రాహుల్ గాంధీకి స్వీటు తినిపిస్తున్న కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే
న్యూఢిల్లీ: లోక్‌సభ సభ్యత్వం కోల్పోవడానికి కారణమైన 2019 నాటి పరువు నష్టం కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాం«దీకి భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు రెండేళ్లపాటు జైలు శిక్ష విధిస్తూ గుజరాత్‌లోని సూరత్ కోర్టు ఇచి్చన తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా లోక్‌సభ సభ్యత్వం మళ్లీ పొందడానికి రాహుల్‌కు అవకాశం లభించింది. ఆయన సభ్యత్వాన్ని లోక్‌సభ స్పీకర్ స్వయంగా పునరుద్ధరించవచ్చు లేదా సుప్రీంకోర్టు ఉత్తర్వు ప్రకారం సభ్యత్వం తిరిగి పొందడానికి రాహుల్ గాంధీ న్యాయ పోరాటం చేయొచ్చు. ఈ తీర్పుతో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి రాహుల్ గాంధీకి ఇక అడ్డంకులు తొలగిపోయినట్లే.
ప్రజాజీవితంలో ఉన్నవారు ఆచితూచి మాట్లాడాలి
పరువు నష్టం కేసులో తనకు రెండేళ్లపాటు జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు ఇచి్చన తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాహుల్ తొలుత గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని తిరస్కరిస్తూ గుజరాత్ హైకోర్టు తీర్పునిచి్చంది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రాహుల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గావై, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సంజయ్ కుమార్‌తో కూడిన త్రిసభ్య సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది.
‘‘పరువు నష్టం కేసులో రాహుల్‌కు గరిష్ట శిక్ష విధించడానికి ట్రయల్ కోర్టు న్యాయమూర్తి ఎలాంటి కారణం చూపలేదు. అందుకే దోషిగా నిర్ధారించే తీర్పును నిలిపివేయాలి. అలాగే ఈ తరహా(పరువుకు నష్టం కలిగించే) వ్యాఖ్యలు మంచివి కావు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రజాజీవితంలో ఉన్నవారు బహిరంగ సభల్లో ఆచితూచి మాట్లాడాలని ప్రజలంతా ఆశిస్తారు’’ అని స్పష్టం చేసింది. రాహుల్‌ను దోషిగా నిర్ధారించడం అనేది కేవలం ఆయనపైనే కాకుండా ఆయనను తమ ప్రతినిధిగా ఎన్నుకున్న ఓటర్ల హక్కుపై కూడా ప్రభావం చూపుతుందని వెల్లడించింది. ఐపీసీ సెక్షన్ 499(పరువు నష్టం) కింద రాహుల్‌కు గరిష్ట శిక్ష విధించడంపైనా ధర్మాసనం సంశయం వ్యక్తం చేసింది. శిక్షాకాలం ఒక్కరోజు తగ్గినా ఆయనపై ఎంపీగా అనర్హత వేటు పడేది కాదని ఉద్ఘాటించింది.
సమాజ వ్యతిరేక వ్యాఖ్యలు కావవి
రాహుల్ తరపున సీనియర్ అడ్వొకేట్ అభిõÙక్ మనూ సింఘ్వీ వాదనలు వినిపించారు. తన క్లయింట్ కరడుగట్టిన నేరçస్తుడు కాదని చెప్పారు. ఆయనపై బీజేపీ కార్యకర్తలు ఎన్నో కేసులు పెట్టారని, అయినా ఏ ఒక్క కేసులోనూ దోషిగా తేలలేదని గుర్తుచేశారు. రాహుల్‌పై ఫిర్యాదు చేసిన పూర్ణేష్ మోదీ ఇంటిపేరు అసలు మోదీయే కాదని పేర్కొన్నారు. ఈ విషయం ఆయనే చెప్పారని గుర్తుచేశారు. రాహుల్ వ్యాఖ్యలు సమాజానికి వ్యతిరేకంగా చేసినవి కావని వివరించారు.
ఇది అపహరణ, హత్య, అత్యాచారం వంటి నేరం కాదని, అయినప్పటికీ రెండేళ్ల జైలు విక్ష విధించారని ఆక్షేపించారు. రాహుల్ నిర్దోíÙగా విడుదల కావడానికి, పార్లమెంట్‌కు హాజరు కావడానికి, వచ్చేసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇదే చివరి అవకాశమని అన్నారు. ఫిర్యాదుదారు పూర్ణేష్ మోదీ తరఫున సీనియర్ అడ్వొకేట్ మహేష్ జెఠ్మలానీ వాదించారు. రాహుల్ తప్పు చేశారనడానికి చాలా ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం చివరకు రాహుల్‌కు విధించిన జైలు శిక్షపై స్టే వి«ధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఏమిటీ కేసు?
2019 ఏప్రిల్ 13న కర్ణాటకలోని కోలార్ పట్టణంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ‘‘దొంగలందరి ఇంటి పేరు మోదీ అని ఎందుకుంటుంది?’’ అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను తప్పుపడుతూ గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ సూరత్ కోర్టును ఆశ్రయించారు. రాహుల్‌పై క్రిమినల్, పరువు నష్టం దావా వేశారు. విచారణ జరిపిన సూరత్ కోర్టు 2023 మార్చి 23న రాహుల్ గాంధీని దోషిగా తేలి్చంది. రెండేళ్లపాటు జైలు శిక్ష విధించింది. మరుసటి రోజే రాహుల్‌పై లోక్‌సభ స్పీకర్ అనర్హత వేటు వేశారు. రాహుల్ లోక్‌సభ సభ్యత్వం రద్దయ్యింది. మాజీ ఎంపీగా మారారు. అంతేకాకుండా ఢిల్లీలోని తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి, బయటకు వెళ్లిపోవాల్సి వచి్చంది.
ఇప్పుడేం జరుగుతుంది?
పరువు నష్టం కేసులో రాహుల్ గాం«దీకి సుప్రీంకోర్టు ఊరట కలిగించడంతో ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని ఎప్పటిలోగా పునరుద్ధరిస్తారన్న దానిపై చర్చ ప్రారంభమైంది. అధికారిక ప్రక్రియ ప్రకారం.. లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలంటే రాహుల్ తొలుత లోక్‌సభ సెక్రటేరియట్‌కు విజ్ఞాపన పత్రం సమరి్పంచాల్సి ఉంటుంది. రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచి్చందని తెలియజేయాలి. సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని అభ్యరి్థంచాలి. సుప్రీంకోర్టు ఉత్తర్వు కాపీని కూడా సమరి్పంచాలి. అన్నీ సక్రమంగా ఉన్నట్లు భావిస్తే సభ్యత్వాన్ని పునరుద్ధరించినట్లు లోక్‌సభ సెకట్రేరియట్ ఒక అధికారిక ప్రకటన జారీ చేస్తుంది. ఇటీవల నేషనలిస్టు కాంగ్రెస్ పారీ్ట(ఎన్సీపీ) ఎంపీ మొహమ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించడానికి రెండు నెలలు పట్టడం గమనార్హం.
కోలార్ నుంచి కోర్టుల వరకు..
నాలుగేళ్ల క్రితం కర్ణాటక ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారమే సృష్టించి చివరికి ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోవలసి వచ్చింది. మోదీ ఇంటి పేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యల దగ్గర్నుంచి అత్యున్నత న్యాయస్థానం తీర్పు వరకు పరిణామ క్రమాన్ని చూద్దాం.
ఏప్రిల్ 12, 2019: కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ దొంగలందరికీ ఇంటి పేరు మో దీయే ఎందుకు ఉంటుంది ? నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ అని వ్యాఖ్యానించారు.
ఏప్రిల్ 15, 2019: గుజరాత్ సూరత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు.
జూలై 7, 2019: సూరత్ మెట్రోపాలిటన్ కోర్టు ఎదుట రాహుల్ గాంధీ మొదటిసారిగా హాజరయ్యారు.
మార్చి 23, 2023: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన సూరత్ కోర్టు ఆయనకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. రాహుల్ అప్పీలు చేసుకోవడానికి వీలుగా నెల రోజుల పాటు తీర్పుని సస్పెండ్ చేసింది.
మార్చి 24, 2023: ఒక క్రిమినల్ కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో పార్లమెంటు సభ్యుడిగా ఆయనపై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం ఒక నోటీసు జారీ చేసింది.
ఏప్రిల్ 3 2023: మెట్రోపాలిటన్ కోర్టు తీర్పుని సవాల్ చేస్తూ రాహుల్ సూరత్ సెషన్స్ కోర్టుని ఆశ్రయించారు. తీర్పుపై స్టే విధించాలని కోరారు
ఏప్రిల్ 20, 2023: తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన సెషన్స్ కోర్టు రాహుల్ పిటిషన్‌ను కొట్టేసింది.
ఏప్రిల్ 25, 2023: రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టుని ఆశ్రయించారు. తన శిక్షను నిలుపదల చేయాలని పిటిషన్ వేశారు.
జూలై 7, 2023: గుజరాత్ హైకోర్టులో రాహుల్‌కి ఎదురు దెబ్బ తగిలింది. శిక్షపై స్టే విధించడానికి నిరాకరించిన కోర్టు రాహుల్ పిటిషన్‌ను తిరస్కరించింది.
జూలై 15, 2023: హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టుకెక్కారు.
జూలై 21, 2023: ఈ కేసులో గుజరాత్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఆగస్టు 4, 2023: రాహుల్‌కి విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసులో కింద కోర్టు గరిష్టంగా రెండేళ్లు జైలు శిక్షని విధించడానికి కారణాలు కనిపించలేదని వ్యాఖ్యానించింది. సుప్రీం తీర్పుతో రాహుల్ పార్లమెంటు సభ్యత్వం తిరిగి పొందడానికి ఆస్కారం ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment