ఆర్‌పీఎఫ్ పాత్ర కీలకం
గుంతకల్లు : రైల్వే ఆస్తుల పరిరక్షణ, ప్రయాణికుల రక్షణలో ఆర్‌పీఎఫ్ పాత్ర ప్రముఖమైందని గుంతకల్లు రైల్వే డివిజనల్ మేనేజర్ అమితాబ్ ఓజా అన్నారు. స్థానిక రైల్వే క్రీడామైదానంలో ఆర్‌పీఎఫ్ (రైల్వే రక్షక దళం) 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. డీఆర్‌ఎంతోపాటు, ఆర్‌పీఎఫ్ కమాండెంట్ ఏలిషా, జిల్లా జీఆర్‌పీ ఎస్పీ సుబ్బారావు హాజరయ్యారు. తొలుత రైల్వే రక్షక దళం జెండాను డీఆర్‌ఎం ఆవిష్కరించి, గౌరవ వందనాన్ని స్వీకరించారు.
అసిస్టెంట్ కమాండెంట్లు వసంతకుమార్ (గుంతకల్లు), చంద్రశేఖర్ (రేణిగుంట), డివిజన్‌లోని వివిధ రైల్వేస్టేçÙన్ల అర్‌పీఎఫ్ సీఐలు కోటా జోజే, ప్రసాద్, నాగార్జునరావు (తిరుపతి), సంతోష్‌కుమార్ (రాయచూర్), వినోద్‌కుమార్ మీనా (అనంతపురం), సుబ్బయ్య (గుత్తి), రవిప్రకాష్ (డోన్), మధుసూదన్ (రేణిగుంట), ఎన్‌వీ నారాయణస్వామి (చిత్తూరు), బి.వెంకటరమణ (కడప)తోపాటు డివిజన్ పరిధిలోని ఆర్‌పీఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చోరీల నియంత్రణకు చర్యలు
ప్రయాణికుల రక్షణ, రైల్వే ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు గుంతకల్లు ఆర్‌పీఎఫ్ డివిజనల్ సెక్యూరిటీ కమాండెంట్ ఏలిషా తెలిపారు. స్థానిక డీఆర్‌ఎం కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రధాన రైల్వేస్టేçÙన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఐబీ బేస్డ్ సిస్టం ద్వారా డివిజన్‌లోని సీసీ కెమెరాలను లింకప్ చేసుకొని గుంతకల్లులోని తన కార్యాలయం నుంచే మానిటరింగ్ చేస్తామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25 మంది దొంగలను అరెస్టు చేసి రూ. 8 లక్షల 23 వేలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. మహిళా ప్రయాణికుల కోసం మహిళా ఆర్‌పీఎఫ్‌లను నియమించినట్లు చెప్పారు.