కన్న తండ్రేనా? | female cub five days to attempt | Sakshi
Sakshi News home page

కన్న తండ్రేనా?

Published Mon, Oct 26 2015 12:53 AM | Last Updated on Sun, Sep 3 2017 11:28 AM

కన్న తండ్రేనా?

కన్న తండ్రేనా?

ఐదు రోజుల ఆడ పిల్లను వదిలించుకునే యత్నం
మూసీకాల్వలో పడేసేందుకు పన్నాగం
ఇతనో ప్రభుత్వ ఉద్యోగి

 
ఉప్పల్: పొత్తిళ్ల బిడ్డను కడతేర్చాలని చూశాడు ఈ తండ్రి. తల్లికి తెలియకుండానే కడతేర్చాలనుకున్నాడు. ఆడ పిల్ల పుట్టిందని అందులోనూ అవిటిది (పోలియో) అయిందని గ్రహించిన ఆ తండ్రి ఎలాగైనా బిడ్డను వదిలించుకోవాలని యత్నించాడు. ఐదు రోజుల బిడ్డను గుట్టు చప్పుడు కాకుండా తల్లి పొత్తిళ్ల నుంచి తీసుకొచ్చి ఉప్పల్ ఏషియన్ థియేటర్ ఎదురుగా గల నాలాలో పడేయడానికి ప్రయత్నిస్తూ స్థానికులకు పట్టుబడ్డాడు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు.. ప్రకారం.. సరూర్‌నగర్ కర్మాన్‌ఘాట్‌కు చెందిన జిల్లా జగదీశ్వర్(35) నాంపల్లి ఎలక్ట్రికల్ విభాగంలో జూనియర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. భార్య ప్రతిమ(30) వీరికి ఒక బాబు ఉన్నాడు. ఈ నెల 21న ప్రసవం కోసం చైతన్యపురిలోని స్వప్న ఆస్పత్రిలో చేరింది.

అదే రోజు ఆడపిల్లకు జన్మనిచ్చింది. పిల్ల అవిటిగా (పోలియో ఎఫెక్ట్‌తో) పుట్టడంతో ఎలాగైనా వదిలించుకుందామనుకున్నాడు ఆ తండ్రి. ఆదివారం సాయంత్రం బిడ్డను ఆస్పత్రి నుంచి తీసుకొని బస్సులో ఉప్పల్ ఏషియన్ థియేటర్‌కు చేరుకున్నాడు. పొత్తిళ్ల బిడ్డను మూసీ కాల్వలో పడేయడానికి తండ్రి జగదీశ్వర్ ప్రయత్నిస్తుండగా ఈ విషయాన్ని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పసిగట్టి 100కి ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఆ లోపు స్థానికులను పోగు చేసిన ఆ ఉద్యోగి అతడ్ని పట్టుకొని పోలీసులు వచ్చే వరకు నిలువరించారు. పోలీసులు వచ్చి బిడ్డను స్వాధీనం చేసుకొని తండ్రిని అదుపులోకి తీసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement