పశ్చిమబెంగాల్‌లోని పుర్బ మేదినీపూర్ రైల్వేస్టేషన్‌లో... ప్లాట్‌ఫామ్‌పై నిల్చున్న ఒక వ్యక్తి ఉన్నట్టుండి పట్టాలపై తలపెట్టి పడుకున్నాడు. అటు నుంచి రైలు వస్తోంది. అవతలి ప్లాట్‌ఫామ్‌పై ఉన్న కె.సుమతి అనే రైల్వే కానిస్టేబుల్ మెరుపు వేగంతో పరుగెత్తుకు వచ్చి అతడిని పట్టాల మీది నుంచి బలవంతంగా లాక్కెళ్లింది. ఏమాత్రం ఆలస్యం అయినా అతడు చనిపోయేవాడు.
దీనికి సంబంధించిన సీసీటీవి ఫుటేజిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీ ఎఫ్), ఇండియా ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తే సుమతిపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ‘రైల్వేశాఖ మాత్రమే కాదు యావత్ దేశం గర్వించదగిన మహిళ’ ‘అంకితభావంతో కూడిన విధి నిర్వహణకు మానవత్వం, సాహసం తోడైతే... ఆ పేరు సుమతి’... ఇలాంటి కామెంట్స్ ఎన్నో నెటిజనుల నుంచి వచ్చాయి. గత సంవత్సరం జార్ఖండ్‌లోని టాటానగర్ రైల్వేస్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్ ఎస్‌కే మీనా ఒక వ్యక్తి రైలుకింద పడకుండా కాపాడిన వీడియో వైరల్ అయింది.
Comments
Please login to add a commentAdd a comment