
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్‌లో ఓ రైల్వే కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించాడు. తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో స్విట్జర్లాండ్‌కు చెందిన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమెపై భౌతికంగా దాడి చేయబోయాడు. ఆమెకు కాబోయే భర్త పక్కనే ఉన్నా పట్టించుకోకుండా కానిస్టేబుల్ రెచ్చిపోయాడు.
ఢిల్లీ నుంచి లక్నో వెళ్తున్న తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గవర్నమెంట్ రైల్వే పోలీస్(జీఆర్‌పీ) వెంటనే చర్యలకు ఉపక్రమించింది. అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసింది.
అతిథి అని కూడా చూడకుండా విదేశీ మహిళను వేధించిన ఈ ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ పేరు జితేంద్ర సింగ్. గత ఏడాదిన్నరగా యూపీ ఫిరోజాబాద్‌లోని ఆర్‌పీఎఫ్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు.
చదవండి: బీజేపీ ఎమ్మెల్యే ఇంట్లో రూ.6 కోట్లు సీజ్.. కీలక పదవికి రాజీనామా
Comments
Please login to add a commentAdd a comment