స్టేషన్‌పై దాడి జరగ్గానే కాచిగూడ, హైదరాబాద్ స్టేషన్ల చుట్టూ భద్రతవలయాన్ని ఏర్పాటు చేశారు. వరంగల్, కాజీపేట లాంటి అన్ని స్టేషన్లలో అదనపు బలగాలను ఏర్పాటు చేశారు. ఇంతకూ నష్టమెంత.. ఆందోళనకారులు కనిపించిన ఆస్తిని ధ్వంసం చేయటమే లక్ష్యంగా రైల్వేస్టేషన్‌లోనికి ప్రవేశించారు. ఆందోళనకారులు ఉదయం 9 గంటల సమయంలో లోనికి వెళ్లేటప్పటికి ఎనిమిది ప్లాట్‌ఫామ్స్‌పై రైళ్లున్నాయి. రాజ్‌కోట్, ఈస్ట్‌కోస్ట్, అజంతా రైళ్లకు సంబంధించి ఐదు కోచ్‌లకు నిరసనకారులు నిప్పు పెట్టారు. ఇవి నాన్ ఏసీ జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్‌లు. ఇవన్నీ ఒక్కోటి రూ.2 కోట్ల ఖరీదైన్ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు. దహనం చేసిన వాటిల్లో రెండు సరుకురవాణా (పార్శిల్) వ్యాన్లు కూడా ఉన్నాయి. ఒకదానిలో హౌరాకు తరలిస్తున్న చేపల లోడ్ ఉండగా, మరో దానిలో ద్విచక్రవాహనాలు, ఇతర వస్తువులు ఉన్నాయి. ఒక ఎంఎంటీఎస్ సహా ఆరు లోకోమోటివ్ (ఇంజిన్ కోచ్‌లు)లను రాళ్లతో పాక్షికంగా ధ్వంసం చేశారు. 30 ఏసీ కోచ్‌లు, 47 నాన్ ఏసీ కోచ్‌ల్లో విధ్వంసం చోటుచేసుకుంది. 4,500 బెడ్‌రోల్స్ తగులబెట్టారు. రైళ్లకు సంబంధించి రూ.3.30 కోట్ల నష్టం వాటిల్లినట్టు దక్షిణ మధ్య రైల్వే మెకానికల్ డిపార్ట్మెంట్ ప్రాథమిక నివేదిక రూపొందించింది. ఇక దహనమైన సరుకు, దుకాణాల విలువను కూడా లెక్కించాల్సి ఉంది. సీసీ టీవీ కెమెరాలు, ప్రకటన టీవీలు, ఫ్యాన్లు, లైట్లు, సరుకు తరలించే కార్లు, బల్లలు, వస్తువులు విక్రయించే స్టాళ్లు.. ఇలా కనిపించినవన్నీ ధ్వంసం చేశారు. పూర్తిగా లెక్కగట్టేందుకు ఓ కమిటీని నియమించారు. ఇక నష్టం విలువ రూ.ఏడు కోట్ల వరకు ఉండొచ్చని, వాస్తవ లెక్కలు పూర్తి పరిశీలన తర్వాత తెలుస్తుందని సికింద్రాబాద్ డీఆర్ఎం విలేకరులకు తెలిపారు. -
చెప్తే వినలా.. 7000 మంది పురుషులు అరెస్టు!
న్యూఢిల్లీ: భారతీయ రైల్వే శాఖ మహిళల భద్రతను సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో రైళ్లలోని మహిళలకు కేటాయించిన కోచ్‌లలో ప్రయాణిస్తున్న 7 వేల మంది పురుషులను అరెస్టు చేసింది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు. దీంతో పాటు మానవ అక్రమ రవాణా నుంచి 150 మంది అమ్మాయిలను కూడా పోలీసులు రక్షించారు. వివరాల్లోకి వెళితే.. మే 3 నుంచి మే 31 మధ్య రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు "ఆపరేషన్ మహిళా సురక్ష" కింద ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. రైళ్లలో ప్రయాణించే మహిళా ప్రయాణీకులకు మెరుగైన వసతులు, వారి భద్రతే ప్రధాన లక్ష్యంగా ఈ డ్రైవ్ నిర్వహణ జరిగింది. కాగా ఇందులో 283 పోలీసు బృందాలు మొత్తం 223 స్టేషన్లను కవర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. రోజుకు 1,125 మంది మహిళా ఆర్పీఎఫ్ పోలీసులు ఈ డ్రైవ్‌లో పాల్గొన్నట్లు చెప్పారు. వీటితో పాటు రైల్లో ప్రయాణిస్తున్న 2.25 లక్షల మంది మహిళలతో మాట్లాడి, వారి భద్రతకు తీసుకోవాల్సిన అంశాలపై సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. ఈ నెల రోజుల ఆపరేషన్‌లో, ఆర్పీఎఫ్ సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి.. కదులుతున్న రైళ్లను ఎక్కేటప్పుడు, డీ బోర్డింగ్ చేస్తున్నప్పుడు జారిపడిపోతున్న ఘటనల్లోని 10 మంది మహిళల ప్రాణాలను కాపాడారని రైల్వే పోలీసులు తెలిపారు. చదవండి: ఈ ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు, కాంగ్రెస్‌కు హార్దిక్ షాక్ -
ప్రయాణికులు, రైల్వే ఆస్తుల పరిరక్షణపై దృష్టి
సాక్షి, హైదరాబాద్: రైల్వేతో పాటు ప్రయాణికుల ఆస్తుల పరిరక్షణ కోసం దక్షిణ మధ్య రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్) వినూత్న కార్యక్రమాలను చేపట్టింది. నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. ప్రస్తుత వేసవిలో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతుండటం, పెద్దఎత్తున సరుకు రవాణా రైళ్ల రాకపోకలు.. ప్రధాన రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో కొన్ని అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకునే ప్రమాదముంది. దొంగలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడే నేరస్తులతో సహా అసాంఘిక శక్తుల కార్యకలాపాలను అరికట్టేందుకు ఆర్పీఎఫ్ పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసింది. రైల్వే ఆస్తుల రక్షణతో పాటు, ప్రయాణికుల భద్రత కోసం రాష్ట్ర పోలీసులు, ఇతర ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ప్రయాణంలో ప్రమాదాలు... రైలు పట్టాలే మృత్యుపాశాలుగా మారుతున్నాయి. జీవితంపై విరక్తితో కొందరు ఆత్మహత్యల కోసం పట్టాలను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు రైల్వేస్టేషన్లలో పట్టాల మీదుగా ఒక ప్లాట్‌ఫామ్ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు దాటుతూ కొందరు ప్రమాదాల బారిన పడుతుండగా, కదిలే రైలు ఎక్కడం వల్ల, లేదా రైలు స్టేషన్లో పూర్తిగా ఆగకుండానే దిగేందుకు ప్రయత్నిస్తూ మరికొందరు పట్టాలపైకి జారి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలాంటి ప్రమాదాల నియంత్రణలో ఆర్పీఎఫ్ సిబ్బంది అప్రమత్తత వల్ల కొందరు ప్రాణాలతో బయటపడుతున్నారు. ‘మిషన్ జీవన్ రక్ష’ కింద ఈ ఏడాది మార్చి నెలలో 13 మంది పురుషులు, 8 మంది మహిళలను కాపాడినట్లు అధికారులు తెలిపారు. బాలలకు భరోసా.. వివిధ కారణాలతో ఇళ్ల నుంచి పారిపోయి రైళ్లెక్కే చిన్నారులకు రైల్వేస్టేషన్లే అడ్డాలుగా మారుతున్నాయి. తెలిసీ తెలియక రైళ్లలో దూర ప్రాంతాలకో చేరుకొని అసాంఘిక శక్తుల చేతుల్లో పడుతున్న పిల్లలు వీధి బాలలుగా మారి చివరకు నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి పిల్లల రక్షణ కోసం అనేక స్వచ్ఛంద సంస్థలు పని చేస్తున్నాయి. ► రైల్వేస్టేషన్లలో బాలల రక్షణ కోసం పని చేసే సహాయ కేంద్రాలకు ఆర్పీఎఫ్ బాసటగా నిలు స్తోంది. ‘ఆపరేషన్ నాన్హే ఫరిస్తే’ పథకంలో భా గంగా ఇల్లు వదిలి తప్పిపోయి, లేదా పారిపోయి వచ్చిన 93 మంది పిల్లలను ఆర్పీఎఫ్ దళాలు కాపాడాయి. వారిలో 66 మంది అబ్బాయిలు, మరో 27 మంది అమ్మాయిలు ఉన్నారు. ► ‘ఆపరేషన్ డిగ్నిటీ’ కార్యక్రమంలో భాగంగా నిరాశ్రయులు, నిస్సహాయులు, మతిస్థిమితం లేనివారు, అక్రమ రవాణాకు గురయ్యే వాళ్లను గుర్తించి రక్షించారు. అలాంటి వారిని తిరిగి కుటుంబాలకు అప్పగించారు. అయిదుగురు పురుషులతో పాటు 10 మంది మహిళలను కాపాడినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణంలో వైద్య సహాయం అవసరమైన 59 మందిని ఆర్పీఎఫ్ దళాలు సత్వరమే చేరుకొని ఆస్పత్రులకు తరలించాయి. అక్రమ రవాణాపై ఉక్కుపాదం... ► రైళ్లలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఆర్పీఎఫ్ ఉక్కుపాదం మోపింది. ‘ఆపరేషన్ నార్కో స్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది.గత నెలలో రూ.7.50 లక్షలకు పైగా విలువైన మాదకద్రవ్యాల ఉత్పత్తులను జప్తు చేసి, ఆరుగురు వ్యక్తుల ను అరెస్టు చేశారు. ఆపరేషన్ సట్కార్క్’లో భాగంగా రూ.1.97 లక్షల విలువైన అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకొని ఆరుగురిని అరెస్టు చేసి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. -
తుపాకీతో కాల్చుకుని హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, చిత్తూరు: తిరుపతిలోని రేణిగుంటలో విషాదం చోటుచేసుకుంది. ఆర్పీఎఫ్ బ్యారక్‌లో హెడ్ కానిస్టేబుల్ ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం తెల్లవారుజామున తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆనందరావు ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. మృతుడు శ్రీకాకుళం జిల్లా చింతలపోలూరుకి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రేణిగుంట సీఐ అంజూ యాదవ్ మాట్లాడుతూ.. శ్రీకాకుళానికి చెందిన హెచ్ ఆనందరావు అనే హెడ్ కానిస్టేబుల్ ఇటీవల సెలవులపై వెళ్లి ఆగష్టు 3న తిరిగి విధుల్లో చేరినట్లు తెలిపారు. అయితే ఈరోజు ఉదయం 3 గంటల సమయంలో ర్వేల్వే బ్యారక్ ఆర్మర్ గదిలోకూర్చీలో కూర్చొని తుపాకీతో కాల్చుకొని మరణించినట్లు వెల్లడించారు. నిన్న ఉదయం 6 గంటల నుంచి ఈరోజు ఉదయం 6 గంటల వరకు అతను విధుల్లో ఉండాల్సి ఉంది. ఉదయం 4 గంటలకు ఏఎస్సై రాజు పిస్తోల్‌ను డిపాజిట్ చేసేందుకు రాగా కానిస్టేబుల్ మరణించిన వార్త తెలిసిందన్నారు. దీనిపై విచారణ చేపట్టినట్టు తెలిపారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించలేదని అంజూ యాదవ్ పేర్కొన్నారు. -
దేశవ్యాప్తంగా 90 రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ
దేశవ్యాప్తంగా 90 రైల్వే స్టేషన్లను ప్రైవేటీకరించాలని కేంద్రం యోచిస్తున్నట్లు హిందుస్తాన్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది. హిందుస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం.. ఆ రైల్వే స్టేషన్లలో ఎయిర్‌పోర్టు తరహా భద్రతా, మౌలిక సదుపాయాలను అందించాలని భారతీయ రైల్వే ఆలోచన చేస్తోంది. ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద నెట్‌వర్క్‌ను కలిగిన భారతీయ రైల్వే, 2019లో ప్రైవేట్-కంపెనీలను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య(పిపిపి) కింద కొన్ని స్టేషన్లను నడుపుటకు అనుమతి ఇచ్చింది. ఇప్పడు మరికొన్ని రైల్వే స్టేషన్లలో మెరుగైన సౌకర్యాలు, సదుపాయాలు, భద్రతాపరమైన వసతులు కల్పించేందుకు చూస్తుంది. ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఐఆర్ఎస్ డిసి) ఆ రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ భాద్యతలను పర్యవేక్షిస్తుంది. ఈ 90 రైల్వే స్టేషన్లలో భద్రతా, మౌలిక సదుపాయాలు ఎలా కల్పించాలనే దానిపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పిఎఫ్), అన్ని రైల్వే జోన్ల ప్రధాన చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ల నుంచి అభిప్రాయాలను కోరుతూ రైల్వే బోర్డు లేఖ రాసింది. ప్రస్తుతం విమానాశ్రయాలలో ఉన్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సిఐఎస్ఎఫ్) మాదిరిగానే ఈ స్టేషన్లలో అలాంటి భద్రతా బలగాలను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని రైల్వే బోర్డు తన అభిప్రాయాన్ని తెలిపింది. అలాగే, ప్రైవేట్ సంస్థలే సీఐఎస్ఎఫ్ బలగాలకు వేతనాలు చెల్లించాలి. ప్రస్తుతం విమానాశ్రయాలలో ఉన్న భద్రతాపరమైన వ్యవస్థను ప్రైవేట్ స్టేషన్లలో అమలు చేయాలనీ బోర్డు చూస్తుంది. ఈ ప్రతిపాదనలపై అభిప్రాయాలను మార్చి 15లోగా తెలపాలంటూ రైల్వే బోర్డు కోరింది. 150 రైళ్లు, 50 రైల్వే స్టేషన్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం కోసం బ్లూప్రింట్ రూపొందించడానికి ఒక కమిటీని 2019 అక్టోబర్‌లో ఏర్పాటు చేసింది. నాగ్‌పూర్, గ్వాలియర్, అమృత్ సర్, సబర్మతి, నెల్లూరు, పుదుచ్చేరి, డెహ్రాడూన్, తిరుపతి రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం బిడ్డింగ్ అర్హత ప్రక్రియను సెప్టెంబర్‌లో ప్రారంభించినట్లు గతేడాది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటికే గాంధీనగర్, హబీబ్‌గంజ్ వంటి స్టేషన్లలో పునరాభివృద్ధిపై పనులు ప్రారంభమయ్యాయి. ఆనంద్ విహార్, బిజ్వాసన్, చండీగఢ్ వంటి రైల్వే స్టేషన్లలో పునరాభివృద్ధికి కాంట్రాక్టులు ఇచ్చారు. రైల్వే పునరాభివృద్ధి చేస్తున్న స్టేషన్లలో రైలు ఛార్జీలపై అదనపు రుసుము వసూలు చేయాలనీ చూస్తుంది. ఇంకోవైపు 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొదట 12 ప్రైవేట్ రైళ్లు, 2027 నాటికి 151 రైళ్లను ప్రైవేటీకరించాలని కేంద్రం యోచిస్తుంది. చదవండి: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్! మొబైల్ ప్రియులకు గుడ్ న్యూస్ -
రియల్ హీరోగా మారిన కానిస్టేబుల్
-
‘ఈ–టికెట్’ స్కాం బట్టబయలు
న్యూఢిల్లీ: రైల్వేలో భారీ ఈ –టికెట్ కుంభకోణం బయటపడింది. ఈ కుంభకోణం సూత్రధారులకు మనీ ల్యాండరింగ్, ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నట్లు దీన్ని ఛేదించిన రైల్వే భద్రతా దళం (ఆర్పీఎఫ్) డీజీ అరుణ్ కుమార్ తెలిపారు. మంగళవారం ఇక్కడ మీడియాకు ఆయన వివరాలు వెల్లడించారు. ‘దొడ్డిదారిన ఈ టికెట్ల విక్రయం జరుగుతున్నట్లుగా అనుమానం రావడంతో గత ఏడాది ‘ఆపరేషన్ థండర్‌స్టార్మ్’పేరుతో దర్యాప్తు ప్రారంభించాం. ఈ సందర్భంగా గులాం ముస్తాఫా(28) పేరు బయటకు వచ్చింది. జార్ఖండ్‌కు చెందిన ఇతడు 2015 నుంచి ఈ దందా నడుపుతున్నాడు. ఈ నెల మొదటి వారంలో ఇతడిని భువనేశ్వర్‌లో అదుపులోకి తీసుకున్నాం. ఇతని వద్ద ఐఆర్సీటీసీకి చెందిన 563 మంది గుర్తింపుకార్డులు లభించాయి. వీటి ద్వారా ఇతడు టికెట్లను బుక్ చేసేవాడు. వచ్చిన డబ్బును బ్యాంకు అకౌంట్లకు మళ్లించేవాడు. ఇందుకు సంబంధించి ఇతని వద్ద 3,000 అకౌంట్ల వివరాలు లభించాయి. దీంతోపాటు ఇతని వద్ద రెండు ల్యాప్‌టాప్‌లలో ఏఎన్ఎంఎస్ అనే సాఫ్ట్వేర్ ఉంది. దీంతో సాధారణ యూజర్ల కంటే వేగంగా టికెట్లను బుక్ చేయవచ్చు. వచ్చిన డబ్బును డార్క్‌నెట్ ద్వారా క్రిప్టో కరెన్సీలోకి మారుస్తాడు. ఆ కరెన్సీని మనీ ల్యాండరింగ్‌కు, ఉగ్రసంస్థలకు సాయం అందించేందుకు వాడుతున్నట్లు మా అనుమానం’ అని డీజీ వెల్లడించారు. ‘పాక్‌కు చెందిన తబ్లిక్–ఇ–జమాత్ అనే ఉగ్రసంస్థతోనూ, బంగ్లాదేశ్, ఇండోనేసియా, నేపాల్, ఇంకా గల్ఫ్ దేశాల వారితో ఇతనికి సంబంధాలున్నట్లు ల్యాప్‌టాప్‌ల్లో సమాచారంతో తేలింది. అతని వద్ద నకిలీ పాన్, ఆధార్ కార్డులను తయారు చేసే సాఫ్ట్వేర్ కూడా ఉంది. ఇతని గ్రూప్ నుంచి డబ్బు అందుకునే సాఫ్ట్వేర్ కంపెనీ మనీల్యాండరింగ్ కు పాల్పడుతోంది. దీనిపై సింగపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు’అని డీజీ అరుణ్ కుమార్ చెప్పారు. ‘గురూజీ అనే పేరుగల సాంకేతిక నిపుణుడికి ముస్తాఫా ఇటీవల రూ.13 లక్షలు అందించాడు. తన గుర్తింపు బయటపడకుండా ఉండేందుకు ఈ గురూజీ యుగోస్లావియా వీపీఎన్ వాడుతున్నాడు. ఈ ముఠా నడిపే అవయవ వ్యాపారం దందాలో భాగంగా వివిధ ఆస్పత్రులకు గురూజీ చికిత్సల పేరుతో బంగ్లాదేశ్ వాసులను పంపిస్తున్నాడు. ఈ రాకెట్ ద్వారా నెలకు రూ.10 నుంచి రూ.15 కోట్ల వరకు ఆర్జిస్తున్నట్లు అనుమానిస్తున్నాం’అని వివరించారు. దుబాయ్‌లో సూత్రధారి ఈ టికెట్ రాకెట్‌కు మాస్టర్‌మైండ్ హమీద్ అష్రాఫ్. 2019 జూలైలో ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలోని ఓ స్కూల్ ఆవరణలో బాంబు పేలుడుకు ఇతడే సూత్రధారి. ఈ ఘటనలో అరెస్టయిన ఇతడు బెయిల్‌పై బయటకు వచ్చి, నేపాల్ మీదుగా దుబాయ్‌కి పరారయ్యాడు. పది రోజులుగా ఇంటలి జెన్స్ బ్యూరో, స్పెషల్ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), కర్ణాటక పోలీసులు ముస్తాఫాను విచారణ చేస్తున్నారు. ముస్తాఫా ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పటివరకు 27 మందిని అరెస్టు చేశారు. -
క్షణాల్లో కాపాడారు.. లేకపోతే
-
క్షణాల్లో కాపాడారు.. తృటిలో బయటపడ్డాడు
పట్నా : కదులుతున్న రైలును ఎక్కబోయి ప్రమాదవశాత్తు కిందపడిపోయిన ఓ 60 ఏళ్ల వృద్ధుడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. రైల్వేశాఖ అందించిన సమాచారం ప్రకారం.. బిహార్‌లోని గయా రైల్వే స్టేషన్లో ఫ్లాట్‌ఫామ్‌పై బండి ఆగి ఉంది. దీంతో ఓ వృద్ధుడు ఫ్లాట్ఫాంపైకి దిగాడు. కొద్ది సమయంలోని ఆ రైలు తిరిగి బయలుదేరింది. అయితే కదులుతున్న సమయంలో ట్రైన్ ఎక్కబోయిన ఆ వృద్ధుడు ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఫ్లాట్‌ఫామ్‌కి, రైలుకి మధ్య సందులో ఇరుక్కుపోయాడు. దీంతో అక్కడే ఉన్న రైల్వే సిబ్బంది (ఆర్పీఎఫ్) క్షణాల్లో అతన్ని గమనించి వెంటనే వెనక్కి లాగా కాపాడింది. దీంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. రైల్వేగార్డ్ సహాయంతో ట్రైన్ ఆపి అతన్ని లోపలకి ఎక్కించారు. దీనికి సంబందించిన వీడియోను రైల్వేమంత్రిత్వ శాఖ ట్విటర్లో షేర్ చేసింది. ప్రయాణ సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. ఆర్పీఎఫ్ సిబ్బందికి అభినందనలు తెలిపింది. -
పెరిగిన రైల్వే చార్జీలు
న్యూఢిల్లీ: కొత్త సంవత్సర ప్రారంభ రోజు నుంచే రైలు చార్జీలను పెంచుతున్నట్లు రైల్వేశాఖ మంగళవారం ప్రకటించింది. సబర్బన్ రైళ్లు తప్ప మిగిలిన అన్ని రకాల రైళ్లలో 2020 జనవరి 1 నుంచి చార్జీలు పెరగనున్నట్లు తెలిపింది. రోజూ సబర్బన్ రైళ్లలో ప్రయాణించే వారిని దృష్టిలో ఉంచుకొని ఆ రైళ్లలో చార్జీలు పెంచట్లేదని తెలిపింది. సాధారణ నాన్ ఏసీ, నాన్ సబర్బన్ రైళ్లలో కిలోమీటరుకు 1 పైసా, మెయిల్/ఎక్స్‌ప్రెస్ నాన్ ఏసీ రైళ్లలో కిలోమీటరుకు 2 పైసలు, ఏసీ క్లాసులకు కిలోమీటరుకు 4 పైసలు పెరిగాయి. ప్రీమియం రైళ్లైన శతాబ్ది, రాజధాని, దురంతో రైళ్లకు కూడా ఈ పెంపు వర్తిస్తుందని చెప్పింది. ఢిల్లీ–కోల్‌కతాల మధ్య 1,447 కిలోమీటర్లు ప్రయాణిస్తున్న రాజధాని రైల్లో కిలోమీటరుకు 4 పైసలు పెరగడంతో టికెట్ చార్జీకి రూ. 58 కలవనుంది. అయితే ఇప్పటికే బుక్ చేసిన టికెట్ల రిజర్వేషన్ ఫీజు, సూపర్‌ఫాస్ట్ చార్జీ వంటి వాటికి ఈ పెంపు వర్తించదని చెప్పింది. 7వ వేతన కమిషన్ భారం రైల్వేశాఖపై పడడంతో చార్జీలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. కాగా, రైల్వేబోర్డు చైర్మన్‌గా వీకే యాదవ్ మరో ఏడాదిపాటు కొనసాగనున్నారు. ఈ మేరకు కేబినెట్ నియామక మండలి ఆయన పదవీ కాలాన్ని పెంచుతూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఆర్పీఎఫ్ పేరు మార్చిన రైల్వేశాఖ రైల్వే భద్రతా దళం (ఆర్పీఎఫ్) పేరును భారత రైల్వే భద్రతా దళం సర్వీస్‌గా (ఐఆర్పీఎఫ్ఎస్) మారుస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు వ్యవస్థీకృత గ్రూప్–ఏ హోదా కల్పిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
రైల్వే వెబ్సైట్లో నకిలీ ఐడీలు!
లక్ష్మీపురం (గుంటూరు): గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో గత ఏడాది నుంచి నకిలీ ఐడీలతో టికెట్లు బుక్ చేసి రైల్వే ప్రయాణికులను మోసగిస్తున్న ట్రావెల్ వ్యాపారిని ఆర్పీఎఫ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆర్పీఎఫ్ సీఐ సరోజ్‌కుమార్ వివరాలను వెల్లడించారు. పాత గుంటూరు ప్రాంతానికి చెందిన టి.శివప్రసాద్ సునీతా ట్రావెల్స్ అండ్ డిజిటల్ స్టూడియో పేరుతో ఏడాది క్రితం వ్యాపారం ప్రారంభించాడు. రైల్వే వెబ్సైట్లో 10 నకిలీ ఐడీలను సృష్టించాడు. పండుగల సమయంలోనూ, దూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు టికెట్లు బుక్ చేసి వెయిటింగ్ ఉన్నా వాటిని కన్ఫార్మ్డ్ టికెట్లుగా మార్చేవాడు. ఆ టికెట్లను ఐఆర్సీటీసీ కంటే అధిక మొత్తానికి విక్రయించేవాడు. ప్రయాణికులు రైలు ఎక్కిన సమయంలో ఆ టికెట్లు చెల్లేవికాదు. దీనివల్ల ఎంతో మంది మార్గం మధ్యలోనే దిగిపోవడం లేదా జరిమానాలు చెల్లించేవారు. దీనిపై సమాచారం అందుకున్న గుంటూరు డివిజన్ రైల్వే ఆర్పీఎఫ్ సీఐ సరోజ్‌కుమార్ ఏఎస్సై పి.వేణు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు సిబ్బందితో కలసి శివప్రసాద్ షాప్‌లో తనిఖీలు చేశారు. శివప్రసాద్ వద్ద ఉన్న రూ.1.75 లక్షల విలువైన 135 రైలు టికెట్లను సీజ్ చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ సరోజ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రయాణికులు నకిలీ టికెట్ల విక్రయించేవారి వలలో పడొద్దని, టికెట్టు కొనుగోలు చేశాక పీఎన్ఆర్ నంబర్‌ను సరి చూసుకోవాలని సూచించారు. -
‘ఆ పిల్లల వివరాలు వెబ్సైట్లో పెడుతున్నాం’
సాక్షి, విజయవాడ : ఇంట్లోంచి పారియపోయి వచ్చిన పిల్లలను గుర్తించి వారిని తిరిగి క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చడమే తమ ప్రధాన ఉద్దేశం అంటున్నారు సౌత్ సెంట్రల్ రైల్వే డీఆర్ఎం ఆర్ ధనుంజయ్. శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడిన ధనుంజయ్ 2017 సంవత్సరంలో దాదాపు 230 మంది ఇంట్లోంచి పారిపోయి వచ్చిన పిల్లలను రైల్వే ప్రోటక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) రెస్క్యూ టీం కాపాడారని తెలిపారు. అయితే ఈ ఏడాది వీరి సంఖ్య పెరిగిందని చెప్పారు. 2018 సంవత్సరంలో ఇప్పటివరకూ దాదాపు 246 మంది ఇలా ఇంటి నుంచి పారిపోయి వచ్చారని తెలిపారు. ఇలా పట్టుకున్న పిల్లలను వారి కుటుంబాలకు అప్పగించడం చాలా ఇబ్బందిగా మారిందన్నారు. తాము కాపాడిన పిల్లల ఫోటోలను ఆర్పీఎఫ్ వెబ్ పోర్టల్‌లో పెడుతున్నాని వెల్లడించారు. దాంతో పాటు ప్రస్తుతం ఆ పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారో వారి అడ్రస్‌తో పాటు ఫోన్ నెంబర్లను వెబ్‌సైట్‌తో పాటు సోషల్ మీడియాలో కూడా పెడుతున్నట్లు తెలిపారు. -
ఆ వేళల్లో అదనపు సిబ్బంది!
సాక్షి, సిటీబ్యూరో: కొత్తగా నగరానికి వస్తున్న, ఇతర ప్రాంతాలకు వెళ్లి వస్తున్న రైలు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని నగర ట్రాఫిక్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అధికారులు నిర్ణయించారు. ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలను గుర్తించేందుకు ఈ రెండు విభాగాల అధికారులు గురువారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో కాలినడకన పర్యటించారు. ఆర్పీఎఫ్ ఐజీగా నియమితులైన ఈశ్వర్రావు, ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్, డీసీపీ ఎల్ఎస్ చౌహాన్‌తో పాటు స్థానిక అధికారులూ స్టేషన్ చుట్టూ ఉన్న ప్రతి రోడ్డులోకి వెళ్లి అక్కడి సమస్యలు గుర్తించారు. రైళ్ల రాకపోకలు ఎక్కువగా ఉండే తెల్లవారుజాము 5 నుంచి ఉదయం 9, సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల మధ్యే రద్దీ భారీగా ఉందని తెలుసుకున్నారు. ఆయా సమయాల్లో రోటీన్‌గా ఉండే సిబ్బందికి అదనంగా మరికొందరిని మోహరించాలని, ట్రాఫిక్ అధికారులు ఆర్పీఎఫ్ వారితో సమన్వయం ఏర్పాటు చేసుకుని పని చేయాలని నిర్ణయించారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో అక్రమ పార్కింగ్, ఫుట్‌పాత్‌ల ఆక్రమణ, అడ్డదిడ్డంగా ఉంటున్న ఆటోలు, చిరు వ్యాపారుల వ్యవహారశైలితో వాహనచోదకులతో పాటు పాదచారులు ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. వీరిని అదుపు చేసేందుకు మరికొన్ని చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. -
రైళ్లలో భద్రతకు ‘రైల్ సురక్ష’ యాప్
రైలు ప్రయాణికులకు ఎదురయ్యే భద్రతా పరమైన సమస్యలను సత్వరమే పరిష్కరిం చడం కోసం రైల్వే శాఖ ‘రైల్ సురక్ష’ పేరుతో మొబైల్ యాప్‌ను రూపొందించింది. ఇది ఈ నెలాఖరు నుంచి సెంట్రల్ రైల్వే పరిధిలోని దూరప్రాంత, లోకల్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ప్రయాణికులు తన సమస్యను యాప్‌లో పెట్టాలి. ఆ సందేశం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌లో ఉన్న కంట్రోల్ రూం(182)కు చేరు తుంది. అక్కడి సిబ్బంది వెంటనే ఫిర్యాదు దారుడి ఫోన్ ఎక్కడ ఉందో గుర్తించి దగ్గరలోని రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్)లేదా గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ)లను అప్రమత్తం చేస్తారు. దాంతో అధికారులు ఫిర్యాదుదారు దగ్గరకి వెళ్లి సమస్యను పరిష్కరిస్తారు. -
ఒక్క ట్వీట్‌తో 26 మంది బాలికలకు విముక్తి
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియా పుణ్యమా అని 26 మంది మైనర్ బాలికలు అక్రమ రవాణా ముఠా నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఓ ప్రయాణికుడు చేసిన ట్వీట్‌పై స్పందించిన జీఆర్పీ, ఆర్పీఎఫ్ భద్రతా దళాలు సత్వరం రంగంలోకి దిగి బాలికలను రక్షించాయి. మజఫర్ నగర్-బాంద్రాల మధ్య నడిచే అవధ్ ఎక్స్‌ప్రెస్‌లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. అవధ్ ఎక్స్‌ప్రెస్ ‘ఎస్ 5’ భోగిలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి.. ‘పక్క భోగిలో దాదాపు 25 మంది బాలికలు ఉన్నారు. వారంతా ఏడుస్తూ.. భయం భయంగా దిక్కులు చూస్తున్నారు. బహుశా వారిని బలవంతంగా ఎక్కడికో తరస్తున్నార’ని రైల్వే భద్రతా దళానికి ట్వీట్ చేశాడు. సమాచారం అందుకున్న ఉన్నాతాధికారులు వెంటనే కాపతాన్‌గంజ్‌లో ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులను రంగంలోకి దించారు. సివిల్ దుస్తుల్లో ఉన్న ఇద్దరు ఆర్పీఎఫ్ జవాన్లు బాలికలు ఉన్న భోగిలో ప్రవేశించి గోరఖ్‌పూర్ వరకు కాపలాగా వెళ్లారు. అక్కడే మాటువేసిన మిగతా పోలీసులు బాలికలను రక్షించారు. వారిని బలవంతంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ ట్వీట్ అందిన 30 నిమిషాల్లో పూర్తవడం విశేషం. 26 మంది బాలికలను రక్షించామనీ, వారంతా బిహార్‌లోని చంపారన్‌కు చెందిన వారని పోలీసులు వెల్లడించారు. బాలికలను నర్‌కాథిక్యాగంజ్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఈద్గా ప్రాంతానికి తరలిస్తున్నారని తెలిపారు. బాలికలు దగ్గర నుంచి మరిన్నివివరాలు తెలియాల్సి ఉందన్నారు. వారిని బాలికా సంరక్షణ కమిటీకి అప్పగించామన్నారు. పిల్లలంతా 10 నుంచి 14 ఏళ్ల లోపు వారు కావడం గమనార్హం. -
మహిళను వేధిస్తున్న కానిస్టేబుల్‌కు దేహశుద్ధి
-
మహిళను వేధిస్తూ అడ్డంగా బుక్కైన కానిస్టేబుల్
సాక్షి, ముంబై : మహిళా ప్రయాణీకురాలి పట్ల అమర్యాదకరంగా వ్యవహరించిన కానిస్టేబుల్‌ను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అధికారులు గురువారం సస్పెండ్ చేశారు. కానిస్టేబుల్ మహిళను అభ్యంతరకరంగా తాకిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానిస్టేబుల్ రాజేష్ జంగిడ్‌ను సస్పెండ్ చేసి అతడిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించామని, దోషిగా తేలితే అతడిపై కఠిన చర్యలు చేపడతామని ఆర్పీఎఫ్ అధికారులు చెప్పారు. ముంబైలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్లో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. నిద్రిస్తున్నట్టు నటిస్తూ పక్కనే కూర్చున్న మహిళను కానిస్టేబుల్ అభ్యంతరకరంగా తాకడంతో మరో మహిళ వారించగా మరో ప్రయాణీకుడు, మరికొందరు అతడికి దేహశుద్ధి చేశారు. మహిళల భద్రతపై తాము రాజీపడబోమని, ఈ ఘటనకు సంబంధించి వీడియో ఫుటేజ్‌ను పరిశీలించిన అనంతరం కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసి విచారణ చేపట్టామని ఆర్పీఎఫ్ ముంబై డివిజన్ సెక్యూరిటీ కమిషనర్ సచిన్ భలోడే తెలిపారు. -
దొంగలు బాబోయ్ దొంగలు..
న్యూఢిల్లీ : రైల్వే సమాన్ల దొంగతనం జరగడం కొత్తకాకపోయిన చోరికి గురౌతున్న వస్తువుల గురించి తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది. ఇంతకు ముందు రైలు పట్టాలను ఎత్తుకెళ్లెవారు. ప్రస్తుతం బాత్రూంలో ఉన్న సమాన్లను కూడా దొంగలు వదలట్లేదని రైల్వే అధికారులు వాపోతున్నారు. బాత్రూంలో ఉండే మగ్గులు, వాష్బెసిన్లు, బోగిలో ఫ్యాన్లను చోరి చేస్తున్నారని అధికారులు తెలిపారు. కిటికిలకు ఉండే ఇనుప కడ్డీలు, పట్టాలు ఎక్కువగా చోరి అవుతున్నట్టు వెల్లడించారు. 2017-18 సంవత్సరానికి గాను చోరి అయిన దాదాపు రూ. 2.97 కోట్ల విలువైన వస్తువులను రైల్వే పోలీసులు పట్టుకున్నారు. దీనికి రెండింతలు గత సంవత్సరం స్వాధీనం చేసుకున్నట్టు తెలపారు. కొన్ని సార్లు ప్రయాణికులు సీట్ల నారను, మగ్గులను వారి బ్యాగులలో తీసుకెళ్లడం తాము గమనిస్తామని, అవి సాధారణంగా జరిగేవే. కానీ రైలు పట్టాల చోరీ మాత్రం భారీ రైలు ప్రమాదాలకు దారి తీస్తుందని అన్నారు. దొంగలు ఎక్కువగా రైలు పట్టాలు, ఫిష్ ప్లేట్స్, వాష్ బెసిన్, అద్దాలు, ట్యాబులు, కేబుల్స్, సోలార్ ప్లేట్స్, టెలిఫోన్లు, బ్యాటరీలు, ఫ్యాన్లు, స్విచ్‌లను లక్ష్యంగా చేసుకుని దొంతనాలకు పాల్పడుతుంటారని తెలిపారు. 2016-17 సంవత్సరానికి గాను 5,219 దొంగతనం కేసులు నమోదు కాగా, వాటికి సంబంధించి 5,458 మందిని రైల్వే పోలీసులు అరెస్టు చేసినట్టు తెలిపారు. 2017-18 గాను 5,239 కేసులు నమోదు అయ్యాయి. ఆర్పీఎఫ్ సిబ్బంది కొరత వల్లే దొంగతనాలను అరికట్టలేకపోతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. 74,456 మందికి గాను కేవలం 67,000 మంది సిబ్బందే ఉన్నట్టు తెలిపారు. వారిలో ఎక్కువ శాతం పోలీసు స్టేషన్లకే పరిమితమవ్వడం వల్ల యాంటీ తెఫ్ట్ డ్రైలను నిర్వహించలేక పోతున్నామని అన్నారు. -
పదివేల రైల్వే జాబ్స్
రైల్వే భద్రతా బలగాల్లో ఉద్యోగాల సైరన్ మోగింది. చాలా రోజుల తర్వాత రైల్వేలో యూనిఫాం ఉద్యోగాలకు ప్రకటన వెలువడింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్పీఎస్ఎఫ్)ల్లో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి భారత రైల్వేశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర స్థాయి ఉద్యోగాలతో పోల్చుకుంటే చాలా తక్కువ శ్రమతో ఈ ఉద్యోగాలు దక్కించుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్‌లలో రాణిస్తే చాలు నెలకు రూ.35 వేలకు పైగా వేతనంతో ఎస్ఐ కొలువు వరిస్తుంది. అదే విధంగా కేవలం పదో తరగతి ఉత్తీర్ణతతోనే కానిస్టేబుల్ ఉద్యోగాన్ని చేజిక్కించుకునే సువర్ణావకాశం అభ్యర్థులకు లభించింది. కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 21,700 జీతం అందుతుంది. ఈ నేపథ్యంలో పరీక్ష విధానం, సిలబస్, సన్నద్ధత వ్యూహాలపై ఫోకస్.. నోటిఫికేషన్ వివరాలు విద్యార్హత: కానిస్టేబుల్‌కు పదో తరగతి; ఎస్ఐకు గ్రాడ్యుయేషన్. వయసు: 2018, జూలై 1 నాటికి 18– 25 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ట వయోపరిమితిలో బీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు సడలింపు ఉంటుంది. నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉన్న అభ్యర్థులే దరఖాస్తు చేయడానికి అర్హులు. దరఖాస్తు రుసుం : రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళలు, మైనార్టీలు, ఈబీసీ అభ్యర్థులకు రూ.250 ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ : 2018, జూన్ 1 నుంచి జూన్ 30. కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: 2018, సెప్టెంబర్/అక్టోబర్. వెబ్సైట్: www.indianrailways.gov.in ఆర్పీఎఫ్, ఆర్పీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఖాళీలు: 8619 (పురుషులకు 4403, మహిళలకు 4216. సబ్ ఇన్స్పెక్టర్ ఖాళీలు: 1120 (పురుషులకు 819, మహిళలకు 301. సిలబస్ ఒకటే.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు పదో తరగతి ఉత్తీర్ణత అర్హత కాగా, ఎస్ఐ ఉద్యోగాలకు డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ రెండు పరీక్షలకు నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)కు ఒకే సిలబస్ పేర్కొనడంతో అభ్యర్థులకు ప్రిపరేషన్ సులువు కానుంది. పరీక్షలో ప్రశ్నల కాఠిన్యత స్థాయిలో మాత్రం వ్యత్యాసం తప్పనిసరిగా ఉంటుంది. కానిస్టేబుల్ పరీక్ష పేపర్ పదో తరగతి స్థాయిలో, ఎస్ఐ పేపర్ డిగ్రీ స్థాయిలో ఉంటుంది. దీన్ని గుర్తించి సన్నద్ధత వ్యూహాన్ని రూపొందించుకోవాలి. సన్నద్ధత సులువు.. కానిస్టేబుల్, ఎస్ఐ సీబీటీలో పేర్కొన్న సిలబస్‌లో మూడు అంశాలు ఉన్నాయి. అవి.. జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉన్నాయి. వీటిలో జనరల్ అవేర్నెస్ సెక్షన్‌కు ఎక్కువ వెయిటేజీ ఇచ్చారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు మొత్తం 120 మార్కులు (120 ప్రశ్నలు) కేటాయిస్తే వీటిలో 50 మార్కులను జనరల్ అవేర్‌నెస్‌కు కేటాయించారు. అర్థమెటిక్, రీజనింగ్ విభాగాలకు 35 మార్కుల చొప్పున ఇచ్చారు. మొత్తం 90 నిమిషాల వ్యవధిలో ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం కనీసం 35 శాతం అర్హత మార్కులు పొందడం తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీల అభ్యర్థులు కనీసం 30 శాతం మార్కులు సాధించాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్షలో మెరిట్ జాబితా ప్రకారం కేటగిరీల వారీగా పదిరెట్ల మందికి ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (పీఎంటీ)లకు పిలుపు అందుతుంది. జనరల్ అవేర్నెస్ మొత్తం 120 ప్రశ్నల్లో జనరల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు ఉండటంతో ఈ విభాగం విజయంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. రుణాత్మక మార్కులు ఉండడం, ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులు కోత విధిస్తుండటంతో జనరల్ అవేర్నెస్ సెక్షన్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. మొత్తంగా పరీక్షకు 90 నిమిషాల సమయం మాత్రమే ఇవ్వడంతో అభ్యర్థులకు టైం మేనేజ్మెంట్ కీలకం కానుంది. జనరల్ అవేర్నెస్ సెక్షన్‌లోని ప్రశ్నలకు తక్కువ సమయంలోనే సమాధానాలు గుర్తించేందుకు వీలుంటుంది. దీనివల్ల మిగిలిన అర్థమెటిక్, రీజనింగ్ విభాగాలకు ఎక్కువ సమయం కేటాయించడానికి అవకాశం లభిస్తుంది. జనరల్ అవేర్నెస్ సెక్షన్లో మన చుట్టూ జరుగుతున్న పరిణామాలపై అభ్యర్థులకు ఉన్న అవగాహనతో పాటు చరిత్ర, రాజ్యాంగం, పరిపాలన వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం, భౌగోళిక స్థితిగతులు, సైన్స్, సంస్కృతి తదితర అంశాలపై అభ్యర్థుల పరిజ్ఞానాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఇక సమకాలీన అంశాలపై కూడా అభ్యర్థులు ఎక్కువగా దృష్టిసారించాలి. వివిధ దేశాల అధ్యక్షులు, అంతర్జాతీయ సంబంధాలు, దేశాల కరెన్సీలు, వార్తల్లోని వ్యక్తులు తదితర సమకాలీన అంశాలు తెలుసుకోవాలి. వీటితో పాటు శాస్త్ర సాంకేతిక రంగంలో చోటుచేసుకున్న సంఘటనలు, డిఫెన్స్ టెక్నాలజీ, సైనిక విన్యాసాలు, తాజాగా క్రీడల్లో చెప్పుకోదగిన పరిణామాలు, బడ్జెట్ ముఖ్య అంశాలు, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు వాటి లక్ష్యాలను స్పష్టంగా తెలుసుకోవాలి. సెప్టెంబర్ – అక్టోబర్‌లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి – మార్చి నుంచి కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. ప్రిపరేషన్‌కు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు పుస్తకాలను ఉపయోగించుకోవాలి. రోజూ ఏదైనా ఒక ప్రామాణిక పేపర్ చదువుతూ సొంతంగా నోట్స్ రాసుకోవాలి. రిఫరెన్స్: ప్రామాణిక దినపత్రిక, మ్యాగజైన్. www.sakshieducation.com అర్థమెటిక్ 35 ప్రశ్నలు ఉండే ఈ విభాగంలో ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న మ్యాథమెటిక్స్ పుస్తకాల్లోని అర్థమెటిక్ చాప్టర్లలోని ప్రాథమిక భావనలు, సమస్యలను అధ్యయనం చేయాలి. డెసిమల్స్, ఫ్రాక్షన్స్, కసాగు, గసాభా, నిష్పత్తి–అనుపాతం, శాతాలు, మెన్సురేషన్, కాలం–పని, కాలం–దూరం, చక్రవడ్డీ, బారువడ్డీ, లాభనష్టాలు, ఆల్జీబ్రా తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థులు సంఖ్యా వ్యవస్థపై పట్టు సాధించడం తప్పనిసరి. కూడికలు, తీసివేతలు, భాగహారాలు, గుణకారాలు, శాతాలు వంటి ప్రాథమిక అర్థమెటిక్ అంశాలకు సంబంధించిన సమస్యలకు వేగంగా, కచ్చితమైన సమాధానాలు ఇచ్చేలా ప్రాక్టీస్ చేయాలి. ఎక్కాలు, వర్గాలు – వర్గమూలాలు, ఘనమూలాలపై పట్టు సాధించడం ద్వారా సమస్యలను వేగంగా సాధించొచ్చు. రిఫరెన్స్: ఆర్ఎస్ అగర్వాల్, అరిహంత్ పబ్లికేషన్స్, కిరణ్ పబ్లికేషన్స్ పుస్తకాలు ఉపయోగపడతాయి. వీటితో పాటు ‘ఇండియాబిక్స్’ వెబ్‌సైట్‌ను ప్రాక్టీస్‌కు ఉపయోగించుకోవచ్చు. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ సులువైన సెక్షన్ ఇది. అభ్యర్థులు తమ ఆలోచనలపై స్పష్టంగా ఉంటూ సమస్య పరిష్కారానికి తార్కికంగా ఆలోచించగలరా లేదా అని తెలుసుకోవడానికి, మేధస్సును అంచనా వేయడానికి రీజనింగ్ ఉపయోగపడుతుంది. తార్కికంగా ఆలోచించే వారికి సులువైన విభాగమిదే. అనాలజీస్; సిమిలారిటీస్, డిఫరెన్సెస్; స్పేషియల్ విజువలైజేషన్, స్పేషియల్ ఓరియెంటేషన్, ప్రాబ్లం సాల్వింగ్ అనాలిసిస్, కోడింగ్–డీకోడింగ్, అర్థమెటికల్ రీజనింగ్, రిలేషన్స్, ఆడ్‌మాన్ అవుట్, సింబల్స్, నొటేషన్స్, వెన్ చిత్రాలు, బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్మెంట్, డైరెక్షన్స్, స్టేట్మెంట్–కన్‌క్లూజన్, డెసిషన్ మేకింగ్, సిలాయిజం తదితర విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. రిఫరెన్స్: ఆర్ఎస్ అగర్వాల్. ప్రాక్టీస్ ప్రధానం 90 నిమిషాల్లో 120 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి కాబట్టి విజయంలో టైమ్ మేనేజ్మెంట్ కీలక పాత్ర పోషిస్తుంది. వేగంగా, కచ్చితత్వంతో సమాధానాలు గుర్తించాలంటే ప్రాక్టీస్‌కు మించిన మార్గం మరొకటి లేదు. రైల్వే పరీక్షల్లో గత ప్రశ్నపత్రాల్లోని ప్రశ్నలు చాలా వరకు పునరావృతమవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రీవియస్ పేపర్లను ప్రాక్టీస్ చేయాలి. జనరల్ అవేర్‌నెస్‌లో ప్రధానంగా జనరల్ సైన్స్, ఆధునిక భారతదేశ చరిత్ర, పాలిటీ బేసిక్స్‌పై దృష్టిసారించాలి. 90 శాతం ప్రశ్నలు బేసిక్‌గా, యావరేజ్‌గా, లాజిక్‌గా వస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని, తొలుత బేసిక్ కాన్సెప్టులపై పట్టు సాధించాలి. ఆ తర్వాతే అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి లోతుగా అధ్యయనం చేయాలి. అర్థమెటిక్‌లో సంఖ్యా వ్యవస్థ, సింప్లిఫికేషన్స్, శాతాలు, నిష్పత్తులు, వడ్డీ అంశాలు ముఖ్యమైనవి. రీజనింగ్‌లో సీటింగ్ అరేంజ్మెంట్, ఆల్ఫాబెటికల్ టెస్ట్, కోడింగ్–డీకోడింగ్, బ్లడ్‌రిలేషన్స్, ర్యాంకింగ్స్ తదితర అంశాలు ముఖ్యమైనవి. – ఎ.సత్యనారాయణ, డైరెక్టర్, గ్రేట్ ఇన్స్టిట్యూట్. -
రైళ్లలో చోరీ, ఇద్దరు దొంగల అరెస్ట్
సాక్షి, విజయవాడ: రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. జీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో రైల్లో దొంగతనాలు చేస్తున్న ఇద్దరు దుండగులను అదుపులోకి తీసుకున్నట్లు విజయవాడ రైల్వే ఏడిజి కిషోర్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చోరీలకు పాల్పడుతున్నవాళ్లని ఉత్తరప్రదేశ్‌కి చెందినవారిగా గుర్తించామని, వారి నుంచి పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్ట్‌లో ఉన్న హరివిందర్ సింగ్ నుంచి 70 లక్షల విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు కిషోర్ కుమార్ తెలిపారు. గడిచిన రెండు నెలల్లో రైల్వే, జీఆర్పీఎఫ్ ఆధ్యర్యంలో సుమారు కోటి 50 లక్షల రూపాయల విలువ చేసే సొత్తును రికవరీ చేశామన్నారు. వృద్ధులు, ఒంటరి ప్రయాణికులనే టార్గెట్‌గా చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారని, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. బంగారు ఆభరణాలు ధరించి ప్రయాణించడం సురక్షితం కాదని కిషోర్ కుమార్ సూచించారు.