న్యూఢిల్లీ: పర్యాటకుల కోసం రైల్వేలో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయనున్నారు. 24 స్టేషన్లలో వీటిని ప్రవేశపెట్టనున్నారు. రైల్వే భద్రతా దళం(ఆర్పీఎఫ్) ఆధ్వర్యంలో ఇవి నిర్విరామంగా పనిచేస్తాయి. వీటి ద్వారా సంబంధిత ప్రదేశాల సమగ్ర సమాచారాన్ని పొందవచ్చు. పోలీసుల సహకారంతో ఇవి పనిచేస్తాయి. మధ్యవర్తుల మోసాలకు చెక్ పెట్టే యోచనలో వీటిని ఏర్పాటు చేయనున్నారు.
మొదటి దశలో భాగంగా అమృత్‌సర్, తిరువనంతపురం, గయా, రాయ్‌బరేలీ, ఆగ్రాలో వీటిని అందుబాటులోకి తేనున్నారు. తర్వాతి దశలో హరిద్వార్, వారణాసి, అయోధ్య, అలహాబాద్, ద్వారక, హౌరా, కామాఖ్య, తిరుపతి నగరాల్లో ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం 2,500 రైళ్లలో దాదాపు 60 వేల మంది ఆర్పీఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. త్వరలోనే దీనిని 3 వేల రైళ్లకు పెంచనున్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రయాణికులకు ఆర్పీఎఫ్ దళాలు మరింత భద్రతనిస్తాయి. వీటితో పాటు రైల్వే ఆస్తులకు రక్షణనివ్వాల్సి ఉంటుంది.
రైళ్లలో పర్యాటకుల కోసం హెల్ప్ డెస్క్‌లు
Published Fri, Oct 7 2016 1:30 PM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM
Advertisement