విధుల్లోంచి ఉపాధ్యాయుడి తొలగింపు | On duty the teacher's removal | Sakshi
Sakshi News home page

విధుల్లోంచి ఉపాధ్యాయుడి తొలగింపు

Published Sun, Sep 27 2015 4:36 AM | Last Updated on Sun, Sep 3 2017 10:01 AM

On duty the teacher's removal

కురవి : పదో తరగతి విద్యార్థినుల పట్ల అసభ్యంగా వ్యవహరించిన స్థానిక ఏకలవ్య బాలికల గురుకుల విద్యాలయం ఉపాధ్యాయుడు వికాస్‌ను విధుల నుంచి తొలగించినట్లు మహబూబాబాద్ డీటీడబ్ల్యూఓ రామ్మూర్తి, ఏటీడబ్ల్యూ రమాదేవి, ఎంఈవో లచ్చిరాం తెలిపారు. ‘గురురూప రాక్షసుడు’ శీర్షికన శనివారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు. ఈమేరకు శనివారం పాఠశాలకు చేరుకుని బా ధిత బాలికల నుంచి వివరాలు సేకరించారు.

ఉపాధ్యాయు డు వికాస్‌తోనూ అధికారులు మాట్లాడారు. అరుుతే, తాను పాఠాలు బోధించడంలో కటువుగా ఉండడంతోనే బాలికలు తనపై నిందలు వేస్తున్నారని ఉపాధ్యాయుడు తెలిపారు. తా ను ఎలాంటి తప్పుచేయలేదన్నారు. అధికారులు మాట్లాడు తూ, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని విధుల్లోంచి తొలగించామన్నారు. సంఘటనపై విచారణ కొనసాగిస్తామని తెలిపారు. ప్రిన్సిపాల్ రమేష్‌రెడ్డి, మేట్రిన్ శోభారాణి పాల్గొన్నారు. కాగా, శుక్రవారం రాత్రే సీఐ కరుణాకర్‌రెడ్డి గురుకులంలో విచారణ చేపట్టారు. విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని బాలికలతో చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement