న్యూఢిల్లీ : రైలులో 22 ఏళ్ల మహిళా ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన రైల్వే పోలీసును (ఆర్‌పీఎఫ్) శుక్రవారం ఉదయం అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ముస్సోరి ఎక్స్‌ప్రెస్‌లో డెహరడూన్ నుంచి ఢిల్లీ వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ విషయాన్ని బాధితురాలు ఢిల్లీకి వచ్చిన తర్వాత పాత ఢిల్లీలోని రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మహిళా కోచ్‌లో నిందితుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు పేర్కొంది. యూపీలోని అమ్రోహ జిల్లాలోని గజరౌవులా రైల్వే స్టేషన్ నుంచి రైలు ఉదయం 5గంటలకు బయలుదేరింది. ఢిల్లీ రాగానే సహ ప్రయాణికుల చొరవతో అలారమ్ మోగించింది. సుమారు 8.20 గంటలకు పీసీఆర్ కాల్ ద్వారా పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ఆర్‌పీఎఫ్‌కు చెందిన రాజ్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.