హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బలవన్మరణం చెందాడు. ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ఆదర్శనగర్ శ్రీనివాస హైట్స్ ప్లాట్ నంబర్-51 లో ఉంటున్న గణేష్ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగి. ఇతడు గురువారం మధ్యాహ్నం తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు కుటుంబసభ్యుల సాయంతో మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని చుట్టుపక్కల వారు అంటున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
Published Thu, Jul 27 2017 7:51 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement