సాక్షి, వెబ్‌డెస్క్ : వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్‌ను మరింత సులభతరం చేసింది కేంద్రం. దీని ప్రకారం ఇకపై వ్యాక్సిన్ స్టాట్ బుకింగ్ కోసం కోవిన్ యాప్, వెబ్‌పోర్టల్‌లకు వెళ్లాల్సిన పని లేదు. థర్డ్ పార్టీ యాప్‌లను వినియోగించాల్సిన అవసరం లేదు. వాట్సాప్ ద్వారానే ఈ పనిని సుళువుగా చేసేయొచ్చు.
ఎక్కువ మందికి చేరువగా
స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరి ఫోన్‌లో వాట్సాప్ కామన్‌గా మారింది. ఎంట్రీ లెవల్ ఫోన్లలోనూ వాట్సాప్ ఉంటోంది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల ప్రజలు సైతం వాట్సాప్‌ను వినియోగడంలో పట్టు పెంచుకున్నారు. దీంతో వాట్సాప్ ద్వారా వాక్సిన్ స్లాట్ బుకింగ్‌కు కేంద్రం అవకాశం కల్పించింది.
వాట్సాప్ అయితేనే
వాట్సాప్ ద్వారా కరోనా హెల్ప్ డెస్క్‌ని ఈ ఏడాది మార్చిలో కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల ప్రారంభం నుంచి వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్‌లోడ్‌కి అవకాశం కల్పించింది. ఇప్పటికే ఈ హెల్ప్‌డెస్క్ నుంచి 31 లక్షల మంది వ్యాక్సిన్ సర్టిఫికేట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇతర ఆప్షన్ల కంటే వాట్సాప్ ద్వారా ఎక్కువ మంది అత్యంత వేగంగా వ్యాక్సిన్ సర్టిఫికేట్టు డౌన్‌లోడ్ చేసుకున్నట్టు కేంద్రం గుర్తించింది. దీంతో వాట్సాప్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్‌కి అవకాశం కల్పించింది.
9013151515
వాట్సాప్ ద్వారా వ్యాక్సిన్ బుకింగ్ చేసుకోవడానికి మైగవ్ కరోనా హెల్ప్ డెస్క్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ పద్దతులు పాటించాలి.
- మీ మొబైల్ నంబరులో 9013151515 నంబరు సేవ్ చేసుకోవాలి. ఇదే నంబరుకు బుక్ స్లాట్ అని ఇంగ్లిష్‌లో టైప్ చేసి మెసేజ్ పంపాలి.
- ఆరు అంకెల ఓటీపీ నంబరు మీ మొబైల్‌కి వస్తుంది. మూడు నిమిషాల్లోగా ఓటీపీ నంబర్ ఎంటర్ చేయాలి
- ఆ నంబరు ఆధారంగా ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాలను బట్టి మనకు వివిధ ఆప్షన్లు వస్తాయి. అందులో మొదటి డోసు ఎప్పుడు ఇచ్చారు, రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి అనే విషయాలు ఉంటాయి
- హెల్ప్ డెస్క్ మెనూలో కుటుంబ సభ్యుల్లో ఎవరి పైరునైనా చేర్చాలా , దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ సెంటర్ వివరాలు ఇలా వివిధ ఆప్షన్లకు 1, 2 ,3 ఇలా 8 వరకు నంబర్లు కేటాయించారు. మన అవసరానికి తగ్గట్టు నంబరును రిప్లై ఇస్తే దానికి తగ్గట్టుగా ఆప్షన్లు వస్తాయి.
- ఈ హెల్ప్‌లైన్ డెస్క్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవడంతో పాటు కరోనాకు సంబంధించి ఇతర సమాచారాన్ని కూడా తెలుసుకునే వీలుంది.
Comments
Please login to add a commentAdd a comment