సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్ వక్రబుద్ధి | hyderabad software engineer held for filming | Sakshi
Sakshi News home page

సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్ వక్రబుద్ధి

Published Thu, Apr 13 2017 10:44 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్ వక్రబుద్ధి - Sakshi

సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్ వక్రబుద్ధి

హైదరాబాద్‌: ఈజీమనీ కోసం ఓ సాఫ్ట్ వేర్‌ ఇంజనీర్‌ ఎవరూ ఊహించనివిధంగా నీచానికి దిగజారాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు పడకింటి రహస్యాలను బట్టబయలు చేశాడు. భార్య ఫిర్యాదుతో చివరకు పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్‌ లో వెలుగు చూసిన ఈ దురాగతం వివరాలను పోలీసులు వెల్లడించారు. భార్యతో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా  నిందితుడు అశ్లీల వెబ్ సైట్లలో పెట్టాడు. భార్య దగ్గర ఏమీ ఎరగనట్టు నటించాడు.

తమ ఏకాంత జీవితానికి సంబంధించిన వీడియోలు అశ్లీల వెబ్‌ సైట్లలోకి ఎక్కాయన్న విషయం తెలుసుకున్న బాధితురాలు హతాశురాలైంది. ఆలస్యం చేయకుండా సైబరాబాద్‌ పోలీసులను ఆశ్రయించింది. భర్త ల్యాప్‌ టాప్‌ నుంచే వీడియోలు వెళ్లినట్లు ఐపీ నంబరు ఆధారంగా పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ఈజీమనీ కోసం అశ్లీల వెబ్‌ సైట్లను ఆశ్రయించినట్టు పోలీసుల విచారణలో అంగీకరించాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement