హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సంలో(2015-16) రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చేరే విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఈ నెలలోనే హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని కళాశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు డిగ్రీ కాలేజీల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై అకడమిక్ కేలండర్‌ను రూపొందించింది. దీన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బుధవారం సచివాలయంలో ఆవిష్కరించారు.
డిగ్రీ కాలేజీల్లో నిర్వహించాల్సిన వివిధ పాఠ్య, పాఠ్య అనుబంధ, పాఠ్యేతర కార్యక్రమాలను ఈ కేలండర్‌లో పొందుపరిచారు. డిగ్రీలో నాణ్యమైన విద్యను అందించేందుకు అధ్యాపకులు రోజువారీ, నెలవారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలను కూడా పేర్కొన్నారు. ఇవి ఈ నెల నుంచే ప్రారంభమై, వచ్చే ఏడాది ఏప్రిల్‌తో ముగుస్తాయి. ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్, న్యాక్, జేకేసీ తది తర కార్యక్రమాలను కేలండర్‌లో చేర్చారు. ప్రతినెల 4న స్వచ్ఛ భారత్ ను నిర్వహిస్తారు. విద్యార్థుల్లో అంతర్గత నైపుణ్యాలను వెలికితీయడానికి, వారి అభిరుచులను పంచుకోడానికి వేదిక ఏర్పాటును కూడా ప్రతిపాదించారు.
హేతుబద్దీకరణ, బదిలీలపై నేడు భేటీ
రాష్ట్రంలో పాఠశాలలు, సిబ్బంది, పోస్టుల హేతుబద్దీకరణ, పదోన్నతులు, బదిలీలపై చర్చించేందుకు ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యా శాఖ గురువారం ఉదయం 11 గం టలకు సమావేశం కానుంది. అన్ని సంఘాల నేతలతో పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు విడివిడిగా చర్చిస్తారు. శుక్ర లేదా శని వారాల్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే అవకాశముంది. కాగా, రాష్ర్టంలోని గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహిం చిన పరీక్షలో 3,325 మందిని తాత్కాలికంగా ఎంపిక చేసినట్లు గురుకుల విద్యాలయాల సొసైటీ ప్రకటించింది. అభ్యర్థుల ఫలి తాలను ్టటట్జఛీఛి.ఛిజజ.జౌఠి.జీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 20న ఒరిజనల్ సర్టిఫికెట్లతో ఆయా జిల్లా కన్వీనర్లను సంప్రదించాలని సొసైటీ సూచించింది.
ప్రభుత్వ కాలేజీల్లో హెల్ప్‌డెస్క్
Published Thu, May 7 2015 2:27 AM | Last Updated on Tue, Oct 2 2018 7:58 PM
Advertisement
Advertisement