ప్రత్యేక పశు సంపదగా నమోదు చేసిన ఎన్‌బీఏజీఆర్
ఇప్పటికే ఒంగోలు గిత్త, అశీల్ కోడికి ప్రత్యేకత
పశు సంపదలో ఏపీకి దేశంలోనే రెండో స్థానం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: పల్నాడు ప్రాంతంలో బాగా పెరిగే ‘మాచర్ల గొర్రె’కు దేశీయంగా ప్రత్యేక గుర్తింపు లభించింది. ఏపీకి చెందిన ఒంగోలు గిత్త, అశీల్ రకం కోడి వంటివి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రత్యేకత సంతరించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఎన్‌బీఏజీఆర్ (నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్) ఈ గొర్రెను ఉత్తమ రకం పశువుగా నమోదు చేసింది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలతో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మాచర్ల రకం గొర్రెలు ఉన్నాయి.
దేశంలోని ఇతర రకాల గొర్రెలు, పొట్టేళ్లతో పోలిస్తే మాచర్ల గొర్రెలు విభిన్నంగా ఉన్నట్టు ఎన్‌బీఏజీఆర్ పేర్కొంది. దీనిపై ప్రత్యేక పరిశోధన చేసిన అనంతరం తాజా గా ఆ సంస్థ వీటిని ఉత్తమ రకం పశువులుగా గుర్తించింది. ఈ పరిశోధనలో కర్నాల్‌లోని ఎన్‌బీఏజీఆర్, గన్నవరంలోని ఎనీ్టఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ పరిశోధన బృందాలు పాల్గొన్నాయి.
స్థానిక పరిస్థితులకు అనుకూలంగా..
మాచర్ల గొర్రెలనే గుక్కల జాల అని, గుంటూరు లోకల్ గొర్రె అని కూడా పిలుస్తారు. ఏపీలోని వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మాచర్ల గొర్రెల జాతి చక్కగా ఇమిడిపోయినట్టు పరిశోధకులు తెలిపారు. వీటి మాంసం మిగతా వాటితో పోలిస్తే రుచికరంగా ఉంటుందని వెల్లడించారు.
శరీర బరువు ఏడాదిలో 30 నుంచి 45 కేజీల వరకూ పెరుగుతుందని పేర్కొన్నారు. ముఖం, కాళ్లపై గోధుమ లేదా నలుపు రంగు మచ్చలు ఉంటాయి. కొన్ని గొర్రెలు ముదురు గోధుమ రంగు మచ్చలతో ఉంటాయి. మాచర్ల గొర్రెల పోషణ లాభదాయకంగా ఉండటంతో చిన్న సన్నకారు రైతులు, రైతు కూలీలు దీన్నే వృత్తిగా చేసుకుంటున్నారని వెల్లడించారు.
రెండో స్థానంలో ఏపీ
» గడచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో పశు సంపద భారీగా పెరిగినట్టు ఎన్‌బీఏజీఆర్‌వెల్లడించింది.
» ప్రపంచంలో 13.8 % వాటా పశువులతో దేశం మూడో స్థానంలో ఉండగా.. దేశంలో 23.74% వాటాతో అంటే 17.63 మిలియన్ గొర్రెలతో దేశంలోనే
ఏపీ రెండో స్థానంలోఉన్నట్టు స్పష్టం చేసింది.
» వ్యవసాయం కంటే గొర్రెల పెంపకం లాభసాటిగాఉండటంతో ఎక్కువ మంది రైతులు దీనినే వృత్తిగా ఎంచుకుంటున్నారు. పైగా మాంసం ధర ఎక్కువగా ఉండటం వల్ల మంచి గిట్టుబాటు అవుతున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment