
నిందితులను మీడియ ముందు ప్రవేశపెట్టిన పోలీసులు, ఇన్‌సెట్‌లో స్వాధీనం చేసుకున్న ఆభరణాలు
సాక్షి, విజయవాడ: రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. జీఆర్‌పీఎఫ్, ఆర్‌పీఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో రైల్లో దొంగతనాలు చేస్తున్న ఇద్దరు దుండగులను అదుపులోకి తీసుకున్నట్లు విజయవాడ రైల్వే ఏడిజి కిషోర్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చోరీలకు పాల్పడుతున్నవాళ్లని ఉత్తరప్రదేశ్‌కి చెందినవారిగా గుర్తించామని, వారి నుంచి పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్ట్‌లో ఉన్న హరివిందర్ సింగ్ నుంచి 70 లక్షల విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు కిషోర్ కుమార్ తెలిపారు. గడిచిన రెండు నెలల్లో రైల్వే, జీఆర్‌పీఎఫ్ ఆధ్యర్యంలో సుమారు కోటి 50 లక్షల రూపాయల విలువ చేసే సొత్తును రికవరీ చేశామన్నారు. వృద్ధులు, ఒంటరి ప్రయాణికులనే టార్గెట్‌గా చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారని, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. బంగారు ఆభరణాలు ధరించి ప్రయాణించడం సురక్షితం కాదని కిషోర్ కుమార్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment