వివరాలు వెల్లడిస్తున్న సీసీఎస్ డీఎస్పీ బాలసుందరరావు
నెల్లూరు(క్రైమ్): తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఓ పాతదొంగను నెల్లూరు సీసీఎస్, సంతపేట పోలీసులు «శుక్రవారం అరెస్ట్ చేశారు. నగరంలోని సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ డీఎస్పీ ఎం.బాలసుందరరావు నిందితుల వివరాలను వెల్లడించారు. సంతపేట ఈద్గామిట్టకు చెందిన ఎస్‌కే అక్బర్ పాతనేరస్తుడు. గతంలో పలుమార్లు దొంగతనం కేసుల్లో పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. ఇటీవల నగరంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తిరగసాగాడు.
ఈ నేపథ్యంలో సీసీఎస్ డీఎస్పీ ఆధ్వర్యంలో సీసీఎస్, సంతపేట పోలీస్‌స్టేషన్ల ఇన్‌స్పెక్టర్‌లు షేక్ బాజీజాన్‌సైదా, బి.పాపారావులు నిందితుడిపై నిఘా ఉంచారు. శుక్రవారం పోలీసులు ములుముడి బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న అక్బర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తమదైన శైలిలో విచారించగా పలు దొంగతనాలు చేసినట్టు నేరం అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసి అతడి నుంచి రూ.2 లక్షలు విలువచేసే బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలియజేశారు.
నేరాలివే..
2017 జూలైలో కుక్కలగుంటలో, అదే ఏడాది నవంబర్‌లో మన్సూర్‌నగర్‌లో, 2018 జనవరిలో పాతమున్సిప ల్ క్వార్టర్స్ వద్ద, మార్చిలో మన్సూర్‌నగర్‌లో, జూన్‌లో కుక్కలగుంట ప్రాంతంలో అక్బర్ దొంగతనాలు చేశా డు. నిందితుడిని అరెస్ట్‌చేసి చోరీ సొత్తు రాబట్టేందుకు కృషిచేసిన ఇన్‌స్పెక్టర్లు షేక్ బాజీజాŒసైదా, బి.పాపారావు, సీసీఎస్ ఎస్సై కె.మురళీప్రసాద్, హెడ్‌కానిస్టేబుల్స్ ఆర్.సురేష్‌కుమార్, ఎం.మహేశ్వరరావు, కానిస్టేబుల్స్ జి.ప్రభాకర్, సీహెచ్ శ్రీనివాసులు, పి.సాయి ఆనంద్‌లను డీఎస్పీ అభినందించారు. త్వరలో ఎస్పీ చేతుల మీదుగా వారికి రివార్డులు అందిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment