
Hyderabad Auto Drivers: ఆటోవాలాలు ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతూ ప్రయాణికులను ఇబ్బందులుకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా దూలపల్లి రోడ్డులో వీరి ఆగడాలు ఎక్కువయ్యాయి. డ్రైవర్ పక్కన ఇద్దరు, వెనకాల ఆరుగురు ఇలా మొత్తం 8 మందిని నింపుకుని అతి ప్రమాదకరంగా ప్రయాణం కొనసాగిస్తున్నారు. అసలే ఇరుకైన రోడ్డు.. ఆపై గుంతలుగా ఉన్నా.. వేగాన్ని మాత్రం తగ్గించకుండా వెళ్తున్నారు.
కేవలం నలుగురు మాత్రమే ఎక్కాల్సిన ఆటోలో ఇలా 8 మందిని ఎక్కించుకుంటూ కొందరు ఆటోవాలాలు నిబంధనలను తుంగలో తొక్కుతూ ప్రయాణాలు సాగిస్తున్నారు. అయితే ఇక్కడ ట్రాఫిక్ విధులు నిర్వహించే సిబ్బంది కేవలం ఫోటోలకే పరిమితమవుతూ అధిక లోడుతో వెళ్తున్న వారిని కట్టడి చేయడంలో విఫలం అవుతున్నారు. దూలపల్లి నుంచి కొంపల్లి వరకు ప్రత్యేకంగా దృష్టి సారించి ఆటోవాలాలను కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
చదవండి: Ranga Reddy: చిత్తు కాగితాలు కాదండి.. విద్యార్థుల సర్టిఫికెట్లు
Comments
Please login to add a commentAdd a comment