railway constable
-
మెరుపులా వచ్చి కాపాడింది
పశ్చిమబెంగాల్లోని పుర్బ మేదినీపూర్ రైల్వేస్టేషన్లో... ప్లాట్‌ఫామ్‌పై నిల్చున్న ఒక వ్యక్తి ఉన్నట్టుండి పట్టాలపై తలపెట్టి పడుకున్నాడు. అటు నుంచి రైలు వస్తోంది. అవతలి ప్లాట్‌ఫామ్‌పై ఉన్న కె.సుమతి అనే రైల్వే కానిస్టేబుల్ మెరుపు వేగంతో పరుగెత్తుకు వచ్చి అతడిని పట్టాల మీది నుంచి బలవంతంగా లాక్కెళ్లింది. ఏమాత్రం ఆలస్యం అయినా అతడు చనిపోయేవాడు. దీనికి సంబంధించిన సీసీటీవి ఫుటేజిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీ ఎఫ్), ఇండియా ట్విట్టర్లో పోస్ట్ చేస్తే సుమతిపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ‘రైల్వేశాఖ మాత్రమే కాదు యావత్ దేశం గర్వించదగిన మహిళ’ ‘అంకితభావంతో కూడిన విధి నిర్వహణకు మానవత్వం, సాహసం తోడైతే... ఆ పేరు సుమతి’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. గత సంవత్సరం జార్ఖండ్‌లోని టాటానగర్ రైల్వేస్టేషన్లో మహిళా కానిస్టేబుల్ ఎస్కే మీనా ఒక వ్యక్తి రైలుకింద పడకుండా కాపాడిన వీడియో వైరల్ అయింది. -
రైల్వే కానిస్టేబుల్ పాడుపని.. సిట్జర్లాండ్ మహిళలతో అసభ్యంగా..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్‌లో ఓ రైల్వే కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించాడు. తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో స్విట్జర్లాండ్‌కు చెందిన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమెపై భౌతికంగా దాడి చేయబోయాడు. ఆమెకు కాబోయే భర్త పక్కనే ఉన్నా పట్టించుకోకుండా కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. ఢిల్లీ నుంచి లక్నో వెళ్తున్న తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గవర్నమెంట్ రైల్వే పోలీస్(జీఆర్పీ) వెంటనే చర్యలకు ఉపక్రమించింది. అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. అతిథి అని కూడా చూడకుండా విదేశీ మహిళను వేధించిన ఈ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పేరు జితేంద్ర సింగ్. గత ఏడాదిన్నరగా యూపీ ఫిరోజాబాద్‌లోని ఆర్పీఎఫ్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. చదవండి: బీజేపీ ఎమ్మెల్యే ఇంట్లో రూ.6 కోట్లు సీజ్.. కీలక పదవికి రాజీనామా -
‘లాగి’ ఒక్కటిచ్చాడు.. లేదంటే చచ్చేవాడే! షాకింగ్ వీడియో
సాక్షి,ముంబై: అనాలోచితంగానో, హడావిడిలోనో అనుకోని ప్రమాదంలో పడిపోతూ ఉంటారు చాలామంది. దీని వల్ల ఒక్కోసారి ప్రాణాపాయం కూడా సంభవిస్తుంది. అయితే రైల్వే పట్టాలు, రైల్వే క్రాసింగ్‌ల ప్లాట్ఫారంల వద్ద చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నా.. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా నిర్లక్క్ష్య ధోరణి చాలా వరకు కొనసాగుతూనే ఉంది అనడానికి ఉదాహరణ. పట్టాలను దాటుతూ తాత్సారం చేస్తున్న ఒక వ్యక్తికి హెల్ప్ చేసి, సురక్షితంగా పైకి లాగాడు అక్కడున్న ఓ రైల్వే కానిస్టేబుల్. దీంతో లిప్త పాటులో అతనికి ప్రాణా పాయం తప్పింది. ఈ ఉద్వేగంలోనే బాధితుడిని లాగి ఒక్కటిచ్చాడు సదరు పోలీసు.. దీనికి సంబంధించిన వీడియోను ఒకటి ట్విటర్ తెగ షేర్ అవుతోంది. Sometimes you deserve help and a Slap at the same time ! pic.twitter.com/0L3NE3PTc1 — Vijay Gopal (@VijayGopal_) January 14, 2023 -
మహిళను వేధిస్తున్న కానిస్టేబుల్‌కు దేహశుద్ధి
-
మహిళను వేధిస్తూ అడ్డంగా బుక్కైన కానిస్టేబుల్
సాక్షి, ముంబై : మహిళా ప్రయాణీకురాలి పట్ల అమర్యాదకరంగా వ్యవహరించిన కానిస్టేబుల్‌ను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) అధికారులు గురువారం సస్పెండ్ చేశారు. కానిస్టేబుల్ మహిళను అభ్యంతరకరంగా తాకిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానిస్టేబుల్ రాజేష్ జంగిడ్‌ను సస్పెండ్ చేసి అతడిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించామని, దోషిగా తేలితే అతడిపై కఠిన చర్యలు చేపడతామని ఆర్పీఎఫ్ అధికారులు చెప్పారు. ముంబైలోని కళ్యాణ్ రైల్వే స్టేషన్లో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. నిద్రిస్తున్నట్టు నటిస్తూ పక్కనే కూర్చున్న మహిళను కానిస్టేబుల్ అభ్యంతరకరంగా తాకడంతో మరో మహిళ వారించగా మరో ప్రయాణీకుడు, మరికొందరు అతడికి దేహశుద్ధి చేశారు. మహిళల భద్రతపై తాము రాజీపడబోమని, ఈ ఘటనకు సంబంధించి వీడియో ఫుటేజ్‌ను పరిశీలించిన అనంతరం కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసి విచారణ చేపట్టామని ఆర్పీఎఫ్ ముంబై డివిజన్ సెక్యూరిటీ కమిషనర్ సచిన్ భలోడే తెలిపారు. -
ఫిరోజ్‌ఖాన్.. ద హీరో!
భువనేశ్వర్ : ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వందలాది మంది ప్రాణాలను కాపాడడంతోపాటు ఎటువంటి ఆస్తినష్టం జరగకుండా అత్యంత ధైర్యసాహసాలను ప్రదర్శించిన రైల్వే కానిస్టేబుల్ ఫిరోజ్‌ఖాన్‌ను ‘సాహస పురస్కారం’తో సత్కరించాలని ఈస్ట్‌కోస్ట్ రైల్వే సిఫారసు చేసింది. ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న 45 ఏళ్ల ఫిరోజ్ ఖాన్.. ఏప్రిల్ 27 ఉదయం అలెపీ–ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్ ఒడిశాలోని జహర్సగూడా రోడ్‌స్టేషన్ చేరుకోగానే ఎస్–3 కోచ్‌లో కేకలు, అరుపులు వినిపించాయి. వెంటనే ఖాన్ కోచ్‌లోకి వెళ్లి చూడగా ఒక బెర్త్ కింద ఒక మండుతున్న పాలిథిన్ బ్యాగ్ కనిపించింది. వెంటనే దానిని తీసుకుని ఫ్లాట్ ఫాంకు దూరంగా పరుగెత్తాడు. అక్కడకు చేరుకున్న బాంబ్ స్వా్కడ్ పాలిథిన్ బ్యాగ్‌ను తనిఖీ చేయగా అందులో ఆరు రకాల పేలుడు పరికరాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వాటిని నిర్వీర్యం చేయడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అంతటి క్లిష్టపరిస్థితుల్లో సైతం సమయస్ఫూర్తితో, ధైర్యంగా వ్యవహరించిన తీరుకు ఫిరోజ్ ఖాన్‌కు గ్యాలంటరీ అవార్డు ఇచ్చి సత్కరించాలని కోరుతూ ఈస్ట్‌కోస్ట్ రైల్వే అధికారులు రైల్వే బోర్డుకు లేఖ రాశారు. -
సిమ్ కార్డు ఆధారంగా నిందితుడి అరెస్టు
సాక్షి, ముంబై: సెంట్రల్ రైల్వే మార్గంలో రాయి విసిరిన ఘటనలో ఓ మహిళా ప్రయాణికురాలి ప్రాణాలు పోవడానికి కారుడైన నిందితున్ని సిమ్ కార్డు ఆధారంగా పోలీసులు అరెస్టు చేశారు. వారం రోజుల కిందట రాత్రి విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరిన దర్శనా పవార్ (29) అనే మహిళ సీఎస్టీలో లోకల్ రైలు ఎక్కింది. రద్దీ కారణంగా డోరు దగ్గర నిలబడింది. రైలు అంబర్నాథ్ స్టేషన్ దాటిన తరువాత ఓ ఆగంతకుడు విసిరిన రాయి ఆమె ముఖానికి తగలడంతో కిందపడింది. తోటి ప్రయాణికులు కల్యాణ్ స్టేషన్లో రైల్వే పోలీసులకు ఫిర్యాదుచేసి మరో రైలులో సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితురాలిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. కాగా, కల్యాణ్ నుంచి వచ్చిన రైల్వే కానిస్టేబుల్ నిబంధన ప్రకారం ఆమెను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాలని పట్టుబట్టాడు. చివరకు ముంబైలోని కేం ఆస్పత్రికి తరలించారు. కాని ఆలస్యం కారణంగా ఆమె మరణించిన సంగతి తెలిసిందే. కాగా సంఘటన స్థలంవద్ద ఆమె ఒంటిపై నగలు, బ్యాగులో సెల్‌ఫోన్, ఇతర విలువైన వస్తువులు కనిపించలేదు. దీంతో చోరీ కోసం ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్శనా సిమ్ కార్డు ఆధారంగా ఫోన్ నాసిక్‌లోని వర్ణి గ్రామంలో ఉన్నట్లు గుర్తించారు. గ్రామంలో ఫోన్ వినియోగిస్తున్న రతన్ మర్వాడి అనే యువకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరువాత తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించాడు. గతంలో ఇలాగే విరార్ పరిసరాల్లో రాయి విసిరి ఓ ప్రయాణికున్ని కిందపడగొట్టాడు. అతన్ని దోచుకున్నందుకు జైలు శిక్ష కూడా అనుభవించినట్లు పోలీసులు వెల్లడించారు. -
మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన రైల్వే కానిస్టేబుల్
న్యూఢిల్లీ : రైలులో 22 ఏళ్ల మహిళా ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన రైల్వే పోలీసును (ఆర్పీఎఫ్) శుక్రవారం ఉదయం అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ముస్సోరి ఎక్స్‌ప్రెస్‌లో డెహరడూన్ నుంచి ఢిల్లీ వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ విషయాన్ని బాధితురాలు ఢిల్లీకి వచ్చిన తర్వాత పాత ఢిల్లీలోని రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మహిళా కోచ్‌లో నిందితుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు పేర్కొంది. యూపీలోని అమ్రోహ జిల్లాలోని గజరౌవులా రైల్వే స్టేషన్ నుంచి రైలు ఉదయం 5గంటలకు బయలుదేరింది. ఢిల్లీ రాగానే సహ ప్రయాణికుల చొరవతో అలారమ్ మోగించింది. సుమారు 8.20 గంటలకు పీసీఆర్ కాల్ ద్వారా పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ఆర్పీఎఫ్కు చెందిన రాజ్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పట్టపగలు మహిళ దారుణ హత్య
మృతురాలు రైల్వే కానిస్టేబుల్ భార్య బంగారు నగలతో ఉడాయింపు కోలారు : ఇంటిలో ఒంటరిగా ఉన్న వివాహితను దుండగుడు పట్టపగలు దారుణంగా హత్యచేసిన సంఘటన బంగారుపేట పట్టణంలోని అమరావతి కాలనీలో సోమవారం సంచల నం సృష్టించింది. హత్యకు గురైన యువతి రైల్వే కానిస్టేబుల్ భార్య మంజుల (23) కావడం గమనార్హం. వివరాలు... ఉదయం తన ఇద్దరు పిల్లలు పాఠశాలకు, భర్త అశోక్ విధులకు వెళ్లిపోగా మంజుల ఒంటరిగా ఉంది. మధ్యాహ్నం 12 ప్రాంతంలో ఇంటిలోకి ప్రవేశించిన దుండగుడు మంజులపై దాడికి దిగి బ్లేడుతో గొంతు కోసి హతమార్చాడు. సంఘటన స్థలంలో సుత్తి కూడా పడి ఉండటంతో అతి దారుణంగా సుత్తితో మోదిన ఆనవాళ్లు కనిపించాయి. అనంతరం బీరువాలో ఉన్న నగదుతో ఉడాయించాడు. ఇదే సమయంలో నిందితుడు ఎటువంటి భయం కనిపించకుండా సంఘటన అనంతరం కొద్ది దూరం నడుచుకుంటూ వచ్చాడు. అతడి చేతికి రక్తం అంటి ఉండటంతో ఓ వ్యక్తి ప్రశ్నించడంతో వాహనంపై నుంచి కిందపడ్డానని చెప్పి తప్పించుకున్నాడు. కొద్దిసేపు అనంతరం భర్త అశోక్ ఇంటికి వచ్చి చూడగా భార్య రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కేజీఎఫ్ ఎస్పీ భగవాన్‌దాస్, డీఎస్పీ వివేకానంద, సీఐ వెంకటాచలపతి, ఎస్ఐ రవికుమార్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసు జాగిలాలతో ఆధారాలు సేకరించారు. వేలిముద్రల నిపుణులు కూడా రంగంలోకి దిగారు. అశోక్ ఫిర్యాదు మేరకు బంగారుపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందం ఏర్పాటు హంతుకుడి ఆచూకీ కోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ భగవాన్ దాస్ తెలిపారు. హంతుకుడి చేతికి కూడా గాయం అయిందని, హత్య చేసిన అనంతరం నిందితుడు కిలోమీటరు పైగా నడుచుకునే వెళ్లాడని పోలీసులు ఆధారాలు సేకరించారని, త్వరలో పట్టుకుంటామని ఎస్పీ చెప్పారు. -
విద్యార్ధినిపై ఖాకీ అత్యాచారయత్నం