సాక్షి, బీదర్: షిర్డీ టూ కాకినాడ పోర్టు ఎక్స్‌ప్రెస్ రైలులో దొంగలు రెచ్చిపోయారు. రైలులో ప్రయాణీకులు నిద్రిస్తున్న సమయాన్ని ఆసరాగా చేసుకుని మూడు బోగీల్లో బంగారం, నగదు, లగేజీని దొంగలించారు. దీంతో, బీదర్ వద్ద రైలును నిలిపివేసి ప్రయాణీకులు ఆందోళనకు దిగారు.
వివరాల ప్రకారం.. సాయినగర్ షిర్డీ టూ కాకినాడ పోర్టు ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ దోపిడీ జరిగింది. మహారాష్ట్రలోని వర్లీ సమీపంలో రైలులో ఎక్కిన దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ప్రయాణీకులు నిద్రిస్తున్న సమయంలో వారి వద్ద నుంచి బంగారం, నగదు, లగేజీని దొంగలించారు. ఈ క్రమంలో దోపిడీని గుర్తించిన ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
అయితే, దోపిడీ అనంతరం దొంగలు బీదర్‌కు ముందున్న పర్లీ స్టేష్లన్‌లో దిగిపోయినట్టు ప్రయాణికులు గుర్తించారు. దీంతో, తమకు న్యాయం జరగాలని ప్రయాణికులు ఆందోళనలు చేస్తున్నారు. బీదర్‌లో రైలును నిలిపివేసి ఆందోళనకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment