24 లక్షల కంటే అమ్మ మాటే గొప్పగా అనిపించింది!
24 లక్షల కంటే అమ్మ మాటే గొప్పగా అనిపించింది!
Published Tue, Sep 23 2014 1:30 PM | Last Updated on Sat, Sep 2 2017 1:51 PM
24 లక్షలు రూపాయల కంటే కూడా తల్లితండ్రుల మాటలే గొప్పగా అనిపించాయి. సన్మార్గంలో నడవాలని చెప్పిన తల్లితండ్రుల మాటలే ఆ హరిప్రసాద్ కు వేదవాక్కయ్యాయి. చెడు మార్గంలో సంపాదించే సొమ్ము, తేరగా లభించే డబ్బు మన వెంట ఉండదు అని చెప్పిన మాటలే బ్యాంకు పరువును నిలబెట్టాయి. ఏటీఎం నుంచి కుప్పలుకుప్పలుగా వచ్చిపడిన డబ్బు కోసం ఆశపడకుండా బ్యాంక్ అధికారులకు అప్పగించిన హరిప్రసాద్ జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు.
నాపై మా అమ్మ ఎప్పుడు ఫిర్యాదు చేస్తూ ఉంటుంది. నా చిన్నతనం నుంచి మా అమ్మ ఎప్పుడు చెబుతున్న మాటలు ఎప్పుడు గుర్తుకు వస్తాయి. కష్టపడని సొమ్ము ఎప్పటికి మనది కాదు అని అమ్మ చెబుతూ ఉండేది. సరియైన మార్గంలోనే డబ్బు సంపాదించాలి. ఆ డబ్బే జీవితాంతం తోడుగా ఉంటుంది అని చెప్పిన మాటలు మనసులో నాటుకుపోయాయి అని హరిప్రసాద్ చెప్పారు.
బ్యాంకు అకౌంట్లో ఉన్న 500 రూపాయల్లో 200 రూపాయలు డ్రా చేసుకుందామనుకున్న హరిప్రసాద్, అతడి స్నేహితులు లతీఫ్ ఆలీ, దుర్గా ప్రసాద్ లకు కళ్లెదుటే కుప్పులుగా పడి ఉన్న డబ్బు కనిపించింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగులుగా ఉన్న వీరు ముగ్గురు తమదికాని డబ్బు కోసం ఆశపడకుండా పోలీసులకు, బ్యాంక్ అధికారులకు సమాచారం అందించి తమ నిజాయితీని నిరూపించుకున్నారు.
ఈ ఘటన తర్వాత ఈ ముగ్గురు యువకులు హీరోలుగా మారారు. అయితే తన తల్లితండ్రులు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు. ప్రతి ఒక్కరు ఈ విషయం గురించి తెలుసుకుని గొప్పగా ఫీలయ్యారు. అయితే తండ్రి మాత్రం ఏమైనా ఉద్యోగం లభించిందా అని మాత్రం అడిగారని హరిప్రసాద్ తెలిపారు. ఈ సంఘటన తర్వాత తన నిజాయితీ కారణంగా తండ్రికి ఆయన పనిచేసే స్కూల్లో అధికారులు సన్మానించడంతో చాలా హ్యాపీగా ఫీలవుతున్నానని హరిప్రసాద్ తెలిపారు. నిజాయితీకి నిలువెత్తు అద్దంగా నిలిచిన నిరుద్యోగ ఇంజినీర్లు, చార్టెడ్ అకౌంటెన్సీ రంగంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న హరిప్రసాద్, లతీఫ్ ఆలీ, హరి ప్రసాద్ ఉద్యోగంతోపాటు మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుందాం. చూద్దామంటే కనిపించని ఈ సమాజంలో నిజాయితీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన యువకులకు సెల్యూట్ చేద్దాం!
Advertisement
Advertisement