Honesty
-
'నిజాయితీ'..! ఒక రాజు.. అంతు చిక్కని రోగంతో..
అనగనగా ఒక రాజు. అతనో అంతు చిక్కని రోగంతో బాధపడసాగాడు. తానింక ఎన్నో రోజులు బతకనని అతనికి అర్థమైంది. అందుకే తను బతికుండగానే.. రాజ్యానికి నిజాయితీపరుడైన యువరాజును ఎన్నుకోవాలనుకున్నాడు. మరునాడే రాజ్యంలోని యువకులందరినీ పిలిపించి.. యువరాజు ఎంపిక విషయం చెప్పాడు. అందరికీ తలా ఒక విత్తనం ఇచ్చి, దాన్ని నాటమని చెప్పి.. పదిరోజుల తర్వాత మొలకెత్తిన ఆ మొక్కను తీసుకొని రమ్మన్నాడు. ఎవరి మొక్క అయితే ఏపుగా, బలంగా పెరుగుతుందో అతనే ఈ రాజ్యానికి యువరాజు అవుతాడు’ అని సెలవిచ్చాడు రాజు. ‘అలాగే రాజా..’ అంటూ అందరూ ఆ విత్తనాలను ఇంటికి తీసుకువెళ్లి మట్టి కుండల్లో వేశారు.పది రోజుల తర్వాత వాళ్లంతా ఆ మట్టికుండలను తీసుకుని రాజుగారి కొలువుకు వచ్చారు. మహేంద్ర అనే ఒక యువకుడు మాత్రం ఖాళీ కుండతో వచ్చాడు. రాజు అందరి కుండలను పరిశీలించి.. ఖాళీ కుండ తెచ్చిన మహేంద్రనే యువరాజుగా ప్రకటించాడు. ఆ మాట విన్న మిగతా యువకులంతా విస్తుపోయారు. ఓ యువకుడు కాస్త ధైర్యం చేసి ‘రాజా! మీరు చెప్పిన దాని ప్రకారం ఎవరి మొక్క అయితే ఏపుగా, బలంగా పెరుగుతుందో వారే కదా యువరాజు! మా విత్తనాలన్నీ మొలకెత్తి చక్కగా పెరిగాయి. పోటీ మా మధ్యనే ఉండాలి. కానీ విత్తనమే మొలకెత్తని మహేంద్రను యువరాజుగా ఎలా ప్రకటిస్తారు?’ అని ప్రశ్నించాడు.అప్పుడు రాజు చిన్నగా నవ్వుతూ ‘నేను మీకు ఉడకబెట్టిన విత్తనాలను ఇచ్చాను. వాటి నుంచి మీ అందరి కుండల్లోకి మొక్కలు ఎలా వచ్చాయి?’ అని తిరిగి ప్రశ్నించాడు రాజు. ఆ ఎదురు ప్రశ్నకు ఆ యువకులంతా బిత్తరపోయారు. తాము చేసిన మోసాన్ని రాజు గ్రహించాడని వాళ్లకు తెలిసిపోయింది. సిగ్గుతో తలవంచుకున్నారు! వాళ్లంతా రాజు ఇచ్చిన విత్తనాలను కాకుండా వేరే విత్తనాలను నాటారు. అందుకే అవి మొలకెత్తి ఏపుగా పెరిగాయి. మహేంద్ర మాత్రం రాజు ఇచ్చిన విత్తనాన్నే వేశాడు. అందుకే అది మొలకెత్తలేదు.అతని నిజాయితీని మెచ్చిన రాజు.. ఆ రాజ్యానికి సమర్థుడైన పాలకుడు మహేంద్రనే అని అతన్నే యువరాజుగా ప్రకటించాడు. తదనంతర కాలంలో ఆ రాజ్యానికి మహేంద్ర రాజు అయ్యాడు. నిజాయితీకి మారుపేరుగా నిలిచాడు. ప్రజలకు ఏ లోటూ రానివ్వకుండా పాలన సాగించాడు. – పుల్లగూర్ల శీర్షికఇవి చదవండి: 'కిడ్నాప్..'! ఓరోజు సాయంత్రం.. ఆఫీసు నుండి తిరిగి వస్తుండగా.. -
Pillala Katha: ఎవరు నిజాయితీ పరుడు?
సింహగిరిని హిమవంతుడు పాలించేవాడు. ఒకరోజు ఆ రాజు.. మంత్రి వసంతుడితో ‘ఉద్యానవనంలో కొత్తగా చేరిన పది మంది పనివాళ్లలో ఎవరు నిజాయితీపరుడో తెలుసుకోవాలని ఉంది మంత్రివర్యా! అందుకు వజ్రాలను వారికి దొరికేలా చేద్దాం. వాటికి ఆశపడని వాడే నిజాయితీపరుడు. ఏమంటారు?’ అని అడిగాడు. ‘అలాగే మహారాజా.. మీరన్నట్టే చేద్దాం! నిజాయితీపరుడెవరో తేలుతుంది’ అన్నాడు మంత్రి. మరుసటిరోజే మంత్రితో చెప్పి ఉద్యానవనంలో కొత్తగా చేరిన పది మందీ పనిచేసే ప్రాంతంలో ఒక్కొక్కరికీ ఒక్కో వజ్రం దొరికేలా ఏర్పాటు చేయించాడు రాజు. ఒక గంట తరువాత ఉద్యానవనం చూసుకునే అధికారి ఆ పది మందినీ పిలిచి ‘పొరపాటున ఉద్యానవనంలో పది వజ్రాలు పడిపోయాయి. దొరికిన వాళ్లు వాటిని తీసుకెళ్లి రాజు గారికి ఇస్తే వారికి రాజు గారు ఐదు వెండి నాణేలు ఇస్తారు’ అని చెప్పాడు. అది విన్న పది మందిలో తొమ్మిది మంది అతి సులువుగా ఒక్కో వజ్రాన్ని స్వంతం చేసుకున్నారు. వారిలో ఒకడు ‘మనమేమన్నా పిచ్చివాళ్లమా? వజ్రానికి వెండి నాణేలు తీసుకోవడానికి? మనకు దొరికిన వజ్రాన్ని అమ్ముకుంటే ఎంతో ధనం వస్తుంది’ అన్నాడు. ‘అవునవును’ అన్నారు మిగతావారు. అందరూ మాట్లాడుకుని నేరుగా బంగారు అంగడి భూషయ్య వద్దకు బయలుదేరారు. పదవ వాడైన రామయ్య వద్దకు ఆ అధికారి వచ్చి ‘నేను వజ్రాల గురించి చెబుతున్నా వినకుండా నీ పాటికి నువ్వు పనిచేసుకుంటూ పోతున్నావేంటీ’ అని కసురుకున్నాడు. ‘నాకు పని ముఖ్యం. పనైపోయాక విరామ సమయంలో వెతుకుతాను’ అని బదులిచ్చాడు రామయ్య. అన్నట్టుగానే రామయ్య.. విరామ సమయంలో భోజనం చేసి వజ్రాన్ని వెతికి తీసుకెళ్లి ‘మహారాజా! ఇదిగోండి నాకు దొరికిన వజ్రం’ అంటూ రాజుకు ఇచ్చి ‘తోటలో పని ఉంది’ అంటూ వెంటనే వెళ్లిపోయాడు. దారిలో తొమ్మిది మందిలో ఒకడు ‘ఉద్యానవనంలో పనికి మనకిచ్చే జీతం చాలా తక్కువ. అందుకే ఈ వజ్రాన్ని అమ్మితే వచ్చే ధనంతో నేను పొరుగు దేశం వెళ్లి వ్యాపారం చేసుకుంటాను’ అన్నాడు. మరొకడు ‘పంట పొలం కొంటాన’న్నాడు. ఇలా మిగిలిన వాళ్లూ తమ తమ ఆలోచనలను పంచుకుంటూ భూషయ్య అంగడికి చేరుకున్నారు. వజ్రాలు అమ్మడానికి వచ్చామంటూ భూషయ్యకు తమ దగ్గరున్న వజ్రాలను ఇచ్చారు. వాటిని పరీక్షించిన భూషయ్య ‘ఇవి వజ్రాలు కావు. నాసిరకం రంగు రాళ్లు. నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావు’ అని తేల్చాడు. ‘ఒరే! మనం పొరబడ్డాము. తిన్నగా కోటకు వెళ్లి వీటిని రాజు గారికి ఇచ్చి వెండినాణేలు దక్కించుకుందాము’ అన్నాడు వారిలో ఒకడు. ‘అవునురా’ అంటూ వంత పాడారు మిగిలిన వాళ్లు. వెంటనే కోటకు పయనమయ్యారు. రాజు గారి కొలువుకు చేరుకొని ‘మహారాజా! ఇవిగోండి.. మాకు దొరికిన వజ్రాలు’ అంటూ ఆ తొమ్మండుగురూ వాటిని రాజుకిచ్చారు. ‘మీకు భోజన సమయానికి ముందు వజ్రాలు దొరికితే.. అవి అసలైనవనుకుని అమ్మడానికి భూషయ్య వద్దకు వెళ్లారు. అక్కడవి నకిలీవని తేలగానే ఇటు వచ్చారు కదా’ అని గద్దించాడు రాజు. సమాధానమివ్వలేక పోయారు వాళ్లు. ‘రామయ్య ఒక్కడే పని చూసుకుని వజ్రం దొరికిందని ఇచ్చి వెళ్ళాడు. మీలో నిజాయితీపరుడు ఎవరో తెలుసుకోవడం కోసం నేను ఆడిన నాటకం ఇది’ అన్నాడు రాజు. ‘నిజాయితీతో పని చేయలేని మీ అందరినీ మహారాజు గారు కొలువు నుండి తొలగిస్తున్నారు. మీరు పక్షం రోజులు పనిచేసినా మాసం జీతం ఇస్తున్నారు. తీసుకుని వెళ్ళండి’ అన్నాడు మంత్రి. తరువాత రామయ్యను పిలిచి ‘వృత్తికి విలువ ఇచ్చిన తరువాతనే నిజాయితీగా వజ్రం తెచ్చి ఇచ్చావు. అన్న మాట ప్రకారం నీకు ఐదు వెండినాణేలు ఇవ్వాలి. కానీ పది బంగారు నాణేలు ఇస్తున్నాను’ అన్నాడు రాజు. ‘మహారాజా! నాది కానిది పూచిక పుల్ల కూడా నాకు అవసరం లేదు. దొరికిన వజ్రం మీకు తెచ్చిచ్చాను. నాకిచ్చిన కొలువు బంగారం కంటే విలువైనది. మీరిచ్చే జీతం నాకు చాలు’ అని వందనం చేసి వెళ్లిపోయాడు రామయ్య. మరొక్కమారు రామయ్య నిజాయితీని ప్రశంసించి ‘చూశారుగా మంత్రీ.. మన పథకం ఎలా పారిందో!’ అన్నాడు రాజు గర్వంగా. ‘అవును మహారాజా!’ అన్నాడు మంత్రి మెచ్చుకోలుగా! - యు.విజయశేఖర రెడ్డి -
గ్రేట్ లాండ్రీవాలా.. నిజాయితీ చాటుకుని, రూ.2100 అందుకుని..
మీరెప్పుడైనా ప్యాంట్ జేబులో డబ్బులు పెట్టి మరచిపోయారా? అలాగే ఉతికేందుకు ఇచ్చేశారా? ఇంట్లోనైతే ఫర్వాలేదు కానీ... బయట లాండ్రీకి ఇస్తే? ఇక అంతే సంగతులు. ఆ డబ్బులను శాశ్వతంగా మరచిపోవచ్చు. ఇదీ మన అనుభవం కానీ మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి వ్యక్తి ఒకరికి దీనికి భిన్నమైన అనుభవం ఎదురైంది. జేబులో ఉంచి మరచిపోయిన డబ్బు అంతకు అంతా తిరిగి వచ్చింది. లాండ్రీవాడి నిజాయితీ పుణ్యం! వివరాలు ఏమిటంటే... మధ్యప్రదేశ్‌లోని శివపురిలోని సంతోషి మాత ఆలయానికి సమీపంలో సూపర్ లాండ్రీ దుకాణం ఉంది. ఈ షాపులో పనిచేస్తున్న డ్రై క్లీనర్ పంచమ్ రజక్‌కు కొన్ని దుస్తులు డ్రైక్లీనింగ్‌కు వచ్చాయి. వాటిని వాషింగ్ మెషీన్‌లోకి వేసేందుకు సిద్ధం చేస్తూండగా అందులో 500 రూపాయల నోట్ల కట్ట కనిపించింది. కట్టలో మొత్తం 50 వేల రూపాయలు ఉన్నట్లు స్పష్టమైంది. అంత డబ్బు చూసిన రజక్‌కు కాసేపు ఏం చేయాలో పాలుపోలేదు. నిజాయితీ పరుడు కావడంతో ఈ విషయాన్ని వెంటనే వినియోగదారుడికి తెలియజేశాడు. తరువాత పంచమ్ రజక్ ఆ కస్టమర్ ఇంటికి వెళ్లి, రూ.50 వేల మొత్తాన్ని అతనికి తిరిగి ఇచ్చాడు. అతని నిజాయితీని గుర్తించిన కస్టమర్ అతనికి బహుమానంగా రూ.2100 అందజేశాడు. కాగా ఈ సంగతి తెలుసుకున్న స్థానికులు డ్రై క్లీనర్ పంచమ్ రజక్ నిజాయితీని మెచ్చుకుంటున్నారు. -
పోయిన బంగారం తిరిగివస్తే.. ఉద్యోగి నిజాయితీకి కాళ్లు మొక్కిన దంపతులు
సాక్షి, బెంగళూరు: తనకు దొరికిన నగల బ్యాగ్‌ను సొంతదారుకు అప్పగించి ఓ కోర్టు ఉద్యోగి నిజాయితీ చాటాడు. శివమొగ్గ వినోబా నగరానికి చెందిన అర్పిత చింతామణిలో బంధువుల ఇంటిలో పెళ్లికి వెళ్తూ ఈక్రమంలో శివమొగ్గ రైల్వే స్టేషన్లో బ్యాగ్‌ను పోగొట్టుకుంది. పనిపై శివమొగ్గకు వెళ్లిన తుమకూరు కోర్టు ఫస్ట్‌క్లాస్ అసిస్టెంట్ గురురాజ్‌కు ఆ బ్యాగ్ దొరికింది. అంతలోనే రైలు రావడంతో బ్యాగ్‌తో తుమకూరు చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నగల బ్యాగును అందజేస్తున్న గురురాజ్ అర్పితా కూడా బ్యాగ్ మిస్ అయినట్లు శివమొగ్గ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. బ్యాగ్ దొరికిందని తెలియడంతో అర్పితా కుటుంబం తుమకూరు తాలూకా వక్కోడికి రాగా గురురాజ్ దంపతులు నగల బ్యాగ్ అందజేశారు. అర్పితా కుటుంబ సభ్యులు గురురాజ్ దంపతుల కాళ్లకు నమస్కరించి బ్యాగును స్వీకరించారు. -
నిజాయితీ చాటుకున్న ట్రాఫిక్ పోలీసు.. రోడ్డుపై దొరికిన రూ.45 లక్షలను..!
రాయ్‌పుర్: రోడ్డుపై వెళ్తున్న క్రమంలో రూపాయి దొరికినా కళ్లకు అద్దుకుని జేబులో వేసుకుంటారు. అదే కట్టల కొద్ది డబ్బు దొరికితే ఇంకేమన్నా ఉందా.. గుట్టు చప్పుడు కాకుండా వాటిని స్వాధీనం చేసుకుంటారు. కానీ, కొందరు అలా ఉండరు. తమకు దొరికిన వాటిని ఎంతో నిజాయితీతో తిరిగి ఇచ్చేస్తారు. అలాంటి కోవకే చెందుతారు ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఓ ట్రాఫిక్ పోలీసు. రోడ్డుపై తనకు రూ.45లక్షలు దొరికితే పోలీసులకు అప్పగించారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్‌లోని నవా రాయ్‌పుర్ కయబంధా పోస్ట్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు ట్రాఫిక్ కానిస్టేబుల్ నిలాంబర్ సిన్హా. మనా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారు జామున రోడ్డుపై ఓ బ్యాగు చూశారు. దానిని తెరిచి చూడగా నోట్ల కట్టలు బయటపడ్డాయి.‘ బ్యాగ్ తెరిచి చూడగా మొత్తం రూ.2వేలు, రూ.500 నోట్ల కట్టలు ఉన్నాయి. సుమారు రూ.45 లక్షలు ఉంటాయి. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు కానిస్టేబుల్. ఆ తర్వాత సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో బ్యాగ్‌ను అప్పగించారు.’ అని అదనపు ఎస్పీ సుఖ్నాందన్ రాథోడ్ తెలిపారు. రివార్డ్ ప్రకటన.. నోట్ల కట్టలతో బ్యాగు దొరికితే తిరిగి తీసుకొచ్చి తన నిజాయితీని చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను అభినందించారు ఉన్నతాధికారులు. రివార్డ్ ప్రకటించారు. బ్యాగు ఎవరిదనే విషయాన్ని తేల్చే పనిలో నిమగ్నమయ్యారు సివిల్ లైన్స్ పోలీసులు. ఇదీ చదవండి: గ్రీన్ సిగ్నల్ ఫర్ ‘టైగర్’.. నిలిచిపోయిన ట్రాఫిక్.. వీడియో వైరల్ -
డిజిటల్ లావాదేవీలు.. రోజుకు రూ. 20వేల కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో రోజుకు రూ. 20వేల కోట్ల విలువైన డిజిటల్ లవాదేవీలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. డిజిటల్ లావాదేవీలు సౌకర్యవంతమైనవే కాకుండా వీటివల్ల నిజాయితీతో కూడిన వ్యాపార వాతావరణం పెరుగుతోందన్నారు. ఆదివారం ఆయన మన్ కీ బాత్‌లో ప్రసంగించారు. చిన్న చిన్న ఆన్లైన్ పేమెంట్లు భారీ డిజిటల్ ఎకానమీ నిర్మాణానికి ఉపయోగపడుతున్నాయని, ఫిన్‌టెక్ స్టార్టప్స్ ముందుకు వస్తున్నాయని తెలిపారు. డిజిటల్ చెల్లింపుల అనుభవాలను ఇతరులతో పంచుకోవాలని ప్రజలను కోరారు. మార్చిలో యూపీఐ లావాదేవీలు రూ. 10 లక్షల కోట్లను చేరాయని చెప్పారు. పలు రంగాల్లో దివ్యాంగులు తమ సత్తా చాటుతున్నారని ప్రశంసించారు. రాబోయే పండుగల సందర్భంగా ప్రజలంతా కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎండాకాలంలో నీటి సంరక్షణ అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. పరీక్షాపే చర్చలో కొందరు పిల్లలకు లెక్కల గురించి కొంచెం భయమున్నట్లు గమనించానని, గణితశాస్త్రంలో మన దేశానికి ఎంతో జ్ఞానం ఉందని చెప్పారు. భారత్ సున్నాను ప్రపంచానికి గుర్తు చేసిందని, మన విజ్ఞానంలో గణితం ఒక భాగమని, అందువల్ల లెక్కల గురించి భయపడవద్దని పిల్లలకు సూచించారు. -
ఈ ఆటోడ్రైవర్ది ఎంత మంచి మనసు..!
పెరవలి(పశ్చిమగోదావరి జిల్లా) : ఆటో డ్రైవర్ నిజాయితీగా వ్యవహరించి ఆటోలో మర్చిపోయిన బంగారు నగలు, నగదును మహిళకు అందించాడు. పెరవలి గ్రామానికి చెందిన పడాల స్వప్న పెనుగొండ వెళ్లేందుకు శనివారం ఉదయం ఆటో ఎక్కింది. ఆమె బ్యాగ్‌లో 10 కాసుల బంగారు నగలు, నగదు ఉన్నాయి. స్వప్న గమ్యానికి చేరుకొన్న తరువాత ఆటోలో బ్యాగ్ వదిలి వెళ్ళిపోయింది. ఆటోలో బ్యాగ్ ఉండటం గమనించిన డ్రైవర్ అడపా రమేష్ కొద్దిసేపు పెనుగొండలోనే ఉండి ఎవరైనా వస్తారని ఎదురు చూశాడు. ఎవరూ రాకపోవడంతో పెరవలి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి బ్యాగ్ అప్పగించాడు. ఆటో వెళ్ళిన గంటసేపటికి బ్యాగ్ పోగొట్టుకున్న స్వప్న ఆటో కోసం వెతకడంతో అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు జరిగిన విషయం తెలిపారు. ఇంతలో ఎస్సై సూర్య భగవాన్ ఆమెకు ఫోన్ చేసి బ్యాగ్ పోలీస్‌స్టేషన్‌లో ఉందని చెప్పారు. దీంతో స్వప్న స్టేషన్‌కు వచ్చి బ్యాగ్‌లో ఉన్న నగలు, నగదు పరిశీలించి అన్ని ఉన్నాయని చెప్పటంతో డ్రైవర్ రమేష్ చేతుల మీదుగా ఆమెకు అందించారు. ఆటో డ్రైవర్ నిజాయతీని అందరు అభినందించారు. -
నిజాయితీపరులైన బ్యాంకు ఉద్యోగులకు భరోసా
న్యూఢిల్లీ: నిజాయితీగా పనిచేసే బ్యాంకు ఉద్యోగులకు రుణాలపరమైన మోసాల కేసుల్లో చర్యల నుంచి రక్షణ కల్పించే విధంగా కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చింది. సిబ్బంది జవాబుదారీతనానికి సంబంధించి నిబంధనలు సూచించింది. రూ. 50 కోట్ల దాకా విలువ చేసే రుణాల మంజూరు విషయంలో తీసుకున్న నిర్ణయాల ఫలితాలు తారుమారైనా సదరు ఉద్యోగినే బాధ్యుడిగా చేసి, చర్యలు తీసుకోకుండా వీటిని రూపొందించింది. కేవలం నిజాయితీగా తీసుకున్న నిర్ణయాలకు మాత్రమే ఇవి వర్తిస్తాయని, దురుద్దేశంతో తీసుకున్న వాటికి వర్తించబోవని ఆర్థిక శాఖ తెలిపింది. ఇలాంటి కేసుల్లో విచారణ జరిపేందుకు పాటించాల్సిన విధానాలను వివరించింది. రుణాన్ని మొండిబాకీగా వర్గీకరించిన ఆరు నెలల్లోగా జవాబుదారీగా వ్యవహరించాల్సిన వారిని గుర్తించే ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొంది. ఓవైపు నిజాయితీగా నిర్ణయాలు తీసుకున్న ఉద్యోగులకు రక్షణ కల్పిస్తూనే మరోవైపు సిబ్బంది జవాబుదారీతనంతో వ్యవహరించే విధంగా ఈ మార్గదర్శకాలు ప్రోత్సహించగలవని ఆర్థిక శాఖ పేర్కొంది. ఓ సంస్థ రుణ ఎగవేత కేసుకు సంబంధించి ఎస్బీఐ మాజీ చైర్మన్ ప్రతీప్ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో కూడా పలువురు బ్యాంకర్లు రుణ డిఫాల్ట్ కేసుల్లో అరెస్ట్ అవ్వడం గమనార్హం. సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) విచారణలకు భయపడి, కొన్ని రకాల రుణాల మంజూరు విషయంలో బ్యాంకర్లు వెనుకంజ వేస్తున్నారు. ఈ భయాలను పోగొట్టి, రుణ వితరణను మెరుగుపర్చేలా బ్యాంకర్లను ప్రోత్సహించేందుకు తాజా మార్గదర్శకాలు ఉపయోగపడగలవని పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ ఎండీ ఎస్ కృష్ణన్ తెలిపారు. -
లక్ష్యసిద్ధికి త్రికరణశుద్ధి
మనం ఏ కార్యాన్ని ఆచరించినా త్రికరణశుద్ధితో ఆచరించాలి. మనస్సుకు, మాటకు, చేతకు తేడా లేకుండా ఉండటమనే నిజాయితీనే త్రికరణశుద్ధిగా వ్యవహరించవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే, మనోవాక్కాయాల శుద్ధి. ఏదయినా పనిని మనసా, వాచా, కర్మణా అన్నిటా ఏకీభావ స్థితిలో మలచుకోవడమే త్రికరణశుద్ధి. మనసులో ఏ విధంగా కార్యాన్ని చేయాలని మనం సంకల్పిస్తామో, వచస్సులో, అంటే మన మాటల్లోనూ అదే ప్రతిఫలించాలి. కర్మణా అంటే కార్యాన్ని ఆచరించే విధానమూ మనం తలచిన విధంలో, చెప్పిన సంవిధానంలో పూర్తి చేయాలి. అప్పుడే ఆ కార్యం త్రికరణశుద్ధి కలిగినదై, లోకాన రాణింపునకు వస్తుంది. మనం ఎన్నో గొప్ప కార్యాలను మదిలో సంకల్పిస్తాం. తీరా, ఆ పనులను గురించి నలుగురిలో విడమరచి చెప్పాలంటే ఎందుకో బిడియం, ఎవరు ఏమనుకుంటారో..? అనే సందేహం. మనం సాధించగలమో లేదో అని అనుమానం. ఒకవేళ, మరీ సాహసం చేసి కొంతవరకు చెప్పగలిగినా, మళ్ళీ ఆచరించే సమయంలో మనకున్న సందేహాలతో ముందుకు సాగకుండా ఆగిపోతాం, దానికితోడు అనుకోకుండా ఎదురయ్యే అవాంతరాలు..!! ఈ విధంగా చేసే కార్యాలు నిరర్ధకమైన రీతిలోనే సాగుతాయి. మన మనసు అత్యంత పవిత్రమైనదనీ, సమస్త పుణ్యాలు అగణ్యమైన రీతిలో ఈ ధరిత్రిలో జరిగింది కేవలం మనసు వల్లనేనని పెద్దల ఉవాచ. అందుకని తలచిన పనులు సఫలం అవాలంటే, మనం భావించిన విషయాన్ని స్పష్టంగా వ్యక్తపరచగలగాలి. ఇది అత్యంత ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఏ పనిలోనైనా కార్యసిద్ధి అనేది ఒక్కరి వల్ల జరగదు. అది సమిష్టిగా, నలుగురితో కలిసి కృషి చేయడం వల్ల జరుగుతుంది లేదా కొంతమంది వ్యక్తుల సమన్వయంతో జరుగుతుంది. అధికశాతం పనులు రకరకాల వ్యక్తుల సమన్వయంతోనే జరుగుతాయి. ఈ కార్యక్రమంలో కొంతమంది విద్యాధికులు, కొంతమంది ఎక్కువగా చదువుకోనివారు కూడా భాగం కావచ్చు. వీరందరి మధ్యా జరిగే సమన్వయమే త్రికరణాలతో కూడుకుని తలపెట్టిన పనిలో కార్యసిద్ధిని కలిగిస్తుంది. వ్యక్తిగతంగా తాము చేసే పనులు కూడా శుద్ధమైన మనసుతో ఆచరిస్తే, విజయాలు సాధించవచ్చు. మధ్యయుగం కాలంలోని ఒక చిన్న కథ ద్వారా ఆ సందేశాన్ని తెలుసుకుందాం. ఒక గురువు గారు నదికి అవతలి ఒడ్డున తన శిష్యులతో నిలిచి ఉన్నారు. నదిలో వారిని దాటించే పడవవాడు వెళ్ళిపోయాడు. కానీ గట్టుకు రెండోవేపు ఒక శిష్యుడు నిలిచిపోయాడు. గురువుగారు, వేగంగా రమ్మని ఆ శిష్యుని ఆజ్ఞాపించారు. వెంటనే, ఆ శిష్యుడు నీటిమీద వేగంగా నడుచుకుని అవతలి గట్టుకు వెళ్ళిపోయాడు. గురువుగారు, శిష్యునికేసి ఆశ్చర్యంగా చూస్తూ, ‘‘నాయనా.. ఏ విద్యతో అంత వేగంగా నీటిమీద నడుచుకుంటూ రాగలిగావు’’ అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించగా, శిష్యుడు’’ భలేవారే.. గురువుగారు... మీకు తెలియని విద్యలేవి ఉన్నాయి నా దగ్గర..!! మీరు తొందరగా రమ్మని ఆజ్ఞాపించారు. నేను మదిలో నది ఒడ్డుకు రావాలన్న తలపును త్రికరణశుద్ధిగా ఆచరించాను. విజయవంతంగా మీ దగ్గరకు చేరుకున్నాను’’ అంటూ వినయంగా సెలవిచ్చాడు. ఇందులో శిష్యుడు చూపిన అగణితమైన ప్రతిభకన్నా, అతని అంకితభావం, నదిని విజయవంతంగా దాటే సమయాన మనసా, వాచా, కర్మణా ఒకే పద్ధతిలో ముందుకు సాగడం పెద్ద పెద్ద లక్ష్యాలను తలపోసే అందరికీ అనుసరణీయం. త్రికరణశుద్ధిగా చరించే మనిషి తనను తాను మూర్తిమంతంగా నడుపుకుంటూ, విజయాలను అవలీలగా సొంతం చేసుకోవడం జరుగుతుంది. ఎన్నో శాస్త్రాలను, విజ్ఞానాన్ని శిష్యులకు క్షుణ్ణంగా బోధించిన ఓ గురువుగారి జీవనప్రస్థానపు అంతిమఘడియల్లో అమృతతుల్యమైన ఈ సత్యం విశదం అయింది. మహా విజ్ఞాననిధియై జీవితాన్ని గడిపిన గురువుగారికి అంత్యకాలం చేరువ అయ్యింది. ఆయన శిష్యులందరిలో ఎడతెగని విచారం. ఆయన ఆశ్రమ ప్రాంతమంతా విషాద వీచికలు కమ్ముకుంటున్నాయి. ముఖ్యశిష్యునిగా వ్యవహరిస్తూ, ఆశ్రమ యోగక్షేమాలు చూసే అతనిలో మరీ విచారం..!! ఈ వాతావరణాన్ని పరికిస్తున్న గురువుగారికి జీవన విషమస్థితిలోనూ ఏ మాత్రం మింగుడుపడడం లేదు. గురువు తన ముఖ్యశిష్యుణ్ణి దగ్గరకు పిలిచి ‘‘ఎందుకు మీరంతా అంతగా బాధపడిపోతున్నారు’’ అని ప్రశ్నించగా, అతను గద్గద స్వరంతో ‘‘గురువుగారూ.. మీరు మా నుంచి వెళ్ళిపోతున్నారు. మీవల్ల ఈ ఆశ్రమానికి వచ్చిన గొప్ప గుర్తింపు, ఎనలేని కాంతి మీ తదనంతరం మాయమవుతుంది. మాలో ఈ కారణం చేతనే రోజురోజుకూ అశాంతి పెరుగుతోంది’’ అన్నాడు. దానికి గురువు నవ్వుతూ ‘‘పిచ్చివాడా.. ఎంత అవివేకంతో మాట్లాడుతున్నావు నాయనా..!! నువ్వు చెప్పిన విధంగా జరిగితే, నేను ఇన్ని రోజులూ మీ అందరికీ చేసిన విద్యాబోధన అంతా వృథానే సుమా.. నేను మీకు ఇచ్చే సలహా ఒక్కటే.. నేను నేర్పించిన విషయాలను అన్నిటా ఆచరణలో పెడుతూ, మిమ్మల్ని మీరే దివ్యమైన జ్యోతుల్లా వెలిగించుకోండి. అది కేవలం మీరు త్రికరణశుద్ధితో చేసే పనులవల్లనే సదా సాధ్యమవుతుంది’’ అన్నాడు. శిష్యునికి జ్ఞానోదయ మయింది. మిగిలిన వారికీ ఇదే సందేశాన్ని అందించి, గురువు బోధలను మనసా వాచా కర్మణా ఆచరించి విజేతగా నిలిచాడు. త్రికరణశుద్ధిగా వుండడమే సిసలైన జీవనానికి ఆనందసూత్రం..!! త్రికరణశుద్ధి లేనివాడికి ఆనందం ఆమడదూరం. త్రికరణశుద్ధి ఉన్నవాళ్ళకే మకరందభరితమైన జీవనం అమితంగా లభ్యమవుతుంది. అందుకని ప్రతివాడు పాటించవలసింది ఒక్కటే.. ‘‘ఆనందంగా, స్థితప్రజ్ఞునిగా ఉండాలంటే త్రికరణశుద్ధిని తప్పనిసరి గా కలిగి వుండాలి. తెలియనిది మాట్లాడకుండా, తనకు అవగాహన ఉన్న విషయాలనే మాట్లాడడం. మాట్లాడిందే ఆచరించడం ప్రధానంగా పాటించవలసిన అంశాలు. ఇవి మొక్కుబడిగా కాకుండా, మక్కువతో పాటిస్తే, జగతిలో గొప్ప విజయాలు నిత్యమూ ఆవిష్కృతమవుతాయి. ‘‘త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును.. లోకము మెచ్చును’’ అన్న సంకీర్తనాచార్యుని వాక్కులు అక్షరసత్యం. త్రికరణశుద్ధితోనే జీవనానికి నిజమైన సత్వం, పస కలిగిన పటుత్వం కలుగుతాయి. బుద్ధిమంతుల ఆలోచనా సరళికి ఆధారమూలం జీవనగమనంలో వారు కలిగి ఉండే త్రికరణశుద్ధి..!! ఈ లక్షణం కలిగినవారికి తప్పక ఒనగూడుతుంది అన్నిటా కార్యసిద్ధి.. త్రికరణ శుద్ధిగా వుండడమే సిసలైన జీవనానికి ఆనందసూత్రం..!! త్రికరణశుద్ధి లేనివాడికి ఆనందం ఆమడదూరం. త్రికరణశుద్ధి ఉన్నవాళ్ళకే మకరంద భరితమైన జీవనం లభ్యమవుతుంది. అందుకని ప్రతివాడు పాటించవలసింది ఒక్కటే.. ‘‘ఆనందంగా, స్థితప్రజ్ఞునిగా ఉండాలంటే త్రికరణశుద్ధిని తప్పనిసరిగా కలిగి వుండాలి. తెలియనిది మాట్లాడకుండా, తనకు అవగాహన ఉన్న విషయాలనే మాట్లాడడం. మాట్లాడిందే ఆచరించడంప్రధానంగా పాటించవలసిన అంశాలు. ఇవి మొక్కుబడిగా కాకుండా, మక్కువతో పాటిస్తే, జగతిలో గొప్ప విజయాలు నిత్యమూ ఆవిష్కృతమవుతాయి. – వ్యాఖ్యాన విశారద వెంకట్ గరికపాటి -
Assam Home Guard: నిజాయితీకి దక్కిన సత్కారం
గువాహటి: కోట్ల రూపాయల విలువైన మాదకద్రవ్యాల సరఫరాలో తమకు సహకరిస్తే భారీ నజరానా ఇస్తామని డ్రగ్ డీలర్లు ఆశజూపినా.. నిజాయితీకే కట్టుబడ్డాడు ఆ హోం గార్డు. అతని నిజాయతీకి, నిఖార్సయిన విధి నిర్వహణకు ప్రతిఫలంగా అస్సాం ప్రభుత్వం ఆయనను కానిస్టేబుల్ ఉద్యోగంతో సత్కరించింది. శనివారం ఆ హోంగార్డు బోర్సింగ్ బేకు కానిస్టేబుల్ నియామక పత్రాన్ని రాష్ట్ర సీఎం హిమంత స్వయంగా అందజేశారు. జూన్ 21న కార్బి అంగ్లాంగ్ జిల్లాలోని ఓ చెక్‌పోస్టు వద్ద మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతోంది. అక్కడే విధుల్లో ఉన్న హోం గార్డు బస్సులో అక్రమ రవాణాను పసిగట్టాడు. అయితే, పోలీసులను ఏమార్చేందుకు, తమకు సాయపడేందుకు ఒప్పుకుంటే భారీ స్థాయిలో లంచమిస్తామని హోం గార్డు బోర్సింగ్కు డ్రగ్ డీలర్లు ఆశపెట్టారు. అందుకు బోర్సింగ్ ససేమిరా ఒప్పుకోలేదు. బస్సులో ఉన్న రూ.12 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడంలో పోలీసులకు సాయపడ్డాడు. దీంతో, హోం గార్డు నిజాయతీకి మెచ్చి సీఎం అతనికి కానిస్టేబుల్ ఉద్యోగనియామక పత్రం అందజేశారు. -
నిజాయతీ: చేతికి దొరికిన రూ.7 కోట్లు తిరిగిచ్చేశారు
మసాచుసెట్స్: రూపాయి దొరికితేనే ఎవరి కంటబడకుండా జేబులో వేసుకుని.. అక్కడ నుంచి జారుకునే రోజులివి. అలాంటిది ఏకంగా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా కోట్ల రూపాయలు దొరికితే ఎవరైనా తిరిగిచ్చేస్తారా.. ఎక్కువ శాతం మంది చెప్పే సమాధానం లేదనే. కానీ అక్కడక్కడ కొందరు నిజాయతీపరులుంటారు. వారి దృష్టిలో పరుల సొమ్ము పాముతో సమానం. అందుకే ఎంత భారీ మొత్తం దొరికినా అందులో రూపాయి కూడా ముట్టరు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి మసాచుసెట్స్‌లో చోటు చేసుకుంది. భారత సంతతి కుటుంబం తమకు దొరికిన 1 మిలియన్ డాలర్(7,27,80,500 రూపాయలు) ప్రైజ్‌మనీ గెలుచుకున్న లాటరీ టికెట్‌ను దాని యజమానిదారుకు అప్పగించారు. ప్రస్తుతం ఆ కుటుంబంపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనలు. ఆ వివారలు.. మౌనిశ్ షా అనే భారత సంతతి వ్యక్తి మసాచుసెట్స్‌లో సొంతంగా ఓ స్టోర్ నడుపుతున్నాడు. లాటరీ టికెట్లను కూడా అమ్ముతుంటారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం మౌనిశ్ షా భార్య 1 మిలియన్ డాలర్ విలువ చేసే లాటరీ టికెట్‌ని లీస్ రోజ్ ఫిగా అనే మహిళకు అమ్మింది. అదృష్టం కొద్ది ఆ టికెట్‌కే లాటరీ తగిలింది. అయితే లీస్ రోజ్ షిగా ఆ టికెట్‌ని సరిగా స్క్రాచ్ చేయకుండానే.. తనకు లాటరీ తగలలేదని భావించి స్టోర్‌లో ఉన్న చెత్త డబ్బాలో పడేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మౌనిశ్ షా కుమారుడు అభి షా సాయంత్ర డస్ట్‌బిన్‌లో ఉన్న టికెట్లను బయటకు తీసి చెక్ చేయగా.. లీస్ రోజ్ ఫిగా టికెట్‌ను సరిగా స్క్రాచ్ చేయకపోవడం చూసి.. దాన్ని పూర్తిగా గీకి చూడగా.. ఆ నంబర్‌కే లాటరీ తగిలిందని గమనించాడు. చేతిలో ఏడు కోట్ల రూపాయలు విలువ చేసే టికెట్ చూసి అభి ఉద్వేగానికి లోనయ్యాడు. వెంటనే దీని గురించి తల్లిదండ్రులకు చెప్పాడు. ముందు అభి ఆ డబ్బుతో టెస్లా కారు కొనాలని భావించాడు. కానీ అతడి తల్లిదండ్రులు ఆ టికెట్‌ను దాన్ని కొన్న లీస్ రోజ్ ఫిగాకు అప్పగించాలని భావించారు. దీని గురించి అభి భారతదేశంలో నివసిస్తున్న తన తాతయ్య, నానమ్మలకు చెప్పగా వారు కూడా ఆ టికెట్ ఎవరిదో వారికి తిరిగి ఇచ్చేయమన్నారు. ‘‘దాన్ని మన దగ్గర ఉంచుకోవడం కరెక్ట్ కాదు. టికెట్ వారికి తిరిగి ఇచ్చేయండి.. ఒకవేళ మీ అదృష్టంలో రాసిపెట్టి ఉంటే మీకే సొంతమవుతుంది’’ అన్నారు. దాంతో ఆ టికెట్‌ను లీస్ రోజ్ ఫిగాకు తిరిగి ఇచ్చేయాలని భావించాను’’ అన్నాడు అభి షా. ఇక మరుసటి రోజు అభి తల్లిదండ్రులను తీసుకుని లీస్ రోజ్ ఫిగా పని చేస్తున్న చోటకు వెళ్లి.. ‘‘మా అమ్మనాన్న మీతో మాట్లాడాలనుకుంటున్నారు.. ఒక్క నిమిషం బయటకు రండి అని పిలిచాను. బయటకు వచ్చాక ఆమెకు తను కొన్న టికెట్ అప్పగించాం’’ అన్నాడు. ఈ సందర్భంగా లీస్ రోజ్ ఫిగా మాట్లాడుతూ.. ‘‘అక్కడి వెళ్లాక వారు నా చేతిలో నేను డస్ట్‌బిన్‌లో పడేసిన టికెట్ నా చేతిలో పెట్టారు. దానికే ప్రైజ్‌మనీ వచ్చిందని తెలిపారు. అది చూసి నా కళ్లని నేను నమ్మలేకపోయాను.. సంతోషంతో అక్కడే కూర్చుని గట్టిగా ఏడ్చాను. ఆ తర్వాత వారిని కౌగిలించుకుని కృతజ్ఞతలు తెలిపాను. లోకంలో ఇంత నిజయాతీపరులు ఉంటారని కలలో కూడా ఊహించుకోలేదు. జీవితాంతం వారికి రుణపడి ఉంటాను. దేవుడు వారిని చల్లగా చూడాలి’’ అని తెలిపింది. చదవండి: నాన్న ఇచ్చిన నాణెం: కోట్లు కురిపించింది! -
ఆటో డ్రైవర్ నిజాయితీ
కొణిజర్ల: ఓ మహిళ ఆటోలో మర్చిపోయిన బ్యాగ్‌ను ఆటో డ్రైవర్ తిరిగి అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు. ఎస్ఐ గండికోట మొగిలి కథనం ప్రకారం.. ఖమ్మానికి చెందిన తేజావత్ శైలజ సోమవారం మధ్యాహ్నం ఖమ్మం నుంచి తన అమ్మమ్మ గారి ఊరైన కొణిజర్ల మండలం అమ్మపాలెం వెళ్లేందుకు ఆటోలో బయలుదేరింది. తనికెళ్ల వద్ద దిగి అమ్మపాలెం వెళ్లే క్రమంలో తన బ్యాగు ఆటోలో మర్చిపోయి వెళ్లిపోయింది. ఆమె బ్యాగులో రెండు తులాల బంగారపు గొలుసు, పుస్తెల తాడు, చెవిదిద్దులు, బంగారపు ఉంగారాలు ఉన్నాయి. దీంతో కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అదే సమయంలో తనికెళ్లకు చెందిన ఆటో డ్రైవర్ డేరంగుల రవీందర్‌బాబు తన ఆటోలో మర్చిపోయిన బ్యాగును ఠాణాలోఅప్పగించాడు. సదరు బ్యాగును ఎస్ఐ సమక్షంలో శైలజకు అందించాడు. డ్రైవర్ నిజాయితీని ఎస్ఐ మొగిలి అభినందించారు. -
నిజాయతీ ఉందనడానికి ఇదే నిదర్శనం..!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి చిరుద్యోగులు, రోజు కూలీలు, ఆటో, క్యాబ్ డ్రైవర్లకు కష్టాలు మొదలయ్యాయి. లాక్‌డౌన్‌తో అసలు జనాలు భయటకు వెళ్లలేదు. ప్రస్తుతం సడలింపులు ఇచ్చినప్పటికి.. పరిమిత సంఖ్యలోనే ప్రయాణికులను అనుమతిస్తున్నారు. దాంతో రోజు గడవడం.. వాహనాల ఈఎమ్ఐలు, రోజు వారి అద్దెలు గడవడం గగనంగా మారింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఓ ఆటోడ్రైవర్ తన నిజాయతీని కోల్పోలేదు. రోజుకు మూడు వందల రూపాయలు సంపాదించడమే కష్టంగా ఉన్న తరణంలో తన ఆటోలో అతడికి సుమారు లక్షన్నర రూపాయల సొమ్ము దొరికింది. కానీ అతడు దానిలో ఒక్క రూపాయి ముట్టుకోకుండా పోలీసులకు అప్పగించి నిజాయతీని చాటుకున్నాడు. (ఉపాధి ఊడుతోంది!) వివరాలు.. మహ్మద్ హబీబ్ నగరంలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కరోనా ముందు వరకు ఆటో మీద బాగానే సంపాదించేవాడు. కానీ లాక్‌డౌన్‌తో కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతం రోజుకు కేవలం మూడువందల రూపాయలు మాత్రమే సంపాదించగల్గుతున్నాడు. దానిలో 250 రూపాయలు ఆటో అద్దెకు పోతుంది. మిగిలిన 50 రూపాయలతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం మహ్మద్ హబీబ్ ఆటోలో ఇద్దరు మహిళలు ఎక్కారు. సిద్దంబర్ బజారు ప్రాంతంలో దిగారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30గంటల ప్రాంతంలో మహ్మద్ తాడబన్ ప్రాంతానికి చేరుకున్నాడు. వాటర్ బాటిల్ కోసం ప్యాసింజర్ సీటులో వెతికాడు. అతడికి ఓ బ్యాగ్ కనిపించింది. అది చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఏ బాంబో ఉంటే ఎంటి పరిస్థితి అనుకున్నాడు. (నెల రోజుల తర్వాత కాస్త రిలీఫ్..) ఇంతలో మహ్మద్‌కి సిద్దంబర్ బజార్ ప్రాంతంలో దిగిన మహిళలు గుర్తుకు వచ్చారు. ఈ బ్యాగ్ వారిదే అయ్యుంటుందని భావించాడు. అక్కడి వెళ్లి వారి కోసం చూశాడు. కానీ కనిపించలేదు. దాంతో ధైర్యం చేసి బ్యాగ్ ఒపెన్ చేశాడు. దాన్నిండ డబ్బుల కట్టలు ఉన్నాయి. మొత్తం 1.40 లక్షల రూపాయలు ఉన్నాయి. వెంటనే దగ్గరిలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. విషయం వారికి చెప్పాడు. ఇంతలో బ్యాగ్ మర్చిపోయిన మహిళ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. మహ్మద్ ఆమెను గుర్తు పట్టాడు. అనంతరం బ్యాగ్‌ను ఆమెకు అందించాడు. పోయింది అనుకున్న డబ్బు దొరకడంతో సదరు మహిళ సంతోషించింది. మహ్మద్‌కు కృతజ్ఞతలు తెలపడమే కాక అతడికి ఐదు వేల రూపాయలు బహుమతిగా ఇచ్చింది. పోలీసులు మహ్మద్ నిజాయతీని ప్రశంసించడంతో పాటు అతడికి సన్మానం చేశారు. -
ఛండీగడ్ గార్డుకు సలాం.. ఏం చేశాడంటే
చండీగఢ్ : పది రూపాయలు దొరికినా గుట్టుగా జేబులో వేసుకునే ఈ రోజుల్లో చండీగడ్‌లో ఒక సినిమా హాల్లోని సెక్యూరిటీ గార్డు చూపించిన నిజాయితీ ఆదర్శంగా నిలిచింది. లక్షల రూపాయల విలువ చేసే డైమండ్ బ్రాస్లెట్ను తిరిగి నిజమైన యజమానురాలికి ఇచ్చిన వైనం సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కించుకుంటోంది. వివరాల్లోకి వెళితే..వివాహ వార్షికోత్సవ కానుకగా భర్త బహుమతిగా ఇచ్చిన ఖరీదైన డైమండ్ బ్రాస్లెట్ను మీనాక్షి గుప్తా సినీపోలిస్ సినిమా హాల్లో పోగొట్టుకున్నారు. దీనికోసం వెతికి వెతికి నిరాశ చెందిన మీనాక్షి చివరి ప్రయత్నంగా సినీపోలిస్ థియేటర్లోని పోలీసులను సంప్రదించారు. ఆ ఆశే ఆమెకు అంతులేని సంతోషాన్ని మిగిల్చింది. నిజాయితీగల, నిఖార్సైన సెక్యూరిటీ గార్డును ప్రపంచానికి పరిచయం చేసింది. తన భర్త ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్ పోవడంతో చాలా షాకయ్యాననీ, కానీ గార్డు నిజాయితీ తనకు అంతులేని సంతోషాన్ని తీసుకొచ్చిందంటూ సోషల్ మీడియాలో వెల్లడించారు మీనాక్షి. నాలుగు సంవత్సరాల క్రితం దీని విలువ రూ. 2 లక్షలు అని తెలిపారు. ఇంతకీ ఈ స్టోరీలోని రియల్ హీరో పేరు సూరజ్, చండీగఢ్ నివాసి. గత ఏడు నెలలుగా సినీపోలిస్ సినిమా హాల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షో అయిపోగానే ప్రతీ సీటును క్షుణ్ణంగా పరిశీలిస్తామని సూరజ్ చెప్పారు. ప్రతీరోజు సెల్‌ఫోన్, బంగారు నగలు లాంటి విలువైన వస్తువులు దొరుకుతూనే ఉంటాయనీ వాటిని జాగ్రత్తగా దాచిపెట్టి పోగొట్టుకున్నవారికి అందిస్తామన్నారు. నిజాయితీగా సంపాదించిన డబ్బు మాత్రమే మనకు మిగులుతుంది.. అప్పనంగా వచ్చింది ఏదో ఒక రూపంలో పోతుందంటూ సూరజ్ పేర్కొనడం విశేషం. అంతేకాదు బ్రాసెలెట్ను జాగ్రత్తగా భద్రపరిచిన పెట్టిన సూరజ్..అడిగిన వెంటనే అలవోకగా మీనాక్షికి ఆ నగను స్వాధీనం చేయలేదు. దాని ఖరీదుకు సంబంధించిన బిల్లు, ఫోటో, ఆధార్‌కార్డు లాంటివి తీసుకుని పూర్తిగా ధృవీకరించుకున్న తరువాత మాత్రమే అప్పగించడం గమనార్హం. -
బంగారు తూనిక రాళ్లు
ఒక ఊరిలో ఒక వృద్ధుడు తన ధార్మిక చింతనతో, దైవారాధనలతో ఎంతోమంది అనుయాయులను సంపాదించుకున్నాడు. ఒకరోజు అనుయాయుడొకరు వచ్చి, ‘‘గురువర్యా! నా వ్యాపారం అభివృద్ధి చెందాలని దీవించండి’’ అని ప్రాధేయపడ్డాడు. ‘‘దైవం నీ వ్యాపారంలో వృద్ధీ వికాసాలు ప్రసాదించుగాక. ధాన్యాన్ని నిజాయితీగా తూచి ఇవ్వు. వ్యాపారంలో నిజాయితీగా వ్యవహరించు. మోసాలకు పాల్పడకు’’ అని హితవు పలికాడు వృద్ధుడు. దీంతో తనలో గూడుకట్టుకుని ఉన్న మోసబుద్ధిని గురువుగారి హితవుతో పూర్తిగా మానుకున్నాడు. వ్యాపారాన్ని నిజాయితీగా, ఎలాంటి కల్తీలు, మోసాలకు పాల్పడకుండా సాగించాడు. అనతికాలంలోనే మంచి పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. ఆ ప్రాంతంలో నిజాయితీగల వ్యాపారిగా అందరి మన్ననల్ని అందుకున్నాడు. వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోంది. తూనిక రాళ్లను బంగారంతో తయారు చేయించేంతగా వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకున్నాడు. ఫలానా షావుకారు వద్ద బంగారు తూనికరాళ్లు ఉన్నాయని ప్రజలు గొప్పగా చెప్పుకునేవారు. ఆ తూనికరాళ్లను ఆశ్చర్యంగా చూసి వెళ్లేవారు. ఒకరోజు అతడు ఆ తూనిక రాళ్లను తీసుకొని తన గురువుగారి వద్దకు వచ్చి ‘‘గురువుగారూ! మీ ఆశీర్వాదం వల్ల నా వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది. నేను ధాన్యాన్ని తూచడానికి బంగారపు తూనికరాళ్లను ఉపయోగిస్తున్నాను’’ అని ఎంతో సంతోషంగా చెప్పాడు. ‘‘అవునా? అయితే ఆ పుత్తడి తూనిక రాళ్లను తీసుకెళ్లి వాగులో పడవేయి’’ అన్నాడు వృద్ధుడు. గురువు గారి ఆజ్ఞకు వ్యాపారి బిత్తరపోయాడు. ఆజ్ఞ పాటించక తప్పదన్నట్లుగా ఆ రాళ్లను వాగులో విసిరేశాడు. ఈ సంఘటన జరిగిన రెండు మూడు రోజుల తర్వాత కొంతమంది రైతులు తమ ధాన్యాన్ని అమ్మడం కోసం వాగును దాటుతుండగా ఆ తూనిక రాళ్లు వారి కాళ్లకు తగిలాయి. వెంటనే అవి వ్యాపారికి సంబంధించినవిగా గుర్తించి, అతడికి అప్పగించారు. ఆ వ్యాపారి వాటిని తీసుకుని వెళ్లి.. ‘నేనైతే వీటిని వాగులో పడేశాను. కాని తిరిగి ఇవి నా వద్దకే వచ్చాయి’’ అని గురువుగారికి చెప్పాడు. ‘‘ఇది ఒక పరీక్ష మాత్రమే. నిజాయితీగా సంపాదించిన నీ సొమ్మును నువ్వు వాగులో పడేసినా తిరిగి నీ దగ్గరికే వచ్చిందంటే ఇది నీ కష్టార్జితం. నిజాయితీగా సంపాదించినదే. ఇలాంటి సంపద గౌరవమైనది’’ అన్నాడు వృద్ధుడు. – సుమయ్యా -
నిజాయితీ చాటుకున్న మహిళ
జనగామ : తాను అమ్ముకున్న భూమికి రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకంలో మంజూరు చేసిన పెట్టుబడి చెక్కును ఓ మహిళ అధికారులు అప్పగించి తన నిజాయితీని చాటుకుంది. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన సీహెచ్ లీలాకుమారి తనకున్న 7.10 ఎకరాల భూమిని పదేళ్ల క్రితం అమ్ముకున్నారు. అయితే భూమిని కొనుగోలు చేసిన వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేసుకుని, రెవెన్యూలో కన్వర్షన్ చేసుకోకపోవడంతో నేటికీ పట్టాదారు కాలంలో లీలాకుమారి పేరు ఉంది. అయితే భూ ప్రక్షాళన పూర్తి చేసుకుని, రైతు బంధు చెక్కులను సిద్ధం చేయగా, అందులో పెట్టుబ డి సాయం కింద లీలాకుమారికి రూ.32,700 చెక్కు మంజూరు చేశారు. కాగా, రెవెన్యూ అధికారులు ఆమెకు చెక్కు వచ్చిందని సమాచారం అందించగా, అమ్ముకున్న భూమికి పెట్టుబడి అవసరం లేదని అధికారులకు తేల్చి చెప్పారు. తనలోని నిజాయితీని చాటుకుంటూ.. చెక్కును తహసీల్దార్ రమేష్‌కు అప్పగించారు. ఆమెను అధికారులతో పాటు జిల్లా ప్రజలు అభినందించారు. -
నిజాయితీ చాటుకున్న ఆటోవాలా
ఎస్ఆర్నగర్(హైదరాబాద్): నిజాయితీ కరవైన ఈ రోజుల్లో ఓ ఆటోవాలా తన నిజాయితీని చాటుకున్నాడు. తాను నడుపుతున్న ఆటోలో ప్రయాణించిన వారి బంగారు ఆభరణాలు ఆటోలో జారిపోయాయి. ఇది గమనించని వారు ఆటో దిగి వెళ్లిపోయారు. తర్వాత వాటిని గమనించిన ఆటో డ్రైవర్ మీర్జా మహమూద్ ఆరున్నర తులాల బరువున్న ఆ ఆభరణాలను ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించాడు. నిజాయితీ ప్రదర్శించిన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అభినందించారు. సీఐ వహిదుద్దీన్ ఆయన్నుసన్మానించారు. -
నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్
సాక్షి, బనశంకరి: రోడ్డుపైన పదిరూపాయల నోటు పడితే ఎవరూ చూడకుండా నొక్కేసే రోజులివి. అయితే ప్రయాణికుడు మరచిపోయిన రూ.2లక్షల నగదు సంచిని సొంతదారుడికి అప్పగించి ఓ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువెత్తు రూపంగా నిలిచాడు. ఈఘటన బుధవారం కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. శివాజీనగనర చర్చ్‌లో పనిచేసే దివ్య చర్చ్‌కు సంబంధించిన రూ.15 లక్షల నగదును బ్యాంకులో డిపాజిట్ చేయడానికి మంగళవారం సాయంత్రం ఆటోడ్రైవరు సుహేల్‌బాషా ఆటోలో ఇన్ప్యాంట్రీరోడ్డు వరకు వెళ్లింది. ఈక్రమంలో రూ.2 లక్షల నగదు ఆటోలోనే మరచిపోయింది. నగదు గల్లంతైన ఘటపై కమర్షియల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా బుధవారం ఉదయం ఆటో డ్రైవర్ సుహేలబాషా తన వాహనంలో రూ.2 లక్షల నగదు సంచిని గమనించి పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో అప్పగించాడు. అధికారులు స్పందించి బాధితురాలిని కమిషనర్ కార్యాలయానికి రప్పించి నగదు అందజేశారు. నిజాయితీగా వ్యవహరించిన ఆటోడ్రైవర్‌కు దివ్య కృతజ్ఞతలు తెలిపారు. , , -
నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్
బోడుప్పల్: ప్రయాణికురాలు ఆటోలో మరిచిపోయిన బ్యాగ్‌ను మేడిపల్లి పోలీస్ స్టేషన్లో అప్పజెప్పి ఓ ఆటో డ్రైవర్ నిజాయితీ చాటుకున్నాడు. మేడిపల్లి పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నారాపల్లి ఎంఎస్ఆర్ కాలనీకి చెందిన వేముల రాజు (33)ఆటో డ్రైవర్‌గా పని చేసేవాడు. ఆదివారం రాత్రి అంబర్‌పేటలో ఓ మహిళ (40) అతని ఆటో ఎక్కి ఉప్పల్‌లోని రేణుక వైన్స్ వద్ద దిగి వెళ్లింది. ఆ తరువాత ఇంటికి వెళ్లిన రాజు తన ఆటోలో చూసుకోగా బ్యాగ్ కనిపించింది. బ్యాగు తీసి పరిశీలించగా అందులో రూ 37,080 నగదు, కొన్ని డాక్యుమెంట్లు ఉన్నా యి. దీంతో అతను నేరుగా మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు బ్యాగ్‌ను అప్పగించాడు. పోలీసులు ఆ ఆటో డ్రైవర్‌ను అభినందించారు. బాధితురాలు మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు. -
నిజాయితీని భయపెట్టిన శిక్ష
ఆలోచనం ఈ ప్రపంచంలో తప్పులు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్లసలు ఏ పనీ చెయ్యలేదని అర్థం. మచ్చలేని ఉద్యోగ రికార్డ్ కలిగిన హెచ్ఎస్ గుప్తా చేసిన పనిలో పొరపాటు జరిగింది. తప్పుచేయాలనే ఉద్దేశం లేని చోట జరిగిన పొరపాటు శిక్షార్హం కాకూడదు. కొద్దిరోజుల క్రితం నా కూతురు అడిగిన ఒక ప్రశ్నకు నేను, నాకెంతో ఇష్టమయిన చైనా తత్వవేత్త లావో త్సు మాటలు కోట్ చేశాను. ‘నీ ఆలోచనలపై శ్రద్ధపెట్టు ఎందుకంటే అవే నీ మాటలవుతాయి, నీ మాట లపై శ్రద్ధ ఉంచు, అవే నీ చేతలు, నీ చేతలపై శ్రద్ధ ఉంచు అవే అలవాట్లవుతాయి, నీ అలవాట్లను గమనించు, అవే నీ వ్యక్తిత్వంగా మారుతాయి, నీ వ్యక్తిత్వంపై శ్రద్ధ పెట్టు ఎందుకంటే అదే నీ విధిని నిర్ణయిస్తుంది’’ అని. మన ఆలోచనలు నిష్కల్మషంగా ఉంటే మన విధి బాగుంటుందని బొగ్గుగనుల శాఖ మాజీ సెక్రటరీ హరీష్ చంద్ర గుప్తాకి సీబీఐ కోర్టు శిక్ష విధించే వరకు నేను దృఢంగా విశ్వసించేదాన్ని. నిజాయితీపరుడిగా ఖ్యాతిగాంచిన ఈ అధికారి ‘‘నా దగ్గర లాయర్ ఫీజులు ఇచ్చుకునేంత డబ్బు కూడా లేదు’’ అని కన్నీటి పర్యంతం కావడం, అతను వారణాసి వున్న యూపీకి చెందినవాడు కావడం, అతని పేరు సత్య హరిశ్చంద్రని జ్ఞాపకం తెస్తూ ఉండటం చేతననుకుంటా నాకు పదే పదే బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రచించిన సత్యహరిశ్చంద్రీయంలోని... తిరమై సంపదలెల్ల వెంటనొకరీతిన్సాగిరావేరి కేరికేపాటు విధించినో విధి యవశ్యప్రాప్తమద్దానినె వ్వరు దప్పించెదరున్నవాడననిగర్వంబేరికిన్ గాదుకిం కరుడే రాజగు రాజే కింకరుడగున్గాలానుకూలంబుగన్’’ అనే పద్యం మదిలో మెదులుతూ, విధి ఎవరికేది రాసి ఉంచిం దో దానినెవరమూ తప్పించజాలం అనే హిందూ కర్మ సిద్ధాంతం వైపునకు నా మనసునుlలాగుతూ ఉంది. నిజానికి కాగ్ మొదట బొగ్గుగనుల కేటాయింపుల గురించి మాట్లాడినపుడు, ఇప్పుడు అనుసరించిన పద్ధతి కాకుండా వేలం పద్ధ తిని అనుసరించి ఉంటే దేశానికి ఇన్ని లక్షలకోట్ల లాభించి ఉండేవని అన్నదేకానీ ఇందులో వీరు అనుమానితులు అని ఎక్కడా అనలేదు. కేసు సీబీఐకి వెళ్లిన తరువాత ప్రస్తుత బీజేపీ పరిపాలనా కాలాన, కోర్టు హెచ్ఎస్ గుప్తా తదితరులకు జైలు శిక్షను ఖరారు చేసింది. చిదంబరం కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖామంత్రిగా ఉన్నపుడు రూపొందిన అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1)(ఛీ)(111) ప్రకారం అధికారులు తీసుకున్న చర్యల వల్ల ఎవరైనా ఆర్థిక లాభం పొందితే ఆ అధికారి లంచం తీసుకోకపోయినా అది నేరపూరిత చర్య అవుతుంది. ఐ్కఇలో నేరాన్ని రుజువు చేయడానికి మెన్స్ రియా (mens rea–అపరాధ భావన) ముఖ్యప్రాతిపదిక కాగా ఈ అవినీతి నిరోధక చట్టంలో మెన్స్ రియా లేకపోయినప్పటికీ శిక్ష పడిపోతుంది. మచ్చలేని ఉద్యోగ రికార్డ్ కలిగిన హెచ్ఎస్ గుప్తా ఈ చట్టం క్రింద శిక్షార్హుడవటం ఆయన సహచరోద్యోగులను తీవ్రంగా కలతపరిచింది. ఈ సందర్భంగా ప్రభుత్వ పనివిధానాలు, అధికారుల బాధ్యతలు, అవి నీతి నిరోధక చట్టం గురించి వివిధ స్థాయిల్లో చర్చ జరుగుతూ ఉంది. కేబినెట్ సెక్రటరీ ర్యాంకులో రిటైర్డ్ అయిన బీకే చతుర్వేది, నరేష్ చంద్ర వంటి వారు హరీష్ చంద్ర సత్యసంధతను ప్రస్తావిస్తూ కోర్టు నిర్ణయాన్ని తప్పుపట్టడం గుర్తించాల్సిన విషయం. నరేష్ చంద్ర పెట్రోల్ పంపులు, ఎల్పీజీ కేటాయింపులలో అవకతవకలను గుర్తించి కోర్టు 2002లో అలాటి 3,760 కేటాయింపులను రద్దు చేసిందని, కానీ ఆయా బోర్డుల చైర్మన్లను అరెస్ట్ చేయలేదని, ఆ చైర్మన్లలో చాలామంది రిటైర్డ్ జడ్జీలని ఈ సందర్భంలో జ్ఞాపకం చేశారు. ఒక కార్యానికి నాయకత్వం వహించే వ్యక్తి బాధ్యత అనే కాడెను భుజాన వేసుకుని కార్యరంగంలోకి దిగుతాడు. నాయకుడు దార్శనికుడై ఉండటమే కాదు గోడమీది పిల్లిలా కాకుండా అవసరమొచ్చినపుడు కష్టనష్టాలను అంచనావేసి రిస్కు తీసుకోగల ధీరత్వం కలవాడు కూడా అయి ఉండాలి. సివిల్ సర్వీస్ అధికారులకు ట్రైనింగ్ సమయంలో ప్రమాదభరితమయిన పర్వతాలను ఎక్కడమూ, గుర్రపు స్వారీ చేయడమూ, రివర్ రాఫ్టింగ్ వంటి వాటిలో శిక్షణ ఇస్తారు. దాని అర్థం వారు అప్పుడప్పుడూ సరదాగా గుర్రపు స్వారీ చేసుకోమని కాదు అవసరమొచ్చినప్పుడు ప్రజారక్షణార్ధం అన్ని విధాలా సిద్ధంగా వుండాలని. నా భర్త జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు గంగానది పోటెత్తి ఊళ్లని ముంచుతూవుంటే ఒక చిన్న తెప్పమీద వరద గంగపై చిన్న దీవి ప్రాంతానికి వెళ్లడం నాకు ఇప్పటికీ ఒళ్లు జలదరించే జ్ఞాపకం. అట్లాగే ఇంతకు ముందు ఎటువంటి విధివిధానాలు రాసి పెట్టి ఉండని బొగ్గుగనుల కేటాయింపులోని నిర్ణయాత్మక స్థానంలో నిలబడిన హరీష్ చంద్ర అతని కార్యవర్గం ఆ నిర్ణయాలను తీసుకున్నారు. ఏ లాభమూ లేని చోటుకి వ్యాపారి రాడు. గనుల కేటాయింపుల్లో వ్యాపారికి లాభం జరిగి ఉండొచ్చు, కానీ దాని కోసమని ఏ గుప్తా లంచం తీసుకున్నట్లు అభియోగాలు కానీ, ఆధారాలు కానీ లేవు. అంతే కాదు, ఆయన ఉద్యోగ చరిత్రలో ఎక్కడా మచ్చ లేదు అయినా కోర్ట్ శిక్ష విధించింది. సంస్కృత న్యాయ సూక్తి కోశంలో ఒక మాట ఉంటుంది ‘‘కాకాక్షి న్యాయము’’ అని కాకి ఒకవైపు మాత్రమే చూడగలదు. అందుకని అది ఏం చూడదలచుకుంటుందో అటువైపే చూస్తుంది. కోర్టు హరీష్ చంద్ర సత్యసంధత చరిత్రను లెక్కలోకి తీసుకోకుండా శిక్షవిధించడం కాకాక్షి న్యాయం కిందికే వస్తుందని ప్రజలు అనుకోవడంలో తప్పులేదు. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. ఈ దేశంలో అవసరమయినపుడు, చురుకుగా నిర్ణయాలు తీసుకునే అధికారుల అవసరం ఎంతయినా ఉంది. ఏ క్షణం ఏమొస్తుందో, ఈ రోజు తీసుకున్న ఈ నిర్ణయం మరో పదేళ్లకు జైలు శిక్ష కాటేస్తుందేమో అనే భీతి అధికారులలోకి ప్రవేశిస్తే వారు రిస్క్ చేయడానికి పూనుకోరు. నిజాయితీ పరుడయిన హరీష్ చంద్ర ప్రస్తుత స్థితి సివిల్ సర్వీస్ అధికారులలో ఈ భయానికి బీజం వేసింది. యూఎస్ఏ 26వ అధ్యక్షుడు థియోడర్ రూజ్వెల్ట్ "The only man who never makes a mistake is the man who never does anything'' అన్నారు నిజం కదా అసలు ఈ ప్రపంచంలో తప్పులు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్లసలు ఏపని చెయ్యలేదని అర్థం. హెచ్ఎస్ గుప్తా చేసిన పనిలో పొరపాటు జరిగింది. తప్పుచేయాలనే ఉద్దేశం లేని చోట జరి గిన పొరపాటు శిక్షార్హం కాకూడదు. వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 91635 69966 సామాన్య కిరణ్ -
నిష్పక్షపాతంగా క్రీడాకారులను ఎంపిక చేయాలి
అకాడమీలు అందుబాటులో ఉండాలి రాష్ట్రస్పోర్ట్సు అథారిటీ చైర్మన్ మోహన్ సామర్లకోట : క్రీడాకారులకు అకాడమీలు అందుబాటులో ఉన్నప్పుడే ఉత్తమంగా తయారవుతారని రాష్ట్ర స్పోర్ట్సు అథారిటీ చైర్మన్ పీఆర్ మోహన్ పేర్కొన్నారు. సామర్లకోటలో జరుగుతున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల సందర్భంగా శనివారం కబడ్డీ కోర్టులను ఆయన పరిశీలించారు. కోర్టు ఆవరణలో ఆయన మాట్లాడుతూ పల్లం బీడు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉందని చెప్పారు. ఆ స్థలం కలిగిన వ్యక్తులు ముందుకు వచ్చి స్టేడియం నిర్మాణం చేసుకోవడానికి స్థలం ఇస్తే దాత ఫొటోతో స్టేడియం పేరు ఏర్పాటు చేస్తామని చెప్పారు. క్రీడాకారుల ఎంపిక అవినీతి, పక్షపాతం, సిఫారసులు లేకుండా జరిగితే నిజమైన క్రీడాకారులకు అవకాశం ఉంటుందని చెప్పారు. జాతీయ స్థాయిలో గోల్డు మెడల్ సాధించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ. ఏడు లక్షలు నగదు బహుమతి ఇవ్వడానికి నిర్ణయించిందని తెలిపారు. రాష్ట్రం విడిపోవడంతో స్టేడియాలు లేని పరిస్థితి ఏర్పడిందని, దాంతో రూ. 70 కోట్లతో స్టేడియం నిర్మించాలని నిర్ణయించిన్నట్లు చెప్పారు. పదేళ్లక్రితం టోర్నమెంట్‌కు నిధులిచ్చేవారు రాష్ట్రంలో ఎక్కడ టోర్నమెంట్ జరిగినా పదేళ్ల క్రితం ప్రతి క్రీడాకారుడికి రూ.50 వంతున నిధులు కేటాయించేవారని ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి వి.వీరలంకయ్య అన్నారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రం నుంచి ఐదుగురు కబడ్డీ క్రీడాకారులు వియత్నాంలో జరిగిన పోటీల్లో బంగారు, వెండి పతకాలను సాధించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ సొంత ఖర్చులు, దాత సహకారంతోనే టోర్నమెంటులు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. సమావేశంలో జాతీయ కబడ్డీ కోచ్ పోతుల సాయి, రాష్ట్ర కోశాధికారి ఎం.రంగారావు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు, పోటీల నిర్వాహక కార్యదర్శి బోగిళ్ల మురళీ కుమార్, కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షుడు కొండపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
పిజ్జా ఆర్డర్ చేస్తే.. నోట్ల కట్ట వచ్చింది!
సాధారణంగా ఏదైనా వస్తువు ఆర్డర్ చేసినప్పుడు అది మనకు సకాలంలో రాకపోతే ఎంతో చిరాకు పడుతుంటాం. అయితే తనకు వచ్చిన పార్శిల్ చాలా ఆలస్యంగా వచ్చినా ఓ మహిళా కస్టమర్ ఓపిక పట్టింది. అయితే ఆ ఆర్డర్ లో తనకు కావాల్సిన వస్తువు లేదు.. అంతకంటే ఆశ్చర్యం ఏంటంటే.. ఐదు వేల డాలర్ల విలువైన నోట్లు ఉన్నాయి. ఈ విషయాలన్ని ఆ సంస్థకు చెప్పి, డబ్బు వెనక్కు తీసుకోవాలని సూచించింది. ఆమె నిజాయితీని మెచ్చిన ఆ సంస్థ కస్టమర్ కు ఓ ఏడాది పాటు పిజ్జా ఫ్రీగా అందిస్తామంటూ ప్రకటించింది. కాలిఫోర్నియాకు చెందిన సెలెనా అవలోస్ ఓ రోజు డోమినోస్ కు ఫోన్ చేసి పిజ్జా ఆర్డర్ చేసింది. అయితే తనకు రావాల్సిన పిజ్జా కాస్త ఆలస్యంగా వచ్చింది. పార్శిల్ ఓపెన్ చూసి చూడగా పిజ్జా బదులుగా ఐదువేల డాలర్ల నగదు ఉన్నట్లు గుర్తించింది. కస్టమర్ సెలెనా వెంటనే డోమినోస్ వారికి ఫోన్ చేసి పిజ్జా రాలేదని, పార్శిలో బాక్స్ లో డబ్బులు ఉన్నాయని చెప్పింది. ఆ కస్టమర్ నిజాయితీని డోమినోస్ వారు అభినందించారు. ఒక ఏడాది పాటు సెలెనాకు పిజ్జా ఫ్రీగా అందిస్తామని ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె మేనేజర్ ఈ విషయం తెలుసుకుని వారం రోజుల పాటు ఆమెకు సెలవు ఇచ్చారు. -
శభాష్.. రాజేష్
నిడదవోలు : ఆటోవాలా నిజాయితీకి అభినందనలు వెల్లువెత్తాయి. తన ఆటోలో ప్రయాణికుడు మరిచిపోయిన ఆరు కాసుల బంగారు నెక్లెస్ ఉన్న బ్యాగ్‌ను నిజాయతీగా పోలీసులకు అప్పగించి శభాష్ అనిపించుకున్నాడు. కొవ్వూరు మండలం బంగారంపేటకు చెందిన ఆటో డ్రైవర్ దాసరి రాజేష్ కిరాయికోసం శుక్రవారం నిడదవోలు బయలుదేరాడు. మార్గమధ్యలో సమిశ్రగూడెం వద్ద విజయవాడ పుష్కరాలకు బయలుదేరిన ఆకుల శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఎక్కించుకున్నాడు. వారు నిడదవోలు బస్టాండ్ సెంటర్లో ఆటోదిగారు. అక్కడి నుంచి రైల్వేస్టేçÙన్కు నడిచివెళుతుండగా ఆటోలో నెక్లెస్ బ్యాగ్ మరిచిపోయినట్టు గుర్తించారు. స్థానిక పోలీస్‌స్టేçÙన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. బస్టాండ్ వద్ద ప్రయాణికులను దింపిన ఆటో డ్రైవర్ రాజేష్ కిరాయి కోసం రాజమండ్రి వెళ్లాడు. తిరిగి బంగారంపేట చేరుకున్నాడు. అప్పుడు ఆటోలో బ్యాగ్ ఉన్నట్టు గుర్తించి నిడదవోలు పోలీస్‌స్టేçÙన్ వద్దకు వచ్చాడు. పోలీసులు బ్యాగ్ తెరచి చూడగా విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. పోలీసులు బ్యాగ్ మరిచిపోయిన ఆకుల శ్రీనివాస్‌కు ఫోన్ చేసి రప్పించి రాజేష్ సమక్షంలో అప్పగించారు. -
దొరికిన వస్తువులు పోలీసులకు అప్పగింత
విజయవాడ(మొగల్రాజపురం): తనకు దొరికిన విలువైన వస్తువుల కోసం ఆశపడకుండా పోలీసులకు అప్పగించి నిజాయితీని నిరూపించుకున్నాడు తమిళనాడులోని మధురైకి చెందిన వెంగస్వామి ప్రభాకర్. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన బరాటం శ్రీనివాసరావు కుటుంబసభ్యులతో సోమవారం కృష్ణవేణి ఘాట్‌లో స్నానం చేయడానికి వచ్చారు. తడిసిన దుస్తులను మెట్లపై ఉంచారు. కొడుకు, భార్యను అక్కడే ఉండమని చెప్పారు. పిండప్రధానం చేయడానికి వెళ్లారు. శ్రీనివాసరావు భార్య లక్ష్మీరాజ్యం ఘాట్‌లోని నీళ్లు సీసాలో తీసుకురావడానికి వెళ్లింది. విషయాన్ని గమనించిన దొంగలు బాలుడి వీపుపై పౌడర్ చల్లారు. దురదగా ఉండటంతో నీటితో కడుక్కోడానికి వెళ్లాడు. వచ్చి చూస్తే దుస్తులు కనిపించలేదు. వెంటనే తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పాడు. సమీపంలోని పోలీస్ అవుట్‌పోస్ట్‌లో వివరాలు చెప్పారు. నగరంలో వారు బసచేసిన హోటల్‌కు వెళ్లిపోయారు. ఘాట్‌లోని 22వ నంబరు హైమాస్ట్ లైటు దగ్గర స్రీలు దుస్తులు మార్చుకునే గదికి సమీపంలో ఎప్పటి నుంచో తడిసిన దుస్తులు ఉండటం, సమీపంలో ఎవరూ లేకపోవడాన్ని స్నానం చేయడానికి వచ్చిన వెంగస్వామి ప్రభాకర్ గమనించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు శ్రీనివాసరావుకు ఫోన్ చేసి ఘాట్‌కు రప్పించారు. దుస్తుల్లోని వాచ్, రెండు పర్సులు, ఏటీఎం కార్డులను సీఐ ఎం.కృపానందం, ఎస్ఐ ఏజీ నాయుడు, వెంగస్వామి ప్రభాకర్ చేతుల మీదుగా శ్రీనివాసరావు దంపతులకు అప్పగించారు. పర్సులో రూ.17 వేలు పోయాయి. పోలీసులు వెంగస్వామి ప్రభాకర్‌ను అభినందించారు. -
నిప్పులాంటి ఐదుగురు అధికారులు
స్వాతంత్య్ర దినోత్సవం రోజున సాధారణంగా స్వాతంత్య్ర సమరయోధులను స్మరించకుంటాం. నేడు స్వతంత్ర భారతంలో పెరిగిపోతున్న అవినీతిని అంటరానితనంగా భావించి దాన్ని తమ దరిదాపుల్లోని రానియ్యని అధికారుల గురించి, రాజకీయ పెద్దల ఒత్తిళ్లు, వేధింపులను, బెదిరింపులను, బదిలీలను తట్టుకొని అవినీతిపై పోరు సాగించిన, సాగిస్తున్న సివిల్స్ అధికారుల గురించి గుర్తు చేసుకోవడం బహు అరుదు. అలాంటి కోవకు చెందిన వారి గురించి క్లుప్తంగా.. పూనం మాలకొండయ్య, ఆంధ్రప్రదేశ్: 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. సమాజంలో వేళ్లూనుకున్న ఆశ్రిత పక్షపాతాన్ని, జాతి దురహంకారం, నిర్లిప్తతా ధోరణులకు వ్యతిరేకంగా ఆమె పోరాడారు. అవినీతి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడినందుకు ఆరేళ్లలో ఏడుసార్లు బదిలీ అయ్యారు. వ్యవసాయ రంగం నుంచి రవాణా, అటు నుంచి విద్య, అక్కడినుంచి పౌర సరఫరాలు.. ఇలా ఎన్ని విభాగాలు మారినా ఏ రంగంలోనూ రాజీ పడని మనస్తత్వం ఆమెది. వ్యవసాయ శాఖ కమిషనర్‌గా మోన్శాంటో లాంటి బహుళజాతి కంపెనీల మెడలు వంచి బీటీ కాటన్ విత్తనాల ధరలు తగ్గించిన ఘనత ఆమెది. మనోజ్ నాథ్, బిహార్: తన 20వ ఏటనే ఐపీఎస్ పరీక్ష రాసి దేశంలో మూడోర్యాంక్ సాధించారు. 1973లో బిహార్ నుంచి తొలి ర్యాంక్‌ను సాధించారు. 39 ఏళ్ల పాటు ఐపీఎస్ అధికారిగా సేవలందించిన ఆయన 2012లో పదవీ విరమణ చేశారు. నిజాయితీకి నిలువుటద్దంలా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం వల్ల 40 సార్లు బదిలీ అయ్యారు. ఎన్నో అర్హతలు ఉన్నా డీజీపీ లాంటి పదవులకు ఆయన పేరును ఎప్పుడూ పరిశీలించలేదు. ఆయన కన్నా ఎంతో మంది జూనియర్లు ఆయనను దాటేసి ఉన్నత పదవులను అధిష్ఠించారు. బొకారో ఎస్పీగా పనిచేసినప్పుడు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా అవినీతి కేసులో బొకారో స్టీల్ ప్లాంట్ ఎండీని అరెస్టుచేశారు. పర్యవసానంగా 24 గంటల్లోనే బదిలీ అయ్యారు. జీఆర్ ఖైర్నార్, మహారాష్ట్ర: గోవింద్ రఘో ఖైర్నార్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నారు. ఆయనది ఎవరికీ భయపడే తత్వం కాదు. డిప్యూటీ మున్సిపల్ కమిషనర్‌గా నగరంలో దురాక్రమణలను తొలగించారు. అక్రమ కట్టడాలను కూల్చారు. ఎన్నో ప్రభుత్వ స్థలాలను రక్షించారు. ల్యాండ్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాటం జరిపారు. వారి చేతుల్లో గాయపడ్డారు. నిజాయితీగా విధులు నిర్వర్తిస్తున్నందుకు ఒకసారి సస్పెండ్ అయ్యారు. ఉన్నతాధికారుల మాటలు వినడం లేదన్న ఆరోపణలపై ఆయనపై కేసు దాఖలుచేశారు. చివరకు ముంబై కోర్టులో ఆయన కేసు గెలిచారు. ఆయనకు కోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. 'వన్ మేన్ డెమోలిషన్ ఆర్మీ'గా ముంబై ప్రజలు ఆయన్ని కీర్తించారు. ఆయన తన సస్పెన్షన్ కాలంలో మరాఠీలో 'ఏకాకి జూంజ్ (ఒంటరి పోరాటం)' శీర్షికన తన ఆత్మకథను రాశారు. సమిత్ శర్మ, రాజస్థాన్: రాష్ట్రంలోని చిత్తూర్‌గఢ్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. 2009లో ప్రభుత్వం ఆయన్ని అన్యాయంగా బదిలీ చేసినందుకు నిరసనగా 12 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు మూకుమ్మడి సెలవులు పెట్టి సమ్మెచేశారు. అయినా రాజకీయ పెద్దలు ఆయన బదిలీని వెనక్కి తీసుకోలేదు. స్థానిక ఎమ్మెల్యే ఒకరు కలెక్టర్ కార్యాలయానికి వచ్చినప్పుడు కిందిస్థాయి డివిజనల్ గుమాస్తా లేచి నమస్కారం పెట్టనందుకు అతన్ని ఉద్యోగం నుంచి తీసేయాలని సదరు ఎమ్మెల్యే శర్మపై ఒత్తిడి తెచ్చారు. అందుకు ఆయన నిరాకరించడంతో బదిలీ చేశారు. ఐఏఎస్ ఆఫీసర్ కాకముందు డాక్టర్‌గా ఐదేళ్లు ప్రాక్టీస్ చేసిన శర్మ తన అనుభవాన్ని ఉపయోగించి రాజస్థాన్ పేద ప్రజలకు వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. జనరిక్ మెడిసన్ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. రజనీ సెక్రి సిబల్, హర్యానా: ఈ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారిణి. ధైర్యానికి మారుపేరు. 1999-2000 సంవత్సరంలో 3,200 మంది జూనియర్ బేసిక్ ట్రేనింగ్ (జేబీటీ) టీచర్ల నియామకాల మార్కుల జాబితాను మార్చాలని రాజకీయ నాయకుల నుంచి ఆమెపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. అందుకు కోట్లాది రూపాయలను లంచంగా కూడా ఇస్తామని రాజకీయ పెద్దలే ఆశ చూపారు. అయినా ఆమె వినలేదు. అందుకని ఆమెను వెంటనే బదిలీ చేశారు. అసలు జాబితాను మార్చకుండా ఉండేందుకు ఆమె ఆ జాబితా ఉన్న బీరువాకు తాళం వేసి, నాలుగు అడుగుల గుడ్డతో బ్యాండేజీ చుట్టారు. పలుచోట్ల సీళ్లు అతికించారు. తన కింద పనిచేసే ఐదుగురు అధికారులతో వాటిపై సంతకాలు తీసుకున్నారు. తాళం చెవిని ఓ కవర్లో పెట్టి సీలు చేశారు. అయినా ఆమె బదిలీ అనంతరం ఈ టీచర్ల నియామకాల్లో అవినీతి చోటుచేసుకుంది. రజనీ కారణంగానే ఆ కుంభకోణం వెలుగులోకి వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయడంతో ఉన్నత స్థానాల్లో ఉన్న పలువురు వ్యక్తులు జైళ్ల పాలయ్యారు. భారత సమాజంలో ఇలా నీతి, నిజాయితీలకు కట్టుబడి పనిచేస్తున్న వారు అక్కడక్కడైనా ఉండడం వల్ల ఈ వ్యవస్థ నడుస్తోంది. ఇలాంటి వ్యక్తులను స్వాతంత్య్ర దినోత్సవరం రోజున సన్మానించకపోయినా ఫర్వాలేదు. గుర్తు చేసుకుంటే చాలు.