thives
-
సూర్యాపేటలో దొంగల ముఠా హల్చల్
-
షిర్డీ టూ కాకినాడ రైలులో భారీ చోరీ.. ప్రయాణీకుల ఆందోళన
సాక్షి, బీదర్: షిర్డీ టూ కాకినాడ పోర్టు ఎక్స్‌ప్రెస్ రైలులో దొంగలు రెచ్చిపోయారు. రైలులో ప్రయాణీకులు నిద్రిస్తున్న సమయాన్ని ఆసరాగా చేసుకుని మూడు బోగీల్లో బంగారం, నగదు, లగేజీని దొంగలించారు. దీంతో, బీదర్ వద్ద రైలును నిలిపివేసి ప్రయాణీకులు ఆందోళనకు దిగారు.వివరాల ప్రకారం.. సాయినగర్ షిర్డీ టూ కాకినాడ పోర్టు ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ దోపిడీ జరిగింది. మహారాష్ట్రలోని వర్లీ సమీపంలో రైలులో ఎక్కిన దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ప్రయాణీకులు నిద్రిస్తున్న సమయంలో వారి వద్ద నుంచి బంగారం, నగదు, లగేజీని దొంగలించారు. ఈ క్రమంలో దోపిడీని గుర్తించిన ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.అయితే, దోపిడీ అనంతరం దొంగలు బీదర్‌కు ముందున్న పర్లీ స్టేష్లన్‌లో దిగిపోయినట్టు ప్రయాణికులు గుర్తించారు. దీంతో, తమకు న్యాయం జరగాలని ప్రయాణికులు ఆందోళనలు చేస్తున్నారు. బీదర్‌లో రైలును నిలిపివేసి ఆందోళనకు దిగారు. -
Defamation Case: మళ్లీ ఎంపీగా రాహుల్ గాంధీ!
న్యూఢిల్లీ: లోక్‌సభ సభ్యత్వం కోల్పోవడానికి కారణమైన 2019 నాటి పరువు నష్టం కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాం«దీకి భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు రెండేళ్లపాటు జైలు శిక్ష విధిస్తూ గుజరాత్‌లోని సూరత్ కోర్టు ఇచి్చన తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా లోక్‌సభ సభ్యత్వం మళ్లీ పొందడానికి రాహుల్‌కు అవకాశం లభించింది. ఆయన సభ్యత్వాన్ని లోక్‌సభ స్పీకర్ స్వయంగా పునరుద్ధరించవచ్చు లేదా సుప్రీంకోర్టు ఉత్తర్వు ప్రకారం సభ్యత్వం తిరిగి పొందడానికి రాహుల్ గాంధీ న్యాయ పోరాటం చేయొచ్చు. ఈ తీర్పుతో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి రాహుల్ గాంధీకి ఇక అడ్డంకులు తొలగిపోయినట్లే. ప్రజాజీవితంలో ఉన్నవారు ఆచితూచి మాట్లాడాలి పరువు నష్టం కేసులో తనకు రెండేళ్లపాటు జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు ఇచి్చన తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాహుల్ తొలుత గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని తిరస్కరిస్తూ గుజరాత్ హైకోర్టు తీర్పునిచి్చంది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రాహుల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గావై, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సంజయ్ కుమార్‌తో కూడిన త్రిసభ్య సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. ‘‘పరువు నష్టం కేసులో రాహుల్‌కు గరిష్ట శిక్ష విధించడానికి ట్రయల్ కోర్టు న్యాయమూర్తి ఎలాంటి కారణం చూపలేదు. అందుకే దోషిగా నిర్ధారించే తీర్పును నిలిపివేయాలి. అలాగే ఈ తరహా(పరువుకు నష్టం కలిగించే) వ్యాఖ్యలు మంచివి కావు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రజాజీవితంలో ఉన్నవారు బహిరంగ సభల్లో ఆచితూచి మాట్లాడాలని ప్రజలంతా ఆశిస్తారు’’ అని స్పష్టం చేసింది. రాహుల్‌ను దోషిగా నిర్ధారించడం అనేది కేవలం ఆయనపైనే కాకుండా ఆయనను తమ ప్రతినిధిగా ఎన్నుకున్న ఓటర్ల హక్కుపై కూడా ప్రభావం చూపుతుందని వెల్లడించింది. ఐపీసీ సెక్షన్ 499(పరువు నష్టం) కింద రాహుల్‌కు గరిష్ట శిక్ష విధించడంపైనా ధర్మాసనం సంశయం వ్యక్తం చేసింది. శిక్షాకాలం ఒక్కరోజు తగ్గినా ఆయనపై ఎంపీగా అనర్హత వేటు పడేది కాదని ఉద్ఘాటించింది. సమాజ వ్యతిరేక వ్యాఖ్యలు కావవి రాహుల్ తరపున సీనియర్ అడ్వొకేట్ అభిõÙక్ మనూ సింఘ్వీ వాదనలు వినిపించారు. తన క్లయింట్ కరడుగట్టిన నేరçస్తుడు కాదని చెప్పారు. ఆయనపై బీజేపీ కార్యకర్తలు ఎన్నో కేసులు పెట్టారని, అయినా ఏ ఒక్క కేసులోనూ దోషిగా తేలలేదని గుర్తుచేశారు. రాహుల్‌పై ఫిర్యాదు చేసిన పూర్ణేష్ మోదీ ఇంటిపేరు అసలు మోదీయే కాదని పేర్కొన్నారు. ఈ విషయం ఆయనే చెప్పారని గుర్తుచేశారు. రాహుల్ వ్యాఖ్యలు సమాజానికి వ్యతిరేకంగా చేసినవి కావని వివరించారు. ఇది అపహరణ, హత్య, అత్యాచారం వంటి నేరం కాదని, అయినప్పటికీ రెండేళ్ల జైలు విక్ష విధించారని ఆక్షేపించారు. రాహుల్ నిర్దోíÙగా విడుదల కావడానికి, పార్లమెంట్‌కు హాజరు కావడానికి, వచ్చేసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇదే చివరి అవకాశమని అన్నారు. ఫిర్యాదుదారు పూర్ణేష్ మోదీ తరఫున సీనియర్ అడ్వొకేట్ మహేష్ జెఠ్మలానీ వాదించారు. రాహుల్ తప్పు చేశారనడానికి చాలా ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం చివరకు రాహుల్‌కు విధించిన జైలు శిక్షపై స్టే వి«ధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఏమిటీ కేసు? 2019 ఏప్రిల్ 13న కర్ణాటకలోని కోలార్ పట్టణంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ‘‘దొంగలందరి ఇంటి పేరు మోదీ అని ఎందుకుంటుంది?’’ అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను తప్పుపడుతూ గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ సూరత్ కోర్టును ఆశ్రయించారు. రాహుల్‌పై క్రిమినల్, పరువు నష్టం దావా వేశారు. విచారణ జరిపిన సూరత్ కోర్టు 2023 మార్చి 23న రాహుల్ గాంధీని దోషిగా తేలి్చంది. రెండేళ్లపాటు జైలు శిక్ష విధించింది. మరుసటి రోజే రాహుల్‌పై లోక్‌సభ స్పీకర్ అనర్హత వేటు వేశారు. రాహుల్ లోక్‌సభ సభ్యత్వం రద్దయ్యింది. మాజీ ఎంపీగా మారారు. అంతేకాకుండా ఢిల్లీలోని తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి, బయటకు వెళ్లిపోవాల్సి వచి్చంది. ఇప్పుడేం జరుగుతుంది? పరువు నష్టం కేసులో రాహుల్ గాం«దీకి సుప్రీంకోర్టు ఊరట కలిగించడంతో ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని ఎప్పటిలోగా పునరుద్ధరిస్తారన్న దానిపై చర్చ ప్రారంభమైంది. అధికారిక ప్రక్రియ ప్రకారం.. లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలంటే రాహుల్ తొలుత లోక్‌సభ సెక్రటేరియట్‌కు విజ్ఞాపన పత్రం సమరి్పంచాల్సి ఉంటుంది. రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచి్చందని తెలియజేయాలి. సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని అభ్యరి్థంచాలి. సుప్రీంకోర్టు ఉత్తర్వు కాపీని కూడా సమరి్పంచాలి. అన్నీ సక్రమంగా ఉన్నట్లు భావిస్తే సభ్యత్వాన్ని పునరుద్ధరించినట్లు లోక్‌సభ సెకట్రేరియట్ ఒక అధికారిక ప్రకటన జారీ చేస్తుంది. ఇటీవల నేషనలిస్టు కాంగ్రెస్ పారీ్ట(ఎన్సీపీ) ఎంపీ మొహమ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడానికి రెండు నెలలు పట్టడం గమనార్హం. కోలార్ నుంచి కోర్టుల వరకు.. నాలుగేళ్ల క్రితం కర్ణాటక ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారమే సృష్టించి చివరికి ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోవలసి వచ్చింది. మోదీ ఇంటి పేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యల దగ్గర్నుంచి అత్యున్నత న్యాయస్థానం తీర్పు వరకు పరిణామ క్రమాన్ని చూద్దాం. ఏప్రిల్ 12, 2019: కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ దొంగలందరికీ ఇంటి పేరు మో దీయే ఎందుకు ఉంటుంది ? నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ అని వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 15, 2019: గుజరాత్ సూరత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. జూలై 7, 2019: సూరత్ మెట్రోపాలిటన్ కోర్టు ఎదుట రాహుల్ గాంధీ మొదటిసారిగా హాజరయ్యారు. మార్చి 23, 2023: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన సూరత్ కోర్టు ఆయనకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. రాహుల్ అప్పీలు చేసుకోవడానికి వీలుగా నెల రోజుల పాటు తీర్పుని సస్పెండ్ చేసింది. మార్చి 24, 2023: ఒక క్రిమినల్ కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో పార్లమెంటు సభ్యుడిగా ఆయనపై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం ఒక నోటీసు జారీ చేసింది. ఏప్రిల్ 3 2023: మెట్రోపాలిటన్ కోర్టు తీర్పుని సవాల్ చేస్తూ రాహుల్ సూరత్ సెషన్స్ కోర్టుని ఆశ్రయించారు. తీర్పుపై స్టే విధించాలని కోరారు ఏప్రిల్ 20, 2023: తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన సెషన్స్ కోర్టు రాహుల్ పిటిషన్‌ను కొట్టేసింది. ఏప్రిల్ 25, 2023: రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టుని ఆశ్రయించారు. తన శిక్షను నిలుపదల చేయాలని పిటిషన్ వేశారు. జూలై 7, 2023: గుజరాత్ హైకోర్టులో రాహుల్‌కి ఎదురు దెబ్బ తగిలింది. శిక్షపై స్టే విధించడానికి నిరాకరించిన కోర్టు రాహుల్ పిటిషన్‌ను తిరస్కరించింది. జూలై 15, 2023: హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టుకెక్కారు. జూలై 21, 2023: ఈ కేసులో గుజరాత్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 4, 2023: రాహుల్‌కి విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసులో కింద కోర్టు గరిష్టంగా రెండేళ్లు జైలు శిక్షని విధించడానికి కారణాలు కనిపించలేదని వ్యాఖ్యానించింది. సుప్రీం తీర్పుతో రాహుల్ పార్లమెంటు సభ్యత్వం తిరిగి పొందడానికి ఆస్కారం ఏర్పడింది. -
వైన్ షాప్ లో దొంగల హల్ చల్
-
ఆంధ్ర- కర్ణాటక సరిహద్దులో రెచ్చిపోయిన దొంగలు
-
సూరంపాలెంలో దొంగల హల్చల్
సాక్షి, విజయవాడ: కృష్ణాజిల్లా చాట్రాయి మండలం సూరంపాలెం గ్రామంలో ముగ్గురు దొంగలు హల్ చల్ చేశారు. గత కొంతకాలంగా నూజివీడు, పరిసర గ్రామాలతో పాటు చాట్రాయి మండల పరిధిలోని పలు గ్రామాల్లో తాళం వేసిన ఇళ్లల్లో చోరీలు జరిగే అవకాశం ఉన్నందున రాత్రి వేళల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు మైకుల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాట్రాయి మండలం సూరంపాలెంలో మంగళవారం రాత్రి గ్రామానికి చెందిన కొందరు యువకులు గస్తీ తిరుగుతున్నారు. అదే సమయంలో చోరీకి వచ్చిన ముగ్గురు యువకులు ఓ ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. గస్తీ తిరుగుతున్న యువకులను చూసిన దొంగలు పరారయ్యారు. ఈ క్రమంలో ఇద్దరు దొంగలు పారిపోగా ఒక వ్యక్తిని గ్రామస్తులు ద్విచక్రవాహనంతో సహా పట్టుకుని దేహశుద్ధి చేశారు. పట్టుబడిన యువకుడు నూజివీడు మండలం పోతురెడ్డిపల్లి గ్రామ వాసిగా గుర్తించారు. పరారైన మరో ఇద్దరు కోసం గ్రామస్తులు గాలింపు చేపట్టారు. -
తాళం వేసిన ఇళ్లే లక్ష్యం
నెల్లూరు(క్రైమ్): తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఓ పాతదొంగను నెల్లూరు సీసీఎస్, సంతపేట పోలీసులు «శుక్రవారం అరెస్ట్ చేశారు. నగరంలోని సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ డీఎస్పీ ఎం.బాలసుందరరావు నిందితుల వివరాలను వెల్లడించారు. సంతపేట ఈద్గామిట్టకు చెందిన ఎస్కే అక్బర్ పాతనేరస్తుడు. గతంలో పలుమార్లు దొంగతనం కేసుల్లో పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. ఇటీవల నగరంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తిరగసాగాడు. ఈ నేపథ్యంలో సీసీఎస్ డీఎస్పీ ఆధ్వర్యంలో సీసీఎస్, సంతపేట పోలీస్స్టేషన్ల ఇన్స్పెక్టర్లు షేక్ బాజీజాన్‌సైదా, బి.పాపారావులు నిందితుడిపై నిఘా ఉంచారు. శుక్రవారం పోలీసులు ములుముడి బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న అక్బర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తమదైన శైలిలో విచారించగా పలు దొంగతనాలు చేసినట్టు నేరం అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసి అతడి నుంచి రూ.2 లక్షలు విలువచేసే బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలియజేశారు. నేరాలివే.. 2017 జూలైలో కుక్కలగుంటలో, అదే ఏడాది నవంబర్‌లో మన్సూర్‌నగర్‌లో, 2018 జనవరిలో పాతమున్సిప ల్ క్వార్టర్స్ వద్ద, మార్చిలో మన్సూర్‌నగర్‌లో, జూన్‌లో కుక్కలగుంట ప్రాంతంలో అక్బర్ దొంగతనాలు చేశా డు. నిందితుడిని అరెస్ట్‌చేసి చోరీ సొత్తు రాబట్టేందుకు కృషిచేసిన ఇన్స్పెక్టర్లు షేక్ బాజీజాŒసైదా, బి.పాపారావు, సీసీఎస్ ఎస్సై కె.మురళీప్రసాద్, హెడ్‌కానిస్టేబుల్స్ ఆర్.సురేష్‌కుమార్, ఎం.మహేశ్వరరావు, కానిస్టేబుల్స్ జి.ప్రభాకర్, సీహెచ్ శ్రీనివాసులు, పి.సాయి ఆనంద్‌లను డీఎస్పీ అభినందించారు. త్వరలో ఎస్పీ చేతుల మీదుగా వారికి రివార్డులు అందిస్తామన్నారు. -
ట్రాక్టర్ల దొంగ అరెస్ట
కరీంనగర్‌క్రైం: పదమూడు ఏళ్లుగా రెండు తెలుగురాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ట్రాక్టర్లు, వాటర్ ట్యాంకర్లు చోరీ చేస్తున్న అంతరాష్ట్ర దొంగ కొత్తపల్లిరాజు అలియాస్ బానోత్ రాజును పోలీసులు అరెస్టు చేశారు.అతని వద్దనుంచి రూ.20 లక్షల విలువైన ట్రాక్టర్లు, ట్యాంకర్లు స్వాధీనం చేస్నుఆ్నరు. హెడ్‌క్వార్టర్స్‌లో బుధవారం సీపీ కమలాసన్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన కొత్తపల్లి రాజు అలియాస్ బానోత్ రాజు(40) స్థానికంగా ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో చెడువ్యసనాలకు బానిసై డబ్బుకోసం చోరీలు చేయడం ప్రారంభించాడు.అతడి భార్య వదిలివెళ్లిపోవడంతో ఓ బాలికను వివాహం చేసుకున్నాడు. తనుకూడా ప్రస్తుతం రాజుతో ఉండడం లేదు. దీంతో ఒంటరిగా ఉంటూ చెడువ్యసనాలకు అలవాడు పడ్డాడు. బస్సుల్లో, రైళ్లలో దూరప్రాంతాలు తిరుగుతూ.. రోడ్డు పక్కన నిలిపిఉంచిన ట్రాక్టర్లు, వాటర్ట్యాంకర్లపై నిఘా ఉంచేవాడు. ఈ క్రమంలో సమీపగ్రామంలో తిష్టవేసి సమయాన్ని చూసుకుని ట్రాక్టర్లు, ట్యాంకర్లు చోరీ చేస్తాడు. తెలంగాణ చోరీచేసిన వాటిని ఆంధ్రాలో, ఆంధ్రాలో చోరీ చేసిన వాటిని తెలంగాణకు తీసుకొచ్చి విక్రయిస్తాడు. వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తాడు. రెండేళ్లు జైలులో ఉండి.. ఈ క్రమంలో ఓ జిల్లాపోలీసులకు చిక్కాడు. రెండేళ్లు జైలు జీవితం అనుభవించాడు. బయటికి వచ్చాక సొంతగ్రామం నుంచి ఓ మారుమూల గ్రామానికి మకాం మార్చాడు. అప్పటి నుంచి మళ్లీ చోరీలు చేయడం ప్రారంభించాడు.వరంగల్ జిల్లాలో ఓ ట్రాక్టర్ చోరీచేసి.. దానికి ఇద్దరు పేరున్న రాజకీయ నాయకుల ఫొటోలు అంటించి సబ్సిడీ ట్రాక్టర్‌గా చెప్పుకుంటూ తిరిగేవాడు. దాని సాయంతో కరీంనగర్ టూటౌన్ పరిధిలో, కొత్తపల్లి మండలం పరిధిలో రెండు వాటర్ ట్యాంకర్లు చోరీ చేశాడు. పక్కా నిఘాతో.. చోరీ విషయమై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కేసును సీసీఎస్‌కు అప్పగించారు. ఏసీపీ సూచనలతో సీఐ కిరణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. చోరీజరిగిన ప్రాంతాలను పరిశీలించి రాజే నిందితుడిగా గుర్తించారు. అతడిపై నిఘా ఉంచారు. బుధవారం ఉదయం తాను చోరీ చేసిన ట్రాక్టర్ ట్రాలీ, వాటర్ ట్యాంకర్లను ఆటోనగర్‌లో అమ్మడానికి రాజు వస్తుండగా పక్కా సమాచారంతో సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద రూ.20 లక్షల విలువైన మాచారెడ్డి, చిల్లకల్లులో చోరీ చేసిన రెండు ట్రాక్టర్లు, బోయినపల్లి మండలం కొదురుపాకకు చెందిన ఓ ట్రాలీ, చిల్లకల్లు, సూర్యపేట, కరీంనగర్ టూటౌన్ పీస్‌ల పరిధిలో చోరీకి గురైన నాలుగు వాటర్ ట్యాంకర్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న సీసీఎస్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ కిరణ్, ఎస్సై నాగరాజు,సిబ్బందికి నగదు రివార్డు అందించారు. సీఐకి కిరణ్‌కు ఎంఎస్ఈకి రికమండ్ పలు నేరాల్లో నిందితులను చాకచక్యంగా పట్టుకు న్న సీసీఎస్ సీఐ ఎర్రల కిరణ్‌ను ఎంఎస్ఈ(మెరిటోరియర్స్ సర్వీస్ ఎంట్రీ) మెడల్‌కు రికమండ్ చేస్తున్నామని సీపీ కమలాసన్‌రెడ్డి ప్రకటించారు. త్వరలో ట్రాఫిక్ సిగ్నళ్లు కరీంనగర్ మరో రెండు నెలల్లో సుమారు 18 జంక్షన్ల వద్ద ట్రాపిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. వారిని నియంత్రించడానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు ప్రకటించారు. -
బంగారు బిస్కెట్ల దోపిడీ ముఠా అరెస్టు
సాక్షి, ఒంగోలు క్రైం: రైలులో ప్రయాణిస్తున్న సేలంకు చెందిన బంగారు వ్యాపారిని బెదిరించి బంగారు బిస్కెట్లను దోచుకున్న ముఠాను అరెస్టు చేసినట్లు రైల్వే జీఆర్పీ గుంతకల్ ఎస్పీ ఎం.సుబ్బారావు పేర్కొన్నారు. స్థానిక ఒంగోలు రైల్వే స్టేషన్‌లోని జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన షేక్ ఇమ్రాన్ ఫిబ్రవరి 18న చత్తీస్ఘడ్ రాష్ట్రం రాయపూర్ నుంచి బంగారం కొనుగోలు చేసి సేలంకు కోర్బా ఎక్స్‌ప్రెస్ రైలులో వెళుతున్నాడు. ఇతని వద్ద గతంలో కారు డ్రైవర్‌గా పనిచేసిన విజయ్‌కుమార్ విషయాన్ని సేలంకు చెందిన తన స్నేహితులు ఆనంద్ ప్రకాష్, వివేక్ జైన్ం సోక్రటీస్లకు చెప్పారు. వీరంతా ముఠాగా ఏర్పడి బంగారాన్ని దోచుకునేందుకు పథకం రచించారు. అందులో భాగంగా కోర్బా ఎక్స్‌ప్రెస్‌లో రైలులో ఇమ్రాన్‌ను విజయవాడ నుంచి అనుసరించారు. రైలు ఒంగోలు రైల్వేస్టేషన్‌కు రాగానే ఈ ముగ్గురు ఇమ్రాన్ ఉన్న రిజర్వేషన్ బోగీలోకి వెళ్లారు. తాము తమిళనాడు పోలీసులమని చెప్పి, దొంగ బంగారం వ్యాపారం చేస్తున్నావని సమాచారం వచ్చిందని అందుకే అరెస్టు చేస్తున్నామని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న 913 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఒంగోలు రైల్వే స్టేషన్రాగానే స్టేషన్లో దించి బయటకు తీసుకెళ్లారు. అప్పటికే సిద్ధం చేసుకోని ఉన్న కారులో ఎక్కించుకొని ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సమీపానికి తీసుకెళ్లి చీకట్లో వదిలేసి వెళ్లిపోయారు. దీంతో వెంటనే షేక్ ఇమ్రాన్ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి ఒంగోలు జీఆర్పీ సీఐ టి.శ్రీనివాసరావు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో సంబంధంలో ఉన్న తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన ఆనంద్ ప్రకాష్, వివేక్ జైన్, సోక్రటీస్, కారు డ్రైవర్ విజయకుమార్‌లను అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.29 లక్షల విలువైన 913 గ్రాముల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అదే విధంగా నిందితులు ఉపయోగించిన కారు టీఎన్ 30డీఎన్ 6669ను కూడా స్వాధీనం చేసుకున్నామని వివరించారు. దర్యాప్తులోజిల్లా ఎస్సీ పూర్తి సహకారం కేసు దర్యాప్తులో ప్రకాశం జిల్లా ఎస్పీ బి.సత్య ఏసుబాబు పూర్తిగా సహకరించారని జీఆర్పీ గుంతకల్ ఎస్పీ ఎం.సుబ్బారావు పేర్కొన్నారు. నిందితులు స్టేషన్లో దిగిన సమయం నుంచి సీసీ పుటేజ్‌ల ఆధారంగా, నగరంలోని సీసీ కెమేరాల పుటేజ్‌ల ఆధారంగానూ కేసు దర్యాప్తు కొనసాగింది. ఎస్పీ తన ఐటీ కోర్ సిబ్బందిచేత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కాల్‌డేటాలను సేకరించి నిందితులను పట్టుకోవటంలో పూర్తిగా సహకరించారని అభినందించారు. అదే విధంగా ఒంగోలు జీఆర్పీ పోలీస్‌స్టేషన్ సిబ్బందిని గుంతకల్ ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో జీఆర్పీ నెల్లూరు డీఎస్పీ జి.ఆంజనేయులు, ఒంగోలు జీఆర్పీ సీఐ టి.శ్రీనివాసరావు, చీరాల ఎస్సై జి.రామిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ ఎంజె.కిషోర్ బాబు, కానిస్టేబుళ్లు బి.శ్రీనివాసరావు, ఈపీఎస్ రెడ్డి, ఎస్కే బాషాతో పాటు పలువురు ఉన్నారు. -
పల్లెల్లో దొంగల కలవరం
పాకాల : మండలంలోని మొగరాల పంచాయతీ పచ్చిపాలపల్లెలో గురువారం రాత్రి 12 గంటల ప్రాతంలో దొంగలు హల్ చల్ చేశారు. స్థానికులు శుక్రవారం తెలిపిన వివరాల మేరకు వివరాలివి. రెండు ద్విచక్ర వాహనాల్లో ముగ్గురు వ్యక్తులు గ్రామంలోని ట్యాంక్ వద్దకు వచ్చి చుట్టుపక్కల ప్రదేశాలను పరిశీలించారు. గమనించిన గ్రామస్తులు కేకలు వేయడంతో ముగ్గురు దొంగలు వచ్చిన బైక్‌ల్లోనే పరారయ్యారని తెలిపారు. మేము గమనించకుంటే ఏదో ప్రమాదం జరిగి ఉండేదని గ్రామస్తులు ఆందోళనగా చెప్పారు. శుక్రవారం ఉదయం కూడా ప్లాస్టిక్ బిందెలు విక్రయిస్తున్నట్లు ఓ వ్యక్తి అదే గ్రామానికి వెళ్లాడు. ఓ మహిళ బిందెలు కొనడానికి అతన్ని పిలిచింది. ఆ వ్యక్తి బందెలు అమ్మకుండా చుట్టుపక్కల పరిసరాలను గమనిస్తూ గ్రామం నుంచి ఊడాయించాడని సమాచారం. ప్రస్తుతం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాల్లో పార్థీ గ్యాంగ్ దొంగల ముఠాపై ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. దీనికి తోడు ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే చుట్టు పక్కలే పార్థీ గ్యాంగ్ ఉందేమోనని అనుమానిస్తున్నారు. పోలీసులు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా గస్తీ నిర్వహించి ప్రజలకు ధైర్యాన్ని కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. దొంగలతో ఇలాంటి సమస్యలు ఎదురయినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా తెలియజేసి అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. -
రైళ్లలో చోరీ, ఇద్దరు దొంగల అరెస్ట్
సాక్షి, విజయవాడ: రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. జీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో రైల్లో దొంగతనాలు చేస్తున్న ఇద్దరు దుండగులను అదుపులోకి తీసుకున్నట్లు విజయవాడ రైల్వే ఏడిజి కిషోర్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చోరీలకు పాల్పడుతున్నవాళ్లని ఉత్తరప్రదేశ్‌కి చెందినవారిగా గుర్తించామని, వారి నుంచి పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్ట్‌లో ఉన్న హరివిందర్ సింగ్ నుంచి 70 లక్షల విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు కిషోర్ కుమార్ తెలిపారు. గడిచిన రెండు నెలల్లో రైల్వే, జీఆర్పీఎఫ్ ఆధ్యర్యంలో సుమారు కోటి 50 లక్షల రూపాయల విలువ చేసే సొత్తును రికవరీ చేశామన్నారు. వృద్ధులు, ఒంటరి ప్రయాణికులనే టార్గెట్‌గా చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారని, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. బంగారు ఆభరణాలు ధరించి ప్రయాణించడం సురక్షితం కాదని కిషోర్ కుమార్ సూచించారు. -
చోరుల హల్చల్
నగరంలో చోరులు హల్చల్ చేస్తున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇలా తాళం వేసి వెళ్లి గంటలోనే తిరిగి వచ్చే లోపే పనికానిచ్చేసి నగర వాసులను బెంబేలెత్తిస్తున్నారు. పోలీసులకు సవాల్ విసురుతున్నారు. విశాఖ క్రైం: నగరంలోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో జరుగుతన్న ఇంటి దొంగతనాలు పోలీసులతో పాటు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాళాలు తీయకుండా కిటకీలను లక్ష్యంగా చేసుకుని.. వెనుక తలుపులు బద్ధలు గొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారు. పగటిపూట పెరిగిన చోరీలు గతంలో అర్ధరాత్రులు, ఒంటిరిగా ఉన్న ఇళ్లను లక్ష్యంగా దొంగతనాలు జరిగేవి. ప్రస్తుతం దొంగలు పంథా మార్చారు. ఇతర రాష్ట్రాల ముఠాలతో చేతులు కలిపి దోపిడీలు, బెందిరింపులకు గురి చేసి అందినకాడకి దోచుకుపోతున్నారు. పట్టపగలే దొంగతనాలకు పాల్పడుతున్నారు. మరి కొంత మంది కొన్ని ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి ఈజీగా పని కానిచ్చేస్తున్నారు. సిబ్బంది కొరతతో సతమతమవుతున్న పోలీస్‌శాఖ పూర్తిస్థాయిలో నిఘా ఏర్పాటు చేయలేని దుస్థితిలో వుంది. నగరంలో ఇతర రాష్ట్రాల ముఠాలు బిహార్, ఝార్కండ్, ఒడిశా, గుంటూరు, ప్రకాశం, రాజస్తాన్ కు చెందిన ముఠాలు నగరంలోకి దిగాయి. వీరితో స్థానిక దొంగులు చేతులు కలుపుతున్నారు. నగరంలోని విశాఖ ,విజయనగరం, నెల్లూరు, కాకినాడతో పాటు వివిధ ప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చి ముందుగా తాళాలు వేసిన ఇళ్లును రెక్కీ నిర్వహిస్తారు. వీలు చిక్కినప్పుడు దొంగతనాలకు పాల్పడతారు. నగరానికి చెందిన మామిడి తిరుపతిరావు, రౌతు మల్లేష్, దున్న కృష్ణ, మణికంఠ, జి.పైడిరాజ్, తోట శివభవానీ తదితరులు ఇంటి దొంగతనాలు చేస్తుంటారు. పోలీసులు తిరుగుతున్నా.. ఎంవీపీకాలనీలో బీఎస్ఎన్ఎల్ మాజీ ఉద్యోగి, చినవాల్తేరులోని రెండు ఇళ్లలో పట్టపగలే దొంగతనాలు జరిగాయి. ఆయా ప్రాంతాల్లో పోలీసులు నిఘా తిరుగుతున్నా దొంగతనాలు మాత్రం సర్వసాధారణం అయిపోయాయి. చినముషిడివాడలో కూడా ఎంవీపీ కాలనీ తరహాలోనే ఇంట్లో అద్దెకి దిగుతామని చెప్పి దొంగతనం చేయడం తెలిసిందే. సీతమ్మధారలోని గత వారం రోజుల్లో మూడు ఇళ్ల తాళాలు పగలుగొట్టిన సంఘటనలతో స్ధానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. దొండపర్తి, ద్వారకానగర్‌లో వరుసుగా ఇంటి దొంగతనాలు జరగడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇంటి దొంగతనాలే అధికం 2016లో విశాఖలో 30 ఇంటి దొంగతనాలు జరిగాయి. ఇందులో 17 కేసుల్లో నేరస్తులను గుర్తించారు. 2017లో 35 కేసులు నమోదు కాగా , 8 కేసుల్లో మాత్రమే నేరస్తులను పట్టుకున్నారు. 2018 లో పదుల సంఖ్యలో ఇంటి దొంగతనాలు జరిగాయి. భోపాల్ గ్రూప్ (ఎంపీ) మధ్యప్రదేశ్‌కు చెందిన భోపాల్ గ్రూప్‌ది స్నాచింగ్‌లకు అందవేసినచెయ్యి. ఒకేసారి నగరంలోని పలు చోట్ల స్నాచింగ్‌లు చేసి పారిపోతారు. విశాఖలో 2010లో సుమారు ఒకే రోజు 10 చోట్ల చైన్‌స్నాచింగ్‌లు చేశారు.వీరు విడతల వారీ దిగుతారు. చెన్నై గ్యాంగ్ (మద్రాస్) మద్రాస్‌లోని రామపురం గ్యాంగ్ నగరంలోకి వచ్చి కారు డోర్ వద్ద డబ్బులు వేసి పక్కతోవ పట్టిస్తుంటారు. వెంటనే దొంగతనం చేస్తారు. ఈ గ్యాంగ్ ముందుగా బ్యాంకుల నుంచి ఎవరు డబ్బులు డ్రా చేస్తారో చూస్తుంటారు. తర్వాత పక్కగా ప్లాన్ గీసి చోరీకి పాల్పడతారు. ఆటో ముఠాలతో బహుపరాక్ విజయనగరం జిల్లా కొత్తవలసలో 202 కాలనీ గ్యాంగ్. వీరంత ఆటోలో ప్రయాణించి ఒక ముఠాగా ఏర్పాడి ప్రయాణికుల నుంచి బ్యాగు దోచుకుంటారు. మహిళలు, యువకులు బ్యాగ్‌లు తెలియకుండా తస్కరిస్తారు. ఇది చాలా డేంజరస్ ముఠా. అప్రమత్తంగా ఉండాలి నగరంలో జరుగుతున్న ఇంటి దొంగతనాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తక్షణమే సంబంధించిన పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వండి. ఇంటి కిటికీ తులుపులు తీసి ఉంచరాదు. ఊరు వెళ్లిన వారు ఇంటికి తాళాలు వేసి పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి. బంగారు నగలు బ్యాంకు లాకర్లో ఉంచుకోవాలి.– రామకృష్ణ, క్రైం,ఎస్ఐ, ఫోర్తుటౌన్ -
పోలీస్ దొంగలు చిక్కారు!
సాక్షి, తగరపువలస(భీమిలి): ఇటీవలే ఉద్యోగ విరమణ చేసిన కానిస్టేబుల్, ప్రస్తుతం కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అతని కుమారుడు ఒక ముఠాను తయారుచేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వైనం ఆలస్యంగా వెలుగుచూసింది. విశాఖ జిల్లా భీమిలి పోలీసులు అందజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దాట్ల సత్యనారాయణరాజు అనే వ్యక్తి మూడు నెలల కిందట రిటైర్ అయ్యారు. అతని కుమారుడు దాట్ల వెంకటవరహాలరాజు ప్రస్తుతం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ మరో ముగ్గురితో కలిసి టాస్క్‌ఫోర్స్ పోలీసుల అవతారం ఎత్తారు. ఈ నెల 22న సాయంత్రం 6.30 సమయంలో తగరపువలస శివారు సంగివలస–పాండ్రంగి రహదారిలో తోటకూర గౌరీ లక్ష్మణరావుకు చెందిన దుకాణం వద్దకు కారులో వెళ్లారు. పాన్ మసాలాలు గుర్తించి గుట్కాలు అమ్ముతున్నట్టు కేసుపెడతామని బెదిరించారు. రూ.లక్ష ఇస్తే వదిలేస్తామని బేరసారాలకు దిగారు. దీంతో బాధితుడు రూ.25 వేలు ఇస్తామన్నా వదిలిపెట్టకుండా రూ.లక్ష ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి తీసుకున్నారు. ఇంకా ఎవరైనా గుట్కా వ్యాపారం చేస్తే సమాచారం ఇవ్వాలని తమ ఫోన్‌నంబరు ఇచ్చి వెళ్లారు. నిజంగా టాస్క్‌ఫోర్స్ పోలీసులేనని భావించిన బాధితుడు తోటి వ్యాపారస్తుల వద్ద గోడు వెల్లబోసుకున్నాడు. వారు నగరంలోని టాస్క్‌ఫోర్స్ పోలీస్ ఉన్నతాధికారులకు విషయం చేరవేశారు. దీంతో అధికారులు బాధితుడిని పిలిచి బెదిరించిన సిబ్బందిని గుర్తు పట్టాల్సిందిగా కోరారు. అక్కడ వారు లేకపోవడంతో తమ దగ్గరికి వచ్చిన వారి కారు నంబరును టాస్క్‌ఫోర్స్ అధికారులకు ఇవ్వగా.. దాని సాయంతో నిందితులను గుర్తించారు. వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి పథకం వేసి బాధితునితో ఏఆర్ కానిస్టేబుల్‌కు ఫోన్ చేయించి ఈ నెల 24న ఆనందపురం మండలం పెద్దిపాలెం వద్దకు రూ.40 లక్షల విలువైన గుట్కా వస్తుందని నమ్మబలికి రప్పించారు. అప్పటికే అక్కడ వాహనంలో డ్రైవర్ వేషంలో ఉన్న టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని ఏఆర్ కానిస్టేబుల్ బెదిరించడంతో పట్టుకుని భీమిలి పోలీసులకు అప్పగించారు. బాధితుడి నుంచి తీసుకున్న సొమ్ములో రూ.40వేలు రికవరీ చేసి తండ్రీ, కొడుకులను రిమాండ్‌కు తరలించనున్నట్టు సీఐ బాలసూర్యారావు తెలిపారు. వీరితో పాటు వచ్చిన మరో ముగ్గురి గురించి ఆరా తీస్తున్నట్టు చెప్పారు. కాగా నిందితులలో ఒకరైన కానిస్టేబుల్ వరహాలరాజు మాట్లాడుతూ గుట్కా నిల్వలు ఉన్నాయేమో తెలుసుకోవడానికి రెక్కీ నిర్వహించడానికి తగరపువలస వైపు వచ్చానని.. పనిలో పనిగా తన తండ్రిని విజయనగరంలో బంధువుల ఇంటిలో దింపేందుకు కారు తీసుకువచ్చానన్నారు. తనపై గిట్టనివారు అక్రమంగా ఈ కేసులో ఇరికించారని చెప్పారు. -
రాచపాళెంలో దొంగల బీభత్సం
ఓజిలి: నెల్లూరు జిల్లా ఓజిలి మండలం రాచపాళెం గ్రామంలో సోమవారం వేకువజామున దొంగలు బీభత్స సృష్టించారు. ఇంటి ముందర నిద్రిస్తున్న పి. వెంకటసుబ్బమ్మ(50) అనే మహిళ మెడలోని 5 సవర్ల బంగారు గొలుసును లాక్కెళ్లారు. మహిళ కేకలు వేయడంతో.. చుట్టుపక్కలవారు దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. వారు పక్కనున్న రైలుపట్టాల వైపు పరుగుతీసి పారిపోయారు. ముగ్గురు దుండగులు వచ్చి నిద్రిస్తున్న వెంకటసుబ్బమ్మ మెడలోని గొలుసును కత్తిరించారు. చేతులకున్న గాజులను కత్తిరిస్తుండగా మేల్కొన్న ఆమె కేకలు వేసింది. ఇరుగుపొరుగువారు రావడంతో దొంగలు వారిపై రాళ్లు విసురుతూ పారిపోయారు. బాధితురాలు ఈ మేరకు ఓజిలి పోలీసులకు ఫిర్యాదుచేసింది. -
అత్తాపూర్‌లో దొంగల బీభత్సం
హైదరాబాద్ : రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం అర్థరాత్రి మూడు చోట్ల దుండగులు చోరీలకు పాల్పడ్డారు. ఒక గ్యాస్ గోదాముతోపాటు రెండిళ్లలో చోరికి పాల్పడి రూ.8 లక్షల విలువైన సొత్తును దోచుకెళ్లారు. చింతల్మెట్లో ఇండేన్‌గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ నాగేశ్వరరావు గదిలోని లాకర్ తెరిచి రూ.4 లక్షలు ఎత్తుకుపోయారు. అలాగే, హైదర్‌గూడ ప్రాంతం న్యూఫ్రెండ్స్ కాలనీలోని శివసాయి రెసిడెన్సీలో వెంకటనర్సింహారెడ్డి ప్లాట్‌లో దొంగలు ఆరు తులాల బంగారు నగలు, రూ.50 వేలు అపహరించుకుపోయారు. అక్కడే మూడో ఫ్లోర్లో ఉండే శ్రీనివాస్ ఇంట్లో 5 తులాల బంగారం, రూ.38 వేల నగదుతోపాటు రూ.50 వేల విలువైన రెండు వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఎత్తుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (అత్తాపూర్) -
జహీరాబాద్ లో దొంగల వీరవిహారం
జహీరాబాద్ : మెదక్ జిల్లా జహీరాబాద్ పట్టణంలో మంగళవారం రాత్రి దొంగలు పెట్రేగి పోయారు. రెండు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. మరో మూడు ఇళ్లలో చోరీకి ప్రయత్నించారు. చెన్నారెడ్డి నగర్‌లోని ఓ ఇంట్లోని యజమానిపై దాడి చేసి బంగారంతో ఉడాయించారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని చెన్నారెడ్డి నగర్ కాలనీలో నివాసం ఉంటున్న న్యాల్కల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీహరి ఇంట్లోకి బుధవారం ఉదయం 3.50 గంటలకు ప్రవేశించారు. ఇంటి తలుపులను బలంగా తోసేయడంతో అవి తెరుచుకున్నాయి. అనంతరం ఇంటి యజమాని శ్రీహరి తలపై పారతో దాడిచేసి గాయపర్చారు. ఆయన భార్య కవిత మెడలో ఉన్న ఐదు తులాలు, కుమార్తె హర్ష మెడలో ఉన్న మరో ఐదు తులాల బంగారం లాక్కున్నారు. అడ్డు వచ్చిన శ్రీహరి కుమారుడు అభినందన్‌ను స్వల్పంగా గాయపర్చారు. ఈ సమయంలోనే పోలీసుల సైరన్ మోగడంతో మూడు నిమిషాల్లోనే దొంగలు బంగారంతో ఉడాయించారు. ప్రమాదంలో గాయపడిన శ్రీహరికి స్థానిక ప్రభుత్వాస్పత్రిలో వైద్యం చేయించి హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. క్లూస్‌టీం ఆధారాలను సేకరించాయి. డాగ్ స్వాడ్‌ను రప్పించి దొంగల ఆచూకి తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దొంగలు ముందుగా దత్తగిరి కాలనీలో చోకికి పాల్పడ్డారు. మధుసూదన్‌కు చెందిన ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న రూ.10 వేల విలువ గల కెమెరా, వెండి పట్టగొలుసును దొంగలించారు. పక్కనే ఉన్న నవీన్‌కుమార్ ఇంటి తలుపులు బలంగా తోయడంతో తెరుచుకున్నాయి. ఇంట్లోని వ్యక్తులు అల్లరి చేయడంతో దొంగలు పారిపోయారు. అక్కడి నుంచి చెన్నారెడ్డినగర్ కాలనీలోకి ప్రవేశించినట్లు భావిస్తున్నారు. ముందుగా నసీర్ అనే వ్యక్తి ఇంట్లోకి దొంగలు ప్రవేశించారు. అదే సమయంలో మూత్రానికి లేచిన పొరుగింటి వారికి ఫోన్ చేయడంతో వారు అప్రమత్తమై అల్లరి చేయడంతో దొంగలు అక్కడి నుంచి కూడా పారిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడినుంచి పారిపోయిన దొంగలు కాలనీ చివరన ఉన్న శివకుమార్ ఇంటి తాళాలు పగులకొట్టారు. ఇల్లు ఖాళీగా ఉండడంతో పక్కనే కాలనీకి చివరనే ఉన్న ప్రిన్సిపాల్ శ్రీహరి ఇంట్లోకి ప్రవేశించి బంగారం దొంగిలించారు. అదే సమయంలో ఎస్ఐ 2 సుభాష్ కాలనీలోకి ప్రవేశించడంతొ దొంగలు పారిపోయారు. బుధవారం ఉదయం సంగారెడ్డి డీఎస్పీ తిరపతన్న, స్థానిక సీఐ, ఎస్ఐలు లక్ష్మీనారాయణ, శివలింగంలు సంఘటనా స్థలాలను సందర్శించారు. బాధితులను పరామర్శించారు. దొంగతనానికి పాల్పడింది పార్థి గ్యాంగ్‌గా భవిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ముసుగులు ధరించి వచ్చిన దొంగలు -
టీ ఎస్ఎస్పీ బెటాలియన్‌లో దొంగలు పడ్డారు!
మామునూరు: టీఎస్ఎస్పీ పోలీసుల నివాసగృహాలకే రక్షణ లేకుండా పోయింది. వరంగల్ జిల్లా మామునూరు టీఎస్ఎస్పీ నాలుగో బెటాలియన్‌లో తాళం వేసి ఉన్న ఎనిమిది క్వార్టర్స్‌ల్లో దొంగలు చోరీకి పాల్పడి 39 తులాల బంగారు ఆభరణాలు, సుమారు 67తులాల వెండి వస్తువులు, రూ.1.12లక్షల నగదు దొంగిలించారు. హన్మకొండ మండలం మామునూరులో టీఎస్ఎస్పీ నాలుగో బెటాలియన్‌లోని సుమారు 7వందల క్వార్టర్స్‌లో పోలీసు కుటుంబాలు నివాసముంటున్నారుు. ఉగాది సందర్భంగా కొంతమంది కానిస్టేబుళ్లు క్వార్టర్లకు తాళాలు వేసి తమ స్వగ్రామాలకు వెళ్లారు. ఇదే అదనుగా దొంగలు చోరీలకు పాల్పడ్డారు. -
పొట్టేళ్లను ఎత్తుకెళ్లిన దొంగలు
కరీంనగర్: కోనరావుపేట మండలంలోని నిజాంబాద్ గ్రామంలో దొంగలు రెండు పొట్టేళ్లను బుధవారం సాయంత్రం ఎత్తుకెళ్లారు. వాటి విలువ సుమారు రూ.24 వేలు ఉంటుందని యజమాని తెలిపాడు. వివరాలు...నిజాంబాద్ గ్రామానికి చెందిన బొల్లు శ్రీనివాస్ బుధవారం గొర్రెల మందలోకి రెండు పొట్టేళ్లను తోలాడు. గురువారం ఉదయం చూసేసరికి రెండు పొట్టేళ్లు కనిపించలేదు. దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (కోనరావుపేట) -
పేట్రేగిన దొంగలు
సాక్షి, గుంటూరు/వట్టిచెరుకూరు/విద్యానగర్: జిల్లాలో ఎన్నడూ లేని విధంగా దోపిడీ దొంగలు లరేగిపోతున్నారు. ఇనుపరాడ్లతో దాడులకు పాల్పడుతున్నారు. గ్రామ శివారులో ఉన్న ఇళ్లు,పెట్రోలు బంకులే లక్ష్యంగా బీభత్సం సృష్టిస్తున్నారు. అర్బన్ జిల్లా పరిధిలో దోపిడీ దొంగల ముఠాలు సంచరిస్తున్నట్టు గత నెల 19న నిఘా వర్గాలు చేసిన హెచ్చరికలు నిజమవుతున్నాయి. దోపిడీకి యత్నించే సమయంలో అడ్డుకునేవారిపై కత్తులు, రాడ్లతో దాడులు చేయడానికి కూడా ముఠాలు వెనకాడబోవని నిఘా వర్గాలు చెప్పిన మాటలు అక్షరాలా జరుగుతున్నాయి. ఈ హెచ్చరికలకు పోలీసు ఉన్నతాధికారులు సైతం స్పందించిన దాఖలాలు లేవనడానికి జిల్లాలో వరసగా జరుగుతున్న దొంగతనాలు, దోపిడీలే సాక్ష్యాలు.. నిఘా వర్గాలు హెచ్చరించిన పది రోజుల్లోనే రెండు దోపిడీలు జరగడం పోలీస్ అధికారుల పనితీరును శంకిస్తోంది. వట్టి చెరుకూరు శివారులో ఉన్న పెట్రోలు బంకు(ఆగ్రో అండ్ ఆయిల్ ఫిలింగ్ స్టేషన్)పై గుర్తుతెలియని దుండగులు దాడిచేసి, అందులో పనిచేస్తున్న ముగ్గురు యువకులను తీవ్రంగా గాయపరచి రూ. ఆరువేల నగదు దోచుకెళ్లారు. వట్టిచెరుకూరు నెహ్రూనగర్‌కు చెందిన కారుమూరి చిన్నబాబు, రెంటచింతల మండలం పాల్వారుు గ్రామానికి చెందిన దాదిబత్తిన మణికంఠ, గాలి సత్యనారాయణ సాయంత్రం విధులు నిర్వర్తిస్తున్నారు. రాత్రి 11గంటల వరకూ వచ్చిన కలెక్షన్ మొత్తాన్ని యజమానికి ఇచ్చేసి, రాత్రి మేనేజర్ రూమ్‌లో పడుకున్నారు. వేకువజామున కొందరు దుండగులు వచ్చి పెట్రోలుకావాలని అడిగారు. తలుపు తెరచిన యువకులపై ఇనుపరాడ్లతో దాడిచేసి విచక్షణారహితంగా కొట్టి వారి వద్ద ఉన్న దాదాపు రూ. ఆరువేల రూపాయలు అపహరించుకుపోయూరు. వెళ్తూ వెళ్తూ బయట గడిపెట్టారు. ఉదయం 5గంటల ప్రాంతంలో పెట్రోలు కోసం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రవి రాగా గది నుంచి రక్తపు మరకలతో ఉన్న చెయ్యి ఎత్తి బాధితుడు సైగ చేశాడు. రవి దగ్గరకు వెళ్లి చూసి పరిస్థితిని అర్థం చేసుకుని గ్రామానికి చెందిన వల్లూరి గోపాలకృష్ణ అనే వ్యక్తికి విషయం చెప్పాడు. వెంటనే ఆయన బంక్ మేనేజర్ శివకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బంకు ఓనర్ శ్రీనివాస రెడి అక్కడకు చేరుకుని రక్తపుమడుగులో ఉన్న యువకులను 108 ద్వారా గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను పరీక్షించిన వైద్యులు ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని 48 గంటలు గడిస్తే గానీ చెప్పలేమని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఎస్సై ప్రసాద్ రెడ్డి అందించిన సమాచారంతో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. వరికోత మెషిన్వద్ద ఆగిన జాగిలాలు పోలీసు జాగిలాలు వచ్చి పెట్రోలు బంకునుంచి ఎదురుగా ఉన్న వరికోత మెషిన్వద్దకు చేరుకుని, అక్కడినుంచి గ్రామంలోని ఎలిమెంటరీ స్కూల్ సమీపంలోగల వరికోత మెషిన్ డ్రైవర్ సేవిక్, క్లీనర్ భూటాసింగ్ ఉండే గదివద్ద తచ్చాడారుు. పంజాబ్ నుంచి వరికోత మెషిన్ నిర్వహణకు ఇద్దరిని స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి తీసుకువచ్చారు. ఆ వచ్చిన ఇద్దరిపైనే పోలీసులు అనుమానిస్తున్నారు. వరికోత మెషిన్ యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. సంఘటన స్థలాన్ని అర్బన్ ఎస్పీ రాజేష్ కుమార్, సౌత్ జోన్ డీయస్పీ నరసింహ, సీఐ శ్రీనివాసరావు చేరుకుని పరిశీలించారు. పోలీసుల అలసత్వం వల్లే దోపిడీలు జిల్లాలో చోరీలు, చైన్ స్నాచింగ్‌లు, దోపిడీలు, దొంగతనాలు వరసగా జరుగుతున్నా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడం లేదని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. గత నెల 21న గోరంట్ల గ్రామంలో ఊరి బయట ఉన్న ఓ గృహంలోకి ప్రవేశించిన దోపిడీ దొంగలు పని మనిషిని కట్టి పడేసి యథేచ్ఛగా ఇల్లు దోచుకున్నారు. సుమారు రూ. 30 లక్షల విలువ చేసే సొత్తుతోపాటు నగదును దర్జాగా కారులో తీసుకెళ్లారు. అయితే ఈ సంఘటనలో ఎవరిపైనా దాడి చేయకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బదిలీలపై చూపుతున్న శ్రద్ధ విధులపై చూపించడం లేదని, దీంతో పోలీసు శాఖ నిద్రావస్థలోకి వెళ్లిందని వ్యాఖ్యానిస్తున్నారు. వరసగా సంఘటనలతో పెట్రోలు బంకులు, వైన్స్‌లు, రెస్టారెంట్లు, ఊరికి దూరంగా ఉండే గృహాల్లో ఉండే వారు భయాందోళనకు గురవుతున్నారు.