ఆటో డ్రైవర్ నిజాయితీ | Auto driver returns bag with valuables worth Rs 50,000 to passenger | Sakshi
Sakshi News home page

ఆటో డ్రైవర్ నిజాయితీ

Published Mon, May 9 2016 1:17 PM | Last Updated on Sun, Sep 3 2017 11:45 PM

Auto driver returns bag with valuables worth Rs 50,000 to passenger

మాల్వాని:  తనకు దొరికిన  విలువైన వస్తువులను  తిరిగి యజమానికి అప్పగించి  నిజాయితీని చాటుకున్నాడో ఆ ఆటో డ్రైవర్. జైరాం అశోక్ ఖర్వాల్(27)  ముంబైలోని మాల్వాని ప్రాంతంలో డ్రైవర్ గా పని చేస్తున్నాడు.  బందూప్ కు చెందిన అమిత్ నాయర్ శనివారం జైరాం ఆటో ఎక్కాడు. అయితే దిగే హడావుడిలో తన బ్యాగ్ ను ఆటోలోనే మర్చిపోయాడు. ఆ బ్యాగ్ లో రూ.50వేల విలువైన  ఐపాడ్, సామ్ సంగ్ టాబ్లెట్ ఉన్నాయి. ఆటోలో బ్యాగ్ ఉండటం గమనించిన జైరాం అశోక్ మాల్వాని పోలీసు స్టేషన్ లో అప్పగించాడు. ఆటో డ్రైవర్ నిజాయితీని మెచ్చుకున్న పోలీసు ఇన్స్పెక్టర్ అతనికి రివార్డు ఇస్తామని ప్రకటించాడు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement