
సాక్షి, అమీర్‌పేట: ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన యువకుడిపై ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. బీకేగూడకు చెందిన తెన్నేటి భార్గవ్ హైటెక్ సిటీలోని ఐను ఆస్పత్రిలో స్టోర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కృష్ణా జిల్లా ఉప్పలపాడుకు చెందిన 26 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది.
బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో ఆస్పత్రిలో నర్సుగా పనిచేసే సదరు యువతి వద్దకు తరచూ వెళ్లే వాడు. నిన్ను ప్రేమిస్తున్నా, పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించాడు. యువతి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి విషయాన్ని చెప్పాడు. రెండేళ్ల నుంచి వీరు ఇద్దరు కలిసి తిరిగారు. పెళ్లి ప్రస్తావన తేవడంతో భార్గవ్ ముఖం చాటేయడంతో యువతి తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
చదవండి: రాత్రి ఇంట్లో నిద్రించారు.. తెల్లారేసరికి మాయం.. ఎటు వెళ్లినట్లు?
Comments
Please login to add a commentAdd a comment