అగ్రిమెంట్ పూర్తి చేసుకున్న కాంట్రాక్టర్లు
రూ.92.50 కోట్లతో 1384 డబుల్ బెడ్‌రూం ఫ్లాట్లు
అంబేద్కర్‌నగర్‌లో పనులు ప్రారంభం
ఇళ్లు ఖాళీ చేస్తే ఎస్‌ఆర్ నగర్‌లోనూ నిర్మాణం
వరంగల్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ మేరకు నగరంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు అగ్రిమెంట్ పూర్తి చేసుకుని పనులు ప్రారంభించారు. స్లమ్ ఏరియాలైన హన్మకొండలోని అంబేద్కర్‌నగర్, జితేందర్‌నగర్, ఎస్‌ఆర్ నగర్‌లో ఉన్న ఇళ్ల స్థానంలో జీ ప్లస్-1, జీ ప్లస్-3 పద్ధతిలో డబుల్ బెడ్‌రూం ఫ్లాట్లు నిర్మించాలని జిల్లా యంత్రాం గం నిర్ణయం తీసుకుంది. ఇందుకు ప్రభుత్వం రూ.150 కోట్ల నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీ ప్లస్ గృహాల నిర్మాణ ప్రాజెక్టు బాధ్యతలను కలెక్టర్ పర్యవేక్షణలో ఆర్‌అం డ్‌బీ శాఖ చేపట్టింది. హైదరాబాద్‌కు చెం దిన ఒక ప్రైవేటు సాంకేతిక సంస్థ సహా యంతో డీపీఆర్‌ను రూపకల్పన చేశారు. డీపీఆర్‌లో కొన్ని తేడాలు ఉండడంతో మొదటిసారి నిర్వహించిన టెండర్లు రద్దయ్యాయి. పూర్తిస్థాయిలో డీపీఆర్ సిద్ధమయ్యాక టెండర్లు నిర్వహించడంతో ఖరారు అయ్యాయి.
అంబేద్కర్ నగర్‌లో జీప్లస్-3 నిర్మాణం
హన్మకొండ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్‌నగర్, జితేందర్‌నగర్‌లోని సుమారు ఏడు ఎకరాల స్థలంలో జీ ప్లస్-3 పద్ధతిలో అర్హులుగా గుర్తించిన 592 మందికి రూ.39 కోట్ల వ్యయంతో డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించనున్నారు. హైదరాబాద్‌లో డ బుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించిన ఎంజెఆర్ సంస్థ 4.58 శాతం తక్కువ ధరతో ఈ పనులను దక్కించుకుంది. అగ్రిమెంటు పూర్తికావడంతో ఇళ్ల నిర్మాణాలకు ముగ్గు పోసి పనులు ప్రారంభించారు.
ఎస్‌ఆర్ నగర్‌లో జీప్లస్-1 ఇళ్ల నిర్మాణం
వరంగల్‌లోని ఎస్‌ఆర్ నగర్‌లో 17 ఎకరాల్లో జీప్లస్-1 పద్ధతిలో డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించనున్నారు. ఇక్కడ అధికారులు జీప్లస్-3 పద్ధతుల్లో ఇళ్లు నిర్మించేం దుకు ప్రయత్నించగా స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో అర్హులుగా గుర్తించిన 792 మందికి రూ.53.50 కోట్ల వ్యయంతో జీప్లస్-1 పద్ధతిలో గ్రేడ్‌లుగా విభజించి ఇళ్లు నిర్మించనున్నారు. ‘ఎ’ గ్రేడ్‌లో 4+4, బి గ్రేడ్‌లో 2+2, సీ గ్రేడ్‌లో 1+1, డీ గ్రేడ్‌లో 1+1గా జీప్లస్ పద్ధతిలో నిర్మించేందుకు అధికారులు డీపీఆర్ రూ పొందించారు. ఇందులో సి, డి గ్రేడ్‌ల ఇళ్లు ఎక్కువ విస్తీర్ణంతో నిర్మించాల్సి వస్తున్నందున ఏ, బీ గ్రేడ్‌లో ఇళ్లు నిర్మించేం దుకు నిర్ణయించారు. జిల్లాకు చెందిన మంద ఐలయ్య కన్‌స్ట్రక్షన్ కంపెనీ 1.96 శాతం తక్కువ ధరతో ఈ పనులను దక్కిం చుకుంది. లబ్ధిదారులు వారు ఉంటున్న ఇళ్లను ఖాళీ చేసిన వెంటనే ఎస్‌ఆర్‌నగర్‌లో పనులు ప్రారంభిస్తామని ఆర్‌అండ్‌బీ అధికారులు తెలిపారు.
‘డబుల్’ పనులు షురూ..
Published Mon, Jan 11 2016 1:13 AM | Last Updated on Fri, May 25 2018 12:49 PM
Advertisement
Advertisement