
లక్నో: యూపీలోని లక్నోలో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. గత ఆగస్టులో ఇద్దరు ఆర్‌పీఎఫ్ పోలీసులను రైలు నుంచి తోసి, హత్య చేసిన కేసులో నిందితునిగా ఉన్న జాహిద్ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఇతనిపై పోలీసులు రూ. రూ.లక్ష రివార్డు ప్రకటించారు. నిందితుడు జాహిద్ మద్యాన్ని రైలులో అక్రమంగా రవాణా చేస్తుండగా, ఇద్దరు ఆర్‌పీఎఫ్ జవానులు అడ్డుకున్నారు. అయితే నిందితుడు జాహిద్ వారిని రైలు నుంచి తోసివేశాడు. ఈ ఘటనలో వారిద్దరూ మృతి చెందారు.
వివరాల్లోకి వెళితే గత నెల ఆగస్టు 19న రాత్రి బార్మర్ గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో జావేద్ ఖాన్, ప్రమోద్ కుమార్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లను నిందితుడు జాహిద్ రైలు నుంచి కిందకు నెట్టివేశాడు. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో పోలీసులు నిందితుడు జాహిద్‌ను ఎన్‌కౌంటర్ చేశారు.
ఘాజీపూర్‌లోని దిల్దార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గాయపడిన స్థితిలో నిందితుడు జాహిద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతను చనిపోయినట్లు ప్రకటించారు. నిందితుడు పట్నాలోని మన్సూర్ గాలి పెదిమా బజార్‌కు చెందినవాడు. నిందితునిపై గతంలో కిడ్నాప్, దాడి, మద్యం స్మగ్లింగ్ తదితర కేసులు నమోదయ్యాయి.
STF यूनिट नोएडा कोतवाली गहमर व GRP दिलदारनगर पुलिस की संयुक्त टीम द्वारा आरपीएफ जवानों की हत्या में शामिल 100000/- रुपये के इनामिया बदमाश के साथ थाना दिलदारनगर क्षेत्रान्तर्गत हुई मुठभेड़ के संबंध में #spgzr महोदय की बाइट(1)@Uppolice @IgRangeVaranasi @adgzonevaranasi pic.twitter.com/lCHVw8Z1In
— Ghazipur Police (@ghazipurpolice) September 23, 2024
ఇది కూడా చదవండి: మహాబోధి ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. పలువురు ప్రయాణికులకు గాయాలు