
వాట్సాప్ కంటే మెరుగైన యాప్ తయారు చేయాలనుకుని..
ప్రాజెక్టు విఫలమవడంతో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: వాట్సాప్ కంటే మెరుగైన యాప్‌ను తయారు చేయాలనుకుని విఫలమైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వివరాలను హైదరాబాద్ సంజీవరెడ్డినగర్ ఎస్సై అజయ్‌కుమార్ వెల్లడించారు. అమీర్‌పేట ధరమ్‌కరమ్ రోడ్డులో నివాసం ఉంటు న్న అశోక్ అగర్వాల్‌కు ఇద్దరు కుమారులు. చిన్నకుమారుడు ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటున్నాడు. బీటెక్ పూర్తి చేసిన పెద్ద కుమారుడు లక్కీ అగర్వాల్(35) తల్లిదండ్రులతో పాటే ఉంటున్నాడు. సమాచార రంగంలో మెరుగైన యాప్‌ను తయారు చేయాలని భావించిన లక్కీ ఓ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టాడు.
అది అనుకున్నంత విజయం సాధించకపోగా ఆర్థికంగా నష్టాలు తెచ్చిపెట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. నెల రోజుల నుంచి ఇంట్లో నుంచి బయటకు వెళ్ల డంలేదు. చివరకు ఇంట్లో ఎవరికీ తెలియకుండా మంగళవారంరాత్రి నైట్రో గ్యాస్ సిలిండర్‌ను కొనుక్కుని తన గది లో పెట్టుకున్నాడు. ఓ పాలిథిన్ కవర్‌లోకి ఆ గ్యాస్ ఎక్కించుకుని మెడ నిండా దాన్ని చుట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్నం వరకు ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు తలుపు తెరిచి చూడగా గదిలో విగతజీవుడిగా కనిపించాడు. అనంత రం సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరిపారు. గదిలో ఓ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పెయిన్‌లెస్‌గా ఉంటుందని గ్యాస్ సిలిండర్ ద్వారా ఆత్మహత్య చేసుకుంటున్నానని, అందరూ బాగుండాలని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు ఎస్సై తెలిపారు.