government collages
-
మరో 12 పాలిటెక్నిక్ కాలేజీలకు ఎన్బీఏ గుర్తింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్(ఎన్బీఏ) గుర్తింపు సాధనలో దూసుకెళ్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యనందిస్తూ గణనీయమైన ప్లేస్మెంట్లు నమోదు చేస్తున్నాయి. తాజాగా మరో 12 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలకు ఎన్బీఏ సర్టిఫికేషన్ దక్కింది. అనంతపురం, శ్రీశైలం, తిరుపతి, పిల్లరిపట్టు, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, జమ్మలమడుగు, కదిరి, నందిగామ, పలమనేరు, కడప మహిళా పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు మదనపల్లె మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కాలేజీకి కూడా ఎన్బీఏ సర్టిఫికేషన్ దక్కింది. పక్కా ప్రణాళికతో ముందుకు.. రాష్ట్రంలో మొత్తం 87 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలుండగా.. తొలి దశలో 41 కాలేజీలకు ఎన్బీఏ సర్టిఫికేషన్ సాధించేలా సాంకేతిక విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే మొత్తం 31 పాలిటెక్నిక్ కాలేజీల్లోని 60 విభాగాల్లో ఎన్బీఏ సర్టిఫికేషన్‌ను సాధించింది. ఈ విద్యా సంవత్సరం ముగిసేలోగా ఎన్బీఏ బృందం మరిన్ని కాలేజీలను కూడా పరిశీలించనుంది. పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్న సాంకేతిక విద్యా శాఖ పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించడంతో పాటు ల్యాబ్‌లు, వర్క్‌షాప్‌లు, సొంత భవనాల నిర్మాణాలను చేపడుతోంది. వచ్చే ఏడాదికి వీలైనన్ని కాలేజీల్లో హాస్టల్ సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చేలా ప్రత్యేక దృష్టి సారించింది. పాలిటెక్నిక్ విద్య ద్వారా లభించే ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల చేరికలను ప్రోత్సహిస్తోంది. పాలిసెట్ కోసం ఉచితంగా కోచింగ్‌ను కూడా అందుబాటులోకి తెస్తోంది. ఇది సరికొత్త చరిత్ర సీఎం జగన్ ఆదేశాలకు అనుగుణంగా విద్యా ప్రమాణాలను పెంపొందిస్తున్నాం. అందువల్లే ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలకు అత్యంత ప్రతిష్టాత్మక ఎన్బీఏ సర్టిఫికేషన్ దక్కుతోంది. భవిష్యత్‌లో ప్రతి కాలేజ్‌నూ ఎన్బీఏ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కరిక్యులమ్‌లో మార్పులు తెచ్చాం. ఉద్యోగ అవకాశాలు పెంచేలా 674 పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకున్నాం. గత విద్యా సంవత్సరంలో 7 వేల మంది చదువులు పూర్తి చేసుకుంటే 4 వేల మందికి పైగా ప్లేస్మెంట్లు సాధించారు. పది శాతంగా ఉన్న ప్లేస్మెంట్లను 60 శాతానికి తీసుకువచ్చాం. ఇది సరికొత్త చరిత్ర. – చదలవాడ నాగరాణి కమిషనర్, సాంకేతిక విద్యాశాఖ -
టెన్త్, ఇంటర్ టాపర్లకు ప్రభుత్వ సత్కారం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెరిగాయని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. టెన్త్, ఇంటర్ ఫలితాలే అందుకు నిదర్శనమన్నారు. ఈ విద్యా సంవత్సరం పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను సన్మానించనున్నట్లు బొత్స ప్రకటించారు. బుధవారం విజయవాడలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులను అవార్డులు, నగదు పురస్కారాలతో సత్కరిస్తామన్నారు. జడ్పీ, ప్రభుత్వ, మున్సిపల్, ఏపీ మోడల్, బీసీ రెసిడెన్షియల్, ఏపీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, జీటీడబ్ల్యూ ఆశ్రమ స్కూళ్లు, కేజీబీవీ విద్యార్థులకు ఈ అవకాశం కల్పించినట్లు తెలిపారు. మార్కుల ఆధారంగా టెన్త్, ఇంటర్లో 2,831 మంది విద్యార్థులను సత్కరించనున్నట్లు చెప్పారు. విద్యారంగాన్ని ప్రోత్సహిస్తూ పేదలు అధికంగా చదివే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దాలన్నదే సీఎం జగన్ సంకల్పమన్నారు. అందుకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన, దీర్ఘకాలిక ప్రయోజనాల దిశగా అధునాతన వసతులు, డిజిటల్ విద్యా బోధన తదితరాలను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ఇప్పటివరకు అమలు చేసిన విప్లవాత్మక కార్యక్రమాలకు తోడు ఈ ఏడాది నుంచి టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన వారిని ప్రోత్సహించే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు వివరించారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు, కళాశాల ప్రిన్సిపాళ్లను కూడా సత్కరిస్తామన్నారు. ఆరోగ్యకరమైన పోటీతో ప్రోత్సహించేందుకే.. ఈ నెల 23న నియోజకవర్గ స్థాయిలో సత్కార వేడుక నిర్వహించి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు పతకం, సర్టిఫికెట్ ప్రదానం చేస్తామని బొత్స తెలిపారు. మే 27న జిల్లా స్థాయిలో సత్కారంలో విద్యార్థులకు మొదటి బహుమతిగా రూ.50 వేలు, రెండో బహుమతిగా రూ.30 వేలు, మూడో బహుమతిగా రూ.10 వేలు నగదు అందచేస్తామన్నారు. రాష్ట్రస్థాయిలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా రూ.లక్ష, రూ.75 వేలు, రూ.50 వేలు చొప్పున నగదు పురస్కారాలతో సత్కరిస్తామని వెల్లడించారు. ఈనెల 31న జరిగే రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఆరోగ్యకరమైన పోటీతో ప్రతిభను ప్రోత్సహించేందుకే మెరిట్ అవార్డులు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. సమావేశంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు, పాఠశాల విద్య పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవానందరెడ్డి, కేజీబీవీ కార్యదర్శి డి.మధుసూదనరావు, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ సెక్రటరీ ఆర్.నరసింహారావు, సమగ్ర శిక్షా ఏఓ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
కంప్యూటర్ విద్య.. మిథ్య
ఒక విద్యాలయం గొప్పతనం పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడిపై ఆధారపడి ఉంటుందే గానీగొప్ప భవనాలను బట్టి కాదని మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పిన మాటలు నేడు వ్యతిరేకార్థంలో ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలలకు పెద్ద పెద్ద భవనాలు నిర్మించినా వాటిలో చదివేవిద్యార్థులకు బోధించేందుకు అధ్యాపకులను నియమించడంలేదు. జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కంప్యూటర్ అధ్యాపకులు లేకుండానే ఆ కోర్సులు పూర్తి చేయాల్సిన దుస్థితి విద్యార్థులకు ఏర్పడింది. తణుకు టౌన్ : దేశంలో, రాష్ట్రంలో కంప్యూటర్ వ్యవస్థను తానే ప్రవేశపెట్టినట్టు గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ కళాశాలల్లో కంప్యూటర్ విద్యకు సంబంధించిన అధ్యాపకులను నియమించకపోవడం దారుణం. దీంతో ప్రభుత్వ కళాశాలల్లో చేరిన డిగ్రీ విద్యార్థులు అధ్యాపకులు లేకుండానే తమ కంప్యూటర్ విద్యను కొనసాగిస్తున్నారు. ప్రతి పని కంప్యూటర్ ఆధారంగా జరగాలని కోరుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు కంప్యూటర్ నైపుణ్యాలు బోధించేందుకు అవసరమైన సిబ్బందిని నియమించాలనే ఆలోచన ఇప్పటికీ కలగపోవడం ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు చేసుకున్న పాపమేమో! అని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఒక అటానమస్ కాలేజ్, ఆరు ప్రభుత్వ పెద్ద కళాశాలలు, మరో 15 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు వుండగా వాటిలో డిగ్రీ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం కలిపి సుమారు 8 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ మిగిలిన సబ్జెక్టుల మాదిరిగానే కంప్యూటర్ సైన్స్‌కు సంబంధించిన రెగ్యులర్ అధ్యాపకులు ఉండాలి. కానీ జిల్లాలోని మొత్తం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తాడేపల్లిగూడెం, నిడదవోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు మాత్రమే కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులున్నారు. అదీ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. మిగిలిన కళాశాలల్లో అసలు కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులే లేకుండా విద్యార్థులు తమ చదువులు కానిచ్చేస్తున్నారు. డిగ్రీలో కంప్యూటర్ కోర్సుకు సంబంధించి విద్యార్థి నుంచి రూ.3 వేల నుంచి రూ.8 వేల వరకూ ఫీజులు వసూలు చేసుకోవచ్చని ప్రభుత్వం, రూ.7,500 వరకూ వసూలు చేసుకోవచ్చని యూనివర్సిటీలు ఆదేశిస్తున్నాయి. ఫీజులు వసూలు చేసుకోవచ్చని ఆదేశించిన ప్రభుత్వం విద్యార్థులకు కావలసి బోధన సిబ్బందిని నియమించాలనే విషయం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కంప్యూటర్ అధ్యాపకులను నియమించకపోవడంతో కంప్యూటర్ విద్య చదువుకోవాలనుకునే విద్యార్థులు ఫీజులు భారమైనా ప్రైవేట్ కళాశాలల్లో చేరుతున్నారు. కళాశాలల్లో కంప్యూటర్ విద్యాబోధనకు అధ్యాపకులను నియమించని ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి కళాశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, వర్చువల్ క్లాస్ రూమ్‌ల పేరుతో ప్రత్యేక రూమ్‌లు ఏర్పాటు చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో కంప్యూటర్లు ల్యాబ్‌ల్లో భద్రంగా ఉంటున్నాయేగానీ అవి విద్యార్థులకు ఉపయోగపడటం లేదు. అధ్యాపకులను నియమించకపోవడం బాధాకరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కంప్యూటర్ సైన్స్‌కు సంబంధించిన అధ్యాపకులను నియమించకపోవడం బాధాకరం. 30 ఏళ్ల క్రితమే రాష్ట్రంలో మొదటిసారిగా పెనుగొండ కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్‌తో, అధ్యాపకులతో బీఎస్సీ కంప్యూటర్ కోర్సును ప్రారంభించాం. దీంతో ప్రైవేట్ కంప్యూటర్ సంస్థలతో పోటీగా అక్కడ విద్యార్థులు కంప్యూటర్ రంగంలో రాణించారు. అయితే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కంప్యూటర్ కోర్సుకు సంబంధించి ఆధునిక సదుపాయాలు ఎన్ని కల్పించినా అవి అధ్యాపకుడు లేకుండా పరిపూర్ణం కావు. – డాక్టర్ గుబ్బల తమ్మయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్, తణుకు -
సీట్లు మురిగిపోవాల్సిందేనా?
- ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో మిగిలే సీట్ల భర్తీకి లేని అవకాశం - వివరాలను ప్రకటించని వర్సిటీలు, కాలేజీలు సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల్లో భాగంగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీపై ప్రభుత్వం దృష్టిసారించట్లేదు. దీంతో విద్యార్థులకు రావాల్సిన సీట్లు మురిగిపోతున్నాయి. రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల పరిధిలో 17 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా ఏటా ఒక్కో కాలేజీలో పదుల సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నాయి. ఎంతో డిమాండ్ ఉండే ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులకు ఇష్టమైన బ్రాంచీల్లో సీట్లు రాకపోవడంతో చాలా మంది విద్యార్థులు ఆయా కాలేజీల్లో చేరట్లేదు. ఈసారి కూడా వివిధ కాలేజీల్లో సీట్లు మిగిలిపోయినట్లు సమాచారం. ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలోనే 20 సీట్లు మిగిలిపోగా మిగిలిన 16 కాలేజీల్లోనూ సీట్లు మిగిలినట్లు తెలియవచ్చింది. కానీ ఏ కాలేజీలో ఎన్ని సీట్లు మిగిలిపోయాయన్న వివరాలను వర్సిటీలు, కాలేజీలు ప్రకటించట్లేదు. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలలో సీట్లు మిగిలిపోతే సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు (సీఎస్ఏబీ) నిర్వహిస్తోంది. ఇప్పటికే నాలుగు దఫాలుగా కౌన్సెలింగ్ నిర్వహించింది. నాలుగో దశ ముగిశాక కూడా దాదాపు 3,500 సీట్లు మిగిలిపోవడంతో మరోసారి స్పాట్ అడ్మిషన్ల కోసం ప్రస్తుతం కౌన్సెలింగ్ నిర్వహణకు చర్యలు చేపట్టింది. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించింది. 18న సీట్ల కేటాయింపు ప్రకటిస్తామని, 18 నుంచి 26 వరకు విద్యార్థులు నేరుగా ఆయా కాలేజీల్లో చేరాలని సూచించింది. అయితే రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో మిగిలే సీట్లలో చేరేందుకు జేఈఈ మెయిన్ పరీక్ష రాసిన విద్యార్థులు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే మిగులు సీట్లను ప్రకటించి వాటిని భర్తీ చేయాలని కోరుతున్నారు. మిగులు సీట్ల విషయంపై అధికారులను వివరణ కోరగా ప్రభుత్వ కాలేజీల్లో చివరి దశ కౌన్సెలింగ్ తరువాత విద్యార్థులు చేరని సీట్లను భర్తీ చేసే అవకాశం లేదని చె ప్పారు. -
ప్రభుత్వ కాలేజీల్లో హెల్ప్‌డెస్క్
హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సంలో(2015-16) రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చేరే విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఈ నెలలోనే హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని కళాశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు డిగ్రీ కాలేజీల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై అకడమిక్ కేలండర్‌ను రూపొందించింది. దీన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బుధవారం సచివాలయంలో ఆవిష్కరించారు. డిగ్రీ కాలేజీల్లో నిర్వహించాల్సిన వివిధ పాఠ్య, పాఠ్య అనుబంధ, పాఠ్యేతర కార్యక్రమాలను ఈ కేలండర్లో పొందుపరిచారు. డిగ్రీలో నాణ్యమైన విద్యను అందించేందుకు అధ్యాపకులు రోజువారీ, నెలవారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలను కూడా పేర్కొన్నారు. ఇవి ఈ నెల నుంచే ప్రారంభమై, వచ్చే ఏడాది ఏప్రిల్‌తో ముగుస్తాయి. ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, ఇంటర్నల్ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్, న్యాక్, జేకేసీ తది తర కార్యక్రమాలను కేలండర్లో చేర్చారు. ప్రతినెల 4న స్వచ్ఛ భారత్ ను నిర్వహిస్తారు. విద్యార్థుల్లో అంతర్గత నైపుణ్యాలను వెలికితీయడానికి, వారి అభిరుచులను పంచుకోడానికి వేదిక ఏర్పాటును కూడా ప్రతిపాదించారు. హేతుబద్దీకరణ, బదిలీలపై నేడు భేటీ రాష్ట్రంలో పాఠశాలలు, సిబ్బంది, పోస్టుల హేతుబద్దీకరణ, పదోన్నతులు, బదిలీలపై చర్చించేందుకు ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల విద్యా శాఖ గురువారం ఉదయం 11 గం టలకు సమావేశం కానుంది. అన్ని సంఘాల నేతలతో పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు విడివిడిగా చర్చిస్తారు. శుక్ర లేదా శని వారాల్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపే అవకాశముంది. కాగా, రాష్ర్టంలోని గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహిం చిన పరీక్షలో 3,325 మందిని తాత్కాలికంగా ఎంపిక చేసినట్లు గురుకుల విద్యాలయాల సొసైటీ ప్రకటించింది. అభ్యర్థుల ఫలి తాలను ్టటట్జఛీఛి.ఛిజజ.జౌఠి.జీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 20న ఒరిజనల్ సర్టిఫికెట్లతో ఆయా జిల్లా కన్వీనర్లను సంప్రదించాలని సొసైటీ సూచించింది.