easy money
-
ఈజీ మనీ, క్రేజీ బోయ్: ఈ వీడియో చూస్తే మీకు పిచ్చెక్కుద్ది!
ఉన్న అవకాశాల్ని క్యాష్ చేసుకోవడం, సులువుగా డబ్బు సంపాదించడం అంత ఈజీ కాదు. చాలా స్మార్ట్‌గా ఉండాలి. దీనికి సంబంధించి తాజాగా ఒక వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు అనే దూకుడు సినిమా డైలాగును నూటికి నూరుపాళ్లు నిజం అంటారు మీరు ఈ వీడియో చూస్తే.. ది ఇన్స్టిగేటర్ అనే ట్విటర్ అకౌంట్ షేర్ చేసిన దాని ప్రకారం రోడ్డు మధ్యలో నిర్మించిన డివైడర్ని దాటడానికి నిచ్చెన ఏర్పాటు చేసి ప్రయాణికులను రోడ్డు దాటిస్తున్నాడు. ఆగండాగండి.. ఇదేదో పుణ్యానికి చేస్తున్నాడనుకోరు. ఇందుకోసం చార్జ్ కూడా వసూలు చేస్తున్నాడు మనోడు. ‘‘డబ్బు సంపాదించే అవకాశాన్ని అస్సలు వదులు కోరు కొంతమంది’’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ అయిన వీడియో ఇపుడు నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది. పలు నగరాల్లో డివైడర్ కష్టాలను తలుచుకుంటూ తెగ కనెక్ట్ అయిపోతున్నారు. ఐడియా అదిరింది గురూ, ఇది బిజనెస్ అంటే, స్మార్ట్ ఐడియా ఇలా పలు కమెంట్లు సందడి చేస్తున్నాయి. Some people don't miss the opportunity to make money 😅😂 pic.twitter.com/Jg6hFmvobk — The Instigator (@Am_Blujay) March 19, 2024 -
అవసరాల కోసం అడ్డదారులు.. చివరికి
సాక్షి, హైదరాబాద్: అవసరాల కోసం అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని దొంగతనానికి పాల్పడిన యువకులు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. కుషాయిగూడ పారిశ్రామికవాడలోని ఎల్ఆర్ఆర్ 9 ఎంటర్ ప్రైజెస్‌లో నాలుగు రోజుల క్రితం రూ.25 లక్షలు విలువ చేసే బోర్వెల్ బిట్స్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. డీఐ గురువారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. లేత్‌మిషన్ పనిచేసే దమ్మాయిగూడకు చెందిన హరికృష్ణ(32), వెల్డర్‌గా పనిచేసే కట్టింగ్‌కాలనీకి చెందిన దుర్గేష్ (37) మిత్రులు. హరికృష్ణ ఎల్ఆర్ఆర్9 ఎంటర్ప్రైజెస్ కంపెనీ ఎదురుగా ఉన్న తన సోదరుడి కంపెనీలో పనిచేస్తున్నాడు. వ్యసనాలకు, కుటుంబ అవసరాలకు జీతం సరిపోయేది కాదు. దీంతో నిత్యం ఎదురుగా ఉన్న కంపెనీలో బోర్‌వెల్స్ బిట్స్ లోడింగ్ చేయడాన్ని గమనించేవాడు. బిట్స్‌ను దొంగిలించి డబ్బులు సంపాదించాలనుకున్నాడు. తన ఫ్లాన్‌ను దుర్గేష్‌కు వివరించాడు. అందుకు దుర్గేష్ ఓకే చెప్పడంతో చోరీకి పక్క ప్లాన్ చేశారు. తెలిసిన వారి వద్ద ఓ ఓమీనీ వ్యాన్‌ను ఎంగేజ్ చేసుకున్నారు. ఆగస్టు 28 రాత్రి 12:30గంటల సమయంలో ఇద్దరు తాళ్లూరి థియేటర్ వద్ద కలుసుకున్నారు. ప్లాన్ ప్రకారం ముందుగానే కంపెనీ ఎదురుగా ఉన్న సీసీ కెమెరాల కనెక్షన్ కట్ చేసి కంపెనీలోకి ప్రవేశించారు. షట్టర్ ఓపెన్ కాకపోవడంతో కిటికీ గ్రిల్స్ తొలగించి లోనికి ప్రవేశించారు. విలువైన బిట్స్‌ను దోచుకెళ్లినట్లు డీఐ వివరించారు. సమీప సీసీ కెమెరాల్లో లభించిన ఆధారాలతో రంగంలోకి దిగిన పోలీసులు 7 బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టి బుధవారం వ్యాన్‌లో వెళ్తున్న వారిని చక్రిపురం చౌరస్తా సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. చదవండి: ఏమైందో? ఏమో?..అనుమానాస్పద స్థితిలో యువతి మృతి -
షాకింగ్: భార్యను చెల్లిగా పరిచయం చేస్తూ పెళ్లి, ఆ పై..
జైపూర్: కష్ట పడకుండా ఈజీగా మనీ సంపాదించడానికి కొందరు దొంగతనాలు చేస్తారు. ఇంకొకరు మోసాలు చేస్తారు. కానీ రాజస్ధాన్ లో ఓ జంట మాత్రం కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. కట్టుకున్న భార్యనే చెల్లిగా పరిచయం చేస్తూ వేరే వ్యక్తికి ఇచ్చిపెళ్లి చేశాడు ఓ భర్త. పెళ్లైన మూడో రోజే ఆ ఇంట్లో ఉన్ననగదు, బంగారంతో భార్య ఉడాయించిన ఘటన రాజస్ధాన్‌లో చోటు చేసుకుంది. కోట జిల్లా కునాడి లో నివసించే రవి అనే యువకుడు పెళ్లి చేసుకోటానికి దేవరాజ్ సుమన్ అనే మ్యారేజి బ్రోకర్‌ను సంప్రదించాడు. సుమన్ కొన్ని ఫోటోలు చూపించాడు. వాటిలో కోమల్ అనే యువతి రవికి నచ్చింది. ఆమె వివరాలు అడగ్గా.. కోమల్‌కు తల్లితండ్రులు లేరని అన్నయ్య ఒక్కడే ఉన్నాడని చెప్పాడు. సరే కోమల్‌ను పెళ్లి చేసుకుంటానని రవి చెప్పాడు. అయితే యువతి అన్నయ్యని కలవాలని మ్యారేజి బ్రోకర్‌తో రవి అన్నాడు. కోమల్ వాళ్ల అన్నయ్య సోనూ కార్పరే, సుమన్, రవి హోటల్లో కలిశారు. తాము కట్నం ఇచ్చుకోలేమని కోమల్ వాళ్ల అన్నయ్య ముందే చెప్పుకొచ్చాడు. తక్కువ సమయంలో కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఇద్దరి పెళ్లి ఒక గుళ్లో జరిపాడు సోనూకార్పరే. తరువాత కోమల్ తన భర్తతో కాపురానికి వెళ్లింది. పెళ్లైన మూడో రోజుకే ఆమె కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కనిపించడం లేదని భర్త స్ధానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగడంతో అసలు విషయాలు బయట పడ్డాయి. మ్యారేజి బ్రోకర్ సుమన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇండోర్ కు చెందిన సోనూ కార్పరే, కోమల్ భార్యా భర్తలని.. ఈజీగా డబ్బు సంపాదించేందుకు ఈ మార్గం చెప్పారని.. తనకు డబ్బులు వస్తాయని ఈ సంబంధం కుదిర్చానని వెల్లడించాడు. సుమన్ చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు సోనూకార్పోరేను, కోమల్‌ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రాణభయంతో తప్పించుకునే యత్నం.. వెంటాడి చంపేశారు -
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వక్రబుద్ధి
-
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వక్రబుద్ధి
హైదరాబాద్: ఈజీమనీ కోసం ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఎవరూ ఊహించనివిధంగా నీచానికి దిగజారాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు పడకింటి రహస్యాలను బట్టబయలు చేశాడు. భార్య ఫిర్యాదుతో చివరకు పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్ లో వెలుగు చూసిన ఈ దురాగతం వివరాలను పోలీసులు వెల్లడించారు. భార్యతో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా నిందితుడు అశ్లీల వెబ్ సైట్లలో పెట్టాడు. భార్య దగ్గర ఏమీ ఎరగనట్టు నటించాడు. తమ ఏకాంత జీవితానికి సంబంధించిన వీడియోలు అశ్లీల వెబ్ సైట్లలోకి ఎక్కాయన్న విషయం తెలుసుకున్న బాధితురాలు హతాశురాలైంది. ఆలస్యం చేయకుండా సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. భర్త ల్యాప్ టాప్ నుంచే వీడియోలు వెళ్లినట్లు ఐపీ నంబరు ఆధారంగా పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ఈజీమనీ కోసం అశ్లీల వెబ్ సైట్లను ఆశ్రయించినట్టు పోలీసుల విచారణలో అంగీకరించాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
అంతర్జిల్లా దొంగ అరెస్ట్
- రూ.2.80 లక్షల వస్తువులు స్వాధీనం పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి రూరల్ పోలీసులు అంతర్ జిల్లా దొంగను అరెస్ట్ చేశారు. ఇతని వద్ద నుంచి రూ.2.80 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ శ్రీధర్, ఎస్ఐ రాఘవరెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రకాశం జిల్లా పొదిలి మండల కేంద్రానికి చెందిన ఇద్దరు మిత్రులు మాలకొండారెడ్డి, తిరుపతిస్వామి అలియాస్ వంశీ చెడు వ్యసనాలకు లోనై, సులభంగా డబ్బు సంపాదించడం కోసం దొంగలుగా మారారు. పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడి, వివిధ కేసుల్లో పట్టుబడి ఒంగోలు జైలుకు కూడా వెళ్లారు. జనవరి 5న బెయిల్‌పై వచ్చిన ఈ ఇద్దరూ గుంటూరు జిల్లా రేపల్లిలో పల్సర్ బైకును అదే నెల 13న చోరీ చేశారు. 16న తెనాలి టౌన్లో రూ.30 వేల నగదు, బంగారు చైను, ఉంగరాలు సెల్‌ఫోన్ దొంగిలించారు. 20న నరసరావు పేట బ్రహ్మంగారి గుడి వద్ద రూ.లక్ష విలువ చేసే యమహా ఎఫ్‌జెడ్ బైకు అపహరించారు. 23న డోన్ ప్రభాకర్‌రెడ్డి నగర్లో హోండాషైన్ బైకు, ఎల్జీ టీవీ, సెల్‌ఫోన్, దొంగిలించారు. అక్కడి నుంచి పుట్టపర్తికి వచ్చి మండల పరిధిలోని పెడపల్లిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. 25న కొత్తచెరువులో ఖైదీ నెంబర్ 150 సినిమా చూసిన ఇద్దరూ మామిళ్లకుంట క్రాస్ లోని పెట్రోలు బంకు వీధిలో రాజశేఖర్ ఇంటి వద్ద ఉన్న రూ.లక్ష విలువ చేసే బైకును దొంగిలించారు. దీన్ని అమ్మే ప్రయత్నంలో ఉన్న మాలకొండారెడ్డిని బుధవారం పెడపల్లిలో అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. ఇతడి వద్ద నుంచి రూ.లక్ష విలువ చేసే బైకు, సెల్ఫోన్లు, ఎల్ఈడీ టీవీ, స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తిరుపతిస్వామి అలియాస్ వంశీ మరికొన్ని సామాన్లు అమ్ముకొని వచ్చే ప్రయత్నంలో పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. దొంగను పట్టుకోవడంలో సహరించిన హెడ్‌కానిస్టేబుళ్లు ధనుంజయ, శ్రీనివాస్, పీసీలు నాగేంద్ర, మారుతి, నరసింహలను సీఐ అభినందించారు. -
జల్సాలతో పెడదోవ
నూజివీడులో ముగ్గురు బైక్ దొంగల పట్టివేత నూజివీడు : సినిమాలు, షికార్లు జల్సాలకు అలవాటుపడిన యువకులు ఈజీ మనీ కోసం బైక్ దొంగతనాలకు దిగారు. చివరకు పోలీసులకు దొరికిపోయారు. బైక్‌చోరీలకు సంబంధించి నూజివీడు సీఐ ఎం.రామ్‌కుమార్ గురువారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా మల్కీపురం మండలం రామరాజులంక కు చెందిన మత్తేప్రవీణ్ నూజివీడులో పాలిటెక్నిక్ సెకెండియర్, పట్టణంలోని కొప్పుల వెలమపేటకు చెందిన సబ్బవరపు సూర్యతేజ ఇంటర్, కోనేరుపేటకు చెందిన గండి దుర్గాకళ్యాణ్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. వీరు వ్యసనాలకు లోనై నాలుగు నెలలుగా నూజివీడు, విజయవాడ ప్రాంతంలో ద్విచక్రవాహనాలను దొంగిలించి, వాటి నెంబరు ప్లేట్లను తీసేసి నూజివీడు ప్రాంతంలో తాకట్టుపెట్టడం, రోజువారీ అద్దెకు ఇవ్వడం చేస్తున్నారు. గొడుగువారిగూడెం రోడ్డులో వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానంతో వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో గుట్టు రట్టయింది. ఎనిమిది బైక్‌లను పోలీసులు రికవరీ చేశారు. అందులో 2 బుల్లెట్లు, 4 పల్సర్లు, 1 అపాచి, 1 యమహా స్పోర్ట్స్‌బైక్ ఉన్నాయి. వీటిలో మూడు విజయవాడ నగరంలోని పటమట, గవర్నర్‌పేట, మాచవరం ప్రాంతాలలో దొంగిలించినవి కాగా, నూజివీడు పట్టణంలో 3, మండలంలో 2 బైక్‌లను ఎత్తుకెళ్లారు. ఈ కేసులో కృషిచేసిన పట్టణ ఎస్ఐ ఎన్ చలపతిరావు, రూరల్ ఎస్ఐ చిన్ని నాగప్రసాద్, సిబ్బందిని సీఐ అభినందించారు. -
‘క్రికెటర్లను ఈజీమనీ చెడగొడుతోంది’
చండీగఢ్: ట్వి20 వచ్చిన తర్వాత ఫాస్ట్ బౌలర్లు కష్టపడడం మానేశారని ఆస్ట్రేలియా బౌలింగ్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ అన్నాడు. పొట్టి ఫార్మాట్ లో సక్సెస్ కాగానే శ్రమించడం ఆపేస్తున్నారని అభిప్రాయపడ్డాడు. క్రికెటర్లను ఈజీమనీ చెడగొడుతోందని పేర్కొన్నాడు. డబ్బు మోజులో పడి వర్ధమాన క్రికెటర్లు ఆటను నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొన్నాడు. చండీగఢ్ లో పీఏసీ స్టేడియంలోని కోచింగ్ క్లినిక్ లో అండర్-23 పేసర్లకు మెక్‌గ్రాత్ మెళకువలు నేర్పించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... క్రికెట్ రాణించాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలని అన్నాడు. సక్సెస్ కావడానికి కష్టపడడం ఒకటే మార్గమని, షార్ట్ కట్స్ లేవని చెప్పాడు. క్రికెటర్లకు ఆటే ముఖ్యమని, తర్వాతే డబ్బు సంపాదన గురించి ఆలోచించాలన్నారు. దేశానికి ప్రాతినిథ్యం వహించడమే లక్ష్యంగా నిర్దేశించుకోవాలని యువక్రికెటర్లకు ఉద్బోధించాడు. పింక్ బంతితో డేనైట్ టెస్టు మ్యాచ్ లు నిర్వహించడం వల్ల క్రికెట్ లో కొత్త పరిణామాలు చోటు చేసుకునే అవకాశముందని మెక్‌గ్రాత్ అభిప్రాయపడ్డాడు. -
కొత్త ‘బంగారు’ దొంగలు
చైన్‌స్నాచింగ్ చేస్తున్న వారంతా కొత్తవారే ఈజీమనీ కోసం యువత అక్రమ మార్గం సాక్షి, సిటీబ్యూరో: మొన్న...కంప్యూటర్ హార్డ్‌వేర్ టెక్నీషియన్ పుట్టి వేదవ్యాస్, కారు డ్రైవర్ గంగాపురం నరేశ్, డిగ్రీ చదివిన పుణుగొటి కృపాకర్...తమ జల్సాల కోసం సులభ పద్ధతిన డబ్బు సంపాదించేందుకు చైన్ స్నాచింగ్ చేస్తూ నల్లకుంట పోలీసులకు దొరికిపోయారు. వీరిపై గతంలో ఎటువంటి చోరీ కేసులు లేవు. చైన్ స్నాచింగ్‌లు చేయడం వీరికి కొత్త. వీరంతా 30 ఏళ్లలోపు వారే. నిన్న...అక్షయ్ శర్మ, సుమీత్ కుమార్. వీరి వయస్సు 20, 21 సంవత్సరాలే. పదో తరగతి వరకు చదివిన అక్షయ్ శర్మ క్యాటరింగ్ పని చేస్తుండగా, సుమీత్ కుమార్ బీకామ్ కంప్యూటర్స్ చదువుతున్నాడు. సయ్యద్ అబ్దుల్ హయ్ అజీమ్ మోహదీతో ఏర్పడిన పరిచయం కాస్తా వీరిని చైన్ స్నాచింగ్‌ల వైపు నడిపించింది. గతంలో అక్షయ్, సుమీత్లపై చోరీ కేసులు లేవు. ఈజీ మనీ కోసమే ఈ బాట పట్టారు. వీరు సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, నారాయణగూడ క్రైమ్ టీమ్ పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో దొరికిపోయారు. ఈ రెండు కేసులే కాదు...ఇటీవల పోలీసులు ఛేదించిన వివిధ చైన్‌స్నాచింగ్ కేసుల్లో గతంలో ఏ మాత్రం దొంగతనాలతో సంబంధం లేని వారే పట్టుబడ్డారు. దీన్నిబట్టి చూస్తే ఈజీమనీ కోసం యువకులు రెచ్చిపోతున్నారన్నది స్పష్టమవుతోంది. ఇంటి వద్ద నుంచి పంపించే డబ్బులు సరిపోకపోవడం, సిటీ లైఫ్‌స్టైల్ జీవితానికి అలవాటుపడటం...ఉద్యోగం ద్వారా వచ్చే జీతం చాలకపోవడం...ప్రియురాళ్ల కోరికలను తీర్చేందుకు...ఇలా కారణం ఏదైతేనేం దొంగలుగా మారిపోతున్నారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అన్న తేడా లేకుండా బంగారు గొలుసు దొంగతనాలు చేస్తూ నగర పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు. తనిఖీలు చేస్తున్నా ... ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు నెల వరకు 213 చైన్ స్నాచింగ్ కేసులు ఆయా పోలీసు స్టేషన్లలో నమోదయ్యాయి. వీటిలో 63 శాతం వరకు కేసుల్లో దొంగలను పట్టుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నా, వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉందని తెలుస్తోంది. సంచలనం సృష్టించిన సుమిత్రా మృతి కేసులో దొంగపై ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసినా పోలీసులు ఇప్పటివరకు ఆ దొంగను పట్టుకోకపోవడం వారి పనితీరుకు అద్దం పడుతోందని సిటీవాసులు అంటున్నారు. చైన్ స్నాచర్లను పట్టుకునేందుకు ప్రతి జోన్లో ఏసీపీ స్థాయి అధికారి వాహనాలను ఆపి తనిఖీ చేస్తున్నా...చైన్ స్నాచర్లు తమ పని తాము కానిచ్చుకొని పోతుండటం పోలీసులను కలవరపెడుతోంది. అయితే బంగారు గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నది కొత్తవారే కావడంతో వారిని పట్టుకోవడం తలకు మించిన భారమవుతోందని పోలీసు అధికారి ఒకరు వాపోవడం క్షేత్రస్థాయి పరిస్థితికి అద్దం పడుతోంది. ఘరానా దొంగలు జైల్లోనే... జంట కమిషనరేట్ల పరిధిలో వివిధ కేసుల్లో 176 మందిపై పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు. వీరిలో 162 మందిని జైల్లో పెట్టామని, నిందితుల్లో ఎక్కువ మంది చైన్‌స్నాచర్లు ఉన్నారని పోలీసు ఉన్నతాధికారి బషీర్‌బాగ్‌లో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఇటీవల నగరంలో పెరిగిపోయిన దొంగతనాలు ఎవరూ చేస్తున్నారనే విషయాన్ని చెప్పకనే చెప్తోంది. ఘరానా దొంగలను జైలు ఊచలు లెక్కిస్తున్నా మరీ బయట పెట్రేగిపోతున్న నవయువ దొంగలు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. కాలేజీ విద్యార్థులు, ఉద్యోగాలు చేస్తున్న యువత ఈజీమనీ కోసం చైన్ స్నాచర్ల అవతారమెత్తుతున్నారు. వీరికి దొంగతనాలు చేయడం కొత్త అయినా, బైక్ రేసింగ్‌లో మంచి అనుభవం ఉండటంతో అలావచ్చి ఇలా క్షణాల్లో గొలుసులు కొట్టుకెళ్తుతున్నారు. ఈ క్రమంలో బాధితురాళ్లు తీవ్రంగా గాయపడుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో గత నెలలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనలో సుమిత్రా తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటన ఇప్పటికీ పోలీసుల ముందు కదలాడుతోంది. సీసీటీవీ కెమెరాల నాణ్యత డొల్ల... నిఘా నగరం వైపు అడుగులు వేస్తున్న మన సిటీలో వేలాది సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. అయితే చైన్ స్నాచింగ్ చేసి పారిపోతున్న యువకులు ఈ కెమెరాల కంటబడుతున్నారు. అయితే నిఘా నేత్రాల నాణ్యత ఉండకపోవడంతో ఆ దృశ్యాలు స్పష్టంగా కనబడటం లేదు. ఒకవేళ ఆ కెమెరాకు చిక్కిన దొంగ మన కళ్ల ముందు వచ్చి నిలబడిన గుర్తుపట్టలేని పరిస్థితి ఉందని ఓ పోలీసు అధికారి వాపోయారు. ఫొటోలున్నా వారిని పట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. -
కొత్త ‘బంగారు’ దొంగలు
చైన్‌స్నాచింగ్ చేస్తున్న వారంతా కొత్తవారే ఈజీమనీ కోసం యువత అక్రమ మార్గం సిటీబ్యూరో: మొన్న...కంప్యూటర్ హార్డ్‌వేర్ టెక్నీషియన్ పుట్టి వేదవ్యాస్, కారు డ్రైవర్ గంగాపురం నరేశ్, డిగ్రీ చదివిన పుణుగొటి కృపాకర్...తమ జల్సాల కోసం సులభ పద్ధతిన డబ్బు సంపాదించేందుకు చైన్ స్నాచింగ్ చేస్తూ నల్లకుంట పోలీసులకు దొరికిపోయారు. వీరిపై గతంలో ఎటువంటి చోరీ కేసులు లేవు. చైన్ స్నాచింగ్‌లు చేయడం వీరికి కొత్త. వీరంతా 30 ఏళ్లలోపు వారే. నిన్న...అక్షయ్ శర్మ, సుమీత్ కుమార్. వీరి వయస్సు 20, 21 సంవత్సరాలే. పదో తరగతి వరకు చదివిన అక్షయ్ శర్మ క్యాటరింగ్ పని చేస్తుండగా, సుమీత్ కుమార్ బీకామ్ కంప్యూటర్స్ చదువుతున్నాడు. సయ్యద్ అబ్దుల్ హయ్ అజీమ్ మోహదీతో ఏర్పడిన పరిచయం కాస్తా వీరిని చైన్ స్నాచింగ్‌ల వైపు నడిపించింది. గతంలో అక్షయ్, సుమీత్లపై చోరీ కేసులు లేవు. ఈజీ మనీ కోసమే ఈ బాట పట్టారు. వీరు సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, నారాయణగూడ క్రైమ్ టీమ్ పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో దొరికిపోయారు. ఈ రెండు కేసులే కాదు...ఇటీవల పోలీసులు ఛేదించిన వివిధ చైన్‌స్నాచింగ్ కేసుల్లో గతంలో ఏ మాత్రం దొంగతనాలతో సంబంధం లేని వారే పట్టుబడ్డారు. దీన్నిబట్టి చూస్తే ఈజీమనీ కోసం యువకులు రెచ్చిపోతున్నారన్నది స్పష్టమవుతోంది. ఇంటి వద్ద నుంచి పంపించే డబ్బులు సరిపోకపోవడం, సిటీ లైఫ్‌స్టైల్ జీవితానికి అలవాటుపడటం...ఉద్యోగం ద్వారా వచ్చే జీతం చాలకపోవడం...ప్రియురాళ్ల కోరికలను తీర్చేందుకు...ఇలా కారణం ఏదైతేనేం దొంగలుగా మారిపోతున్నారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అన్న తేడా లేకుండా బంగారు గొలుసు దొంగతనాలు చేస్తూ నగర పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు. తనిఖీలు చేస్తున్నా ... ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు నెల వరకు 213 చైన్ స్నాచింగ్ కేసులు ఆయా పోలీసు స్టేషన్లలో నమోదయ్యాయి. వీటిలో 63 శాతం వరకు కేసుల్లో దొంగలను పట్టుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నా, వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉందని తెలుస్తోంది. సంచలనం సృష్టించిన సుమిత్రా మృతి కేసులో దొంగపై ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసినా పోలీసులు ఇప్పటివరకు ఆ దొంగను పట్టుకోకపోవడం వారి పనితీరుకు అద్దం పడుతోందని సిటీవాసులు అంటున్నారు. చైన్ స్నాచర్లను పట్టుకునేందుకు ప్రతి జోన్లో ఏసీపీ స్థాయి అధికారి వాహనాలను ఆపి తనిఖీ చేస్తున్నా...చైన్ స్నాచర్లు తమ పని తాము కానిచ్చుకొని పోతుండటం పోలీసులను కలవరపెడుతోంది. అయితే బంగారు గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నది కొత్తవారే కావడంతో వారిని పట్టుకోవడం తలకు మించిన భారమవుతోందని పోలీసు అధికారి ఒకరు వాపోవడం క్షేత్రస్థాయి పరిస్థితికి అద్దం పడుతోంది. ఘరానా దొంగలు జైల్లోనే... జంట కమిషనరేట్ల పరిధిలో వివిధ కేసుల్లో 176 మందిపై పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు. వీరిలో 162 మందిని జైల్లో పెట్టామని, నిందితుల్లో ఎక్కువ మంది చైన్‌స్నాచర్లు ఉన్నారని పోలీసు ఉన్నతాధికారి బషీర్‌బాగ్‌లో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఇటీవల నగరంలో పెరిగిపోయిన దొంగతనాలు ఎవరూ చేస్తున్నారనే విషయాన్ని చెప్పకనే చెప్తోంది. ఘరానా దొంగలను జైలు ఊచలు లెక్కిస్తున్నా మరీ బయట పెట్రేగిపోతున్న నవయువ దొంగలు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. కాలేజీ విద్యార్థులు, ఉద్యోగాలు చేస్తున్న యువత ఈజీమనీ కోసం చైన్ స్నాచర్ల అవతారమెత్తుతున్నారు. వీరికి దొంగతనాలు చేయడం కొత్త అయినా, బైక్ రేసింగ్‌లో మంచి అనుభవం ఉండటంతో అలావచ్చి ఇలా క్షణాల్లో గొలుసులు కొట్టుకెళ్తుతున్నారు. ఈ క్రమంలో బాధితురాళ్లు తీవ్రంగా గాయపడుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో గత నెలలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనలో సుమిత్రా తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటన ఇప్పటికీ పోలీసుల ముందు కదలాడుతోంది. సీసీటీవీ కెమెరాల నాణ్యత డొల్ల... నిఘా నగరం వైపు అడుగులు వేస్తున్న మన సిటీలో వేలాది సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. అయితే చైన్ స్నాచింగ్ చేసి పారిపోతున్న యువకులు ఈ కెమెరాల కంటబడుతున్నారు. అయితే నిఘా నేత్రాల నాణ్యత ఉండకపోవడంతో ఆ దృశ్యాలు స్పష్టంగా కనబడటం లేదు. ఒకవేళ ఆ కెమెరాకు చిక్కిన దొంగ మన కళ్ల ముందు వచ్చి నిలబడిన గుర్తుపట్టలేని పరిస్థితి ఉందని ఓ పోలీసు అధికారి వాపోయారు. ఫొటోలున్నా వారిని పట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.