Help Desk
-
తిరుపతి, రేణిగుంట రైల్వే స్టేషన్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు
-
ఏపీ లో రైల్వే శాఖ హెల్ప్ డెస్క్ ఏర్పాటు
-
జాగు చేయక.. బాగు చేసేలా..
జాతీయ స్థాయి టోల్‌ఫ్రీ నం: 18002021989 హెల్ప్‌లైన్ నం:14566 రాష్ట్రస్థాయి హెల్ప్‌లైన్ నం: 040–23450923 సాక్షి, హైదరాబాద్: దళితులు, గిరిజనులపై అత్యాచారాల (అట్రాసిటీస్) నిరోధక చట్టం అమలును కేంద్ర ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. క్షేత్రస్థాయిలో ఈ చట్టం అమలులో తీవ్ర జాప్యం జరుగుతోందని, బాధితులకు పరిహారం అందించడంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలకు చెక్ పెట్టేందుకు నడుం బిగించింది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన హెల్ప్‌డెస్క్‌ను ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. ఎస్సీ, ఎస్టీలపై దాడులు, అఘాయిత్యాలను అరికట్టడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్న కేంద్ర ప్రభుత్వం.. ప్రత్యేకంగా వెబ్‌పోర్టల్‌తో పాటు ప్రతి రాష్ట్రంలో ఒక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఒకట్రెండు రోజుల్లోనే దేశవ్యాప్తంగా అన్ని కాల్సెంటర్లను ప్రారంభించేందుకు ఆ శాఖ కసరత్తు వేగవంతం చేసింది. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల విషయంలో ఆయా వర్గాల్లో అవగాహన కల్పించేలా మరింత ప్రచారం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ హెల్ప్‌డెస్క్ ప్రారంభించిన ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా 4,776 మంది యూజర్లు రిజిస్ట్రేషన్ చేసుకోగా... 295 మంది వినతులు సమర్పించారు. ఇందులో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రం నుంచి 27 వినతులు (గ్రీవెన్స్) నమోదు అయ్యాయి. ఫిర్యాదుల నమోదు ఇలా... హెల్ప్‌డెస్క్‌లో ఫిర్యాదులను అత్యంత సులభంగా సమర్పించవచ్చు. ముందుగా https://nhapoa.gov.in/ లింకు ద్వారా అత్యాచారాల నిరోధానికి జాతీయ సహాయ కేంద్రం (నేషనల్ హెల్ప్‌డెస్క్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్) పేజీ తెరవాలి. అనంతరం రిజిస్టర్ యువర్ గ్రీవెన్స్ ఆప్షన్‌ను ఎంచుకుని బాధితుడి వివరాలతో పాటు ఎఫ్ఐఆర్ తదితర పూర్తి సమాచారాన్ని అందులో నమోదు చేయాలి. ఈ ప్రక్రియ మొత్తంగా ఏడు దశల్లో జరుగుతుంది. అనంతరం బాధితుడి ధ్రువీకరణతో ఫిర్యాదు సమర్పణ పూర్తవుతుంది. వినతుల నమోదు తర్వాత వెబ్‌పోర్టల్ ద్వారా సంబంధిత అధికారులకు క్షణాల్లో వినతులు/ఫిర్యాదుల చిట్టా మొత్తం చేరుతుంది. అక్కడ పరిశీలన పూర్తి చేసిన తర్వాత అంచెలంచెలుగా అందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు. నిర్దేశించిన గడువులోగా పరిష్కరించి కేంద్ర అధికారులకు రాష్ట్ర అధికారులు యాక్షన్ టేకెన్ రిపోర్టు (చేపట్టిన చర్యలతో నివేదిక) సమర్పించాల్సి ఉంటుంది. వినతులు, ఫిర్యాదుల నమోదులో కేవలం బాధితులే కాకుండా అట్రాసిటీ చట్టాల అమలుపై పనిచేస్తున్న స్వచ్ఛంధ సంస్థలు కూడా భాగస్వాములు కావొచ్చు. వెబ్‌పోర్టల్ ద్వారానే కాకుండా జాతీయ స్థాయి టోల్‌ఫ్రీ నంబర్, హెల్ప్‌లైన్ నంబర్లలో కూడా సంప్రదించవచ్చు. ఇక రాష్ట్ర స్థాయిలో నోడల్ అధికారులకు కూడా ఫిర్యాదులు పంపవచ్చు. రాష్ట్రంలో secyscdts@gmail.com ద్వారా మెయిల్ పంపడంతో పాటు 040–23450923 ఫోన్ నంబర్‌కు ఫోన్ చేసి వినతులు చెప్పుకోవచ్చు. కేంద్రం, రాష్ట్రాల భాగస్వామ్యం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల అమలు కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్, వెబ్‌పోర్టల్, కాల్ సెంటర్ల నిర్వహణలో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధ్యత వహిస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50ః50 చొప్పున నిధులు ఖర్చు చేస్తాయి. కేంద్ర పాలిత ప్రాంతాలకు మాత్రం వందశాతం నిధులను కేంద్రమే భరిస్తుంది. ఎస్సీ, ఎస్టీ ప్రొటెక్షన్ సెల్స్, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, పూర్తిస్థాయి ప్రత్యేక కోర్టులు (ఎక్స్‌క్లూజివ్ స్పెషల్ కోర్ట్స్), స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, పూర్తిస్థాయి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తదితర కేటగిరీల్లో ఖర్చు చేయాలి. బాధితులకు న్యాయ సహాయం, పరిహారం కింద ఇచ్చే మొత్తాన్ని ఈ నిధుల కింద ఖర్చు చేయకూడదు. -
వాట్సాప్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్
సాక్షి, వెబ్‌డెస్క్ : వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్‌ను మరింత సులభతరం చేసింది కేంద్రం. దీని ప్రకారం ఇకపై వ్యాక్సిన్ స్టాట్ బుకింగ్ కోసం కోవిన్ యాప్, వెబ్పోర్టల్లకు వెళ్లాల్సిన పని లేదు. థర్డ్ పార్టీ యాప్‌లను వినియోగించాల్సిన అవసరం లేదు. వాట్సాప్ ద్వారానే ఈ పనిని సుళువుగా చేసేయొచ్చు. ఎక్కువ మందికి చేరువగా స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరి ఫోన్లో వాట్సాప్ కామన్‌గా మారింది. ఎంట్రీ లెవల్ ఫోన్లలోనూ వాట్సాప్ ఉంటోంది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల ప్రజలు సైతం వాట్సాప్‌ను వినియోగడంలో పట్టు పెంచుకున్నారు. దీంతో వాట్సాప్ ద్వారా వాక్సిన్ స్లాట్ బుకింగ్‌కు కేంద్రం అవకాశం కల్పించింది. వాట్సాప్ అయితేనే వాట్సాప్ ద్వారా కరోనా హెల్ప్ డెస్క్‌ని ఈ ఏడాది మార్చిలో కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల ప్రారంభం నుంచి వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్‌లోడ్‌కి అవకాశం కల్పించింది. ఇప్పటికే ఈ హెల్ప్‌డెస్క్ నుంచి 31 లక్షల మంది వ్యాక్సిన్ సర్టిఫికేట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఇతర ఆప్షన్ల కంటే వాట్సాప్ ద్వారా ఎక్కువ మంది అత్యంత వేగంగా వ్యాక్సిన్ సర్టిఫికేట్టు డౌన్లోడ్ చేసుకున్నట్టు కేంద్రం గుర్తించింది. దీంతో వాట్సాప్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్‌కి అవకాశం కల్పించింది. 9013151515 వాట్సాప్ ద్వారా వ్యాక్సిన్ బుకింగ్ చేసుకోవడానికి మైగవ్ కరోనా హెల్ప్ డెస్క్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ పద్దతులు పాటించాలి. - మీ మొబైల్ నంబరులో 9013151515 నంబరు సేవ్ చేసుకోవాలి. ఇదే నంబరుకు బుక్ స్లాట్ అని ఇంగ్లిష్‌లో టైప్ చేసి మెసేజ్ పంపాలి. - ఆరు అంకెల ఓటీపీ నంబరు మీ మొబైల్‌కి వస్తుంది. మూడు నిమిషాల్లోగా ఓటీపీ నంబర్ ఎంటర్ చేయాలి - ఆ నంబరు ఆధారంగా ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాలను బట్టి మనకు వివిధ ఆప్షన్లు వస్తాయి. అందులో మొదటి డోసు ఎప్పుడు ఇచ్చారు, రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి అనే విషయాలు ఉంటాయి - హెల్ప్ డెస్క్ మెనూలో కుటుంబ సభ్యుల్లో ఎవరి పైరునైనా చేర్చాలా , దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ సెంటర్ వివరాలు ఇలా వివిధ ఆప్షన్లకు 1, 2 ,3 ఇలా 8 వరకు నంబర్లు కేటాయించారు. మన అవసరానికి తగ్గట్టు నంబరును రిప్లై ఇస్తే దానికి తగ్గట్టుగా ఆప్షన్లు వస్తాయి. - ఈ హెల్ప్‌లైన్ డెస్క్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవడంతో పాటు కరోనాకు సంబంధించి ఇతర సమాచారాన్ని కూడా తెలుసుకునే వీలుంది. చదవండి: IKEA : కొత్తగా సిటీ స్టోర్లు.. ప్రైస్‌వార్‌కి రెడీ -
అఫ్ఘాన్‌లో చిక్కుకున్న తెలుగువారి కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్
-
అఫ్గాన్‌లో చిక్కుకున్న తెలుగువారి కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్
సాక్షి,అమరావతి: అఫ్గానిస్తాన్ లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారి కోసం కార్మికశాఖలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను ఏపీ సర్కార్ ఏర్పాటు చేసింది. అఫ్ఘాన్‌లో చిక్కుకున్న తెలుగు వారు 0866-2436314, 7780339884, 9492555089 హెల్ప్ డెస్క్ నంబర్లకు ఫోన్ చేసి వివరాలను తెలుపవచ్చని కార్మిక శాఖ పేర్కొంది. అఫ్గానిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయులు, అఫ్గానీల కోసం భారత ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. అవసరమైన వారు ఈ నెంబర్లకు సంప్రదించడం ద్వారా భారత ప్రభుత్వం నుంచి సహాయం పొందవచ్చు. ఇప్పటికే ఆఫ్గనీలకు ప్రత్యేక వీసాలను జారీ చేసేందుకు కేంద్రం అంగీకరించింది. వాట్సాప్: +91 8010611290 ; +91 9599321199 ; +91 7042049944 ఫోన్: +91 11 4901 6783 ; +91 11 4901 6784 ; +91 11 49016785 ఇ-మెయిల్: SituationRoom@mea.gov.in చదవండి: MK Stalin: 68 ఏళ్ల వయసులో ఔరా అనిపిస్తున్నారు, వీడియో వైరల్ -
హిజ్రాలకు ఐటీ కంపెనీల్లో కొలువులు
సాక్షి, సిటీబ్యూరో: హిజ్రా కమ్యూనిటీలో జరుగుతున్న నేరాలను నియంత్రించడంతో పాటు అవసరమైన సందర్భాల్లో వారికి పోలీసుల నుంచి చేయూతనందించే దిశగా సైబరాబాద్ పోలీసులు అడుగులు వేస్తున్నారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సహకారంతో గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో ‘ట్రాన్స్‌జెండర్ హెల్ప్‌డెస్క్’ను పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ శనివారం ప్రారంభించనున్నారు. దీనిద్వారా ముఖ్యంగా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలో తరచూ జరుగుతున్న ఘర్షణలు, రెండు వర్గాల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించడంతో పాటు హిజ్రాలను ఎవరైనా వేధించిన సందర్భంలో పోలీసుల నుంచి సహాయం కోసం ఈ హెల్ప్‌డెస్క్ మార్గదర్శనం చేయనుంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తొలిసారిగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోనే ట్రాన్స్‌జెండర్ హెల్ప్‌డెస్క్ ప్రారంభిస్తుండడం విశేషం. ఎవరెవరు ఉంటారంటే... గచ్చిబౌలి ఠాణాలోని ట్రాన్స్‌జెండర్ హెల్ప్ డెస్క్‌లో ఇద్దరు సిబ్బంది పనిచేస్తున్నారు. ఎస్సీఎస్సీ నియమించిన ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ కో–ఆర్డినేటర్ (హిజ్రా)తో పాటు పోలీసు విభాగం నుంచి ఓ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తారు. వీరు హిజ్రాల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌ను స్వీకరించి ఏదైనా ఆపదలో ఉంటే మార్గదర్శనం చేస్తారు. ఇతర సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కారం కోసం పోలీసులను ఎలా సంప్రదించాలనే దానిపై సూచనలు చేస్తారు. ఏదైనా అత్యవసరమైతే సంబంధిత ఠాణా అధికారులను అప్రమత్తం చేసి వారి వద్దకు చేరుకొని సంరక్షించేలా చూస్తారు. అయితే చాలా మంది హిజ్రాలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటూ..పోలీసులను ఎలా సంప్రదించాలో తెలియక తికమకపడతారు. ఒకవేళ వెళ్లినా ఆ ఫిర్యాదును పట్టించుకోరనే ఉన్న అపోహను తొలగించేలా ఈ హెల్ప్‌డెస్క్ పనిచేయనుంది. ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు... హైదరాబాద్‌లో దాదాపు ఎనిమిదివేల మంది వరకు హిజ్రాలు ఉన్నారు. వీరిలో బాగా చదువుకున్న వాళ్లూ ఉన్నారు. విద్యావంతులైన వారు కొందరు వారికి ఆసక్తి ఉన్న రంగంలో ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే హిజ్రాలకున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు వారిలో బాగా చదువుకున్నవారికి ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించేందుకు ఎస్సీఎస్సీ చేయూతతో ‘హెల్ప్‌డెస్క్’ పనిచేయనుంది. ఇప్పటికే హిజ్రాలకు ఉద్యోగాలిచ్చేందుకు రెండు ఐటీ కంపెనీలు ముందుకువచ్చాయని అధికారులు పేర్కొంటున్నారు. ఏఏ సమస్యలంటే... కొందరు హిజ్రాలు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద యాచిస్తున్నారు. వాహనాలు ఆపి మరీ బలవంతంగా పైసలు వసూలు చేస్తున్నారు. షాపుల వద్దకు వెళ్లి డబ్బులు అడుగుతున్నారు. వీరిలో కొందరు నకిలీ హిజ్రాలు సైతం ఉంటున్నారు. కొందరు వ్యభిచార వృత్తిలో కూడా కొనసాగుతున్నారు. ఆయా సందర్భాల్లో గొడవలు జరిగి నేరాలు పెరుగుతున్నాయి. వీటికి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో ట్రాన్స్‌జెండర్ హెల్ప్‌డెస్క్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. హిజ్రాల్లో కొంతమందినైనా మార్చగలిగితే నేరాలు నియంత్రణలోకి వస్తాయని సైబరాబాద్ పోలీసు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. చదవండి: ఈ సిక్స్ ప్యాక్ బ్యాండ్ గురించి తెలుసా? -
డిసెంబర్ 10 నాటికి ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో హెల్ప్ డెస్క్‌లు
సాక్షి, అమరావతి : వచ్చే నెల 10వ తేదీ నాటికి ఆరోగ్య శ్రీ ఆస్పత్రులన్నింటిలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య శ్రీ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా హెల్ప్ డెస్క్‌లు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వివిధ అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో డిసెంబర్ 10 నాటికి ఆరోగ్య మిత్రలతో హెల్ప్ డెస్క్‌లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆరోగ్య మిత్రలకు శిక్షణ కార్యక్రమం కూడా ముగించాలని చెప్పారు. హెల్ప్ డెస్కులలో ఆరోగ్యమిత్రలు ఏం చేయాలన్న దానిపై ఒక నిర్దిష్ట ఎస్ఓపీ ఖరారు చేయాలని సూచించారు. ‘హెల్్ప డెస్క్‌లలో ఎందుకు కూర్చున్నాము? ఏం చేయాలి? తనపై సీసీ కెమెరా నిఘా ఎందుకు ఉంది? తాను రోగులకు ఏ రకంగా సహాయం చేయాలి?’ అన్న దానిపై ఆరోగ్యమిత్రలకు స్పష్టమైన అవగాహన ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్య ఆసరా ఎలా అమలవుతోందన్నది జేసీలు చూడాలన్నారు. అస్పత్రులలో 9,800 పోస్టులు మంజూరు చేశామని, వాటిలో జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో 7,700 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా, ఇప్పటికే 5,797 పోస్టులు భర్తీ అయ్యాయన్నారు. మిగిలిన పోస్టులు కూడా త్వరగా భర్తీ చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. 25న జగనన్న తోడు - జగనన్న తోడు పథకం నవంబర్ 25న ప్రారంభం అవుతుంది. వీధుల్లో చిరు వ్యాపారులకు ఐడీ కార్డులు ఇవ్వడంతో పాటు, వారికి వడ్డీ లేకుండా రూ.10 వేల రుణం ఇస్తాం. వడ్డీని ప్రభుత్వం బ్యాంకులకు కడుతుంది. - ఈ పథకంలో ఇప్పటి వరకు 6.29 లక్షల దరఖాస్తులకు బ్యాంకులు టైఅప్ అయ్యాయి. మిగిలిన దరఖాస్తులను కూడా వెంటనే బ్యాంకులకు పంపాలి. ఈ నెల 24వ తేదీలోగా బ్యాంకులతో లబ్ధిదారులను అనుసంధానం చేసే కార్యక్రమాన్ని కలెక్టర్లు పూర్తి చేయాలి. జాతీయ ఉపాథి హామీ పనులు - జాతీయ ఉపాథి హామీ పనులు బాగా జరుగుతున్నాయి. ఇంకా కొన్నింటిపై ఫోకస్ పెట్టాల్సి ఉంది. దాదాపు రూ.150 కోట్ల విలువైన పనులు ఒక్కో వారంలో జరుగుతున్నాయి. - అయితే కేవలం రూ.150 కోట్లు మాత్రమే బకాయి ఉండగా, ‘ఈనాడు’ పూర్తిగా తప్పుడు వార్తలు రాస్తోంది. గ్రామాల్లో పనులకు ఎవ్వరూ రాకుండా కుటిల ప్రయత్నం ఇది. బిల్లులు ఇవ్వడం లేదని తప్పుడు వార్తలు రాస్తోంది. ఇవి సకాలంలో పూర్తి కావాలి - గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీయూ), వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లకు ప్రహరీల నిర్మాణం వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తి కావాలి. - బీఎంసీయూల నిర్మాణానికి సంబంధించి ఆర్బీకేల పక్కనే భూములు ఇచ్చేలా చూడండి. ఈ నెల 30 నాటికి స్థలం ఇవ్వడంతో పాటు, అన్నీ మంజూరు చేయాలి. వచ్చే నెల 15 నాటికి తప్పనిసరిగా పనులు మొదలు కావాలి. - ప్రతి నియోజకవర్గంలో రూ.10 కోట్ల విలువైన పనులు చేయాలి. సకాలంలో అవి పూర్తి చేస్తే, అదనంగా మరో రూ.5 కోట్ల విలువైన పనులు వస్తాయి. అన్ని పనుల్లో గ్రామ, సచివాలయాల్లో ఉన్న గ్రామ ఇంజనీరింగ్ అసిస్టెంట్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. నాడు-నేడు (స్కూళ్లలో) - నాడు-నేడు కింద తొలి దశలో 15,715 స్కూళ్లలో పనులు చేపట్టగా, 78 శాతం పూర్తయ్యాయి. డిసెంబర్ 31 టార్గెట్‌గా పనులు పూర్తి చేయాలి. దీనిపై కలెక్టర్లు, జేసీలు దృష్టి పెట్టాలి. బాత్రూమ్ల శ్లాబ్ వంటి పనులు జరగాల్సిన 262 చోట్ల అవసరమైన ఇసుక, సిమెంటు సరఫరా చేయాలి. - పేరెంట్ కమిటీలపైనే పూర్తి భారం వేయకుండా జేసీలు బాధ్యత తీసుకుని ప్రతి రెండు రోజులకు ఒకసారి సమీక్షించాలి. జగనన్న విద్యా కానుక - పిల్లలకు కిట్ ఇచ్చాం. అందులో ఏమైనా లోపాలు ఉంటే, వాటిని సరిచేయండి. నాణ్యతపై పూర్తి దృష్టి పెట్టాలి. పిల్లలు ఎవరికైనా షూ సైజ్ సరిపోకపోయినా, లేక పెద్దగా అయినా తెలుసుకోండి. ఆ మేరకు ప్రతి స్కూల్లో నోటీసులు పెట్టి, పూర్తి వివరాలు సేకరించండి. - పిల్లలను వాటిని స్కూల్‌కు స్వయంగా తీసుకురమ్మని చెప్పి, అక్కడే పరిష్కారం చూపాలి. ఒక వేళ బ్యాగ్ ఎలా ఉందో చూడండి. చినిగిపోతే క్వాలిటీ పెంచాలి. పిల్లలకు అది ఒక ప్యాషన్. వారు బాగా చదువుకోవాలి. కాబట్టి కలెక్టర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. ప్రత్యేక శ్రద్ధ చూపాలి. - పిల్లలకు మూడు జతల యూనిఫామ్ కుట్టుకూలీ తల్లుల ఖాతాలో పడుతుందా? లేదా? అన్నది కూడా చూడాలి. వచ్చే సోమవారం నుంచి ఈ కార్యక్రమం జరగాలి. అంగన్వాడీ కేంద్రాలు (వైఎస్సార్ ప్రిప్రైమరీ స్కూళ్లు) - రాష్ట్రంలో 27,543 అంగన్వాడీలు అద్దె భవనాల్లో ఉన్నాయి. సొంత భవనాల నిర్మాణం కోసం 22,630 స్థలాలు గుర్తించారు. - ఊరిలోకి రాగానే సచివాలయం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్, ఆర్బీకే, ప్రిప్రైమరీ స్కూల్.. ఇలా అన్నీ కనిపిస్తాయి. అంత చక్కటి పరిస్థితి మీరు చేశారంటే, మీ హయాంలో జరిగిందని అందరూ చెప్పుకుంటారు. అలా మీరు గుర్తుండిపోతారు. కాబట్టి కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్‌లు - వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు భవిష్యత్తులో గ్రామాల్లో వైద్య రంగంలో పెను మార్పులు తీసుకురానున్నాయి. వాటిలో హెల్త్ అసిస్టెంట్లు ఉంటారు. ఆశా వర్కర్లు కూడా ఉంటారు. ఏ నిర్మాణంలో అయినా నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. జేసీలు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఖరీఫ్‌లో ధాన్యం సేకరణ - ఏ పంట అయినా అమ్ముడుపోకుండా ఉంటే, దానిపై కలెక్టర్లు, జేసీలు దృష్టి పెట్టాలి. రైతులకు కనీస మద్దతు ధర ఇస్తూ గ్రామ స్థాయిలో ధాన్యం సేకరిస్తున్న ఏకైక రాష్ట్రంగా గుర్తింపు పొందాం. - ఆర్బీకేల స్థాయిలో 5,812 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశాం. వాటిలో వివిధ పంటలకు సంబంధించి 4,29,481 మంది రైతులు ఆర్బీకేల వద్ద పేర్లు నమోదు చేసుకున్నారు. వరి, మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, రాగి తదితర పంటలకు సంబంధించి రైతులు రిజిస్టర్ చేసుకున్నారు. - ఆర్బీకేల వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత 15 రోజుల లోపలే ధాన్యం కొనుగోలు చేయాలి. అంత కంటే ఆలస్యం చేయొద్దు. రైతుల వివరాలు, సేకరణ వివరాలు ఆర్బీకేల వద్ద తప్పనిసరిగా ప్రదర్శించాలి. - ధాన్యం సేకరించిన 15 రోజుల్లో తప్పనిసరిగా పేమెంట్లు జరగాలి. రైతుల పట్ల అందరూ మానవతా దృక్పథంతో ఉండాలి. ధాన్యం సేకరణలో ఈ-ప్రొక్యూర్మెంట్ తప్పనిసరి. ఎక్కడా మన రైతులకు నష్టం జరగకూడదు. ఎఫ్ఏక్యూ రిలాక్స్ - వేరుశనగ రైతుల కష్టాలు తీర్చేందుకు కనీస నాణ్యతా ప్రమాణాలు (ఎఫ్ఏక్యూ) లేని పంటకు కూడా గ్రేడెడ్ ఎమ్మెస్పీ రూ.4,500 ప్రకటించాం. ఆ మేరకు ఎఫ్ఏక్యూలో మినహాయింపులు ఇచ్చాం. దీన్ని అన్ని ఆర్బీకేల వద్ద బాగా ప్రచారం చేయాలి. రబీ సాగు.. సన్నద్ధత - రబీ సీజన్‌కు ఆర్బీకేలు, మండల, జిల్లా స్థాయిలలో అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల అవసరం ఎంత అన్నది చూసి, వాటి లోటు లేకుండా చూడాలి. అన్నింటిలో నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. కలెక్టర్లు, జేసీలు స్వయంగా మానిటర్ చేస్తే తప్ప సమస్యలు తెలియవు. వాటిని పరిష్కరించలేరు. - వ్యవసాయ సలహా మండళ్లు కూడా ఉన్నాయి. అవి ప్రతి శుక్రవారం సమావేశమవుతున్నాయి. క్షేత్ర స్థాయిలో అవి నివేదికలు ఇస్తున్నాయి. వాటిని జేసీలు మండల వ్యవసాయ అధికారి ద్వారా చూడాలి. ఆ మేరకు అన్నీ స్వయంగా పర్యవేక్షించాలి. - సీఎం-యాప్, ఈ-క్రాప్ డేటా నమోదు, వినియోగం ఎలా సాగుతోందని చూడాలి. కాబట్టి జేసీలు, కలెక్టర్లు తప్పనిసరిగా సచివాలయాలు, ఆర్బీకేలు సందర్శించాలి. ఈ-క్రాప్ డేటా ఆధారంగా, గ్రామంలో ఉండాల్సినవి అన్నీ ఉన్నాయా? లేవా? అన్నవి చూడాలి. గుర్రపు డెక్క తొలగించాలి - ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో గుర్రపు డెక్కతో కాలువలు పూడుకు పోయాయి. వాటిని తొలిగించి నీరు సాఫీగా పారేలా చర్యలు చేపట్టాలి. పోలవరం కాఫర్ డ్యామ్ పనులు జరుగుతాయి కాబట్టి, ఉభయ గోదావరి జిల్లాల్లో ఏప్రిల్ 1 తర్వాత నీటి సరఫరా ఆగిపోతుంది. - అందువల్ల డిసెంబరు 31లోగా రబీకి సంబంధించి వరినాట్లు, ఇతర పనులు పూర్తయ్యేలా చూడాలి. ఈ విషయంలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ, ధ్యాస పెట్టాలి. అందుకోసం రైతులతో మాట్లాడాలి. ఆ రెండు జిల్లాలకు చెందిన మంత్రులు కూడా చొరవ చూపాలి. -
వలస కార్మికుల కోసం హెల్ప్‌డెస్క్
సాక్షి, హైదరాబాద్: వలస కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ కార్మిక శాఖ హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది. తెలంగాణలో వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు లాక్డౌన్ కారణంగా వారి సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లేందుకు వీలు లేకుండాపోయింది. ఇలాంటి వారికి సహాయపడేందుకు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్టు తెలంగాణ సంయుక్త కార్మిక కమిషనర్ ఎన్. చతుర్వేది ఒక ప్రకటనలో తెలిపారు. పారిశ్రామిక రంగ కార్మికుల వేతన చెల్లింపులు, సంక్షేమం, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని కార్మిక శాఖ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వలస కార్మికులు సమస్యల పరిష్కారం కోసం 94925 55379 (వాట్సప్)లో సంప్రదించాలని ఆయన సూచించారు. covid19cotr@gmail.comకు ఈ-మెయిల్ కూడా పంపొచ్చని చెప్పారు. హెచ్చార్సీ కేసుల విచారణ వాయిదా లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో కేసుల విచారణను వాయిదా వేస్తున్నట్టు మానవ హక్కుల సంఘం(హెచ్చార్సీ) ప్రకటించింది. వాయిదా వేసిన కేసులను మే 9 నుంచి విచారిస్తామని తెలిపింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని 99631 41253, 90002 64345 నంబర్లలో సంప్రదించవచ్చు. (లాక్డౌన్.. మరిన్ని సడలింపులు ప్రకటించిన కేంద్రం) -
కరోనా: ఏపీలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు
-
ప్రవేశ పరీక్షల సందేహాలకు..ఎన్టీయే పరిష్కారం
జాతీయ స్థాయిలో నిర్వహించాల్సిన వివిధ ప్రవేశ పరీక్షలను వాయిదా వేసిన జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ విద్యార్థుల సందేహాలు, ఇతర సమస్యల పరిష్కారానికి వీలుగా ఏర్పాట్లు చేసింది. తమ వద్ద ఉన్న పరిమిత వనరులతోనే హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. పరీక్షల సమాచారం కోసం ఫోన్ నంబర్లు ఏర్పాటుచేయించింది. సాక్షి, అమరావతి: లాక్డౌన్ కారణంగా జాతీయ స్థాయిలో నిర్వహించాల్సిన వివిధ ప్రవేశ పరీక్షలను వాయిదా వేసిన జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విద్యార్థుల సందేహాలు, ఇతర సమస్యల పరిష్కారానికి వీలుగా ఏర్పాట్లు చేసింది. తమ వద్ద ఉన్న పరిమిత వనరులతోనే హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటుచేసినట్టు ప్రకటించింది. పరీక్షలకు సంబంధించిన వివిధ రకాల సమాచారం కోసం కొన్ని ఫోన్ నంబర్లు, ఈ–మెయిళ్లను ఏర్పాటుచేయించింది. వీటిని సంప్రదించి అభ్యర్థులు తమ సందేహలను నివృత్తి చేసుకోవచ్చని వివరించింది. పరీక్షలకు సంబంధించిన ఇతర సమాచారాన్ని వెబ్సైట్ ద్వారా తెలియచేస్తామని, ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించుకోవాలని పేర్కొంది. ఎన్టీఏ– genadmin@nta.ac.in టెస్టు ప్రాక్టీస్ సెంటర్ (మాక్ టెస్టు)– tpc@ nta.ac.in యూజీసీ నెట్– ugcnet@nta.ac.in జేఈఈ మెయిన్స్– jeemain@nta.ac.in నీట్, యూజీ– neet@nta.ac.in సీఎంఏటీ– cmat@nta.ac.in జీపాట్– gpat@nta.ac.in ఏఐఏపీజీఈటి - aiapget@nta.ac.in స్వయం – swayam@nta.ac.in ఆర్పిట్ – arpit@nta.ac.in ఐసీఏఆర్ – icar@nta.ac.in డీయూఈటీ– duet@nta.ac.in ఎన్సీహెచ్ఎం– nchm@nta.ac.in ఇగ్నౌ– ignou@nta.ac.in జేఎన్‌యూఈఈ - jnu@nta.ac.in ఐఐఎఫ్‌టీ– iiftmba-ib@nta.ac.in సీఎస్ఐఆర్– csirnet@nta.ac.in -
24x7 మీ సేవలో..
సాక్షి, హైదరాబాద్ : రైల్వే స్టేషన్లో మీరు వేచి ఉన్న విశ్రాంతి గదిలో తాగునీరు లేదా.. ఏసీలు పని చేయడం లేదా... టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉన్నాయా.. వీల్‌చైర్స్ కావాలా... ఇకపై ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయాణికుల సహాయ కేంద్రం సిద్ధంగా ఉంది. 24/7 ఈ కేంద్రం పని చేసేందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కొత్తగా హెల్ప్ డెస్క్‌లను అందుబాటులోకి తెచ్చారు. వైద్యం, అంబులెన్స్‌లు వంటి అత్యవసర సేవలతో పాటు అన్ని రకాల ప్రయాణ సదుపాయాల కోసం నేరుగా ఈ సహాయ కేంద్రాలను సంప్రదించవచ్చు. హెల్ప్ డెస్క్ సేవలు ఇలా... రైల్వేస్టేషన్ల అభివృద్ధి, సదుపాయాల విస్తరణలో భాగంగా దేశవ్యాప్తంగా ఐదు రైల్వేస్టేషన్లు బెంగళూర్, పుణే, సికింద్రాబాద్, ఢిల్లీలోని ఆనంద్‌బాగ్, చండీఘర్లను ఎంపిక చేసి ఇండియన్ రైల్వేస్టేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐఆర్ఎస్డీసీ)కి అప్పగించారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఒకటో నంబర్, పదో నంబర్ ప్లాట్‌ఫామ్‌ల వద్ద సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు నేరుగా కానీ, ఫోన్ నంబర్ల ద్వారా కానీ సేవలను పొందవచ్చు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, గర్భిణులు, నడవలేని స్థితిలో ఉన్న రోగుల కోసం వీల్చైర్లను ఏర్పాటు చేస్తారు. కొత్తగా వచ్చే ప్రయాణికులు ఏ ప్లాట్‌ఫామ్‌కు ఎలా వెళ్లాలి, లిఫ్టులు, ఎస్కలేటర్లు ఎక్కడ ఉన్నాయో చెబుతారు. ఏసీ వెయిటింగ్ హాళ్లు, ప్రీపెయిడ్ రెస్ట్‌రూమ్‌ల వివరాలను తెలియజేస్తారు. స్టేషన్ పరిశుభ్రత, మంచినీటి సదుపాయం, టాయిలెట్ల నిర్వహణ, విద్యుత్ సదుపాయం వంటి వివిధ రకాల సేవల్లో లోపాలకు తావు లేకుండా చూస్తారు. దేశవ్యాప్తంగా రైళ్ల నిర్వహణ, టికెట్ బుకింగ్, రిజర్వేషన్ల వంటి అంశాలకు మాత్రమే రైల్వేలు పరిమితమవుతాయి. స్టేషన్ల నిర్వహణ, రైల్వేస్థలాల్లో వాణిజ్య కార్యకలాపాల విస్తరణ ద్వారా ఆదాయాన్ని ఆర్జించడం వంటివి ఐఆర్ఎస్డీసీ పరిధిలోకొస్తాయి. సికింద్రాబాద్ స్టేషన్లో పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, ఎంటర్టైన్మెంట్ సెంటర్లు, సినిమా హాళ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌ల ఏర్పాటుకు ప్రతిపాదించారు. తొలిదశలో ప్రయాణికుల సదుపాయాల నిర్వహణ, రెండో దశలో స్టేషన్ పునరాభివృద్ధి ప్రాజెక్టును చేపట్టనున్నారు. సికింద్రాబాద్‌లో రోజువారీ ప్రయాణికుల సంఖ్య : 1.95 లక్షలు రాకపోకలు సాగించే రైళ్ల సంఖ్య (సుమారు) : 150 మొత్తం ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య : 10 వీల్‌చైర్, హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్ : 040–27788889 వాటర్, టాయిలెట్లు, విద్యుత్, రెస్ట్‌రూమ్స్ వంటి వాటి కోసం : 040–27786607 ఐఆర్ఎస్డీసీ సిబ్బంది సహాయం కోసం : 8008400051, 9849759977 -
వార్డు సచివాలయ అభ్యర్థులకు హెల్ప్‌డెస్క్
సాక్షి, అమరావతి: వార్డు సచివాలయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు రాష్ట్ర పురపాలక శాఖ హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది. అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానున్న ఈ నూతన వ్యవస్థల్లో పని చేయడానికి ఉద్యోగులను నియమించడానికి ప్రభుత్వం ఈ నెల 26న నోటిఫికేషన్ జారీ చేసింది. వీటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సౌలభ్యం కోసం గుంటూరులోని మున్సిపల్ శాఖ కమిషనర్ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది. సందేహాల నివృత్తి కోసం అభ్యర్థులు మొబైల్ నంబర్ 7997006763కు ఫోన్ చేయవచ్చు. మంగళవారం నుంచి ఇది పని చేస్తుందని, ప్రతీరోజూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ హెల్ప్ డెస్క్‌లో సిబ్బంది అందుబాటులో ఉంటారని, అభ్యర్థులు దీన్ని గమనించగలరని రాష్ట్ర మున్సిపల్ శాఖ కమిషనర్ విజయకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. -
చిన్న వ్యాపారులకు ఈవై ‘జీఎస్టీ హెల్ప్ డెస్క్’
న్యూఢిల్లీ: చిన్న వ్యాపారుల కోసం జీఎస్టీ హెల్ప్ డెస్క్‌ను ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) ప్రారంభించింది. వ్యాపారులు తమ సందేహాలను ఆన్లైన్లోనే ఈ డెస్క్ సాయంతో తొలగించుకోవచ్చు. 14 పట్టణాలకు చెందిన 800 జీఎస్టీ పన్ను నిపుణులు ఉచిత సేవలు అందించనున్నారు. చిన్న వ్యాపారులు, ట్రేడర్లు, వ్యాపారవేత్తలు జీఎస్టీకి సాఫీగా మారేందుకు ఈ హెల్ప్‌డెస్క్ తోడ్పడుతుందని ఈవై ఇండియా చైర్మన్ రాజీవ్మేమాని అన్నారు. తమ సందేహాలను, ప్రశ్నలను ‘ఈవై ఇండియా ట్యాక్స్ ఇన్సైట్’ యాప్, ‘డిజిజీఎస్టీ’ వెబ్సైట్, ‘ఈవై అండర్స్కోర్ ఇండియా’ ట్విట్టర్లో పోస్ట్ చేసి సమాధానాలు పొందొచ్చని ఈవై సూచించింది. -
'కుడా’లో ఎల్ఆర్ఎస్పై హెల్ప్‌డెస్క్
కరీమాబాద్ : హన్మకొండలోని ‘కుడా’ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్పై శనివారం హెల్ప్‌డెస్క్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు దరఖాస్తుదారులు హాజరై తమ అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ‘కుడా’ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, పీఓ అజిత్‌రెడ్డి, సెక్రటరీ మురళీధర్‌రావు, ఏఓ సత్యనారాయణలు దరఖాస్తుదారులకు అవగాహన కల్పించారు. -
రైళ్లలో పర్యాటకుల కోసం హెల్ప్ డెస్క్‌లు
న్యూఢిల్లీ: పర్యాటకుల కోసం రైల్వేలో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయనున్నారు. 24 స్టేషన్లలో వీటిని ప్రవేశపెట్టనున్నారు. రైల్వే భద్రతా దళం(ఆర్పీఎఫ్) ఆధ్వర్యంలో ఇవి నిర్విరామంగా పనిచేస్తాయి. వీటి ద్వారా సంబంధిత ప్రదేశాల సమగ్ర సమాచారాన్ని పొందవచ్చు. పోలీసుల సహకారంతో ఇవి పనిచేస్తాయి. మధ్యవర్తుల మోసాలకు చెక్ పెట్టే యోచనలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. మొదటి దశలో భాగంగా అమృత్సర్, తిరువనంతపురం, గయా, రాయ్‌బరేలీ, ఆగ్రాలో వీటిని అందుబాటులోకి తేనున్నారు. తర్వాతి దశలో హరిద్వార్, వారణాసి, అయోధ్య, అలహాబాద్, ద్వారక, హౌరా, కామాఖ్య, తిరుపతి నగరాల్లో ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం 2,500 రైళ్లలో దాదాపు 60 వేల మంది ఆర్పీఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. త్వరలోనే దీనిని 3 వేల రైళ్లకు పెంచనున్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రయాణికులకు ఆర్పీఎఫ్ దళాలు మరింత భద్రతనిస్తాయి. వీటితో పాటు రైల్వే ఆస్తులకు రక్షణనివ్వాల్సి ఉంటుంది. -
మెతుకుసీమకు పచ్చల హారం
సిద్దిపేట జోన్: హరిత హారంలో భాగంగా ఊరూరా మొక్కలు నాటేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి 22వ తేదీ వరకు పకడ్బందీగా నిర్వహించేందుకు కలెక్టర్ అన్ని ఏర్పాట్లు చేశారు. అన్ని శాఖల అధికారులను సమన్వయపరిచారు. అవసరమైన మేరకు మొక్కలను సిద్ధం చేశారు. అధికారులే కాకుండా ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత, రైతులు ఇలా అన్ని వర్గాల వారు భాగస్వాములయ్యేలా యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది. అవసరమైన మొక్కలను సమకూర్చేందుకు గాను జిల్లా కేంద్రంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటైంది. ఈ కేంద్రంలోని టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసిన వెంటనే మొక్కలను అందజేసేలా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం నాడు ఈ కార్యక్రమాన్ని ఊరూరా ప్రారంభించనున్నారు. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి టి.హరీశ్‌రావు మెదక్ డివిజన్లో పాల్గొననున్నారు. ఏర్పాట్లలో తలమునకలైన అధికారులు.. అటవీ, ఉద్యాన, డ్వామా తదితర ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేస్తూ మూడున్నర కోట్ల మొక్కలను నాటే కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం తలమునకలైంది. అటవీ శాఖకు చెందిన రిజర్వ్ ఫారెస్ట్‌లో 48 లక్ష ల మొక్కలను నాటాలని, అటవేతర ప్రాంతంలో 2.52 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. కందకాలు, ప్రభుత్వ భూములు, పరిశ్రమలు, వివిధ రకాల సంస్థలను, ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఆ దిశగా నిర్దేశిత ప్రాంతాలను గుర్తించి, గుంతలు తీయడం, మొక్కలు, ట్రీగార్డ్‌లు అందజేయడం, ఎరువుల సరఫరా తదితర అంశాలపై కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు దశల వారీగా సమీక్షలు నిర్వహించారు. ఇప్పటికే పలు పర్యాయాలు జిల్లా స్థాయిలో మంత్రి హరీశ్‌రావు, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, డివిజన్ పరిధిలో ఆర్డీఓలు, మండల పరిధిలో ఎంపీడీఓల స్థాయిలో సమీక్ష సమావేశాలను విస్తృతంగా నిర్వహించారు. పంచాయతీకి 40 వేల మొక్కల చొప్పున... ప్రతి గ్రామ పంచాయతీకి 40 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో 40 లక్షల మొక్కల ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. శాఖల వారీగా నివేదికను రూపొందించింది. హరితహారాన్ని విజయవంతం చేసేందుకు ఎంపీడీఓలను మండల ప్రత్యేక అధికారిగా నియమించింది. మొక్కలు విరివిగా నాటేలా ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పటికే ఈజీఎస్ పథకం కింద గుంతలు తీయడం, మొక్కల దిగుమతి వంటి ప్రక్రియను చేపడుతున్నారు. ముందస్తుగా మొక్కలపై దృష్టి .. జిల్లాలోని 450 నర్సరీల నుంచి అవసరమైన మొక్కలను సమీప ప్రాంతాల్లో పంపిణీ చేసేందుకు డ్వామా, అటవీ అధికారులు సిద్ధంగా ఉన్నారు. అడవుల్లో ఇప్ప, మోదుగ, నారింజ, వేప, అల్లనేరడి, తుమ్మ, రక్తగండ వంటి ఇతర మొక్కలను నాటేందుకు, కందక ప్రాంతాల్లో కానుగ, ఈత, నీలగిరి, తుమ్మ, మొక్కలు.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో టేకు, గుమ్మడి టేకు, పండ్ల, పూల మొక్కలను అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో మొక్కల లభ్యతను సరిచూసుకున్న అధికారులు ఖమ్మం జిల్లాలోని గరిముల్లపాడు ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున మొక్కలను దిగుమతి చేసుకుంటున్నారు. ముఖ్యంగా మామిడి, కొబ్బరి, సపోట వంటి 10 రకాల మొక్కలను ఖమ్మం జిల్లా నుంచి తెప్పిస్తున్నట్టు సమాచారం. -
విద్యుత్ రంగంలో పెట్టుబడులకు హెల్ప్ డెస్క్‌లు..
విద్యుత్ శాఖ మంత్రి పియుష్ గోయల్ న్యూయార్క్: దేశీ విద్యుత్ రంగంలోకి దాదాపు 1 లక్ష కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్షించే దిశగా కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా భారత చట్టాలు, నిబంధనలు తదితర అంశాల మీద ఇన్వెస్టర్లకు తోడ్పాటు అందించే విధంగా హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయనుంది. దేశవ్యాప్తంగానే కాకుండా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్ తదితర దేశాల్లోనూ వీటిని ప్రారంభించనున్నట్లు అమెరికా పర్యటనలో భాగంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియుష్ గోయల్ వెల్లడించారు. ఇన్వెస్టర్లు ప్రధానంగా విద్యుత్ పంపిణీ కంపెనీల స్థితిగతులు, వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల నిబంధనల గురించి సందేహాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే 5-6 ఏళ్లలో భారత విద్యుత్ రంగంలో 250 బిలియన్ డాలర్ల మేర వ్యాపార అవకాశాలు ఉన్నాయని, 2030 నాటికి ఏకంగా 1 లక్ష కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరం కాగలవని గోయల్ వివరించారు. అమెరికా పర్యటనలో భాగంగా బ్లాక్‌స్టోన్, వార్బర్గ్ పింకస్ వంటి ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజాలతో గోయల్ సమావేశమయ్యారు. భారత్‌లో వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. -
హెల్ప్‌డెస్క్‌లు భేష్
తప్పిపోయిన పిల్లలు తల్లిదండ్రుల చెంతకు ఇప్పటివరకు 64 మంది చిన్నారులకు రక్షణ ఇందూరు/మోర్తాడ్ : జిల్లాలోని 11 ప్రాంతాలలో ఏర్పాటు చేసిన 18 పుష్కరఘాట్లలో పుణ్య స్నానాలు ఆచరించడాని కి ప్రజలు పిల్లా పాపలతో వస్తున్నారు. భక్తుల ర ద్దీ ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పిపోయిన పిల్లలను తిరిగి తల్లిదండ్రుల చెం తకు చేర్చడానికి జిల్లా మహిళా, శిశు సంక్షే మ శాఖ ఆధ్వర్యంలో ప్రతీ ఘాట్ వద్ద హెల్ప్ డెస్క్‌లను ఏ ర్పాటు చేశారు. వారం రోజులుగా పుష్కరాలలో మొ త్తం 64 మంది పిల్లలు తప్పిపోయారు. హెల్ప్ డెస్క్ సిబ్బంది వీరిని క్షే మంగా వారి వారి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు అందజేసి ఘనతను చాటుకున్నారు. సమస్య తలెత్తకుండా తప్పిపోయిన పిల్లలు కుటుంబసభ్యులకు చెందిన వారో కాదో పూర్వాపరా లు, గుర్తింపు కార్డులు పరిశీలించిన తరువాతే అప్పగించారు. ఎక్కువగా పోచంపాడ్, కందకుర్తి, తడ్పాకల్, తుంగిని ఇంకా ఒకటి రెండు పుష్కరప్రాం తా లలో నిత్యం లక్షల మంది స్నానా లు ఆచరించడానికి వచ్చారు. ఇక్కడ భక్తుల రద్దీ గణనీయంగా పెరగడం తో చిన్న పిల్లలు చాలా మంది తప్పిపోయారు. ఈ క్రమంలో పుష్కర ప్రాంతాలలో ఉన్న హెల్ప్ డెస్క్ సిబ్బందికి కుటుంబ సభ్యులు సమాచారం ఇవ్వడంతో తప్పిపోయిన పిల్లలను వెతికి మరీ వారికి అందించా రు. ఒంటరిగా కనిపించిన పిల్లలను హెల్ప్ డెస్క్‌కు తీసుకువచ్చి పిల్లల వివరాలు కుటుంబ సభ్యులకు తె లిసేలా మైకు ద్వారా ప్రచారం నిర్వహించారు. తద్వారా పిల్లల ఆచూకీ తొందరగా లభించింది. హెల్ప్ డెస్క్‌ల విధుల నిర్వహణను బాధిత తల్లిదండ్రులు కొనియాడారు. అధికారులు కూడా వారిని అభినందించారు. పుష్కర ఘాట్ల వద్ద ఒక వేళ హెల్ప్ డె స్క్‌లు లేకుంటే జన ప్రవాహంలో తప్పిపోయిన పిల్ల ల ఆచూకీ అంత సులభంగా లభించేది కాదు. -
ప్రభుత్వ కాలేజీల్లో హెల్ప్‌డెస్క్
హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సంలో(2015-16) రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చేరే విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఈ నెలలోనే హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని కళాశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు డిగ్రీ కాలేజీల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై అకడమిక్ కేలండర్‌ను రూపొందించింది. దీన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బుధవారం సచివాలయంలో ఆవిష్కరించారు. డిగ్రీ కాలేజీల్లో నిర్వహించాల్సిన వివిధ పాఠ్య, పాఠ్య అనుబంధ, పాఠ్యేతర కార్యక్రమాలను ఈ కేలండర్లో పొందుపరిచారు. డిగ్రీలో నాణ్యమైన విద్యను అందించేందుకు అధ్యాపకులు రోజువారీ, నెలవారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలను కూడా పేర్కొన్నారు. ఇవి ఈ నెల నుంచే ప్రారంభమై, వచ్చే ఏడాది ఏప్రిల్‌తో ముగుస్తాయి. ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్, న్యాక్, జేకేసీ తది తర కార్యక్రమాలను కేలండర్లో చేర్చారు. ప్రతినెల 4న స్వచ్ఛ భారత్ ను నిర్వహిస్తారు. విద్యార్థుల్లో అంతర్గత నైపుణ్యాలను వెలికితీయడానికి, వారి అభిరుచులను పంచుకోడానికి వేదిక ఏర్పాటును కూడా ప్రతిపాదించారు. హేతుబద్దీకరణ, బదిలీలపై నేడు భేటీ రాష్ట్రంలో పాఠశాలలు, సిబ్బంది, పోస్టుల హేతుబద్దీకరణ, పదోన్నతులు, బదిలీలపై చర్చించేందుకు ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యా శాఖ గురువారం ఉదయం 11 గం టలకు సమావేశం కానుంది. అన్ని సంఘాల నేతలతో పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు విడివిడిగా చర్చిస్తారు. శుక్ర లేదా శని వారాల్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే అవకాశముంది. కాగా, రాష్ర్టంలోని గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహిం చిన పరీక్షలో 3,325 మందిని తాత్కాలికంగా ఎంపిక చేసినట్లు గురుకుల విద్యాలయాల సొసైటీ ప్రకటించింది. అభ్యర్థుల ఫలి తాలను ్టటట్జఛీఛి.ఛిజజ.జౌఠి.జీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 20న ఒరిజనల్ సర్టిఫికెట్లతో ఆయా జిల్లా కన్వీనర్లను సంప్రదించాలని సొసైటీ సూచించింది. -
అతివకు అండ
మహిళా భద్రత, సమస్యల పరిష్కారానికి హెల్ప్‌డెస్క్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహిళలకు భద్రత, వారికి సంబంధించిన సమస్యల సత్వర పరిష్కారానికి 24 గంటలు పనిచేసే హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేయాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. మహిళల సమస్యలను తెలుసుకుని, వారికి అవసరమైన సహాయ, సహకారాలను అందించే విధంగా దాన్ని రూపొందించాలని సూచించారు. మహిళల కోసం పనిచేసే వివిధ సంస్థలు, వ్యక్తులు, అధికారులను సమన్వయపరుస్తూ ఈ డెస్క్ ప్రభావవంతంగా పనిచేయాలన్నారు. మహిళలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వీలుగా 181 టోల్‌ఫ్రీ నంబర్‌తో హెల్ప్‌లైన్‌ను కూడా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో కచ్చితంగా మహిళా విభాగం ఉండాలని సూచించారు. పోలీస్ శాఖలోని అన్నిస్థాయిల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశించారు. అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా మహిళలకు వేతనాలు అందించాలని, ఎక్కడైనా వివక్ష చూపితే హెల్ప్‌లైన్ ద్వారా పరిష్కరించాలని చెప్పారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలలో మహిళలకు ప్రసూతి సెలవులు ఇవ్వడంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని సీఎం సూచించారు. మహిళల సమస్యలు-పరిష్కార మార్గాలపై ఏర్పాటైన మహిళా భద్రత, రక్షణ కమిటీ చేసిన సిఫార్సులపై గురువారం సచివాలయంలో కేసీఆర్ సమీక్ష జరిపారు. ఈ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, పోలీస్ కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్, కమిటీ సభ్యులు పూనం మాలకొండయ్య, శైలజారామయ్యార్, స్మితా సబర్వాల్, చారుసిన్హా, సౌమ్యామిశ్రా, స్వాతిలక్రా, సునీల్‌శర్మ, ఐఏఎస్ అధికారులు రేమండ్ పీటర్, చంద్రవదన్, హరిప్రీత్‌సింగ్, రమణారావుతో పాటు ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే గొంగిడి సునీత, జర్నలిస్టు ప్రేమ తదితరులు పాల్గొన్నారు. హోం, ఐటీ, రవాణా, వైద్య, ఆరోగ్యం, మహిళా, శిశు సంక్షేమం, కార్మిక శాఖ, పాఠశాల విద్య, రెవెన్యూ తదితర శాఖల సమన్వయంతో చేపట్టాల్సిన చర్యలపై పూనం మాలకొండయ్య, ఇతర అధికారులు ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. మహిళలకు గౌరవం దక్కడం లేదు: కేసీఆర్ ఆవేదన కర్మభూమి, వేదభూమి అని చెప్పుకొంటున్నప్పటికీ మహిళలకు సమాజంలో ఏమాత్రం గౌరవం దక్కడం లేదని సీఎం ఆవేదన వ్యక్తంచేశారు. మహిళల భద్రత ప్రతి ఒక్కరికీ సంబంధించిన అంశమన్నారు. వారి గౌరవాన్ని కాపాడడానికి, భద్రత కోసం తీసుకుంటున్న చర్యలపై విస్తృత ప్రచారాన్ని కల్పించాల్సిన అవసరముందన్నారు. షార్ట్‌ఫిల్మ్‌లు, ప్రకటనల ద్వారా ప్రచారం చేయాలన్నారు. సెల్‌ఫోన్, ఇంటర్నెట్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సమాచార సాధనాలు, సామాజిక వెబ్సైట్ల ద్వారా మహిళలను వేధిస్తున్నారని, దీన్ని అరికట్టడానికి ఐటీ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలని ఆదేశించారు. చైనా, గల్ఫ్ దేశాల మాదిరిగా సోషల్ మీడియాపై నియంత్రణ ఉంచే అవకాశాలు కూడా పరిశీలించాలని అధికారులకు సూచించారు. భ్రూణ హత్యలు, ఆడపిల్లలను వదిలించుకోవడం వంటి వాటిని అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. గుడుంబా వల్ల చాలా మంది చనిపోతున్నారని, దీంతో 25-30 ఏళ్ల వయసులోని యువతులే వితంతువులుగా మారుతున్నారని సీఎం పేర్కొన్నారు. గుడుంబా, నాటుసారాను లేకుండా చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ కారణాల వల్ల రెస్క్యూహోంలలో ఉంటున్న వారి విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని చెప్పారు. వారి పోషణకు ప్రస్తుతం నెలనెలా ఇస్తున్న రూ. 750 సరిపోదన్నారు. ఈ మొత్తాన్ని పెంచాల్సి ఉందన్నారు. హెదరాబాద్లో మహిళల భద్రతకు చేపడుతున్న కార్యక్రమాలను జిల్లాలకు కూడా విస్తరించాలని ఆయన సూచించారు. డీఎస్పీ స్థాయి అధికారికి బాధ్యతలు జిల్లాల్లో మహిళల భద్రతా కార్యక్రమాలను చేపట్టేందుకు డీఎస్పీ స్థాయి అధికారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని సీఎం చెప్పారు. జిల్లాల్లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆటోరిక్షాలు, ట్యాక్సీల నిర్వహణను కూడా జాగ్రత్తగా పరిశీలించాలని, వాటి యజమానులు, డ్రైవర్ల వివరాలు పోలీసుల వద్ద ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిపై ఆరా తీయాలన్నారు. హైదరాబాద్‌తో పాటు నగరాలు, పట్టణాల్లోనూ ‘షీ’ ఆటోలు, ట్యాక్సీలు నడపాలని సూచిం చారు. మహిళా డ్రైవర్లకు 50 శాతం సబ్సిడీపై వాహనాలను సమకూరుస్తామన్నారు. హైదరాబాద్‌లో సీసీ కెమెరాల నిఘా హైదరాబాద్‌లో బస్సులు, బస్టాపులతో పాటు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆకతాయిల వేధింపులను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు. అమ్మాయిలను వేధించే వారిని గుర్తించడానికి నిఘా పెట్టామని, ఇప్పటికే చాలామంది ఈవ్‌టీజర్లను గుర్తించామని చెప్పారు. వారికి ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని, వారి ఫొటోలు, వేలిముద్రలు కూడా తీసుకుంటున్నామన్నారు. ఈవ్టీజర్ల త ల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలకు కూడా లేఖలు రాస్తున్నట్లు తెలిపారు. కోఠి, మెహదీపట్నం, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో ఈవ్‌టీజింగ్ ఎక్కువగా జరుగుతున్నదని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటుచేయాలని సూచించారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ బస్సుల్లో ముందువైపు మహిళలు, వెనకవైపు పురుషులు ఎక్కి, దిగేలా చూడాలని పేర్కొన్నారు. కండక్టర్ రెండువైపులా తిరిగే విధంగా స్లైడర్ ఏర్పాటు చేయాలని సూచించారు. -
దేవుడా..! నువ్వే దిక్కు
* హైరిస్క్ కేంద్రాలున్నా ఫలితం సున్నా * ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళల ప్రసవ వేదన సంగారెడ్డి క్రైం: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాతా, శిశు హైరిస్క్ ప్రసూతి కేంద్రాలు ఉన్నప్పటికీ ప్రసవం కోసం వస్తున్న మహిళలకు నరకయాతన తప్పడం లేదు. మాతా, శిశు మరణాలను తగ్గించడం, రక్త హీనత, ఇతర సమస్యలతో బాధపడే గర్భిణులకు సుఖ ప్రసవం జరిపించాలన్న ఉద్దేశంతో గత కలెక్టర్ స్మితా సబర్వాల్ ఈ హైరిస్క్ కేంద్రాలను ఏర్పాటు చేయించారు. జిల్లాలోని మెదక్, సిద్దిపేట, పటాన్చెరు, జహీరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ కేంద్రాలు ఉన్నాయి. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోనే హైరిస్క్ కేంద్రం లేకపోవడం విచారకరం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు ఎన్ని కల్పించిన ప్పటికీ వైద్యులు, సిబ్బందిలో అంకితభావం లోపించడం వల్ల గర్భిణులకు ఇబ్బందులు తప్పడం లేదు. మెదక్ మండలం హవేళి ఘన్పూర్ గ్రామానికి చెందిన రవి భార్య శేఖమ్మ ఆదివారం మెదక్, సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యుల సహకారం లభించకపోవడం వల్ల హైదరాబాద్‌కు వెళ్లేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఇంటికి తిరుగుముఖం పట్టింది. ఆర్టీసీ బస్సులో బయలుదేరిన ఆమె మార్గంమధ్యలోనే జోగిపేట సమీపంలో ప్రసవించింది. బస్సు డ్రైవర్, కండక్టర్లు ప్రయాణికులను మరో బస్సు ఎక్కించి శేఖమ్మను జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్, కండక్టర్లు మానవత్వాన్ని ప్రదర్శించడం వల్లే తల్లీబిడ్డలు క్షేమంగా బయట పడ్డారు. ఈ పాటి విజ్ఞతను మెదక్‌లోగానీ, సంగారెడ్డిలోని ప్రభుత్వ వైద్యులు చూపించి ఉంటే శేఖమ్మ ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవించి ఉండేది. హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటయ్యేనా? ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రసూతి కోసం వచ్చిన మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ సుఖ ప్రసవం పొందేందుకు హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటుకు గత కలెక్టర్ స్మితా సబర్వాల్ పూనుకున్నారు. ప్రతినెలా 30 వరకు కాన్పులు జరిగే ప్రతి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని త లిచారు. ప్రభుత్వ ఆస్పత్రికి కాన్పు కోసం వచ్చే మహిళలు సుఖ ప్రసవం పొంది ఇంటికి క్షేమంగా వెళ్లే వరకు ఈ హెల్ప్‌డెస్క్‌లో పనిచేసే సిబ్బంది పర్యవేక్షించాలని ఆమె భావించారు. గర్భిణులకు గానీ, బిడ్డకుగానీ పరిస్థితి ఆందోళకరంగా ఉంటే ఆమెను హైదరాబాద్‌కు తరలించైనా సరే డెలివరీ చేయించాల్సి ఉంటుంది. అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే నిరుపేదలకు వరం లాంటిది. హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటుకు ఒక్కింటికి రూ. 80 వేలు ఎన్ఆర్హెచ్ఎం కింద ఖర్చు చేయాలని భావించారు. కానీ స్మితా సబర్వాల్ ఇక్కడి నుంచి బదిలీ కావడంతో ఈ కార్యాచరణ అంతా కాగితాలకే పరిమితమైంది. తర్వాత ఇన్చార్జ్గా ఉన్న జేసీ శరత్, కొత్తగా వచ్చిన రాహుల్ బొజ్జాలు ఈ విషయంలో దృష్టి సారించక పోయారు. ఇటీవల సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం రాజయ్య సైతం సంగారెడ్డి ఆస్పత్రిలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కానీ హెల్ప్‌డెస్క్‌ల నిర్వహణకు సరిపడా సిబ్బంది లేకపోవడం, ఖర్చులు ఎక్కడి నుంచి వినియోగించాలో తేలకపోవడంతో హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు కాలేదు. ఒకవేళ హెల్ప్‌డెస్క్ సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసి ఉంటే మెదక్ మండలం హవేళి ఘన్‌పూర్‌కు చెందిన గర్భిణికి ఆర్టీసీ బస్సులో కాకుండా ప్రభుత్వ ఆస్పత్రిలోనే కాన్పు జరిగేది. -
ప్రజల కోసం హెల్ప్‌డెస్క్‌లు
జిల్లా, తాలూకా కేంద్రాల్లో ఏర్పాటు: దేవీప్రసాద్ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం నిర్ణయించింది. ఇందుకోసం ప్రతి తాలూకా, జిల్లా కేంద్రాల్లో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయాలని తీర్మానించింది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన టీఎన్జీఓ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటుకు తీర్మానించినట్టు టీఎన్జీఓ అధ్యక్షుడు జి. దేవీప్రసాద్ అనంతరం విలేకరులకు తెలిపారు. ముందుగా జిల్లా కేంద్రాల్లోని తమ కార్యాలయాల్లో ఏర్పాటు చేసి, ఆ తరువాత తాలూకా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. వీటిద్వారా ప్రజలకు అవసరమైన సలహాలు, సూచనలు అందించడమేగాక, కార్యాలయాల్లో వారి సమస్యలు త్వరగా పరిష్కరించేలా చూస్తామన్నా రు. ఉద్యోగులు అలసత్వాన్ని వీడే లా, పని సంస్కృతిని పెంచేలా చర్యలు చేపడుతామన్నారు. కొన్నిశాఖల్లో రోజుకు అదనంగా 2 గంటలు పనిచేస్తున్నామ ని చెప్పారు. ఉద్యోగుల విభజన సమస్యలపై వచ్చే నెల 26, 27 తేదీల్లో ఒక రోజు ఛలో ఢిల్లీ నిర్వహిస్తామన్నారు. విభజన 31లోగా పూర్తిచేయాలి ఉద్యోగుల విభజనను ఈనెల 31 లోగా పూర్తి చేయాలని దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసిన ఎంపీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. -
పండగ జోరు.. చలో పల్లె‘టూరు’
= సొంతవూళ్లకు తరలిన నగరవాసులు = తెలంగాణ జిల్లాలకే పెద్ద ఎత్తున ప్రయాణం = సమ్మె విరమణతో కదిలిన సీమాంధ్ర బస్సులు = తగ్గిన రైళ్ల రద్దీ.. = తుపాన్‌తో ప్రయాణాల విరమణ = రెండు హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు సాక్షి, సిటీబ్యూరో : నగరం పల్లెబాట పట్టింది. దసరా వేడుకల కోసం నగరవాసులు సొంతవూళ్లకు తరలి వెళ్లారు. గత వారం రోజులుగా కొనసాగుతున్న ప్రయాణాలు శనివారం తార స్థాయికి చేరుకొన్నాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధులకు హాజరుకావడంతో సీమాంధ్ర జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో బస్సులు నగరానికి చేరుకొన్నాయి. దీంతో ఇటీవల వరకు తెలంగాణ జిల్లాలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు చాలా రోజుల తరువాత శనివారం విజయవాడ, కడప, కర్నూలు, తిరుపతి, గుంటూరు తదితర ప్రాంతాలకు తరలి వెళ్లాయి. మరోవైపు నగర శివార్ల నుంచి సైతం ప్రజలు భారీ సంఖ్యలో ఊళ్లకు వెళ్లారు. ఒక్క శనివారమే 900కి పైగా బస్సులు వివిధ ప్రాంతాలకు బయలుదేరి వెళ్లినట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ సి.వినోద్‌కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. రెండురోజుల క్రితం వరకు పలుచగా ఉన్న మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లలో సందడి నెలకొంది. మొత్తంగా ఈ ఏడాది సీమాంధ్రలో కొనసాగిన నిరవధిక సమ్మె, నిలిచిపోయిన బస్సుల కారణంగా ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గింది. తెలంగాణ జిల్లాలకు మాత్రమే పెద్దసంఖ్యలో ప్రజలు తరలి వెళ్లారు. పైగా బతుకమ్మ, దసరా వేడుకలకు తెలంగాణలో ఉండే ప్రాధాన్యం దృష్ట్యా ఈ ప్రాంత ప్రజలే ఎక్కువ సంఖ్యలో సొంతవూళ్లకు వెళ్లారు. తెలంగాణ జిల్లాలకు వెళ్లే వాళ్ల కోసం ఆర్టీసీ నాలుగు రోజుల ముందు నుంచే అదనపు బస్సులను ఏర్పాటు చేసింది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, తదితర జిల్లాలకు ప్రయాణికుల రద్దీని బట్టి అదనపు బస్సులు నడిపారు. మరోవైపు నగర శివార్ల నుంచి సైతం ప్రజలు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, సొంత వాహనాలు, రైళ్లలో వెళ్లారు. మొత్తంగా ఈ ఏడాది ప్రయాణికుల సంఖ్య చాలా వరకు తగ్గింది. సాధారణంగా దసరా, సంక్రాంతి వంటి పర్వదినాల్లో హైదరాబాద్ నుంచి కనీసం 20 నుంచి 30 లక్షల మంది సొంత ఊళ్లకు తరలి వెళితే ఈ ఏడాది 10 నుంచి 15 లక్షల మంది మాత్రమే వెళ్లినట్లు అంచనా. వారిలోనూ తెలంగాణ జిల్లాలదే అగ్రస్థానం. యథావిధిగా ‘ప్రైవేట్’ దోపిడీ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ బస్సులు యథావిధిగా తమ దోపిడీ పర్వాన్ని కొనసాగించాయి. ఆర్టీసీ సమ్మెతో ప్రైవేట్ ఆపరేటర్లకు ఈ ఏడాది కనకవర్షం కురిసింది. అది చాలదన్నట్లు వారు రెట్టింపు చార్జీలు వసూలు చేసి ప్రయాణికులపై నిలువు దోపిడీకి పాల్పడ్డారు. రైళ్లు చాలక, ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణం తప్పనిసరి అనుకున్న ప్రయాణికులు రూ.వేలకు వేలు కుమ్మరించి సొంత ఊళ్లకు వెళ్లాల్సి వచ్చింది. మరోవైపు ప్రైవేట్ బస్సులే కాకుండా టాటా ఏసీ, ఓమ్ని వ్యాన్లు, మెటాడోర్లు, ట్యాక్సీలు, కార్లు వంటి ప్రైవేట్ వాహనాలు సైతం తెలంగాణ జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల నుంచి దోచుకున్నాయి. బాలానగర్, చింతల్ నుంచి నర్సాపూర్‌కు వెళ్లేందుకు ఆర్టీసీ చార్జీ రూ.35 అయితే, ఈ వాహనాలు ఒక్కొక్కరి దగ్గర రూ.100 చొప్పున వసూలు చేశాయి. ఉప్పల్ నుంచి జనగామ, హన్మకొండ, ఎల్బీనగర్ నుంచి నకిరేకల్, ఖమ్మం, సూర్యాపేట్ తదితర ప్రాంతాలకు వెళ్లిన ప్రయాణికులు ప్రైవేట్ వాహనాల దారిదోపిడీకి గురయ్యారు. తగ్గిన రైళ్ల రద్దీ గత వారం రోజులుగా ప్రయాణికులతో కిటకిటలాడిన రైళ్లలో శనివారం రద్దీ తగ్గుముఖం పట్టింది. ఇప్పటికే చాలామంది సొంతూళ్లకు వెళ్లిపోవడం ఒక కారణమైతే ఫై-లీన్ తుపాన్ ప్రభావం వల్ల పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు రద్దు కావడంతో చాలామంది ప్రయాణాలు విరమించుకున్నారు. దీంతో సికింద్రాబాద్ రిజర్వేషన్ కార్యాలయం వద్ద టికెట్ల రద్దు కోసం వచ్చినవారి సంఖ్య ఎక్కువగా కనిపించింది. తుపాన్ ప్రభావం వల్ల రద్దయిన, పాక్షికంగా రద్దయిన, దారి మళ్లిన రైళ్ల వివరాలను తెలుసుకొనేందుకు సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లలో అధికారులు రెండు హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక హెల్ప్లైన్లను అందుబాటులోకి తెచ్చారు. సికింద్రాబాద్ హెల్ప్‌లైన్ : 040-27700868 నాంపల్లి హైల్ప్‌లైన్ : 040-23200865