హైదరాబాద్: నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగారంలో ఆదివారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న వినీల(25) ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తోంది.
ఈ క్రమంలో ఆదివారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపులే వినీల ఆత్మహత్యకు కారణమంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.