ఓజిలి: నెల్లూరు జిల్లా ఓజిలి మండలం రాచపాళెం గ్రామంలో సోమవారం వేకువజామున దొంగలు బీభత్స సృష్టించారు. ఇంటి ముందర నిద్రిస్తున్న పి. వెంకటసుబ్బమ్మ(50) అనే మహిళ మెడలోని 5 సవర్ల బంగారు గొలుసును లాక్కెళ్లారు. మహిళ కేకలు వేయడంతో.. చుట్టుపక్కలవారు దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. వారు పక్కనున్న రైలుపట్టాల వైపు పరుగుతీసి పారిపోయారు.
ముగ్గురు దుండగులు వచ్చి నిద్రిస్తున్న వెంకటసుబ్బమ్మ మెడలోని గొలుసును కత్తిరించారు. చేతులకున్న గాజులను కత్తిరిస్తుండగా మేల్కొన్న ఆమె కేకలు వేసింది. ఇరుగుపొరుగువారు రావడంతో దొంగలు వారిపై రాళ్లు విసురుతూ పారిపోయారు. బాధితురాలు ఈ మేరకు ఓజిలి పోలీసులకు ఫిర్యాదుచేసింది.
రాచపాళెంలో దొంగల బీభత్సం
Published Mon, Jul 11 2016 8:47 AM | Last Updated on Mon, Sep 4 2017 4:37 AM
Advertisement
Advertisement