రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి చెందగా ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు. మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే జగదీశ్వర్, సాయి బిందు అనే దంపతులు సోమవారం ఉదయం బైక్‌పై విధులకు బయలుదేరారు. వారి బైక్ బయోడైవర్సిటీ పార్కు వద్ద రోడ్డుపై ఉన్న స్టాఫర్స్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో జగదీశ్వర్ అక్కడికక్కడే చనిపోగా సాయి బిందు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి
Published Mon, May 30 2016 12:36 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement
Advertisement