
రైలు ప్రయాణికులకు ఎదురయ్యే భద్రతా పరమైన సమస్యలను సత్వరమే పరిష్కరిం చడం కోసం రైల్వే శాఖ ‘రైల్ సురక్ష’ పేరుతో మొబైల్ యాప్‌ను రూపొందించింది. ఇది ఈ నెలాఖరు నుంచి సెంట్రల్ రైల్వే పరిధిలోని దూరప్రాంత, లోకల్ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ప్రయాణికులు తన సమస్యను యాప్‌లో పెట్టాలి. ఆ సందేశం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌లో ఉన్న కంట్రోల్ రూం(182)కు చేరు తుంది. అక్కడి సిబ్బంది వెంటనే ఫిర్యాదు దారుడి ఫోన్ ఎక్కడ ఉందో గుర్తించి దగ్గరలోని రైల్వే రక్షక దళం (ఆర్‌పీఎఫ్)లేదా గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్‌పీ)లను అప్రమత్తం చేస్తారు. దాంతో అధికారులు ఫిర్యాదుదారు దగ్గరకి వెళ్లి సమస్యను పరిష్కరిస్తారు.