nonsensical behavior
-
విధుల్లోంచి ఉపాధ్యాయుడి తొలగింపు
కురవి : పదో తరగతి విద్యార్థినుల పట్ల అసభ్యంగా వ్యవహరించిన స్థానిక ఏకలవ్య బాలికల గురుకుల విద్యాలయం ఉపాధ్యాయుడు వికాస్‌ను విధుల నుంచి తొలగించినట్లు మహబూబాబాద్ డీటీడబ్ల్యూఓ రామ్మూర్తి, ఏటీడబ్ల్యూ రమాదేవి, ఎంఈవో లచ్చిరాం తెలిపారు. ‘గురురూప రాక్షసుడు’ శీర్షికన శనివారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు. ఈమేరకు శనివారం పాఠశాలకు చేరుకుని బా ధిత బాలికల నుంచి వివరాలు సేకరించారు. ఉపాధ్యాయు డు వికాస్తోనూ అధికారులు మాట్లాడారు. అరుుతే, తాను పాఠాలు బోధించడంలో కటువుగా ఉండడంతోనే బాలికలు తనపై నిందలు వేస్తున్నారని ఉపాధ్యాయుడు తెలిపారు. తా ను ఎలాంటి తప్పుచేయలేదన్నారు. అధికారులు మాట్లాడు తూ, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని విధుల్లోంచి తొలగించామన్నారు. సంఘటనపై విచారణ కొనసాగిస్తామని తెలిపారు. ప్రిన్సిపాల్ రమేష్‌రెడ్డి, మేట్రిన్ శోభారాణి పాల్గొన్నారు. కాగా, శుక్రవారం రాత్రే సీఐ కరుణాకర్‌రెడ్డి గురుకులంలో విచారణ చేపట్టారు. విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని బాలికలతో చెప్పారు. -
మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన రైల్వే కానిస్టేబుల్
న్యూఢిల్లీ : రైలులో 22 ఏళ్ల మహిళా ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన రైల్వే పోలీసును (ఆర్పీఎఫ్) శుక్రవారం ఉదయం అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ముస్సోరి ఎక్స్‌ప్రెస్‌లో డెహరడూన్ నుంచి ఢిల్లీ వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ విషయాన్ని బాధితురాలు ఢిల్లీకి వచ్చిన తర్వాత పాత ఢిల్లీలోని రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మహిళా కోచ్‌లో నిందితుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు పేర్కొంది. యూపీలోని అమ్రోహ జిల్లాలోని గజరౌవులా రైల్వే స్టేషన్ నుంచి రైలు ఉదయం 5గంటలకు బయలుదేరింది. ఢిల్లీ రాగానే సహ ప్రయాణికుల చొరవతో అలారమ్ మోగించింది. సుమారు 8.20 గంటలకు పీసీఆర్ కాల్ ద్వారా పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు ఆర్పీఎఫ్కు చెందిన రాజ్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బావ అసభ్యంగా ప్రవర్తించాడని మరదలి ఆత్మహత్య
ఐ.పోలవరం :బావ అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మరదలు గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మురమళ్ల రాఘవేంద్ర వారధి వద్ద మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ముమ్మిడివరం మండలం గాడిలంకకు చెందిన కాశి జ్యోతి (25) రాఘవేంద్ర వారధిపై నుంచి గోదావరిలోకి దూకింది. ఆ సమయంలో వారధిపై వెళుతున్న ప్రయాణికులు ఆమెను గమనించి స్థానికులకు తెలియజేశారు. స్థానికులు హుటాహుటిన గోదావరిలో వెతకడం మొదలు పెట్టారు. అయినా లాభం లేకపోయింది. వారధికి అర కిలోమీటరు దూరంలో జ్యోతి శవమై తేలింది. ఐ.పోలవరం పోలీసులు, జ్యోతి భర్త కాశీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... కాశీకృష్ణ అమలాపురంలో ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం డ్యూటీకి వెళ్లగా అతనికి భార్య జ్యోతి నుంచి సోమవారం సాయంత్రం ఫోన్ వచ్చింది. ముమ్మిడివరంలో ఉంటున్న బావ శ్రీనివాసరావు ఇంటికి వచ్చి అసభ్యంగా తనతో ప్రవర్తించాడని తెలిపింది. కంగారు పడకు ఉదయం ముమ్మిడివరం వెళ్లి తేల్చుకుందామని కాశీకృష్ణ ధైర్యం చెప్పాడు. మంగళవారం ఉదయం ఇద్దరూ ముమ్మిడివరంలోని శ్రీనివాసరావు ఇంటికి వెళ్లారు. అయితే అతను అక్కడ లేకపోవడంతో ఫోను చేయగా గంటలో వస్తానని చెప్పాడు. ఎంతసేపటికీ రాకపోవడంతో బయటకు వెళ్లి వస్తానని జ్యోతికి చెప్పి కాశీకృష్ణ వెళ్లాడు. అక్క ప్రమీల ఇంటి దగ్గర ఉండడం ఇష్టం లేక జ్యోతి తనకు ఫోన్‌చేసి గాడిలంక వెళ్తున్నానని చెప్పిందని, ఆమె ముమ్మిడివరం నుంచి ఆటో ఎక్కి మురమళ్ల మాణిక్యాంబ ఆలయం వద్ద దిగి వారధిపై నదిలోకి దూకేసిందని కాశీకృష్ణ సంఘటనా స్థలంలో చెబుతూ బోరున విలపిస్తూ చెప్పాడు. జ్యోతి మృతదేహాన్ని ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాశీకృష్ణ ఫిర్యాదు మేరకు ఐ.పోలవరం హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.