కోనరావుపేట మండలంలోని నిజాంబాద్ గ్రామంలో దొంగలు రెండు పొట్టేళ్లను బుధవారం సాయంత్రం ఎత్తుకెళ్లారు.
కరీంనగర్: కోనరావుపేట మండలంలోని నిజాంబాద్ గ్రామంలో దొంగలు రెండు పొట్టేళ్లను బుధవారం సాయంత్రం ఎత్తుకెళ్లారు. వాటి విలువ సుమారు రూ.24 వేలు ఉంటుందని యజమాని తెలిపాడు. వివరాలు...నిజాంబాద్ గ్రామానికి చెందిన బొల్లు శ్రీనివాస్ బుధవారం గొర్రెల మందలోకి రెండు పొట్టేళ్లను తోలాడు. గురువారం ఉదయం చూసేసరికి రెండు పొట్టేళ్లు కనిపించలేదు. దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
(కోనరావుపేట)