jagadisvar
-
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి చెందగా ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు. మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే జగదీశ్వర్, సాయి బిందు అనే దంపతులు సోమవారం ఉదయం బైక్‌పై విధులకు బయలుదేరారు. వారి బైక్ బయోడైవర్సిటీ పార్కు వద్ద రోడ్డుపై ఉన్న స్టాఫర్స్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో జగదీశ్వర్ అక్కడికక్కడే చనిపోగా సాయి బిందు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కన్న తండ్రేనా?
ఐదు రోజుల ఆడ పిల్లను వదిలించుకునే యత్నం మూసీకాల్వలో పడేసేందుకు పన్నాగం ఇతనో ప్రభుత్వ ఉద్యోగి ఉప్పల్: పొత్తిళ్ల బిడ్డను కడతేర్చాలని చూశాడు ఈ తండ్రి. తల్లికి తెలియకుండానే కడతేర్చాలనుకున్నాడు. ఆడ పిల్ల పుట్టిందని అందులోనూ అవిటిది (పోలియో) అయిందని గ్రహించిన ఆ తండ్రి ఎలాగైనా బిడ్డను వదిలించుకోవాలని యత్నించాడు. ఐదు రోజుల బిడ్డను గుట్టు చప్పుడు కాకుండా తల్లి పొత్తిళ్ల నుంచి తీసుకొచ్చి ఉప్పల్ ఏషియన్ థియేటర్ ఎదురుగా గల నాలాలో పడేయడానికి ప్రయత్నిస్తూ స్థానికులకు పట్టుబడ్డాడు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు.. ప్రకారం.. సరూర్‌నగర్ కర్మాన్‌ఘాట్‌కు చెందిన జిల్లా జగదీశ్వర్(35) నాంపల్లి ఎలక్ట్రికల్ విభాగంలో జూనియర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. భార్య ప్రతిమ(30) వీరికి ఒక బాబు ఉన్నాడు. ఈ నెల 21న ప్రసవం కోసం చైతన్యపురిలోని స్వప్న ఆస్పత్రిలో చేరింది. అదే రోజు ఆడపిల్లకు జన్మనిచ్చింది. పిల్ల అవిటిగా (పోలియో ఎఫెక్ట్‌తో) పుట్టడంతో ఎలాగైనా వదిలించుకుందామనుకున్నాడు ఆ తండ్రి. ఆదివారం సాయంత్రం బిడ్డను ఆస్పత్రి నుంచి తీసుకొని బస్సులో ఉప్పల్ ఏషియన్ థియేటర్‌కు చేరుకున్నాడు. పొత్తిళ్ల బిడ్డను మూసీ కాల్వలో పడేయడానికి తండ్రి జగదీశ్వర్ ప్రయత్నిస్తుండగా ఈ విషయాన్ని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి పసిగట్టి 100కి ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఆ లోపు స్థానికులను పోగు చేసిన ఆ ఉద్యోగి అతడ్ని పట్టుకొని పోలీసులు వచ్చే వరకు నిలువరించారు. పోలీసులు వచ్చి బిడ్డను స్వాధీనం చేసుకొని తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. -
రూ.10వేలు బకాయిపడితే నల్లా కట్
సాక్షి,సిటీబ్యూరో: నీటి బిల్లు బకాయిలు రూ.10 వేలు దాటితే నల్లా కనెక్షన్ కట్ చేయాలని జలమండలి నిర్ణయించింది.శనివారం ఖైరతాబాద్‌లోని బోర్డు ప్రధాన కార్యాలయంలో ఎమ్డీ జగదీశ్వర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరుకు నెలవారీ నీటి బిల్లులు, బకాయిలతో కలిపి రూ.100 కోట్లు రాబట్టాలని నిర్ణయించారు. జలమండలికి రావలసిన బకాయిల మొత్తం రూ.వెయ్యి కోట్లకు పైగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెలవారీ బిల్లులతో పాటు బకాయిల్లో కొంతమొత్తమైనా రాబట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. నూతన కుళాయి కనెక్షన్ల జారీ, ట్యాంకర్ల ద్వారా విక్రయించే నీటి చార్జీలు అన్నీ కలిపితేరూ.100 కోట్ల రెవెన్యూ లక్ష్యం సాధించవచ్చని ఓ అధికారి తెలిపారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 8.25 లక్షల కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. నెలవారీ ఠంఛనుగా బిల్లులు చెల్లించేవారు నాలుగు లక్షలకు మించకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ సమావేశంలో ఈడీ సత్యనారాయణ, ఇతర డెరైక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రూ.200 కోసం హత్య
వీడిన డ్రైవర్ మర్డర్ కేసు మిస్టరీ హత్యకు పాల్పడిన తాగుబోతు రిమాండ్ మియాపూర్, న్యూస్‌లైన్: ఐడీఏ బొల్లారం రోడ్డులో ఈనెల 11న వెలుగు చేసిన డ్రైవర్ హత్య కేసును మియాపూర్ పోలీసులు ఛేదించారు. హతుడి వద్ద ఉన్న రూ. 200, సెల్‌ఫోన్ కోసం ఓ తాగుబోతు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తేల్చారు. నిందితుడిని అరెస్టు చేసి, సోమవారం రిమాండ్‌కు తరలించారు. సీఐ పురుషోత్తం కథనం ప్రకారం... కర్ణాటకలోని సుప్తాపూర్ గ్రామానికి చెందిన జగదీశ్వర్ అలియాస్ జగదీశ్ (38) కుటుంబ సభ్యులతో కలిసి మియాపూర్ రెడ్డికాలనీలో ఉంటూ.. విజయ లాజిస్టిక్స్ ట్రాన్స్‌ఫోర్ట్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈనెల 10న జీతం రావడంతో భార్యకు రూ. 8500 ఇచ్చి.. రూ. 1500 తన జేబులో పెట్టుకున్నాడు. మియాపూర్ వెళ్లి స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. రాత్రి 10 గంటలకు ఇంటికి వెళ్తూ మద్యం బాటిల్ తీసుకొనేందుకు సత్య వైన్స్ వద్ద ఆగాడు. ఇదిలా ఉండగా.. జగద్గిరిగుట్టకు చెందిన ఎండీ ఇర్ఫాన్ (23) డ్రైవర్. మద్యానికి బానిసైన ఇతను రాత్రి వేళ్లల్లో వైన్స్ వద్ద తిష్టవేసి.. అతిగా మద్యం తాగి వెళ్లే వారిని గుర్తించి వారిపై దాడి చేసి డబ్బులు లాక్కోవడం ప్రవృత్తిగా చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 10వ తేదీ రాత్రి అతిగా మద్యం తాగి ఉన్న జగదీశ్‌ను సత్య వైన్స్ వద్ద గమనించి.. ఐడీఏబొల్లారం రోడ్డులోని ఎమ్మార్ఎఫ్ వరకు అతడిని అనుసరించాడు. ఇర్ఫాన్ అక్కడ జగదీశ్ వద్ద ఉన్న పర్సు లాక్కోవడానికి ప్రయత్నించగా ప్రతిఘటించాడు. ఈ క్రమంలో ఇర్ఫాన్ కత్తితో జగదీశ్‌ను పొడి చంపి.. అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో పాటు పర్సులో ఉన్న రూ. 200 తీసుకుని పారిపోయాడు. దొంగిలించిన సెల్‌ఫోన్‌ను చందానగర్‌లో పరుశురామ్ అనే వ్యక్తికి రూ. 600కు విక్రయించగా.. అతను సలీం అనే మరో వ్యక్తికి అమ్మేశాడు. కాగా, 11వ తేదీ ఉదయం ఎమ్మార్ ఎఫ్ వద్ద మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఘటనా స్థలంలో లభించిన డ్రైవింగ్ లెసైన్స్ ఆధారంగా హతుడు జగదీశ్‌గా గుర్తించారు. ఎత్తుకెళ్లిన సెల్‌ఫోన్ ఈఎంఈఐ నెంబర్ ఆధారంగా నిందితుడు ఇర్ఫాన్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. 15 రోజుల్లోనే కేసును ఛేదించిన ఎస్సై వెంకటేశ్, జమీందార్ మల్లేష్, కానిస్టేబుల్ మహేశ్, ప్రభాకర్‌లు సీఐ పురుషోత్తం అభినందించారు.